పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : గోవర్థనగిరి ధారణంబు

  •  
  •  
  •  

2-192-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భీమార్జున ముఖ్య చాపధర రూవ్యాజతం గ్రూరులన్
లులన్ దుష్టధరాతలేశ్వరుల సంగ్రామైక పారీణ దో
ర్బకేళిం దునుమాడి సర్వధరణీభారంబు మాయించి సా
ధు రక్షించిన యట్టి కృష్ణుని ననంతుం గొల్తు నెల్లప్పుడున్.

టీకా:

బల = బలరాముడు; భీమ = భీముడు; అర్జున = అర్జునుడు; ముఖ్య = ముఖ్యమైన; చాప = విల్లు; ధర = ధరించిన వారి; రూప = రూపముల; వ్యాజతం = వంకతో; క్రూరులన్ = క్రూరమైన వారిని; ఖలులన్ = నీచులను; దుష్ట = దుర్మార్గులైన; ధరాతల = భూమండలాల; ఈశ్వరులన్ = రాజులను; సంగ్రామ = యుద్ధము అనే; ఏక = ముఖ్య; పారీణ = కార్యముగ; దోర్బల = భుజబల; కేళిన్ = క్రీడలతో; తునుమాడి = సంహరించి; సర్వ = సమస్త; ధరణీ = భూమి; భారంబున్ = భారములను; మాయించి = పోగొట్టి; సాధులన్ = మంచి వారిని; రక్షించినన్ = కాపాడిన; అట్టి = అట్టి; కృష్ణుని = కృష్ణుని {కృష్ణుడు - నల్లని వాడు}; అనంతున్ = కృష్ణుని {అనంతుడు - అంతము లేని వాడు, భగవంతుడు}; కొల్తున్ = సేవింతును; ఎల్లప్పుడున్ = ఎల్లప్పుడును.

భావము:

బలరాముడు, భీముడు, అర్జునుడు మొదలైన విలుకాండ్ర రూపాలతో అవతరించి కఠినులు, నీచులు, దుర్మార్గులు అయిన రాజులను రణరంగంలో ఆరితేరిన భుజబలక్రీడతో శ్రీకృష్ణుడు హతమార్చాడు. సమస్త భూభారాన్ని తొలగించాడు. సజ్జనులను రక్షించాడు. అట్టి అనంతుణ్ణి నేను అనుక్షణమూ ఆరాధిస్తాను.