పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

  •  
  •  
  •  

3-329-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జీవావలిఁ గల్పించుచుఁ
జీవావలిలోనఁ దగ వసించుచుఁ బ్రియవ
స్త్వాలిలోపలఁ బ్రియవ
స్త్వాలి యై యుండు నన్ను నిశముఁ బ్రీతిన్.

టీకా:

జీవ = జీవముల; ఆవలిన్ = సమస్త సమూహమును; కల్పించుచున్ = సృష్టించుచూ; జీవ = జీవముల; ఆవలిన్ = సమస్త సమూహము; లోనన్ = లోపలను; తగన్ = అవశ్యము; వసించుచున్ = నివసిస్తూ; ప్రియ = ప్రియమైన; వస్తు = వస్తువుల; ఆవలిన్ = సమూహము; లోపలన్ = లోపల; ప్రియ = ప్రియమైన; వస్తు = వస్తువుల; ఆవలిన్ = సమూహము; ఐ = అయి; ఉండున్ = ఉండెడు; నన్నున్ = నన్ను; అనిశమున్ = ఎల్లప్పుడును; ప్రీతిన్ = ప్రీతితో.

భావము:

ఓ బ్రహ్మదేవా! సకల ప్రాణులను సృష్టిస్తూ, ఆ జీవాలు అన్నిటి అందు అంతర్యామినై వర్తిస్తూ, ప్రియ వస్తువులలో, అత్యధికమైన ప్రియ వస్తువునై ఉండే నన్ను నిత్యమూ ప్రీతితో స్మరింపుము.