పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణి సందేశము పంపుట

  •  
  •  
  •  

10.1-1706-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీయుతమూర్తి! యో పురుషసింహమ! సింహముపాలి సొమ్ము గో
మాయువు గోరు చందమున త్తుఁడు చైద్యుఁడు నీ పదాంబుజ
ధ్యాయిని యైన నన్ను వడిఁ దాఁ గొనిపోయెద నంచు నున్నవాఁ
డా ధమాధముం డెఱుఁగఁ ద్భుతమైన భవత్ప్రతాపమున్

టీకా:

శ్రీ = లక్ష్మీదేవితో, సంపదలతో; యుత = కూడియున్న; మూర్తి = స్వరూపుడా; ఓ = ఓయీ; పురుష = పురుషులలో; సింహమా = శ్రేష్ఠుడా; సింహము = సింహమునకు; పాలి = చెందిన; సొమ్మున్ = పశువును; గోమాయువున్ = నక్క; కోరు = ఆశించెడి; చందమునన్ = విధముగ; మత్తుడు = మిక్కిలి గర్వము కలవాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు - చేది దేశపువాడు, శిశుపాలుడు}; నీ = నీ యొక్క; పద = పాదము లనెడి; అంబుజ = పద్మము లందు; ధ్యాయిని = ధ్యానించుదానను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; వడిన్ = వేగముగా, తీవ్రముగా; తాన్ = అతను; కొనిపోయెదను = తీసుకుపోయెదను; అంచున్ = అని; ఉన్నవాడు = ఉన్నాడు; ఆ = ఆ యొక్క; అధమ = నీచులలో; అధముండు = నీచుడు; ఎఱుగడు = ఎరుగడు; అద్భుతము = దివ్యము; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; ప్రతాపమున్ = పరాక్రమమును.

భావము:

ఓ శుభాకారా! పురుషోత్తమ! శ్రీకృష్ణా! సింహానికి చెందవలసిన దానిని నక్క కోరినట్లు, గర్విష్ఠి ఐన శిశుపాలుడు నీ పదభక్తురాలు ఐన రుక్మిణిని, నన్ను తీసుకుపోతాను అంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని పరమనీచుడు వాడు.