పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : కృష్ణ సందర్శనంబు

  •  
  •  
  •  

11-11-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నిరుపమసుందరం బయిన శరీరంబు ధరియించి సమస్త కర్మ తత్పరుండై పరమేశ్వరుండు యదువుల నడంగింపఁ దలఁచు సమయంబున జటావల్కల కమండలుధారులును, రుద్రాక్షభూతిభూషణ ముద్రాముద్రితులును, గృష్ణాజినాంబరులును నగు విశ్వామిత్రాసిత దుర్వాసోభృగ్వంగిరః కశ్యప వామదేవ వాలఖిల్యాత్రి వసిష్ఠ నారదాది మునివరులు స్వేచ్ఛావిహారంబున ద్వారకానగరంబున కరుదెంచి యందు.

టీకా:

నిరుపమ = సాటిలేని; సుందరంబు = అందమైనది; అయిన = ఐన; శరీరంబు = తనువు; ధరియించి = తాల్చి; సమస్త = అన్ని; కర్మ = కర్మలందు; తత్పరుండు = ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి; పరమేశ్వరుండు = కృష్ణుడు; యదువులన్ = యాదవులను; అడంగింపన్ = అణచివేయవలెనని; తలచు = భావించెడి; సమయంబునన్ = సమయమునందు; జట = జడలు కట్టిన శిరోజాలు; వల్కల = నారబట్టలు; కమండలున్ = కమండలములు; ధారులున్ = ధరించినవారు; రుద్రాక్ష = రుద్రాక్షలు; భూతి = విభూతి; భూషణ = అలంకారములు; ముద్రా = చిహ్నములు; ముద్రితులునున్ = అలంకరించుకొన్నవారు; కృష్ణాజినా = నల్లజింకతోలు; అంబరులునున్ = వస్త్రములుధరించినవారు; అగు = ఐన; విశ్వామిత్ర = విశ్వామిత్రులు; అసిత = అసితుడు; దుర్వాసః = దుర్వాసుడు; భృగు = భృగువు; అంగిరస = అంగిరసుడు; కశ్యప = కశ్యపుడు; వామదేవ = వామదేవుడు; వాలఖిల్య = వాలఖిల్యుడు; అత్రి = అత్రి; వసిష్ఠ = వసిష్ఠుడు; నారద = నారదుడు; ఆది = మున్నగు; ముని = మునులలో; వరులు = ఉత్తములు; స్వేచ్చా = ఇష్టానుసారముగ; విహారంబునన్ = విహరించుచు; ద్వారకానగరంబున్ = ద్వారకానగరమున; కున్ = కు; అరుదెంచి = వచ్చి; అందు = అక్కడ.

భావము:

“సాటిలేని అందమైన తనువు దాల్చి సకల కర్మల యందు ఆసక్తికలవాడై పరమేశ్వరుడైన కృష్ణుడు యాదవులను అణచవలెనని సంకల్పించిన సమయాన జటావల్కలములు కమండలములు ధరించి, నల్లజింకతోలు కట్టుకున్న వారు, రుద్రాక్షలు వీభూతి అలంకరించిన శరీరాలతో విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యులు, ఇంకా అత్రి, వశిష్టుడు, నారదుడు మున్నగు మునిశ్రేష్ఠులు స్వేచ్ఛావిహారం చేస్తూ ద్వారకానగరానికి విచ్చేసారు.

11-12-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుని శ్రీకృష్ణునిఁ గౌస్తుభాభరణునిఁ,-
ర్ణకుండలయుగ్మనకపోలుఁ,
బుండరీకాక్షు నంభోధరశ్యామునిఁ,-
లిత నానారత్న న కిరీటు,
నాజానుబాహు నిర్గళాయుధహస్తు,-
శ్రీకరపీతకౌశేయవాసు,
రుక్మిణీనయన సరోజ దివాకరు,-
బ్రహ్మాదిసుర సేవ్యపాదపద్ము ,

11-12.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుష్టనిగ్రహ శిష్టసంతోషకరణుఁ,
గోటిమన్మథలావణ్యకోమలాంగు,
నార్తజనరక్షణైకవిఖ్యాతచరితుఁ,
నిరి కరుణాసముద్రుని నులు మునులు.

టీకా:

