పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - పూర్వ : కుబ్జతో క్రీడించుట

  •  
  •  
  •  

10.1-1493-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లీలావతీకృతోల్లస
దేలా కర్పూర మిళిత హిత మధుర మహా
హాలారసపాన మద
శ్రీలాలిత యగుచు నబల చేరెం గృష్ణున్.

టీకా:

లీలావతి = విలాసవంతులు చేత; కృత = చేయబడిన; ఉల్లసత్ = ఉత్సాహము కలిగించెడి; ఏలా = ఏలకులు; కర్పూర = పచ్చకర్పూరము; మిళిత = కలపబడిన; హిత = రుచికరమైన; మధుర = తీయని; మహా = గొప్ప; హేలారస = మద్యమును; పాన = తాగుటచే; మద = మత్తుచేత; శ్రీ = వృద్ధిపొందిన; లాలిత = లాలిత్యము కలామె; అగుచున్ = అగుచు; అబల = కుబ్జ; చేరెన్ = సమీపించెను; కృష్ణున్ = కృష్ణుడును.

భావము:

విలాసవతులచే ఏలకులు పచ్చకర్పూరము కలపి తయారుచేయబడిన హితకరమైన తియ్యటి గొప్ప ఆసవము సేవించి కలువ కంటి కుబ్జ మైమరచి కరగిన హృదయంతో శ్రీకృష్ణుడిని చేరింది.

10.1-1494-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సాలోకనవృష్టి పైఁ గురియుచున్ మ్యగ్వచో వైఖరిం
రఁగం జేసి సువర్ణకంకణసమగ్రం బైన సైరంధ్రి కేల్
పద్మంబునఁ బట్టి తల్పమున కార్షించి గంభీరతం
రిరంభాదుల నానపుచ్చి మరుసంభావించుచున్ వేడుకన్.

టీకా:

సరస = సరసపు; ఆలోకన = చూపులు అను; వృష్టిన్ = వానను; పైన్ = మీద; కురియుచున్ = కురిపించుచు; సమ్యక్ = మంచి; వచః = మాటల; వైఖరిన్ = రీతిచేత; కరగన్ = రక్తిపొందునట్లు; చేసి = చేసి; సువర్ణ = బంగారు; కంకణ = కంకణములతో; సమగ్రంబు = నిండుదనము కలిగినది; ఐన = అయిన; సైరంధ్రి = కుబ్జ యొక్క {సైరంధ్రి - సైరంధ్రీ పరవేశ్మస్థా స్వవశా శిల్పకారికా. (అమరము), శృంగారించు టాదుల కైన పనిగత్తె}; కేల్ = చేతిని; కర = చేయి అనెడి; పద్మంబునన్ = పద్మముతో; పట్టి = పట్టుకొని; తల్పమున్ = మంచముమీద; కున్ = కి; ఆకర్షించి = లాగి; గంభీరతన్ = గాఢముగా; పరిరంభ = కౌఁగిలింతలు; ఆదులన్ = మున్నగువానిచే; నానపుచ్చి = సిగ్గుపోగొట్టి; మరున్ = మన్మథుని; సంభావించుచున్ = గౌరవించుచు; వేడుకన్ = కుతూహలముతో.

భావము:

శ్రీకృష్ణుడు శృంగార రసం వెల్లివిరిసే చూపులసొన కుబ్జపై క్రుమ్మరిస్తూ, సరసపు మాటలతో ఆమె హృదయాన్ని కరగించాడు. పద్మమువంటి తన చేతితో బంగారుకంకణాలతో అలంకృతమైన ఆమె చేతిని పట్టుకుని పక్క పైకి లాగి గట్టిగా కౌఁగిలించుకున్నాడు. సిగ్గువల్ల కలిగే జంకుగొంకులు పోగొట్టాడు. కామకేళికి ఉత్సహించాడు.

