తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
నర్థి భవదీయపాదంబులాశ్రయింతు
మహితభక్తిని నీకు నమస్కరింతు
భక్తజనపోష! పరితోష! పరమపురుష!
ప్రవిమలాకార! సంసారభయవిదూర!
టీకా:
అమర = దేవతలు; తిర్యక్ = జంతువులు; మనుష = మానవులు; ఆది = మొదలగు; చేతన = సచేతనములు ఐన; యోనులు = గర్భములు; అందున్ = అందు; ఆత్మ = స్వంత; ఇచ్చన్ = ఇష్టానుసారము; చేన్ = చేత; చెందిన = కలిగన; అట్టి = అటువంటి; కమనీయ = మనోహరమైన; శుభ = శుభకరమైన; మూర్తిన్ = స్వరూపము; కలవాడవు = కలవాడవు; ఐ = అయ్యి; ధర్మ = ధర్మమువలన; సేతువు = తరింపచేయు వంతెన; అనంగ = అని; ప్రఖ్యాతిన్ = పేరుపొందిన; ఒంది = పొంది; విషయ = ఇంద్రియార్థములందు {విషయములు - ఇంద్రియములకు గోచరము అగునవి, ఇంద్రియార్థములు}; సుఖంబులన్ = సుఖములను; విడిచి = విడిచిపెట్టి; సంతత = ఎడతెగని; నిజ = సత్యమైన, ఆత్మ యందలి; ఆనంద = ఆనందము యొక్క; అనుభవమున్ = అనుభవమును; ఉన్నతిన్ = గొప్పగా; తనర్తువు = అతిశయింప చేయుదువు; అదిగాన = అందుచేత; పురుషోత్తమ = పురుషోత్తముడు అను; ఆఖ్యన్ = పేరుతో; చెన్ను = ప్రశస్తి; ఒందుదువు = పొందుతావు; అట్టి = అటువంటి; నిన్నున్ = నిన్ను; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; అభినుతింతు = బాగాకీర్తింతును; అర్థిన్ = కోరి; భవదీయ = నీయొక్క; పాదంబులున్ = పాదములను; ఆశ్రయింతున్ = ఆశ్రయించెదను; మహిత = గొప్ప; భక్తిన్ = భక్తితో; నీకున్ = నీకు; నమస్కరింతున్ = నమస్కారము చేయుదును; భక్తజనపోషపరితోష = విష్ణుమూర్తీ {భక్తజనపోషపరితోషుడు - భక్తులు అయిన జనులను పోషించుట యందు సంతోషము కలవాడు, విష్ణువు}; పరమపురుష = విష్ణుమూర్తీ {పరమపురుషుడు - అత్యున్నతమైన ఫురుషుడు, విష్ణువు}; ప్రవిమలాకారా = విష్ణుమూర్తీ {ప్రవిమలాకారుడు - విశిష్టముగా నిర్మలమైన ఆకారము కలవాడు, విష్ణువు}; సంసారభయవిదూర = విష్ణుమూర్తీ {సంసారభయవిదూరుడు - సంసారము (భవ) వలని భయములను మిక్కిలి దూరము చేయువాడు, విష్ణువు}.
భావము:
పురుషోత్తమా! శ్రీహరీ! నిర్మలమైన స్వరూపం కల వాడా! సంసారభయాన్ని దూరంచేసే పురుషోత్తముడా! నీవు భక్తజనులను సంతోషంగా పోషించే వాడివి. నీవు దేవతలు, జంతువులు, మనుష్యులు మున్నగు సచేతన రూపాలు ధరించి నీ సంకల్పానుసారంగా అవతరిస్తావు. మనోహరమైన మంగళ స్వరూపంతో ధర్మానికి సేతువుగా నిలుస్తావు. పేరు ప్రఖ్యాతులు గడిస్తావు. లౌకిక సుఖాలను విడిచిపెట్టి ఎల్లప్పుడూ అపారమైన ఆత్మానందాన్ని అనుభవిస్తావు. అందుకనే నీవు పురుషోత్తము డని ప్రశస్తి కాంచావు. అటువంటి నిన్ను నిత్యమూ స్తుతిస్తాను. ప్రీతితో నీ పాదాలను ఆశ్రయిస్తాను. మిక్కిలి భక్తితో నీకు నమస్కరిస్తాను.