తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి
- ఉపకరణాలు:
అట్టి యజ్ఞపోత్రిమూర్తిం జూచి కమలాసన ప్రముఖు లిట్లని స్తుతియించిరి.
టీకా:
అట్టి = అటువంటి; యజ్ఞపోత్రిమూర్తిన్ = యజ్ఞవరాహమూర్తిని; చూచి = చూసి; కమలాసన = బ్రహ్మదేవుడు {కమలాసనుడు - కమలమువ ఆసీనుడు (కూర్చున్న వాడు), బ్రహ్మదేవుడు}; ప్రముఖులు = మొదలగు ముఖ్యులు; ఇట్లు = ఈ విధముగా; అని = అని; స్తుతియించిరి = స్తోత్రము చేసిరి.
భావము:
అటువంటి యజ్ఞవరాహమూర్తిని చూచి బ్రహ్మాదిదేవతలు ఇలా కీర్తించారు.