10.1-1495-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జాతియుఁ గాలముం గళయు త్వము దేశము భావచేష్టలున్
ధాతువుఁ బ్రాయముం గుణముఁ ద్దశయుం హృదయంబుఁ జూడ్కియుం
బ్రీతి విశేషముం దెలిసి పెక్కువిధంబులఁ దొయ్యలిన్ మనో
జా సుఖంబులం దనిపె శౌరి వధూహృదయాపహారియై.
^ ఉల్లేఖనము (ఆ) "స్త్రీల జాతాదులు" నకలు. . . లింకు తెరచి చూడగలరు

టీకా:

జాతియున్ = జాతిభేదమును {స్త్రీజాతులు - 1పద్మిని 2శంఖిణి 3చిత్తిని 4హస్తిని}; కాలమున్ = అనుకూలసమయము {సురతానుకూలకాలములు - జాతి (యామము) 1హస్తిని (మొదటి) 2శంఖిణి (రెండవ) 3చిత్తిని (మూడవ) 4పద్మిని (నాల్గవయామము, తెల్లవారగట్ల) మిక్కిలి అనుకూలము}; కళయున్ = కళాస్థానముల ఎరుక {కళాస్థానములు - బొటకనవేలు స్తనము చెక్కలి ముఖము ఆది కళాస్థానములు వాని శక్తి చంద్రకళలను అనుసరించును మరియొక విధముగ చతుషష్టి మన్మథ కళలు}; సత్వము = శక్తిసామర్థ్యలక్షణము {సత్వములు - 1దేవ 2మనుజ 3నాగ 4యక్ష 5గంధర్వ 6పిశాచ 7వాయస 8వానర 9గార్దభ 10కూర్మ 11పర్యటన సత్వములు}; దేశము = పుట్టినప్రదేశ ప్రభావము {దేశము - 1దేశీయ 2లాట 3ఆంధ్ర 4కోసలోత్తర 5పాటల మహారాష్ట్ర 6వంగ గౌళ 7కామరూప 8ఉత్కళ ఆది జన్మస్థానప్రత్యేకతలు}; భావచేష్టలున్ = స్వభావ లక్షణములను {భావభేదములు - 1శ్లధ 2ఘన 3పౌఢ 4బాల భావములు}; ధాతువు = ప్రకృతిభేదము {ధాతుభేదములు - 1వాత 2పైత్య 3శ్లేష్మ ప్రకృతులు}; ప్రాయమున్ = వయోప్రభావము {ప్రాయోపభేదములు - 1బాల (16సం. వరకు) 2యౌవన (30సం. వరకు) 3పౌఢ (40సం. వరకు) 4లోల (40సం. పైన) ఆయా ప్రాయోబేధమును అనుసరించి ఉపచారలక్షణములు ఉండును}; గుణమున్ = త్రిగుణప్రభావములు {త్రిగుణములు - 1సత్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; తత్ = ఆయా; దశయున్ = అవస్థలు {దశవిధమన్మథావస్థలు - 1చూచుట 2తలచుట 3కోరుట 4కాచుట 5చిక్కిపోవుట 6అరుచిపుట్టుట 7సిగ్గువిడుచుట 8నడచుట 9మూర్చిల్లుట 10ప్రాణముపోవుట}; హృదయంబున్ = మనసు గతి; చూడ్కులున్ = చూచునట్టి రీతి; ప్రీతివిశేషమున్ = ప్రీతి భేదము {ప్రీతివిశేషములు - 1అభ్యాసయోగము 2అభిమానయోగము 3సంప్రత్యయోగము 4వైషయికము 5స్వభావసాత్వికము}; తెలిసి = అర్థముచేసికొని; పెక్కు = అనేకమైన; విధంబులన్ = విధములుగా; తొయ్యలిన్ = వనితను {తొయ్యలి - పురుషునికి సహచరి?, స్త్రీ}; మనోజాత = మన్మథ, రతి; సుఖంబులన్ = సుఖము లందు; తనిపెన్ = తృప్తిపరచెను; శౌరి = కృష్ణుడు; వధూ = ఇంతి; హృదయ = మనసును; అపహారి = దొంగిలించినవాడు; ఐ = అయ్యి.

