పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ జననంబు

  •  
  •  
  •  

10.1-1697-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బంధువు లెల్లఁ "గృష్ణునకు బాలిక నిచ్చెద" మంచు శేముషీ
సింధువులై విచారములు చేయఁగ, వారల నడ్డపెట్టి దు
స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాల విరోధముఁ జేసి "మత్త పు
ష్పంయవేణి నిత్తు శిశుపాలున" కంచుఁ దలంచె నంధుఁడై.

టీకా:

బంధువులు = చుట్టములు; ఎల్లన్ = అందరు; కృష్ణున్ = కృష్ణుని; కున్ = కి; బాలికను = కన్యకను, రుక్మిణిని; ఇచ్చెదము = పెండ్లిచేయుదము; అంచున్ = అని; శేముషీ = సద్బుద్ధి; సింధువులు = సముద్రమంత కలవారు; ఐ = అయ్యి; విచారములు = ఆలోచనలు; చేయగన్ = చేయుచుండగా; వారలన్ = వారిని; అడ్డపెట్టి = అడ్డుకొని; దుస్సంధుడు = చెడ్డ ప్రతిజ్ఞ కలవాడు; రుక్మి = రుక్మి; కృష్ణున్ = కృష్ణుని; ఎడన్ = అందు; చాల = అధికముగా; విరోధమున్ = శత్రుత్వము; చేసి = పెట్టుకొని; మత్త = మదించిన; పుష్పంధయ = తుమ్మెదలవంటి {పుష్పంధయము - పూలలోని మధువును గ్రోలునది, తుమ్మెద}; వేణిన్ = జడ కలామెను, రుక్మిణిన్; ఇత్తున్ = వివాహమున ఇచ్చెదను; శిశుపాలున్ = శిశుపాలుని; కిన్ = కి; అంచున్ = అని; తలచెన్ = ఎంచెను; అంధుడు = కన్నుగానని వాని వలె; ఐ = అయ్యి.

భావము:

రుక్మిణిని బంధువు లంతా మిక్కిలి సద్భుద్దితో కృష్ణుడి కిద్దాం అనుకుంటున్నారు; కాని దుష్టులతో స్నేహంపట్టి జ్ఞానహీనుడైన రుక్మి వారిని కాదని, కృష్ణుడి యందు యెంతో విరోధం పెట్టుకొని, మూర్ఖంగా చేదిదేశపు రాజు శిశుపాలుడికి గండుతుమ్మెదల పిండు వలె నల్లని శిరోజాలు గల సుందరవేణి అయిన తన చెల్లెలు రుక్మిణిని ఇస్తానంటున్నాడు.