పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మ జన్మ ప్రకారము

  •  
  •  
  •  

3-280-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నజనాళమూలం
బా నములలోన నర్థిఁ రయుటకొఱకై
యానజాతప్రభవుం
డా నరుహనాళవివర మందభిముఖుఁడై.

టీకా:

ఆ = ఆ; వనజ = పద్మము యొక్క {వనజ - వనమున (నీట) పుట్టినది}; నాళ = గొట్టము, కాడ; మూలంబున్ = మొదలును, మూలమును; ఆ = ఆ; వనములు = నీళ్ళ; లోనన్ = లో; అర్థిన్ = కోరి; అరయుట = వెదకుట; కొఱకై = కోసము; ఆ = ఆ; వనజాతప్రభవుండు = బ్రహ్మదేవుడు {వనజాతప్రభవుడు - పద్మమున ప్రభవించినవాడు, బ్రహ్మదేవుడు}; ఆ = ఆ; వనరుహ = పద్మము యొక్క; నాళ = కాడ; వివరము = కన్నము; అందున్ = లోపల; అభిముఖుండు = వైపునకు తిరిగినవాడు, సంసిద్ధుడు; ఐ = అయి.

భావము:

ఆ తామరతూడు ఎక్కడ నుంచి పుట్టిందో, దాని మొదలు ఎక్కడో తెలుసుకోవాలని ఆ నీటిలో వెదకడంకోసం బ్రహ్మదేవుడు పద్మనాళం వెంట లోపలికి ప్రవేశించాడు.