పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

  •  
  •  
  •  

3-323-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీ కిప్పుఁడు గానంబడె
నాకులకును నురగపతి పినాకులకైనన్
వాకొనఁగం దలపోయను
రాకుండు మదీయ రూపమ్యత్వంబుల్.

టీకా:

నీకున్ = నీకు; ఇపుడు = ఇప్పుడు; కానబడెన్ = కనబడినది; నాకుల = దేవతల {నాకులు - నాక (స్వర్గ) లోకమున ఉండు వారు, దేవతలు}; కున్ = కు; ఉరగపతి = ఆదిశేషుడు {ఉరగపతి - ఉరగము (పాముల)కు పతి, ఆదిశేషుడు}; పినాకులన్ = శివులకును {పినాకుడు - పినాకము అను విల్లు ధరించువాడు, శివుడు}; ఐనను = అయినను; వాకొనగన్ = పలుకుటకును; తలపోయన్ = ఊహించుటకును; రాకుండు = వీలుకానివి; మదీయ = నా యొక్క; రూప = రూపములు; రమ్యత్వంబుల్ = మనోహరత్వములు.

భావము:

ఇప్పుడు నీకు దర్శనం అయిన నా స్వరూపంలోని సౌందర్య విశేషాలన్నీ దేవతలూ, ఆదిశేషుడూ, చివరకు ఆ పరమశివుడు కూడా మాటలలో వర్ణించలేరు. మనస్సులో ఊహించను కూడా ఊహించలేరు.