పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : రుక్మిణీ జననంబు

  •  
  •  
  •  

10.1-1695-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లన రూపు, బుద్ధియు,
శీము, లక్షణము, గుణముఁ జింతించి తగన్
"బాలారత్నముఁ దన కి
ల్లాలుగఁ జేకొందు" ననుచు రియుం దలఁచెన్.

టీకా:

ఆ = ఆ యొక్క; లలన = సుందరి యొక్క; రూపు = రూపసౌందర్యము; బుద్ధియున్ = చక్కటి ప్రజ్ఞ; శీలము = నడవడిక; లక్షణము = మంచి లక్షణములు; గుణమున్ = సుగుణములు; చింతించి = విచారించి; తగన్ = తగినట్లు; బాలా = బాలికలలో; రత్నమున్ = శ్రేష్ఠురాలిని; తన = అతని; కిన్ = కి; ఇల్లాలుగన్ = భార్యగా; చేకొందును = చేపట్టెదను; అనుచున్ = అని; హరియున్ = కృష్ణుడు కూడ; తలచెన్ = భావించెను.

భావము:

ఆ సుందరి అందచందాలు, మంచిబుద్ధి, శీలం, నడవడిక, సుగుణాలు, తెలిసి కృష్ణుడు కూడా రుక్మిణీ కన్యకా రత్నాన్ని పెళ్ళి చేసుకుందా మనుకొన్నాడు.