ఏకాదశ స్కంధము : విదేహ హర్షభ సంభాషణ
- ఉపకరణాలు:
అట్లు గావున పరమేశ్వరభక్తిజనకంబై కైవల్యపదప్రాప్తికరంబయి యొప్పుచున్న విదేహర్షభసంవాదంబు నాఁ బరగు నొక్క పురాతన పుణ్యకథావిశేషం బెఱింగించెద సావధాన మనస్కుండవై యాకర్ణింపు” మని యిట్లనియె
టీకా:
అట్లు = అలా; కావునన్ = అగుటచేత; పరమేశ్వర = విష్ణు; భక్తి = భక్తి; జనకంబున్ = కలిగించునది; ఐ = అయ్యి; కైవల్యపద = మోక్షమును {కైవల్యపదము - కేవలము తానే అగుట, మోక్షపదము, పరమ పదము}; ప్రాప్తి = లభించుటను; కరంబు = కలిగించెడిది; అయి = ఐ; ఒప్పుచున్న = చక్కగానుండెడి; విదేహ = విదేహుడు; ఋషభ = ఋషభుల; సంవాదంబు = చర్చించుకొన్నది; నాన్ = అని; పరగు = పరిశుద్ధమైన; పురాతన = మిక్కిలి పాతకాలపు; పుణ్య = పుణ్యవంతమైన; కథా = వృత్తాంతపు; విశేషంబున్ = విశేషములను; ఎఱింగించెద = తెలిపెదను; సావధాన = శ్రద్ధతోకూడిన; మనస్కుండవు = మనసు కలవాడవు; ఐ = అయ్యి; ఆకర్ణింపుము = వినుము; అని = అని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
అందుకని పరమేశ్వరుని మీద భక్తిని కలిగించేది మోక్షాన్ని అందించేది అయిన విదేహఋషభ సంవాదము అనే ప్రసిద్ధమైన ఒక పురాతన పుణ్యకథను చెప్తాను ఏకాగ్ర చిత్తంతో విను." అని ఇలా చెప్పసాగాడు.