భావము:

జాతి, కాలము, కళ, బలము, దేశము, భావము, చేష్ట, ధాతువు, ప్రాయము, గుణము, దశ, హృదయము, దృష్టి, సంతుష్టి ఇన్నిటిని ఎరిగి, మగువ మనసును దోచి, ఆ శూరుని మనుమడైన శ్రీకృష్ణుడు, అనేక విధముల మదవతి కుబ్జను మన్మథసౌఖ్యాలలో ఓలలాడించి తృప్తి పరచాడు.

10.1-1496-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పద్మంబుల మాధవుఁ
మొప్పం గౌఁగిలించి కామానలముం
భోరువు వర్జించెను
మరు దని తోడిశీతరముఖు లలరన్.

టీకా:

కర = చేతు లనెడి; పద్మంబులన్ = పద్మములచే; మాధవున్ = కృష్ణుని; కరము = మిక్కిలి; ఒప్పగన్ = చక్కగా; కౌఁగిలించి = ఆలింగనము చేసికొని; కామ = మన్మథ; అనలమున్ = అగ్నిని; కరభోరువు = సుందరి, కుబ్జ {కరభోరువు - కరభమును (చేతిచిటికెనవేలికి మణికట్టునకు నడిమి భాగమును) పోలిన ఊరువు (తొడలు కలిగినామె) (ఆంధ్రవాచస్పతము, విద్యార్థికల్పతరువు), అందగత్తె, ఏనుగుతొండము వంటి తొడలు గలది  . శ్రీహరి నిఘంటువు }; వర్జించెను = వదలిపెట్టెను; కరము = మిక్కిలి; అరుదు = దుర్లభము; అని = అని; తోడి = తోటి; శీతకరముఖులు = అందగత్తెలు {శీతకరముఖి - చంద్రముఖి, స్త్రీ}; అలరన్ = సంతోషించగా.

భావము:

లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడిని తామరపూలవంటి తన చేతులతో గట్టిగా కౌఁగిలించుకుని, అందమైన తొడల సుందరి అయిన కుబ్జ, మదనతాపాన్ని దిగవిడిచింది. చంద్రబింబమువంటి మోములు కల ఆమె చెలులు అందరూ ఎంతో అదృష్టమని సంతోషించారు.

10.1-1497-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాదుల్ దలపోసి కానని విభున్ ర్వప్రభున్ దుర్లభున్
మును దా నిచ్చిన యంగరాగ సుకృతామోదంబునం గూడియున్
నిర్వాణవిభూతి యిమ్మనక నా కంజాక్షి "యేఁ బాయఁజా
నుం గొన్ని దినంబు లంగభవకేళిం దేల్పవే?" నావుడున్.

టీకా:

సనకాదులు = సనకాదిమునులు {సనకాదులు - 1సనకుడు 2సనందన 3సనత్కుమార 4సనత్సుజాతుడు}; తలపోసి = తలచుకొన్నను; కానని = తెలిసికోజాలని; విభున్ = కృష్ణుని {విభుడు - సర్వవ్యాపకుడు}; సర్వప్రభున్ = కృష్ణుని {సర్వప్రభువు - సర్వులను (బ్రహ్మాది పిపీలక పర్యంతమును) ప్రభావము చూపు (నియమించు) వాడు, విష్ణువు}; దుర్లభున్ = కృష్ణుని {దుర్లభుడు - పొందరాని వాడు, విష్ణువు}; మును = ఇంతకు ముందు; తాన్ = ఆమె; ఇచ్చిన = ఇచ్చినట్టి; అంగరాగ = మైపూతల వలని; సుకృత = పుణ్యము; ఆమోదంబునన్ = వాసనలచేత; కూడియున్ = కలిగి యున్నను; ఘన = గొప్పదైన; నిర్వాణ = మోక్షము అనెడి; విభూతిన్ = వైభవమును, సంపదను; ఇమ్ము = ఇవ్వవలసినది; అనక = అని అడుగకుండా; ఆ = ఆ యొక్క; కంజాక్షి = పద్మాక్షి, కుబ్జ; ఏన్ = నేను; పాయజాల = ఎడబాయలేను; ననున్ = నన్ను; కొన్ని = కొద్ది; దినంబులున్ = రోజులు; అంగజభవ = మన్మథ {అంగభవకేళి - అంగభవ (మన్మథుని) కేళి (క్రీడ), సురతము}; కేళిన్ = క్రీడ యందు; తేల్పవే = ఆనందింపజేయుము; నావుడున్ = అనగా.

