పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : గోపికల వేణునాథుని వర్ణన

  •  
  •  
  •  

10.1-777-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గోస్థానక రంగమందుఁ బరమానందంబుతోఁ జూత ప
ల్ల నీలోత్పల పింఛ పద్మదళ మాలా వస్త్ర సంపన్నులై
యై వేణువు లూఁదుచున్ బహునటాకారంబులం గేళితాం
ముల్ జేసెద రీ కుమారకులు; వేడ్కం గామినుల్ గంటిరే.

టీకా:

నవ = కొత్త; గోస్థానక = పశువులదొడ్డి అనెడి; రంగము = రంగస్థలము; అందున్ = అందు; పరమ = మిక్కిలి; ఆనందంబునన్ = సంతోషముతో; చూత = మామిడి; పల్లవ = లేతచిగుళ్ళ; నీలోత్పల = నల్ల కలువపూవుల; పింఛ = నెమలిపింఛము; పద్మదళ = తామరపూలరేకుల; మాలా = దండలు; వస్త్ర = మంచిబట్టలు; సంపన్నులు = సమృద్ధిగా గలవారు; ఐ = అయ్యి; కవ = జోడి, జతగా; ఐ = అయ్యి; వేణువులు = పిల్లనగ్రోవులను; ఊదుచున్ = పూరించుచు; బహు = మిక్కిలిగా; నట = నటుల యొక్క; ఆకారంబులన్ = స్వరూపముతో; కేళీ = వినోదపు; తాండవముల్ = ఉద్ధతమైన నృత్యములను {లాస్యము – మృదుమధురమైన నాట్యము}; చేసెదరు = చేయుచున్నారు; ఈ = ఈ ప్రసిద్ధమైన; కుమారకులు = బాలురు; వేడ్కన్ = సంతోషముతో; కామినుల్ = పడతులు {కామిని - కామము కలామె, కామించదగినామె, స్త్రీ}; కంటిరే = చూసితిరా.

భావము:

“ఓ గొల్లభామల్లారా! ఈ వేడుకలు చూడండి. ఈ బలరామకృష్ణులు ఎంతో సంతోషంతో మామిడి చివుళ్ళు, నల్ల కలువలు, నెమలి ఫించాలు, తామర పూదండలు, పట్టు పుట్టాలు ధరించారు. జతగూడి ఈ సుకుమారులు మురళి మ్రోగిస్తూ నిత్యం ఎన్నెన్నో నటవేషాలతో అత్యంత మనోహరంగా తాండవ మాడుతున్నారు. చూడండి.