ఘనుని = గొప్పవానిని; శ్రీ = మహనీయమైన; కృష్ణునిన్ = కృష్ణుడుని; కౌస్తుభ = కౌస్తుభమణిని; ఆభరణునిన్ = ధరించినవానిని; కర్ణకుండల = చెవికమ్మల; యుగ్మ = జత(తోప్రకాశించెడి); ఘన = గొప్ప; కపోలున్ = చెంపలుగలవానిని; పుండరీకాక్షున్ = పద్మనయనుని; అంభోధర = మేఘమువలె; శ్యామునిన్ = నల్లనివానిని; కలిత = ధరించిన; నానా = అనేక; రత్న = మణులు పొదిగిన; ఘన = గొప్ప; కిరీటున్ = కిరీటము కలవానిని; ఆజానుబాహు = మంచిపొడగరిని {ఆజానుబాహువు - ఆజాను (మోకాళ్ళ వరకు కల) బాహువు (చేతులు కలవాడు), సుందరుడు}; నిరర్గళ = ఆడ్డులేని; ఆయుధ = ఆయుధములను; హస్తున్ = ధరించినవానిని; శ్రీకర = శుభకరమైన; పీత = పచ్చని; కౌశేయ = పట్టుబట్టలు; వాసున్ = కట్టుకొన్నవానిని; రుక్మిణీ = రుక్మిణీదేవి యొక్క; నయన = కన్నులను; సరోజ = పద్మములకు {సరోజము - సరస్సున పుట్టినది, పద్మము}; దివాకరున్ = సూర్యుని వంటివానిని {దివాకరుడు - పగటికి కారణమైనవాడు, సూర్యుడు}; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మున్నగు; సుర = దేవతలచే; సేవ్య = కొలవబడుతున్న; పాద = పాదములు అను; పద్మున్ = పద్మములు కలవాడు.
దుష్ట = చెడ్డవారిని; నిగ్రహ = శిక్షించుట; శిష్ట = మంచివారిని; సంతోష = సంతోషము; కరణున్ = కలిగించువాడు; కోటి = కోటిమంది; మన్మథ = మన్మథులతో తులతూగు; లావణ్యున్ = లావణ్యము కలవానిని; కోమల = మృదువైన; అంగు = శరీరము కలవానిని; ఆర్త = ఆర్తులైన; జన = వారిని; రక్షణ = కాపాడుటలో; ఏక = ముఖ్యమైన; విఖ్యాత = ప్రసిద్ధమైన; చరితున్ = ప్రవర్తన కలవానిని; కనిరి = చూసిరి; కరుణా = దయకు; సముద్రునిన్ = సముద్రమువంటివానిని; ఘనులు = గొప్పవారు; మునులు = ఋషులు.

భావము:

మహాత్ముడు; కౌస్తుభమణి సంశోభితుడు; ఘనమైన చెంపలపై కర్ణ కుండలాల కాంతులు ప్రకాశించు వాడు; తెల్లతామరల వంటి కన్నుల వాడు; మేఘం వంటి నల్లని దేహఛాయ వాడు; బహురత్నాలు పొదిగిన కిరీటం వాడు; తిరుగులేని చక్రాది ఆయుధాలు చేబట్టు వాడు; శ్రీకరమైన పచ్చని పట్టువస్త్రం కట్టుకొను వాడు; రుక్మిణీదేవి నయన పద్మాలకు సూర్యుని వంటి వాడు; బ్రహ్మ మున్నగు దేవతలచేత సేవింపదగిన చరణకమలాలు కలవాడు; దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించు వాడు; కోటిమంది మన్మథుల లావణ్యం పుణికిపుచ్చుకున్న కోమల శరీరి; ఆర్తులైన వారిని రక్షించటంలో ప్రసిద్ధ చరిత్రుడు; దయకు సముద్రం వంటి వాడు; ఆజానుబాహువు అయిన శ్రీకృష్ణుడిని ఆ ఘనులైన మునులు దర్శించారు.

11-13-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చ్చిన మునిసంఘములకు
విచ్చలవిడి నర్ఘ్యపాద్యవిధు లొనరింపన్‌
మెచ్చగు కనకాసనముల
చ్చుగఁ గూర్చుండి వనరుహాక్షునితోడన్‌.

టీకా:

వచ్చిన = వచ్చినట్టి; ముని = మునుల; సంఘములు = సమూహముల; కున్ = కు; విచ్చలవిడిన్ = అత్యుత్సాహముతో; అర్ఘ్య = చేతులు కడుగు; పాద్య = కాళ్ళు కడుగు; విధులు = మర్యాదలు; ఒనరింపన్ = చేసిన తరువాత; మెచ్చు = మేలిమి; అగు = ఐన; కనక = బంగారపు; ఆసనములన్ = ఆసనాలమీద; అచ్చుగన్ = చక్కగా; కూర్చుండి = ఆసీనులై; వనరుహాక్షుని = కృష్ణుని {వనరుహాక్షుడు - వనరుహా (పద్మాలలాంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు}; తోడన్ = తోటి.

భావము:

అలా వచ్చిన శ్రీకృష్ణుడు మునులకు ఆర్ఘ్యం పాద్యం మొదలైన మర్యాదలు విస్తృతంగా చేసాడు. అటుపిమ్మట వారు మేలిమి బంగారు ఆసనాల మీద ఆసీనులై పద్మనేత్రుడైన కృష్ణుడితో ఇలా అన్నారు.

11-14-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జములు నిను సేవింపని
దిములు వ్యర్థంబు లగుచుఁ దిరుగుచు నుండుం
నువులు నిలుకడ గావఁట
ములలో నున్ననైన నరుహనాభా!

