పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

  •  
  •  
  •  

3-313-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యనుకంపదోఁప వినయంబునఁ జాఁగిలి మ్రొక్కి చారులో
సరసీరుహుం డగుచు ర్వజగత్పరికల్పనా రతిం
రిన నన్నుఁ బ్రోచుటకుఁ దా నిటు సన్నిధి యైన యీశ్వరుం
యము నాదు దుఃఖము దయామతిఁ బాపెడు నంచు నమ్రుడై

టీకా:

అని = అని; అనుకంప = జాలి; తోపన్ = కలుగునట్లు; వినయంబునన్ = వినయముగా; చాగిలి = సాష్టాంగపడి; మ్రొక్కి = నమస్కరించి; చారు = అందమైన; లోచన = కనులు అను; సరసీరుహుడు = పద్మములు కలవాడు; అగుచున్ = అవుతూ; సర్వ = సమస్త; జగత్ = భువనములను; పరికల్పనా = చక్కగా సృష్టించు; రతిన్ = ఆసక్తిలో; తనరిన = అతిశయించిన; నన్నున్ = నన్ను; ప్రోచుటకున్ = కాపాడుటకు; తాన్ = తను; ఇటు = ఈ విధముగా; సన్నిధి = ప్రత్యక్షము; ఐన = అయిన; ఈశ్వరుండు = విష్ణుమూర్తీ {ఈశ్వరుడు - ఈశత్వము (ప్రభావము) కలవాడు, ప్రభువు, విష్ణువు}; అనయమున్ = ఎల్లప్పుడు; నా = నా యొక్క; దుఃఖమున్ = దుఃఖమును; దయా = దయతో కూడిన; మతిన్ = మనసుతో; బాపెడున్ = పోగొట్టునుగాక; అంచున్ = అనుచూ; నమ్రుడు = నమ్రతతో కూడినవాడు; ఐ = అయి.

భావము:

ఇలా పలికిన కమలసంభవుడు, బ్రహ్మదేవుడు కనికరం ఉట్టిపడేలా విష్ణుదేవునకు విన్నవించుకొని వినయంతో దండప్రణామాలు చేసాడు. “సర్వప్రపంచాన్ని, సృష్టించడానికి పూనుకున్న నన్ను అందాలు చిందే కమలాలవంటి కన్నులతో వీక్షించి రక్షించడానికై, ఈ విధంగా సాక్షాత్కరించిన పరాత్పరుడు నా దుఃఖాన్ని దూరంచేయు గాక” అని తలవంచి నమస్కరించాడు.