పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : జరసంధుడు గ్రమ్మర విడియుట

  •  
  •  
  •  

10.1-1668-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మ్లేచ్ఛులం బొరిగొని మఱియు న మ్మథురానగరంబునం గల ధనంబు ద్వారకానగరంబునకుం బంచిన మనుష్యులు గొనిపోవు నెడ.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; మ్లేచ్ఛులన్ = తురుష్కులను; పొరిగొని = చంపి; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; మథురానగరంబునన్ = మథురాపట్టణము నందు; కల = ఉన్న; ధనంబున్ = ధనమును; ద్వారకానగరంబున్ = ద్వారకాపట్టణమున; కున్ = కు; పంచినన్ = పంపగా; మనుష్యులు = మానవులు; కొనిపోవు = తీసుకుపోతున్న; ఎడన్ = సమయము నందు;

భావము:

అలాగ మ్లేచ్ఛులను సంహరించి మథురానగరంలో ఉండే సిరిసంపదలను ద్వారకానగరానికి తరలించడానికి మనుషులను ఏర్పాటు చేసాడు.అలా వారు ఆ సంపదలను పట్టుకు వెళుతున్న సమయంలో......

10.1-1669-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘోటకసంఘాత ఖురసమున్నిర్గత-
ధూళి జీమూత సందోహముగను
హనీయ మదకల మాతంగ కటదాన-
ధారలు కీలాలధారలుగను
నిరుపమ స్యందననేమి నిర్ఘోషంబు-
దారుణ గర్జిత ధ్వానముగను
నిశిత శస్త్రాస్త్ర మానిత దీర్ఘరోచులు-
లిత సౌదామినీ తికలుగను

10.1-1669.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త్రురాజ ప్రతాపాగ్ని శాంతముగను
వృష్టికాలము వచ్చు న వ్విధముఁ దోఁప
నేగుదెంచె జరాసంధుఁ డిరువదియును
మూడు నక్షౌహిణులు దన్ను మొనసి కొలువ.

టీకా:

ఘోటక = గుఱ్ఱముల; సంఘాత = సమూహము యొక్క; ఖుర = గిట్టలచే; సమ = మిక్కిలి; ఉత్ = పైకి; నిర్గత = లేస్తున్న; ధూళి = దుమ్ము; జీమూత = మేఘముల; సందోహము = సమూహము; కను = అయినట్లు; మహనీయ = మిక్కిలిగొప్పవైన; మదకల = మదపుటేనుగు యొక్క; మాతంగకట = ఏనుగుచెక్కిళ్ళు లందలి; దాన = మదజలపు; ధారలు = కారెడి ధారలు; కీలాల = జల; ధారలు = ధారలు; కనున్ = అయినట్లు; నిరుపమ = సాటిలేని; స్యందన = రథముల; నేమి = చక్రపుకమ్ముల యొక్క; నిర్ఘోషంబు = గట్టిధ్వని; దారుణ = భయంకరమైన; గర్జిత = ఉరుముల; ధ్వానము = చప్పుళ్ళు; కను = అయినట్లు; నిశిత = వాడి యైన; శస్త్ర = శస్త్రముల యొక్క; అస్త్ర = అస్త్రముల యొక్క; మానిత = మనోజ్ఞమైన; దీర్ఘ = అధికమైన; రోచులు = కాంతులు; లలిత = మనోజ్ఞమైన; సౌదమినీ = మెరుపు; లతికలు = తీగలు; కను = అయినట్లు.
శత్రు = విరోధి; రాజ = రాజుల; ప్రతాప = ప్రతాపము అనెడి; అగ్ని = అగ్ని; శాంతము = చల్లార్చునవి; కను = అయినట్లు; వృష్టికాలము = వానాకాలము; వచ్చు = వచ్చెడి; విధమునన్ = విధము; తోపన్ = కనబడునట్లు; ఏగుదెంచె = వచ్చెను; జరాసంధుడు = జరాసంధుడు; ఇరువదియునుమూడున్ = ఇరవైమూడు; అక్షౌహిణులు = అక్షౌహిణుల సేన; తన్ను = అతనిని; మొనసి = పూని; కొలువన్ = సేవించుచుండగా.

భావము:

జరాసంధుడు ఇరవైమూడు అక్షౌహిణుల సేనతో మథుర మీదకి దండెత్తి వచ్చాడు; అతడి గుఱ్ఱాల గుంపుల డెక్కల వలన రేగిన దుమ్ము మబ్బుల గుంపులా ఉంది; బాగా పెద్దవైన మదపుటేనుగుల చెక్కిళ్ళనుండి స్రవించే మదజలధారలు వర్షజలధారలను మించాయి; కదిలే రథచక్రాల రొద ఘోరమైన ఉరుముల మ్రోతలా అనిపించింది; వాడి శస్త్రాస్త్రాల పెనుకాంతులు మెరిసే మెఱుపుతీగలను పోలాయి; శత్రురాజుల శౌర్యాగ్నిని చల్లార్చే వర్షాకాలం మాదిరి అతడి సైన్యం గోచరించింది;

10.1-1670-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టు చనుదెంచి యున్న మగధేశ్వర వాహినిఁ జూచి యుద్ధ సం
నము మాని మానవుల కైవడి భీరుల భంగి నోడి ముం
టి ధనమెల్ల డించి మృదుతామరసాభ పదద్వయుల్ క్రియా
టువులు రామకేశవులు పాఱిరి ఘోరవనాంతరంబులన్.