టీకా:

జనములు = ప్రజలు; నిను = నిన్ను; సేవింపని = కొలువని; దినములు = రోజులు; వ్యర్థంబులు = వృథాయైనవి; అగుచున్ = ఔతు; తిరుగుచునుండున్ = జరుగుతుంటాయి; తనువులు = దేహాలు; నిలుకడ = స్థిరమైనవి; కావు = లేదు; అట = అట; వనములు = అడవుల; లోన్ = అందు; ఉన్ననైనన్ = ఉన్నప్పటికిని; వనరుహనాభా = కృష్ణా {వనరుహనాభుడు - పద్మనాభుడు, విష్ణువు}.

భావము:

“పద్మనాభా! నిను సేవించని దినములు సర్వం మానవులకు ప్రయోజన శూన్యములు; అడవులలో ఉన్నా దేహాలకు నిలుకడలు లేనివి.

11-15-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణంబులు భవజలధికి,
ణంబులు దురితలతల, కాగమముల కా
ణంబు, లార్తజనులకు
ణంబులు, నీదు దివ్యరణంబు లిలన్‌.

టీకా:

తరణంబులు = దాటించెడి తెప్పలు; భవ = సంసార; జలధి = సముద్రమున; కిన్ = కు; హరణంబులు = హరించెడివి; దురిత = పాపాలు అనెడి; లతలు = తీవెల; కిన్ = కు; ఆగమములు = వేదాల; కిన్ = కు; ఆభరణంబులు = అలంకారములు; ఆర్త = ఆర్తులైన; జనులు = వారి; కున్ = కు; శరణంబులు = రక్షించునవి; నీదు = నీ యొక్క; దివ్య = దివ్యమైన; చరణంబు = పాదములు; ఇలన్ =భూలోకంలో.

భావము:

నీ దివ్యమైన పాదములు భవసముద్రం దాటించే నావలు; పాపాలతీగలను హరించేవి; ఆగమములకు అలంకారాలు; ఆర్తులకు శరణములు.

11-16-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్క వేళను సూక్ష్మరూపము నొందు దీ వణుమాత్రమై,
యొక్క వేళను స్థూలరూపము నొందు దంతయు నీవయై,
పెక్కురూపులు దాల్తు, నీ దగు పెంపు మాకు నుతింపఁగా
క్కజం బగుచున్న దేమన? నంబుజాక్ష! రమాపతీ!

టీకా:

ఒక్క = ఒక్కొక; వేళను = మాటు; సూక్ష్మ = చాలాచిన్న; రూపమున్ = స్వరూపమును; ఒందుదు = పొందుతావు; అణుమాత్రము = అణువంతవాడవు; ఐ = అయ్యి; ఒక్క = ఒక్కొక; వేళను = మాటు; స్థూల = మిక్కిలి పెద్ద; రూపమున్ = స్వరూపమును; ఒందుదు = పొందుతావు; అంతయు = సమస్తము; నీవ = నీవుమాత్రమే; ఐ = అయ్యి; పెక్కు = అనేకమైన; రూపులు = స్వరూపాలు; తాల్తు = ధరించెదవు; నీది = నీదైనట్టిది; అగు = ఐన; పెంపు = అతిశయము; మేము = మా; కున్ = కు; నుతింపగాన్ = స్తుతిస్తుండగా; అక్కజంబు = ఆశ్చర్యము; అగుచున్నది = కలిగిస్తున్నది; ఏమనన్ = ఏమి అనగలము; అంబుజాక్ష = కృష్ణా {అంబుజాక్షుడు - పద్మముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; రమాపతీ = కృష్ణా {రమాపతి - రమ (లక్ష్మీదేవి యొక్క) పతి (భర్త), విష్ణువు}.

భావము:

పద్మలోచన! లక్ష్మీవల్లభ! ఒకమాటు అణువంత చిన్న రూపం పొందుతావు. ఒకమాటు పెద్ద ఆకృతి దర్శిస్తావు. అంతా నీవై అనేక రూపాలు దర్శిస్తావు. నీ మహిమ స్తోత్రం చేయడానికి అలవిగాక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

11-17-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీనాయక! నీ నామము
నానాభవరోగకర్మనాశమునకు వి
న్నాణం బగు నౌషధ మిది
కారు దుష్టాత్ము లకట! కంజదళాక్షా! "

టీకా:

శ్రీనాయక = కృష్ణా {శ్రీనాయకుడు - శ్రీ (లక్ష్మీదేవికి, సంపదలకు) నాయకుడు, విష్ణువు}; నీ = నీ యొక్క; నామము = పేరు; నానా = అనేకమైన; భవ = జన్మలు అనెడి; రోగ = జబ్బులను; కర్మ = కర్మలను; నాశమున్ = నశింపజేయుట; కున్ = కు; విన్నాణంబు = మిక్కిలినాణ్యమైనది; అగు = ఐన; ఔషధము = మందు; ఇది = ఇది; కానరు = తెలుసుకొనలేకున్నారు; దుష్టాత్ములు = దుష్టులు; అకట = అయ్యో; కంజదళాక్షా = కృష్ణా {కంజదళాక్షుడు - కంజ (పద్మముల) దళ (రేకుల వంటి) అక్ష (కన్నులు కలవాడు), కృష్ణు}.

