పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

  •  
  •  
  •  

3-315-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జాతప్రభవుండు కేవలతపోవ్యాసంగుఁ డై పద్మలో
ను గోవిందు ననంతు నాఢ్యుఁ దన వాక్ఛక్తిన్ నుతింపన్ సుధా
వంద్యుండు ప్రసన్నుఁ డై నిఖిల విశ్వస్థాపనాలోకనం
బునఁ జూచెన్ విలయప్రభూత బహువాఃపూరంబులన్ వ్రేల్మిడిన్.

టీకా:

వనజాతప్రభవుండు = బ్రహ్మదేవుడు {వనజాతప్రభవుడు - వనజాతము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; కేవల = స్వచ్ఛమైన; తపస్ = తపస్సు అను; వ్యాసంగుడు = మిక్కిలి శ్రద్ధ కలవాడు; ఐ = అయి; పద్మలోచను = విష్ణుమూర్తి {పద్మలోచనుడు - పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; గోవిందు = విష్ణుమూర్తి {గోవిందుడు - గోవుల (నీళ్ళు)కి ఒడయుడు, నారాయణుడు, విష్ణువు}; అనంతు = విష్ణుమూర్తి {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; ఆఢ్యున్ = విష్ణుమూర్తిని {ఆఢ్యుడు - శ్రేష్ఠుడు, విష్ణువు}; తన = తన యొక్క; వాక్ = వాక్కులకు గల; శక్తిన్ = శక్తికొద్దీ; నుతింపన్ = కీర్తింపగా; సుధాశనవంద్యుండు = విష్ణుమూర్తీ {సుధాశనవంద్యుడు - సుధాశన (సుధను సేవించువారు, దేవతలు)కు వంద్యుడు (వందనము చేయతగ్గవాడు), విష్ణువు}; ప్రసన్నుడు = ప్రసన్నముగఉన్నవాడు; ఐ = అయి; నిఖిల = సమస్తమైన; విశ్వ = భువనములను; స్థాపన = సృష్టించవలెనని; ఆలోకనంబునన్ = ఆలోచనతో; చూచెన్ = చూసెను; విలయ = ప్రళయమున; ప్రభూత = పుట్టిన; బహు = మిక్కిలి; వాః = జల; పూరంబులన్ = రాశులందు; వ్రేల్మిడిన్ = చిటికలో.

భావము:

"పద్మంలో పుట్టినవాడు అయిన బ్రహ్మదేవుడు కేవలం తపస్సు పై ఆసక్తి కలవాడై పద్మాక్షుడూ, గోవిందుడూ, అనంతుడూ, పురుషోత్తముడూ అయిన పరమేశ్వరుణ్ణి ఎంతో ప్రస్తుతించాడు. అమృతం తాగే దేవతలకే దేవదేవుడైన హరి అనుగ్రహించాడు. సమస్త విశ్వాన్ని సంస్థాపించాలనే దృష్టితో ప్రళయాన్ని సృష్టించిన ఆ మహా జలప్రవాహం వైపు అలా అలవోకగా ఒక మాటు అవలోకించాడు.