పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-428-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్త్వగుణమున సద్భక్తి సంభవించు
క్తియుతముగఁ జిత్తంబు వ్య మగును
హృదయపద్మంబునం దోలి నెఱుఁగఁబడిన
ట్టి నీకు నమస్కారయ్య; వరద!

టీకా:

సత్త్వగుణమునన్ = సత్త్వగుణము వలన; సత్ = మంచి; భక్తిన్ = భక్తి; సంభవించున్ = కలుగును; భక్తిన్ = భక్తిచేత; యుతముగన్ = కూడినదైన; చిత్తంబున్ = మనసు; భవ్యము = శుభకరము; అగును = అగును; హృదయ = హృదయము అను; పద్మంబునన్ = పద్మములో; ఓలిన్ = క్రమముగా; ఎఱుగబడిన = తెలియబడిన; అట్టి = అటువంటి; నీకున్ = నీకు; నమస్కారము = నమస్కారములు; అయ్య = తండ్రి; వరద = భగవంతుడా {వరదుడు - వరములను ఇచ్చువాడు, విష్ణువు}.

భావము:

సత్వగుణంవల్ల, మంచి భక్తి ప్రాప్తిస్తుంది. భక్తితో కూడిన మనస్సు పవిత్రం అవుతుంది. అటువంటి భక్తి యుక్తమైన పవిత్ర హృదయ పద్మంతో తలచి సేవించదగిన ఓ దేవాధిదేవా! నీకు నమస్కారం.