భావము:

పద్మాపతీ! పద్మలోచన! నీ నామం పునర్జన్మలనే రోగము నశింపజేసే విన్నాణమైన మందు దుష్టాత్ములు పాపం! దీనిని గ్రహించలేరు.”

11-18-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యనేకవిధంబులం బ్రస్తుతించిన మునివరులం గరుణాకటాక్ష వీక్షణంబుల నిరీక్షించి, పుండరీకాక్షుం డిట్లనియె; “మదీయధ్యాన నామస్మరణంబులు భవరోగహరణంబులును, బ్రహ్మరుద్రాదిక శరణంబులును, మంగళకరణంబులును నగు” ననియును, “నా రూపంబులైన మేదినీసురుల పరితాపంబులఁ బరిహరించు పురుషుల నైశ్వర్యసమేతులంగాఁ జేయుదు” ననియును, యోగీశ్వరేశ్వరుం డయిన యీశ్వరుం డానతిచ్చి యనంతరంబ “మీర లిచ్చటికివచ్చిన ప్రయోజనంబేమి?” యనిన వారలు “భవదీయ పాదారవింద సందర్శనార్థంబు కంటె మిక్కిలి విశేషం బొండెద్ది?” యని వాసుదేవవదనచంద్రామృతంబు నిజనేత్రచకోరంబులం గ్రోలి యథేచ్ఛా విహారులై ద్వారకానగరంబున కనతి దూరంబున నుండు పిండారకం బను నొక్క పుణ్యతీర్థంబున కరిగి; రంత.

టీకా:

అని = అని; అనేక = ఎన్నో; విధంబులన్ = విధాల; ప్రస్తుతించిన = స్తుతించిన; ముని = మునులలో; వరులన్ = ఉత్తములను; కరుణా = దయగల; కటాక్ష = కడకంటి; వీక్షణంబులన్ = చూపులతో; నిరీక్షించి = చూసి; పుండరీకాక్షుండు = కృష్ణుడు {పుండరీకాక్షుడు - పద్మాక్షుడు, కృష్ణుడు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; మదీయ = నా యొక్క; ధ్యాన = ధ్యానము; నామ = పేరును; స్మరణంబులు = జపించుటలు; భవ = పునర్జన్మములను; రోగ = రోగమునకు; హరణంబులును = తొలగించునవి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; రుద్ర = పరమశివుడు; ఆదిక = మున్నగువారిని; శరణంబులును = రక్షించునవి; మంగళ = శుభములను; కరణంబులును = కలిగించెడివి; అగును = ఔను; అనియును = అని; నా = నా యొక్క; రూపంబులు = స్వరూపములు; ఐన = అయిన; మేదినీసురుల = విప్రుల; పరితాపంబులన్ = బాధలను; పరిహరించు = తొలగించెడి; పురుషులన్ = వారిని; ఐశ్వర్య = ఐశ్వర్యము; సమేతులన్ = కలిగినవారి; కాన్ = అగునట్లు; చేయుదును = చేసెదను; అనియును = అని; యోగి = ఋషులలో; ఈశ్వర = ఉత్తములైనవారిలో; ఈశ్వరుండు = ఉత్తముడు; అయిన = ఐన; ఈశ్వరుండు = కృష్ణుడు; ఆనతిచ్చి = చెప్పి; అనంతరంబ = తరువాత; మీరలు = మీరు; ఇచ్చటి = ఇక్కడ; కిన్ = కు; వచ్చిన = వచ్చినట్టి; ప్రయోజనంబు = కారణము; ఏమి = ఏమిటి; అనినన్ = అని అడుగగా; వారలు = వారు; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మములను; సందర్శన = దర్శించుట; అర్థంబు = ప్రయోజనము; మిక్కిలి = అధికమైన; విశేషంబు = విశేషము; ఒండు = మరొకటి; ఎద్ది = ఏముంది; అని = అని; వాసుదేవ = కృష్ణుని; వదన = మోము అనెడి; చంద్ర = చంద్రుని; అమృతంబున్ = అందాన్ని, ప్రకాశాన్ని; నిజ = తమ; నేత్ర = కన్నులు అనెడి; చకోరంబులన్ = చకోరపక్షులతో; క్రోలి = తాగి; యథేచ్చా = ఇష్టానుసార; విహారులు = విహరించెడివారు; ఐ = అయ్యి; ద్వారకానగరంబున్ = ద్వారకానగరమున; కున్ = కు; అనతి = ఎక్కువగాని; దూరంబునన్ = దూరములో; ఉండు = ఉన్నట్టి; పిండారకంబు = పిండారకము, నామాంతరము పిందార (పిందారకము పర్యాయపదం పులి); అను = అనెడి; ఒక్క = ఒకానొక; పుణ్యతీర్థంబున్ = పుణ్యతర్థమున; కున్ = కు; అరిగిరి = వెళ్ళిరి; అంత = అప్పుడు.

