దశమ స్కంధము - పూర్వ : రాజలోక పలాయనంబు
- ఉపకరణాలు:
"బ్రతుకవచ్చు నొడలఁ బ్రాణంబు లుండినఁ;
బ్రతుకు గలిగెనేని భార్య గలదు;
బ్రతికితీవు; భార్యపట్టు దైవమెఱుంగు;
వగవ వలదు చైద్య! వలదు వలదు."
టీకా:
బ్రతుకవచ్చు = జీవింపగలము; ఒడలన్ = ఒంట్లో; ప్రాణంబులు = ప్రాణములు; ఉండినన్ = ఉన్నచో; బ్రతుక = జీవించి ఉండుట; కలిగెనేనిన = జరిగినచో; భార్య = భార్య; కలదు = ఎక్కడనైన దొరకును; బ్రతికితివి = జీవించి ఉన్నావు; నీవు = నీవు; భార్యన్ = భార్యను; పట్టు =విషయము; దైవము = దేవునికే; ఎఱుంగు = తెలియునులే; వగవన్ = విచారించుట; వలదు = వద్దు; చైద్య = శిశుపాలుడా; వలదువలదు = వద్దేవద్దు.
భావము:
ఇంకా ఇలా చెప్పసాగారు “నాయనా చేదిరాజ! శిశుపాలా! దుఃఖించకు. ఒంట్లో ప్రాణలుంటే ఎలాగైనా బతక వచ్చును. బతికుంటేనే కదా భార్య ఉండేది. పెళ్ళాం మాట దేవుడెరుగు నువ్వు బతికున్నావు. వద్దు. ఇంక అసలు దుఃఖించ వద్దు.