తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
నాలోని జీవకోటులు
వాలాయము నీకుఁ గానవచ్చు నిపుడు నీ
వాలోకింపుము దారువి
లోల హుతాశనునికరణి లోకస్తుత్యా!
టీకా:
నా = నా; లోని = లోపలి; జీవ = జీవములు; కోటులు = సమస్తమును; వాలాయమున్ = అవశ్యము; నీకున్ = నీకు; కానవచ్చు = కనిపించును; ఇపుడు = ఇప్పుడు; నీవు = నీవు; ఆలోకింపుము = చూడుము; దారు = కట్టెల యందు; విలోల = చక్కగాచరిస్తున్న; హుతాశనుని = అగ్నిహోత్రుని; కరణి = వలె; లోక = లోకములచే; స్తుత్యా = స్తుతింపబడువాడ.
భావము:
ఓ విశ్వం అంతా వినుతించే బ్రహ్మా! కఱ్ఱల లోపల దాగి ఉన్న నిప్పులా, నాలో దాగి ఉన్న ప్రాణి సమూహాలన్నీ నీకు తప్పకుండా కనిపిస్తాయి. ఏదీ నువ్వు ఇప్పుడు చూడు.