భావము:

ఈ విధంగా మునివరులు అనేక విధాల స్తుతించారు. దయగల కడకంటిచూపులతో వారిని చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నా ధ్యాన నామస్మరణలు పునర్జన్మలు అనే భవరోగాలను హరిస్తాయి. బ్రహ్మ రుద్రుడు మొదలైన వారందరికి శరణమైనవి. సకల మంగళ ప్రదములు. నా రూపాలైన బ్రాహ్మణుల బాధలను తొలగించేవారికి ఐశ్వర్యం కలిగిస్తాను.” అని యోగీశ్వరుడైన ఈశ్వరుడు ఆనతిచ్చి “మీరిక్కడికి ఎందుకు వచ్చారు.” అని అడిగాడు. అందుకు వారు “మీ పాదపద్మాలను దర్శించుట కంటే వేరే విశేషము ఏముంటుంది.” అని పలికి, వాసుదేవుని ముఖచంద్రామృతాన్ని తమ కనులనే చకోరాలతో త్రావి తమ ఇష్టానుసారం విహరించేవారు ద్వారకకు దగ్గరలోని పిండారకము అనే పుణ్యతీర్ధానికి వెళ్ళారు. అప్పుడు..

11-19-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్పించి యాదవులు తమ
నేర్పునఁ గొమరారు సాంబు నెలఁతుకరూపం
బేర్పడ శృంగారించియుఁ
ర్పూర సుగంధి పోల్కిఁ గావించి యొగిన్‌.

టీకా:

దర్పించి = పొగరెక్కి; యాదవులు = యాదవులు; తమ = వారి యొక్క; నేర్పునన్ = నేర్పరితనముతో; కొమరారు = చక్కటి; సాంబున్ = సాంబుడుని; నెలతుక = స్త్రీ; రూపంబు = వేషము; ఏర్పడ = వేసి; శృంగారించియున్ = అలంకరించి; కర్పూర = కర్పూరపు; సుగంధి = తావిగలామె; పోల్కిన = వలె; కావించి = చేసి; ఒగిన్ = శీఘ్రమే.

భావము:

అక్కడ ఆ మునివేరేణ్యులను చూసిన యాదవ బాలకులలో కొందరు పొగరెక్కి తమ నేర్పుతో సాంబుడికి అందమైన స్త్రీవేషం వేసారు. కడుపుతో ఉండి కర్పూరపు తాంబూలాలు వేసుకోవటంతో ఆ సువాసనలు కలిగిన కలికిలా తీర్చిదిద్దారు.

11-20-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మూఁలుగూడి యాదవులు ముందటఁ బెట్టుక యార్చి నవ్వుచుం
బోలఁ బోవుచున్‌ మునిసమూహము కొయ్యన సాఁగి మ్రొక్కుచుం
"బ్రాటమైన యీ సుదతి భారపుగర్భమునందుఁ బుత్త్రుఁడో
యేత మందు బాలికయొ యేర్పడఁ జెప్పు" డటన్న నుగ్రులై.

టీకా:

మూకలుగూడి = గుంపులుకట్టి; యాదవులు = యాదవులు; ముందటన్ = ఎదురుగా; పెట్టుక = ఉంచుకొని; ఆర్చి = అరుస్తూ; నవ్వుచున్ = నవ్వుతు; పోకలబోవుచున్ = విలాసాలు చూపుచు; ముని = మునుల; సమూహము = సంఘమున; కున్ = కు; ఒయ్యన = తిన్నగా; సాగి = సాగిలపడి; మ్రొక్కుచున్ = నమస్కరించుచు; ప్రాకటము = ప్రస్ఫుటముగ కనబడునది; ఐన = అయిన; ఈ = ఈ యొక్క; సుదతి = వనిత యొక్క {సుదతి - మంచి దంతములు కలామె, స్త్రీ}; భారపు = బరువైన; గర్భమున = కడుపు; అందున్ = లోనున్నవాడు; పుత్రుడో = మగపిల్లవాడో; ఏకతము = మీ భావన; అందున్ = లో; బాలికయో = ఆడపిల్లయో; యేర్పడన్ = విడమర్చి; చెప్పుడు = తెలుపండి; అట = అని; అనన్నన్ = అడుగగా; ఉగ్రులు = మిక్కిలి కోపగించినవారు; ఐ = అయ్యి.

భావము:

యాదవబాలురు గుంపులు గుంపులుగా చేరి తుళ్ళింతలతో, నవ్వులతో, కేరింతలతో ఆడవేషం వేసిన సాంబుడిని ముందుంచుకుని వెళ్ళారు. మునిసమూహానికి సాగిలపడి మ్రొక్కారు. “ప్రస్ఫుటముగా కనపడుతున్న గర్భం కల ఈ అమ్మాయి కడుపులో మగపిల్లవాడు ఉన్నాడా ఆడపిల్ల ఉందా చెప్పండి?” అని ఆ మునులను అడిగారు. వారి అపహాస్యానికి మునులకు బాగా కోపం వచ్చింది.

11-21-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుడింభకులను గనుఁగొని
యుతులై వచ్చి రనుచు దిలో రోషం
బొవఁ గనుఁగొనల నిప్పులు
సెరఁగ హాస్యంబు సనునె చేయఁగ ననుచున్‌.

