తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
నీ వొనరించు తపోవి
ద్యావిభవ విలోకనీయ మగు నీ సృష్టిం
గావింపుము లోకంబుల
లో వెఁలిగెడి నన్నుఁ గందు లోకస్తుత్యా!
టీకా:
నీవు = నీవు; ఒనరించు = చేయు; తపస్ = తపస్సు అనెడి; విద్య = విద్య యొక్క; విభవ = వైభవముచేత; విలోకనీయము = చూడచక్కనిది; అగున్ = అయిన; నీ = నీ యొక్క; సృష్టిన్ = సృష్టిని; కావింపుము = చేయుము; లోకంబులున్ = లోకములు; లోన్ = అందు; వెలిగెడి = ప్రకాశించు; నన్నున్ = నన్ను; కందు = చూచెదవు; లోక = లోకములుచే; స్తుత్యా = స్తుతింపబడువాడ.
భావము:
నీ తపస్సంపద వైభవం వెల్లడయ్యే ఈ సృష్టి నిర్మాణ కార్యాన్ని మొదలెట్టు. అప్పుడు, లోకం అంతా స్తుతించే బ్రహ్మా! సమస్తమైన లోకాలు అన్నిటిలోనూ ప్రకాశించే నన్ను కనుగొనగలవు.