టీకా:

ఇటు = ఇలా; చనుదెంచి = వచ్చి; ఉన్న = ఉన్నట్టి; మగధేశ్వర = జరాసంధుని {మగధేశ్వరుడు - మగధ దేశపు రాజు, జరాసంధుడు}; వాహినిన్ = సైన్యమును; చూచి = చూసి; యుద్ధ = యుద్ధమునకు; సంఘటనము = సన్నాహములు; మాని = చేయకుండ; మానవుల = సామాన్య మానవుల; కైవడిన్ = వలె; భీరుల = పిరికివారి; భంగిన్ = వలె; ఓడి = భయపడి; ముందటి = ముందరనున్న; ధనము = ధనములను; ఎల్లన్ = అన్నిటిని; డించి = దిగవిడిచి; మృదు = మెత్తని; తామరస = తామరలను; ఆభ = పోలిన; పద = పాదముల; ద్వయుల్ = యుగళములు కలవారు; క్రియా = పనిసాధించుట యందు; పటువులు = దార్ఢ్యము గలవారు; రామ = బలరాముడు; కేశవులు = కృష్ణులు; పాఱిరి = పరుగిడిరి; ఘోర = భీకరమైన; వనా = అడవుల; అంతరంబులన్ = లోపలకి.

భావము:

అలా మథుర మీదకి దండెత్తి వచ్చిన మగధరాజు జరాసంధుడి సైన్యాన్ని చూసి, యుద్ధ ప్రయత్నం మానుకుని కేవలం సామాన్యజనుల వలె, రణభీరువుల వలె బెదిరిపోయి; తమ సంపదలు అన్నీ అక్కడే దిగవిడచి మెత్తటి తామరదళాల వంటి అడుగులు కలవారూ, కార్యశూరులూ అయిన రామకృష్ణులు భయంకరారణ్యంలో పడి పరిగెత్తసాగారు.

10.1-1671-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు పఱచుచున్న కృష్ణబలభద్రులం జూచి వారల ప్రభావంబు లెఱుంగక పరిహసించి.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; పఱచుచున్న = పరుగెడుతున్న; కృష్ణ = కృష్ణుడు; బలభద్రులన్ = బలరాములను; చూచి = చూసి; వారల = వారి యొక్క; ప్రభావంబుల్ = మహిమలను; ఎఱుంగక = తెలియక; పరిహసించి = ఎగతాళి చేసి.

భావము:

అలా పారిపోతున్న బలరామకృష్ణులను చూసి, వారి మహిమలు గుర్తించలేక జరాసంధుడు ఎగతాళి చేస్తూ....

10.1-1672-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" దువీరులార! రభసోద్ధతిఁ బాఱకుఁ; డిట్లు పాఱినం
బోయెడువాఁడఁ గాను; మిము భూమి నడంగిన మిన్ను బ్రాకినం
దోధిఁ జొచ్చినం దగిలి త్రుంచెద" నంచు సమస్త సేనతోఁ
బాక వచ్చె వెంటఁబడి బాహుబలాఢ్యుఁడు మాగధేశుఁడున్.

టీకా:

ఓ = ఓయీ; యదు = యాదవ వంశపు; వీరులార = యుద్ధవీరులు; రభస = తొందరపాటు యొక్క; ఉద్ధతిన్ = అతిశయముచేత; పాఱకుడు = పారిపోకండి; ఇట్లు = ఈ విధముగ; పాఱినన్ = పారిపోతున్నచో; పోయెడు = విడిచిపోయెడి; వాడను = వాడిని; కాను = కాదు; మిమున్ = మిమ్ము; భూమిన్ = నెలలోనికి; అడంగినన్ = దూరిపోయిన; మిన్నున్ = ఆకాశమునకు; ప్రాకినన్ = ఎగిరిన; తోయధి = సముద్రమునందు; చొచ్చినన్ = ములిగినను; తగిలి = వెంటనంటి వచ్చి; త్రుంచెదన్ = చంపెదను; అంచున్ = అని; సమస్త = ఎల్ల; సేన = సేనల; తోన్ = తోటి; పాయక = విడువకుండ; వచ్చెన్ = వచ్చెను; వెంటబడి = వెంబడించి; బాహుబల = భుజబలము యొక్క; ఆఢ్యుడు = సంపత్తి కలవాడు; మాగధేశుడున్ = జరాసంధుడు.

భావము:

“ఓ యాదవవీరులారా! బలరామకృష్ణులారా! అలా వేగంతో పారిపోకండి. ఎంత ఎక్కువ వేగంతో పరిగెత్తి పారిపోతున్నా మిమ్మల్ని విడిచిపెట్టను. భూమిలో దాగినా, ఆకాశానికి ఎగిరినా, సముద్రంలో మునిగినా; వెనుకే వచ్చి మిమ్మల్ని హతమారుస్తాను.” అంటూ భుజబలసంపన్ను డైన ఆ మగధరాజు వదలకుండా సకల సేనలతో వారి వెంటపడ్డాడు.