టీకా:

యదు = యాదవ; డింభకులను = బాలురను; కనుంగొని = చూసి; మదయుతులు = మదంతో; వచ్చిరి = వచ్చారు; అనుచు = అని; మది = మనసుల; లోన్ = అందు; రోషంబు = కోపము; పొదవన్ = ఉదయించగా; కనుగొనల = కడగంట; నిప్పులు = నిప్పులను; చెదరగ = చెరగుతు; హాస్యంబు = వేళాకోళము; చనునె = తగినదా; చేయగన్ = చేయుట; అనుచున్ = అంటూ.

భావము:

యాదవబాలురను చూసి ఆ మునుల మనసులలో వీళ్ళు మదంతో మైమరచి వచ్చారని రోషం ఉదయించింది. కనులగొలకుల నిప్పులు చెదరగా “ఇలా హాస్యాలు చేయొచ్చా?” అని అంటూ....

11-22-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వాలాయము యదుకుల ని
ర్మూకరం బైన యట్టి ముసలం బొక టీ
బాలిక కుదయించును బొం
డాస్యము లే ద"టంచు టఁబల్కుటయున్‌.

టీకా:

వాలయము = అవశ్యము; యదు = యాదవ; కుల = కులమును; నిర్మూలకరంబు = నాశనంచేసెడిది; ఐనయట్టి = అయినట్టి; ముసలంబు = రోకలి; ఒకటి = ఒకానొకటి; ఈ = ఈ యొక్క; బాలిక = యువతి; కున్ = కు; ఉదయించును = పుట్టును; పొండు = వెళ్ళండి; ఆలస్యము = ఆలస్యం; లేదు = లేదు; అటంచున్ = అనుచు; పల్కుటయున్ = పలికిరి.

భావము:

“యదువంశాన్ని నాశనం చేసే రోకలి (ముసలం) ఒకటి ఈ బాలికకు తప్పక పుడుతుంది ఆలస్యం కాదు. ఇక పొండి.” అని పలికారు.

11-23-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మదోద్రేకులైన యాదవబాలకులు మునిశాపభీతులై వడవడ వడంకుచు సాంబకుక్షినిబద్ధ చేల గ్రంథివిమోచనంబు సేయు సమయంబున ముసలం బొక్కటి భూతలపతితం బయిన విస్మయంబు నొంది దానిం గొనిచని దేవకీనందను సన్నిధానంబునం బెట్టి యెఱింగించిన నతం డాత్మకల్పిత మాయారూపం బగుట యెఱింగియు, నెఱుంగని తెఱంగున వారలం జూచి యిట్లనియె.

టీకా:

మద = గర్వము; ఉద్రేకులు = రెచ్చినవారు; ఐన = అయిన; యాదవు = యదు; బాలకులు = యువకులు; ముని = మునుల; శాప = శాపముచే; భీతులు = భయపడినవారు; ఐ = అయ్యి; వడవడ = వడవడమని; వడంకుచున్ = వణకిపోతూ; సాంబ = సాంబుని యొక్క; కుక్షిన్ = కడుపునకు; నిబద్ద = కట్టబడిన; చేల = బట్ట; గ్రంథిన్ = ముడి; విమోచనంబు = విప్పుట; చేయు = చేసెడి; సమయంబునన్ = సమయమునందు; ముసలంబు = రోకలి; ఒక్కటి = ఒకటి; భూతల = నేలపైన; పతితంబు = పడినది; అయిన = కాగా; విస్మయంబు = ఆశ్చర్యము; ఒంది = పొంది; దానినన్ = దానిని; కొనిచని = తీసుకుపోయి; దేవకీనందను = కృష్ణుని; సన్నిధానంబునన్ = దగ్గర; పెట్టి = పెట్టి; ఎఱిగించినన్ = తెలుపగా; అతండు = అతను; ఆత్మ = తనచేతనే; కల్పితంబు = ఏర్పరచిన; మాయా = మాయ చేత; రూపంబు = రూపుదిద్దుకొన్నది; అగుటన్ = ఐ ఉండుట; ఎఱింగియున్ = తెలిసి ఉన్నప్పటికి; ఎఱుంగని = తెలియనివాని; తెఱంగునన్ = విధముగ; వారలన్ = వారిని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

గర్వంతో ఉద్రేకించి చెలరేగిన యాదవబాలురు మునుల శాపం విని భయపడి వడ వడ వణుకుతూ సాంబుడి పొట్టచుట్టూ చుట్టిన చీరల ముడులు విప్పసాగారు. ఆ చీరల పొరలలో నుంచి ఇనుపరోకలి ఒకటి నేల మీద పడింది. వారు ఆశ్చర్యపడి దానిని తీసుకువెళ్ళి శ్రీకృష్ణుల వారి సన్నిధిలో పెట్టి జరిగినదంతా చెప్పారు. అదంతా తన మాయచేత జరిగిందని తెలిసినా కూడ, ఏమి తెలియనివాడిలా వాళ్ళతో వాసుదేవుడు ఇలా అన్నాడు.

