తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు
- ఉపకరణాలు:
అరయ నిష్కామధర్ము లైనట్టి భక్తు
లందు నీవు ప్రసన్నుండ వైనరీతి
హృదయముల బద్ధకాములై యెనయు దేవ
గణము లందుఁ బ్రసన్నతఁ గలుగ వీవు.
టీకా:
అరయన్ = పరిశీలించి చూడగా; నిష్కామ = కోరికలు లేకుండుట అను; ధర్ములు = స్వభావముగా కలవారు; ఐనట్టి = అయినట్టి; భక్తులు = భక్తులు; అందున్ = అందు; నీవు = నీవు; ప్రసన్నుడవు = ప్రసన్నత కలవాడవు; ఐన = అయిన; రీతిన్ = విధముగ; హృదయంబులు = మనసులలో; బద్ధ = చిక్కుకొన్న; కాములు = కామములు కలవారు; ఐ = అయి; ఎనయు = మెలగు; దేవ = దేవతల; గణములు = సమూహములు; అందున్ = అందు; ప్రసన్నతన్ = ప్రసన్నతను; కలుగవు = కలిగి ఉండవు; ఈవు = నీవు.
భావము:
పరిశీలించి చూస్తే కోరికలు లేకుండా నిన్ను ఆరాధించే భక్తులను నీవు అనుగ్రహించినట్లు అంతులేని కోరికలతో నిండిన హృదయాలు గల దేవతలను కూడా అనుగ్రహించవు.