భావము:

కమలముల వంటి కన్నుల కుబ్జ ఇంతకు ముందు తాను మైపూతలను సమర్పించుటచే సమకూడిన పుణ్యం కొద్దీ, దేవర్షులైన సనకసనందాదు లంతటి వారు సైతం ధ్యానం చేసినా దర్శింపలేని ప్రభువు, అఖిల లోకములకు అధీశ్వరుడు, దుర్లభుడు అయినట్టి పరమాత్ముడిని కలియ కలిగింది. గొప్పదయిన కైవల్యసంపదను కోరుకోక, “కృష్ణా! నీ పొందు విడచి ఉండలేను. నన్ను కొన్నాళ్ళు మన్మథలీలలలో తేల్చుము” అని వేడుకుంది.

10.1-1498-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిత గోరుకొనిన రమిచ్చి యా శౌరి
యుద్ధవుండు దాను నువిద యిల్లు
వెడలె నపుడు తియ్యవిలుకాఁడు సురభితోఁ
దీఁగయిల్లు వెడలు తెఱఁగు మెఱయ.
^ వసుదేవుడు వంశం పటం

టీకా:

వనిత = స్త్రీ, కుబ్జ; కోరుకొనిన = అడిగిన; వరమున్ = వరమును; ఇచ్చి = ప్రసాదించి; ఆ = ఆ ప్రసిద్ధుడైన; శౌరి = కృష్ణుడు {శౌరి = శూరుని మనుమడు, కృష్ణుడు}; ఉద్ధవుండు = ఉద్ధవుడు; తానున్ = అతను; ఉవిద = స్త్రీ, కుబ్జ; ఇల్లు = నివాసమును; వెడలెన్ = వదలెను; అపుడు = అప్పుడు; తియ్యవిలుకాడు = మన్మథుడు; సురభి = వసంతము; తోన్ = తోపాటు; తీగయిల్లు = పొదరిండ్లనుండి; వెడలు = బయల్పడు; తెఱగున్ = రీతి; మెఱయన్ = ప్రకాశమగునట్లు.

భావము:

శ్రీకృష్ణుడు ఆమె కోరుకున్న వరం అనుగ్రహించాడు. మదనుడు వసంతుడు పొదరింటి నుండి వెలువడే చందంగా, ఆ దేవమీఢుడి (శూరసేనుని) మనుమడు శ్రీకృష్ణుడు, ఉద్ధవుడు కుబ్జ గృహంలో నించి బయటకు వచ్చారు.

10.1-1499-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేదంబులఁ గానని
దేవోత్తముఁ గాంచి ముక్తి తెరు వడుగక రా
జీవేక్షణ రతి యడిగెను
భావింపఁ దదీయ కర్మల మెట్టిదియో.

టీకా:

ఏ = ఎలాంటి; వేదంబులున్ = వేదవిద్యలచే నైనను; కానని = తెలియరాని; దేవ = దేవతా; ఉత్తమున్ = శ్రేష్ఠుని; కాంచి = చూసి, పొంది; ముక్తిన్ = మోక్షము పొందెడి; తెరువున్ = మార్గమును; అడుగక = వేడుకొనకుండ; రాజీవేక్షణ = కుబ్జ {రాజీవేక్షణ - పద్మాక్షి, స్త్రీ}; రతి = సురతమును; అడిగెను = కోరుకొనెను; భావింపన్ = తరచిచూసినచో; తదీయ = ఆమె యొక్క; కర్మఫలము = పూర్వకర్మఫలము; ఎట్టిదియో = ఎలాంటిదో కాని.

