పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

  •  
  •  
  •  

3-302-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలి శశ్వత్స్వరూప చైన్య భూరి
హిమచేత నపాస్త సస్త భేద
మోహుఁడ వఖిల విజ్ఞానమునకు నాశ్ర
యుండ వగు నీకు మ్రొక్కెదనో రమేశ!

టీకా:

తవిలి = పూనుకొని; శశ్వత్స్వరూప = విష్ణుమూర్తీ {శశ్వత్స్వరూపుడు - శాశ్వతమైన స్వరూపము కలవాడు, విష్ణువు}; చైతన్య = చైతన్యపూరితమైన; భూరి = బహుమిక్కిలి; మహిమ = మహిమ; చేతన్ = చేత; అపాస్త = పోగొట్టబడిన; సమస్త = సమస్తమైన; భేద = భేదములు; మోహుడవు = మోహము కలిగించు వాడవు; అఖిల = సమస్తమైన; విజ్ఞానమున్ = విజ్ఞానమున; కున్ = కును; ఆశ్రయుండవు = ఆశ్రయము ఐనవాడవు; అగు = అయిన; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; ఓ = ఓ; రమేశ = విష్ణుమూర్తీ {రమేశుడు - రమ (లక్ష్మీదేవి)కి భర్త, విష్ణువు}.

భావము:

ఓ లక్ష్మీపతీ! నీ స్వరూపం శాశ్వతమైనది. నీ అందలి చైతన్య మహా ప్రభావంవల్ల సమస్తమైన భేద భావాలనూ వ్యామోహాలనూ రూపుమాపుతావు. అఖండమైన విజ్ఞానానికి ఆశ్రయమైన నీకు నమస్కరిస్తున్నాను.