పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కాలయవనుడు వెంటజనుట

  •  
  •  
  •  

10.1-1636-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ము చేయలేక పురుషాధమ! దుర్లభ కంటకద్రుమా
భీ మహాశిలా సహిత భీకర కుంజర ఖడ్గ సింహ శా
ర్దూ తరక్షు సంకలిత దుర్గపథంబునఁ బాఱుతెంచి యీ
శైగుహన్ సనిద్రుక్రియఁ జాఁగి నటించినఁ బోవనిత్తునే?

టీకా:

ఆలమున్ = పోరు; చేయలేక = సలుపజాలక; పురుషాధమ = అల్పుడా {పురుషాధముడు - మగవారిలో తక్కువవాడు, అల్పుడు}; దుర్లభ = కష్టసాధ్యమైన; కంటక = ముళ్ళు; ద్రుమ = చెట్లతో; ఆభీల = భయంకరమైనట్టి; మహాశిలా = బండరాళ్ళతో; సహిత = కూడుకొన్న; భీకర = భయంకరమైన; కుంజర = ఏనుగులు; ఖడ్గ = ఖడ్గమృగముల; సింహ = సింహములు; శార్దూల = పెద్దపులులు; తరక్షు = సివంగులుతో; సంకలిత = కూడుకొన్న; దుర్గ = చొరరాని; పథంబునన్ = దారిలో; పాఱుతెంచి = పరుగెత్తుకు వచ్చి; ఈ = ఈ యొక్క; శైల = కొండ; గుహన్ = గుహలో; సనిద్రున్ = నిద్రపోతున్నవాని; క్రియన్ = వలె; చాగి = సాచి, ప్రవర్తించి; నటించినన్ = వేషాలు వేసినంతమత్రాన; పోవనిత్తునే = వదిలిపెట్టను.

భావము:

“ఓరీ! పురుషాధమా! నాతో యుద్ధం చేయలేక ముళ్ళ చెట్లు, బండ రాళ్ళు, ఏనుగులు, ఖడ్గమృగాలు, సింహములు, శార్దూలములు, సివంగులు మొదలైన జంతువులతో భీతికొల్పుతూ నడవడానికి వీలుకాని దారిలోపడి పరుగెత్తుకుని వచ్చి ఈ కొండగుహలో దూరి నిద్రిస్తున్న వాడి వలె నటిస్తున్నావా? నిన్ను వదుల్తాను అనుకుంటున్నావా?