పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

  •  
  •  
  •  

3-311-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లజాక్ష! యెట్టి విజ్ఞానబలంబునఁ-
ల్పింతు వఖిలలోకంబు లోలి
తజనప్రియుఁడవు నా కట్టి సుజ్ఞాన-
ర్థిమైఁ గృపసేయు య్య వరద!
సృష్టినిర్మాణేచ్ఛఁ జెంది నా చిత్తంబుఁ-
త్కర్మకౌశలిఁ గిలి యుండి
యునుఁ గర్మవైషమ్యమునుఁ బొందు కతమున-
దురితంబుఁ బొరయక తొలగు నట్టి

3-311.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెఱవు నా కెట్లు కలుగు నవ్విధముఁ దలచి
ర్మవర్తను నను భవత్కరుణ మెఱసి
గఁ గృతార్థునిఁ జేయవే నిమవినుత!
త్కృపామూర్తి! యో దేవక్రవర్తి!

టీకా:

జలజాక్ష = విష్ణుమూర్తీ {జలజాక్షుడు - జలజ (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; ఎట్టి = ఎటువంటి; విజ్ఞాన = విజ్ఞానము యొక్క; బలంబునన్ = బలమువలన; కల్పింతువు = సృష్టింతువు; అఖిల = సమస్తమైన; లోకంబుల్ = లోకములను; ఓలిన్ = క్రమముగా; నత = స్తుతించు; జన = జనుల ఎడ; ప్రియుడవు = ప్రేమ కలవాడవు; నాకున్ = నాకు; అట్టి = అటువంటి; సు = మంచి; జ్ఞానము = జ్ఞానము; అర్థిమైన్ = వాత్సల్యముతో; కృపన్ = దయ; చేయుము = చేయుము (ఇమ్ము); అయ్య = తండ్రి; వరద = విష్ణుమూర్తీ {వరదుడు - వరములను ప్రసాదించువాడు, విష్ణువు}; సృష్టిన్ = సృష్టిని; నిర్మాణ = నిర్మించవలెనను; ఇచ్చన్ = కోరికను; చెంది = పొంది; నా = నా; చిత్తంబున్ = మనసు; తత్ = ఆ; కర్మ = పనియందలి; కౌశలిన్ = నేర్పరితనమున; తగిలి = ములిగిపోయి; ఉండియునున్ = ఉండినను; కర్మ = ఆపనులలోని; వైషమ్యమునున్ = ఒడిదుడుకులను; పొందు = కలుగుటకు; కతమున = కారణము చేత; దురితంబున్ = పాపమును; పొలయక = పొందకుండ; తొలగునట్టి = తొలగిపోవునటువంటి; వెఱపున్ = ఔచిత్యము; నాకు = నాకు; ఎట్లు = ఏవిధముగ; కలుగు = కలుగును; ఆ = ఆ; విధమున్ = విధమును; తలచి = ఆలోచించి చూసి; కర్మ = కర్మను; వర్తను = చేయువాడను; నను = నన్ను; భవత్ = నీయొక్క; కరుణ = దయ; మెఱసి = అతిశయించగా; తగన్ = తగిన విధముగా; కృతార్థునిన్ = సార్థకము చెందినవానిగ; చేయవే = చేయుము; నిగమవినుత = విష్ణుమూర్తీ {నిగమవినుత - వేదములచే స్తుతింపబడు వాడు, విష్ణువు}; సత్కృపామూర్తి = విష్ణుమూర్తీ {సత్కృపామూర్తి - మంచి దయకు స్వరూపము ఐనవాడు, విష్ణువు}; ఓ = ఓ; దేవచక్రవర్తీ = విష్ణుమూర్తీ {దేవచక్రవర్తి - దేవతలకి చక్రవర్తి, విష్ణువు}.

భావము:

శ్రీమహావిష్ణువూ! పద్మాలవంటి కన్నులు కలవాడా! కోరిన వరాలను వర్షించేవాడా! పరమ కరుణార్ద్రమూర్తీ! వేదాలచే పొగడబడేవాడా! దేవతా చక్రవర్తీ! నీవు ఎలాంటి విజ్ఞానబలంతో ఈ సమస్త లోకాలను, సృష్టిస్తున్నావో నాకు అటువంటి ఉత్తమ జ్ఞానాన్ని ప్రసాదించు. నీకు నమస్కరించే జనులకు, నీవు ప్రియుడవు కదా, నా మనస్సులో, సృష్టించాలనే కోరిక మిక్కుటంగా ఉన్నది. అది చేయటానికి తగిన నైపుణ్యం కూడా నాకు అనుగ్రహించి కర్మలందలి ఒడిదుడుకులు వల్ల పాపం పొందకుండా ఉండే ఉపాయం ఏమిటో నాకు తెలుపు. కర్మజీవి నైన నన్ను కనికరించి కృతార్థుణ్ణి కావించు.