పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

  •  
  •  
  •  

3-306-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుషాధీశ! భవత్పదాబ్జయుగళీపూజాది కర్మక్రియా
తం జెందని మూఢచిత్తునిఁ బశుప్రాయున్ మనుష్యాధమున్
యున్ నాశము నొందఁ జేయు నతి దక్షంబైన కాలంబు త
ద్గురు కాలాత్ముఁడ వైన నీకు మది సంతోషంబునన్ మ్రొక్కెదన్.

టీకా:

పురుషాధీశ = విష్ణుమూర్తీ {పురుషాధీశుడు - జీవులకు అధిపతి, విష్ణువు}; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అబ్జ = పద్మముల {అబ్జము - అప్పు (నీరు) లో పుట్టినది, పద్మము}; యుగళీ = జంటను; పూజ = పూజించుట; ఆది = మొదలగు; కర్మ = కర్మములను; క్రియా = ఆచరించుటలో; పరతన్ = ఆసక్తిని; చెందని = చెంది ఉండని; మూఢ = మోహము చెందిన; చిత్తునిన్ = మనసు కలవానిని; పశు = పశువు, పాశముచే కట్టబడిన {పశువు - పాశముచే కట్టబడినది, ఆవులు మొదలగునవి}; ప్రాయున్ = వంటివానిని; మనుష్య = మనుషులలో; అధమున్ = నీచుని; జరయున్ = ముసలితనము; నాశమున్ = మరణమును; ఒందన్ = పొందునట్లు; చేయు = చేసెడి; అతి = మిక్కిలి; దక్షంబు = సమర్థమైన, శక్తివంతమైన; ఐన = అయిన; కాలంబున్ = కాలమును; తత్ = ఆ; గురు = మహా; కాల = కాల; ఆత్ముడవు = స్వరూపుడవు; ఐన = అయిన; నీకున్ = నీకు; మదిన్ = మనసున; సంతోషంబునన్ = సంతోషముతో; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.

భావము:

పురుషోత్తమా! విష్ణుమూర్తీ! నీ పాదపద్మాలను పూజ చేయటం అనే మంచి పనిలో తన్మయత్వం చెందనివాడు పరమ మూఢుడు; పశువులాంటి వాడు; అధముడు. అలాంటి మానవులకు సర్వ సమర్ధమైన కాలం త్వరగా ముసలితనాన్ని కలిగించి, వాడి వినాశనానికి దారితీస్తుంది. అలాంటి అనంతకాలానికి ఆత్మస్వరూపుడవు అయిన నీకు ఆనందంగా నమస్కరిస్తున్నాను.