పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

  •  
  •  
  •  

3-293.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాభిసర్గాభిముఖత నవ్యక్తమార్గుఁ
డైన హరి యందుఁ దన హృదయంబుఁ జేర్చి
మ్మహాత్మునిఁ బరము ననంతు నభవు
జు నమేయుని నిట్లని భినుతించె.

టీకా:

అనఘ = పుణ్యుడా; సర్వేశ్వరున్ = విష్ణుని {సర్వేశ్వరుడు - అన్నిటికిని పై అధికారి, విష్ణువు}; ఆద్యంతశూన్యుని = విష్ణుని {ఆద్యంతశూన్యుడు - మొదలుతుది అన్నవి లేనివాడు, విష్ణువు}; ధన్యుని = విష్ణుని {ధన్యుడు - ధన్యమైన (సార్థకమైన) తత్త్వము కలవాడు, విష్ణువు}; జగదేకమాన్యచరితున్ = విష్ణుని {జగదేకమాన్యచరితుడు - భువనము లంతకును గౌరవింప దగినవాడు, విష్ణువు}; తత్ = అతని; నాభి = బొడ్డు అను; సరసిజ = పద్మమున; ఉద్భవ = పుట్టిన; సరోజంబునున్ = పద్మమును; అప్పులన్ = నీటిని; అనిలునిన్ = అగ్నిని; అంబరమున్ = ఆకాశమును; మానిత = మన్నింపదగిన; భువన = లోకమలను; నిర్మాణ = నిర్మించునట్టి; దృష్టిన్ = చూపును; పొడగనెన్ = చూచెను; కాని = కాని; ఇతరము = మరింకేమియును; కానలేక = చూడలేక; ఆత్మీయ = తనయొక్క; కర్మ = పనికి, బాధ్యతకు; బీజ = విత్తనపు; అంకురంబును = మొలకయును; రజోగుణ = రజోగుణముతో; యుక్తుండు = కూడినవాడు; అగుచున్ = అవుతూ; అకుంఠిత = కుంటుపడని; ప్రజా = ప్రజలను; అభిసర్గ = చక్కగా సృష్టంచవలెనను; అభిముఖతన్ = ప్రయత్నములో, కోరికతో; అవ్యక్త = అంతుపట్టని; మార్గుండు = పద్ధతి కలవాడు; ఐన = అయిన; హరి = విష్ణుని; అందున్ = అందు; తన = తనయొక్క; హృదయంబున్ = హృదయమును; చేర్చి = చేర్చి; ఆ = ఆ; మహాత్మునిన్ = విష్ణుని {మహాత్ముడు - గొప్పవాడు, విష్ణువు}; పరమున్ = విష్ణుని {పరము - సర్వమునకు పరమైనవాడు (బయట ఉండువాడు), విష్ణువు}; అనంతున్ = విష్ణుని {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; అభవున్ = విష్ణుని {అభవుడు - పుట్టుక లేనివాడు, విష్ణువు}; అజున్ = విష్ణుని {అజుడు - జన్మము లేనివాడు, విష్ణువు}; అమేయునిన్ = విష్ణుని {అమేయుడు - మేర లేనివాడు, కొలతలకు అందని వాడు, విష్ణువు}; ఇట్లు = ఈవిధముగ; అని = పలుకుతూ; అభినుతించెన్ = స్తోత్రములు చేసెను.

భావము:

పుణ్యాత్ముడా! విదురా! అలా బ్రహ్మదేవుడు సృష్టి అంతటికి ప్రభువూ, ఆది అంతమూ లేనివాడూ ధన్యుడూ, సకల భువనాలకూ మాన్యుడూ అయిన ఆ మహానుభావుని దర్శించాడు; అంతేకాదు ఆయన బొడ్డునుంచి పుట్టిన కమలాన్ని, జలాన్ని, అగ్నిని ఆకాశాన్ని మహాజగత్తు సృష్టించాలనే దృష్టినీ దర్శించాడు; ఆయనకు ఇంక ఇతరమైనవి ఏవి కనపడ లేదు; తనదైన సృష్టికార్యానికి బీజాంకురం అయిన రజోగుణం అతనిలో జనించింది; అమోఘమైన ప్రజా సృష్టికి సుముఖుడు అయినాడు; అంతుపట్టని వాడూ, అర్థం చేసికొనుటకు వీలు కాని వాడూ అయిన ఆ హరి యందు తన హృదయాన్ని కేంద్రీకరించాడు; అంతట మహాత్ముడూ, పురుషోత్తముడూ, అనంతుడూ, అభవుడూ, అమేయుడూ అయిన, పరాత్పరుణ్ణి బ్రహ్మదేవుడు ఈవిధంగా స్తుతించాడు.