దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ కల్యాణంబు
- ఉపకరణాలు:
అనఘ! యాదిలక్ష్మి యైన రుక్మిణితోడఁ
గ్రీడ సలుపుచున్న కృష్ణుఁ జూచి
పట్టణంబులోని ప్రజ లుల్లసిల్లిరి
ప్రీతు లగుచు ముక్తభీతు లగుచు."
టీకా:
అనఘ = పుణ్యుడా; ఆదిలక్ష్మి = ఆదిలక్ష్మి; ఐన = అయినట్టి; రుక్మిణి = రుక్మిణీదేవి; తోడన్ = తోటి; క్రీడన్ = క్రీడించుట; సలుపుచున్న = చేయుచున్న; కృష్ణున్ = కృష్ణుని; చూచి = చూసి; పట్టణంబు = నగరము; లోని = అందలి; ప్రజలు = జనులు; ఉల్లసిల్లిరి = ఆనందించిరి; ప్రీతులు = సంతోషము కలవారు; అగుచున్ = అగుచు; ముక్త = విడువబడిన; భీతులు = భయము కలవారు; అగుచున్ = అగుచు.
భావము:
పుణ్యాత్ముడైన పరీక్షిన్మహారాజా! ఆదిలక్ష్మి యొక్క అవతారమైన రుక్మిణితో క్రీడిస్తున్న శ్రీకృష్ణమూర్తిని చూసి ద్వారకానగరం లోని పౌరులు భయాలు విడనాడి యెంతో సంతోషంతో విలసిల్లారు."