పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : లోకంబులు పుట్టుట

  •  
  •  
  •  

2-88-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హు పా దోరు భు జాన నేక్షణ శిరఃఫాలశ్రవోయుక్తుఁడై
విరించున్ బహుదేహి దేహగతుఁడై; విద్వాంసు లూహించి త
ద్బహురూపావయవంబులన్ భువనసంత్తిన్ విచారింతు; రా
నీయాద్భుతమూర్తి యోగిజన హృన్మాన్యుండు మేధానిధీ!

టీకా:

బహు = అనేకమైన; పాద = పాదములు, కాళ్ళు; ఊరు = తొడలు; భుజ = భుజములు; ఆనన = ముఖములు, నోర్లు; ఈక్షణ = కళ్ళు; శిరః = తలలు; ఫాల = నుదురులు; శ్రవ = చెవులు; యుక్తుడు = కలిగిన వాడు; ఐ = అయి; విహరించున్ = తిరుగుచుండును; బహు = అనేకమైన; దేహి = జీవుల {దేహి - దేహము కలవి, జీవులు}; దేహ = శరీరము లందు; గతుఁడు = ఉన్నవాడు; ఐ = అయి; విద్వాంసులున్ = బాగుగ తెలిసినవారు; ఊహించి = అర్థము చేసికొని; తత్ = ఆ; బహు = అనేకమైన; రూప = రూపములు; అవయవంబులన్ = అవయవము లందలి; భువన = లోకముల; సంపత్తిన్ = గొప్పతనమును; విచారింతురున్ = సంస్మరింతురు, విమర్శింతురు; ఆ = ఆ; మహనీయ = మహనీయమైన; అద్భుత = అద్భుతమైన; మూర్తిన్ = స్వరూపము కలవానిని; యోగి = యోగుల; జన = సమూహముల; హృత్ = హృదయములచేత; మాన్యుండున్ = గౌరవింబడువానిని; మేధా = మేధస్సు అను; నిధీ = నిధి కలవాడా.

భావము:

బుద్ధిమంతుడవైన నారదా! ఆ దేవుడు అనేకాలైన పాదాలూ, ఊరువులూ, భుజాలూ, ముఖాలూ, నేత్రాలూ, శిరస్సులూ, నోళ్లూ, చెవులతో కూడి ఉన్నాడు. అలా ఉంటూ అనేక ప్రాణుల శరీరాలలో నెలకొని విహరిస్తూ వుంటాడు. పండితులు చక్కగా విమర్శించి ఆ భగవంతుని అనేక రూపాలైన అవయవాలలోనే సమస్త భువనాల ఉనికినీ విచారిస్తూ ఉంటారు. మహామహూడూ, ఆశ్చర్యకర స్వరూపుడూ అయిన ఆ భగవానుడు యోగుల హృదయాలలో అర్చింపదగి ఉన్నాడు.