11-24-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మది సెడి కన్నులుగానక
యుతులై మునులఁ గల్లమాటలఁ జెనయం
దిసి కులక్షయకారణ
విదితం బగు శాప మొందు వెఱ్ఱులుఁ గలరే?

టీకా:

మది = బుద్ధి; చెడి = నశించి; కన్నులు = కళ్ళు; కానక = కనబడక; మద = గర్వము, పొగరు; యుతులు = ఎక్కినవారు; ఐ = అయ్యి; మునులన్ = ఋషులతో; కల్ల = అబద్దపు; మాటలు = మాటలుతో; చెనయన్ = ఎదుర్కొనుటకు; కదిసి = చేరి; కుల = వంశమునకు; క్షయ = నాశన; కారణ = కారణభూతము; విదితంబు = కలిగించెడిది; అగు = అయ్యడి; శాపమున్ = శాపమును; ఒందు = పొందెడి; వెఱ్ఱులు = వెఱ్ఱివారు; కలరే = ఎక్కడైనా ఉంటారా.

భావము:

“మీ బుద్ధిచెడి పోయింది. కళ్ళు మూసుకుపోయి, పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులకు కోపం తెప్పించారు. ఈ విధంగా కులక్షయానికి మూలమైన శాపం పొందే వెఱ్ఱివాళ్ళు ఎవరైనాఉంటారా. అనుభవించండి.

11-25-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణీసురశాపమునకు
రిహర బ్రహ్మాదులైన డ్డము గలరే?
రు లనఁగ నెంత వారలు
మరుదుగఁ బూర్వజన్మర్మముఁ ద్రోవన్‌?

టీకా:

ధరణీసుర = విప్రుల; శాపమున్ = శాపమున; కున్ = కు; హరి = విష్ణుమూర్తి; హర = పరమశివుడు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆదులు = మున్నగువారు; ఐనన్ = అయినప్పటికి; అడ్డము = అడ్డకొన; కలరే = సమర్థులా, కాదు; నరులు = మానవులు; అనగన్ = అనగా; ఎంత = ఏపాటి; వారలు = వారు; కరము = మిక్కిలి; అరుదుగ = అద్భుతముగ; పూర్వజన్మ = జన్మజన్మల సంచిత; కర్మమున్ = కర్మముల ఫలమును; త్రోవన్ = తొలగించుటకు;

భావము:

బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు అంతటి వారు సైతం బ్రాహ్మణ శాపాన్ని అడ్డుకోలేరు. ఇక సామాన్య మనుషులనగా ఎంత? పూర్వజన్మ కర్మ ఫలాన్ని తొలగించుటం ఎవరికి సాధ్యం కాదు కదా.

11-26-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది గావున యతి నిందాపరత్వంబున యదువంశనాశం బగు; సందియంబులే” దని పరమేశ్వరుండు వారలం జూచి “సముద్రతీరంబున నొక్క మహాపర్వతం బున్నది; యందు నుండు నత్యుచ్ఛ్రయ విశాలభీషణం బగు పాషాణంబున మీ భుజాబలంబుచేత నీ ముసలంబు దివిచి దీని చూర్ణంబు సింధు కబంధంబులఁ గలిపి రండు; పొండ”ని జగద్విభుండైన కృష్ణుం డానతిచ్చిన, వారు నట్ల చేసి తత్కీలితం బయిన లోహఖండంబును సరకుగొనక సాగరంబునఁ బడవైచిన, నొక్క ఝషంబు గ్రసించిన, దాని నొక్క లుబ్ధకుండు జాలమార్గంబునఁ బట్టికొని, తదుదరగతంబయిన లోహఖండంబు దెచ్చి బాణాగ్రంబున ముల్కిగా నొనర్చె” నని తత్కథావృత్తాంతంబు సెప్పిన బాదరాయణిం గనుంగొని రాజేంద్రుం డిట్లనియె.

టీకా:

