తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
మాన సతత ప్రసన్న కోమల ముఖాబ్జ
కలిత భవదీయ దివ్యమంగళవిలాస
మూర్తి దర్శింపఁ గలిగె భక్తార్తిహరణ
కరణ! తుభ్యంనమో విశ్వభరణ! దేవ!
టీకా:
సర్వేశ = విష్ణుమూర్తీ {సర్వేశుడు - సర్వమునకును ప్రభువు, విష్ణువు}; కల్ప = కల్పము; అంత = అంతమున; సంస్థితము = ఏర్పడునది; అగు = అయిన; జలజాతము = పద్మము {జలజాతము - జలమున పుట్టినది, పద్మము}; అందున్ = లో; ఏను = నేను; సంజననమున్ = చక్కగా పుట్టుకను; అంది = పొంది; భవదీయ = నీయొక్క; సుస్వరూపమున్ = చక్కటి స్వరూపమును; చూడన్ = చూడవలెనని; అర్థించి = కోరి; బహు = అనేకమైన; వత్సరములు = సంవత్సరములు; తపంబున్ = తపస్సు; చేసి = చేసి; క్రతు = యజ్ఞములు కొరకు చేయు; కర్మములు = కర్మములు; పెక్కు = అనేకము; కావించియును = ఆచరించియు; నిన్నున్ = నిన్ను; పొడగానగ = కనుగొన; లేక = లేక; బుద్ధిన్ = మనసున; భీతిన్ = భయమును; పొందిన = పొందినట్టి; నాకున్ = నాకు; ఇప్పుడును = ఇప్పుడూ; నిర్హేతుక = కారణములేని; కరుణ = దయ; చేన్ = తో; అఖిలలోకైకవంద్యమాన = విష్ణుమూర్తీ {అఖిలలోకైకవంద్యమానుడు - సమస్తమైన లోకములకును వందనము చేయతగ్గ వాడైన ఒక్కడు, విష్ణువు}; సతత = ఎల్లప్పుడు; ప్రసన్న = ప్రసన్నమైన; కోమల = కోమలమైన; ముఖ = ముఖము అను; అబ్జము = పద్మము; కలిత = కలిగిన; భవదీయ = నీయొక్క; దివ్య = దివ్యమైన; మంగళ = శుభములకు; విలాస = నివాసమైన; మూర్తిన్ = స్వరూపమును; దర్శింపన్ = చూచుట; కలిగెన్ = అయినది; భక్తార్తిహరణకరణ = విష్ణుమూర్తీ {భక్తార్తిహరణకరణుడు - భక్తుల ఆర్తిని పోగొట్టుటను చేయువాడు, విష్ణువు}; తుభ్యం = నీకు; నమో = నమస్కారము; విశ్వభరణ = విష్ణుమూర్తీ {విశ్వభరణుడు - విశ్వమును భరించువాడు, విష్ణువు}; దేవ = దేవుడా.
భావము:
ఓ దేవతలు అందరికి ప్రభువైన విష్ణుమూర్తీ! భక్తుల వేదనలను పోగొట్టే పరమేశా! ఈ విశాల విశ్వాన్ని భరించే విశ్వేశ్వరా! నీకు నమస్కారం. కల్పాంత సమయంలో చక్కగా ఉన్న తామరపువ్వు నందు నేను పుట్టాను. నీ సుందరమైన ఆకారాన్ని చూడగోరి చాలా సంవత్సరాలు తపస్సు చేశాను. యజ్ఞాలు కూడా ఎన్నో చేసాను. కానీ నీ జాడ అంతుచిక్కలేదు. మనసు బెదిరిపోయింది. ఇప్పుడు నీవు నాపై అకారణ అపార కరుణ కల వాడవు అయి సాక్షాత్కరించావు. అఖిల లోకాలకూ ఆరాధనీయమై, ఎల్లప్పుడూ ప్రసన్న కోమలమైన, ముఖపద్మంతో, విరాజిల్లే నీ దివ్యమంగళ విగ్రహాన్ని ఇప్పుడు కనులారా, కరువుతీరా దర్శించగలిగాను.