అదిగావున = అందుచేత; యతి = మహామునులను; నిందా = నిందించు; పరత్వంబునన్ = ఆసక్తివలన; యదు = యాదవుల; వంశ = వంశములకు; నాశంబు = నాశనము; అగున్ = కలుగును; సందియంబు = అనుమానము; లేదు = లేదు; అని = అని; పరమేశ్వరుండు = కృష్ణుడు {పరమేశ్వరుడు - అత్యున్నతమైన ఈశ్వరుడు, విష్ణువు}; వారలన్ = వారిని; చూచి = చూసి; సముద్ర = సాగరము {సముద్రము - చంద్రోదయము వలన వృద్ధిపొందునది, కడలి}; తీరంబునన్ = ఒడ్డునందు; ఒక్క = ఒకానొక; మహా = గొప్ప; పర్వతంబు = పర్వతము; ఉన్నది = ఉంది; అందు = దానిలో; ఉండు = ఉండెడి; అతి = మిక్కిలి; ఉచ్ఛ్రయ = పొడవైనది; విశాల = వెడల్పైనది; భీషణంబు = భయంకరమైన; పాషాణంబున = బండరాతి పైన; మీ = మీ యొక్క; భుజాబలంబు = బాహుబలము; చేత = వలన; ఈ = ఈ యొక్క; ముసలంబున్ = రోకలిని; తివిచి = అరగదీసి; దీని = దీని; చూర్ణంబును = పొడిని; సింధు = కడలి; కబంధంబులన్ = నీటిలో; కలిపి = కలిపేసి; రండు = రండి; పొండు = వెళ్ళండి; అని = అనుచు; జగత్ = లోకమునకు; విభుండు = ప్రభువు; ఐన = అయినట్టి; కృష్ణుండు = కృష్ణుడు; వారున్ = వారలు; అట్ల = అలానే; చేసి = చేసి; తత్ = ఆ యొక్క; కీలితంబు = మిగిలిపోయినది; అయిన = ఐన; లోహ = ఇనప; ఖండంబునున్ = ముక్కను; సరకుగొనక = లెక్కచేయక; సాగరంబునన్ = సముద్రలాలలో; పడవేయగా = పడవేయగా; యొక్క = ఒకానొక; ఝషంబు = చేప; గ్రసించిన = మింగగా; దానిన్ = దానిని; ఒక్క = ఒకానొక; లుబ్దకుండు = బోయవాఁడు; జాల = వలవేసెడి; మార్గంబునన్ = విధానముతో; పట్టికొని = పట్టుకొని; తత్ = దాని; ఉదర = కడుపులోనున్నది; అయిన = ఐన; లోహఖండంబున్ = లోహపుముక్కను; తెచ్చి = తీసుకొని వచ్చి; బాణ = బాణమునకు; అగ్రంబునన్ = చివర; ముల్కి = ములుకి; కాన్ = అగునట్లు; ఒనర్చెను = చేసెను; అని = అని; తత్ = ఆ; కథా = కథా; వృత్తాంతంబు = విషయము; చెప్పినిన్ = చెప్పగా; బాదరాయణిన్ = శుకుని {బాదరాయణి - బాదరాయణుని కుమారుడు, శుకుడు}; కనుగొని = చూసి; రాజేంద్రుండు = పరీక్షిన్మహారాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అందుచేత ఈ యతులను నిందించటం అనే దోషం వలన యదువంశం నాశనం కాక తప్పదు.” ఇలా పలికి వాసుదేవుడు వాళ్ళను ఇలా ఆఙ్ఞాపించాడు. “సముద్రపు ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. అక్కడ భయంకరమైన బాగా పొడవూ వెడల్పూ గల పెద్దబండ మీద మీ భుజబలాలు వాడి, ఈ ఇనుప రోకలిని బాగా నూరి అరగదీసి పొడి పొడి చేసి, ఆ పొడిని సముద్రపు నీళ్ళలో కలపండి. పొండి.” అన్నాడు. విశ్వేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన ఆ ప్రకారం పొడిచేసి సముద్రంలో కలిపి. మిగిలిన చిన్న లోహపు ముక్కను లెక్క చేయక, అరగదీయుట ఆపి, సముద్రంలో పడవేశారు. దానిని ఒకచేప మ్రింగింది దానిని ఒక బోయవాడు వలవేసి పట్టుకున్నాడు. దాని కడుపులో ఉన్న ఇనుపముక్కను తన బాణం చివర ములికిగా మలచుకున్నాడు.” అని ఆ కథా విషయం అంతా చెప్పిన శుకమహర్షిని పరీక్షన్మహారాజు ఇలా అన్నాడు.

11-27-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చిత్తం బే క్రియ నిలుచుం?
జిత్తజగురు పాదపద్మ సేవ సదా య
త్యుత్తమ మని వసుదేవుఁడు
చిత్తముఁ దగ నిల్పి యెట్లు సెందె మునీంద్రా! "

టీకా:

చిత్తంబు = మనసు; ఏ = ఏ; క్రియన్ = విధముగ; నిలుచున్ = నిలబడును; చిత్తజగురు = విష్ణుమూర్తి {చిత్తజగురువు - చిత్తజు (మన్మథుని) గురువు (తండ్రి), విష్ణువు}; పాద = పాదములనెడి; పద్మ = పద్మముల; సేవ = కొలచుటందు; సదా = ఎల్లప్పుడు; అత్యుత్తమము = అతి ఉత్తమమైనది; అని = అని; వసుదేవుడు = వసుదేవుడు; చిత్తమున్ = మనసును; తగన్ = చక్కగ; నిల్పి = లగ్నమైనదిగా; ఎట్లు = ఎలా; చెందెన్ = పొందెను; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా.

భావము:

“మునీంద్రా! మనసు ఏ విధంగా నిశ్చలంగా నిలబడుతుంది? మన్మథుడి జనకుడైన శ్రీమహావిష్ణువు చరణకమలములను సేవించటం మిక్కిలి ఉత్తమమైనదని నమ్మి వసుదేవుడు ఏవిధంగా తన చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేసాడు.”