భావము:

వేదములకు కూడా అందరాని దేవతాశిరోమణి అయిన శ్రీకృష్ణుడిని దర్శించి కూడా పద్మములవంటి కన్నులు కల కుబ్జ, మోక్షపదవిని అడుగకుండా తుచ్ఛమైన విషయసుఖం కోరుకుంది. ఆలోచించి చూస్తే ఆమె కర్మఫలమె అలాంటిదేమో.

10.1-1500-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కారుణ్యంబునఁ గృష్ణుఁడు
తారుణ్యము మెఱసి మదనతంత్రంబుల లీ
లాణ్యవీధిఁ దేల్చెను
సైరంధ్రిన్ విభవవిజిత క్రపురంధ్రిన్.

టీకా:

కారుణ్యంబునన్ = దయతో; కృష్ణుడు = కృష్ణుడు; తారుణ్యము = యౌవనము; మెఱసి = ప్రకాశింపజేసి; మదన = మన్మథ; తంత్రంబులన్ = ఉపాయములచేత; లీలా = విలాసపు; అరణ్య = అడవి; వీథిన్ = దారివెంట; తేల్చెను = ఆనందింపజేసెను; సైరంధ్రిన్ = కుబ్జను {సైరంధ్రి - సైరంధ్రీ పరవేశ్మస్థా స్వవశా శిల్పకారికా. (అమరము), శృంగారించుటాదులకైన పనిగత్తె}; విభవశక్రపురంధ్రిన్ = వైభవముచేత; విజిత = గెలువబడిన; శక్ర = ఇంద్రుని; పురంధ్రిన్ = భార్య కలామెను.

భావము:

సౌభాగ్యము నందు శచీదేవిని సైతము జయించిన ఆ కుబ్జను ఎంతో దయతో శ్రీకృష్ణుడు యవ్వనము అతిశయిల్లగా మదనశాస్త్ర తంత్రాలతో శృంగార విలాసములనే వనవీధులలో విహరింపజేసి తృప్తి పరచాడు.

10.1-1501-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తదనంతరంబ కృష్ణుం డుద్ధవ రామ సహితుండై హస్తినాపురంబునకు నక్రూరునిం బనుపందలంచి తద్గృహంబునకుం జనిన నతండు వారలం గని లేచి రామకృష్ణులకు నమస్కరించి యుద్ధవుం గౌఁగలించుకొని వారి నందఱ యధావిధిం బూజించి హరిపాదంబులు తన తొడలమీఁద నిడుకొని యిట్లనియె.

టీకా:

తదనంతరంబ = అటు పిమ్మట; కృష్ణుండు = కృష్ణుడు; ఉద్ధవ = ఉద్ధవుడు; రామ = బలరాములతో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; హస్తినా = హస్తిన అనెడి; పురంబున్ = పట్టణమున; కున్ = కు; అక్రూరునిన్ = అక్రూరుడును; పనుపన్ = పంపించవలెనని; తలంచి = భావించి; తత్ = అతని; గృహంబున్ = ఇంటి; కున్ = కి; చనినన్ = వెళ్ళగా; అతండు = అతను; వారలన్ = వారిని; కని = చూసి; లేచి = లేచి నిలబడి; రామ = బలరాముడు; కృష్ణుల్ = కృష్ణుల; కున్ = కు; నమస్కరించి = నమస్కారముచేసి; ఉద్ధవున్ = ఉద్ధవుని; కౌఁగిలించుకొని = ఆలింగనము చేసికొని; వారిన్ = వారలను; అందఱన్ = అందరిని; యధావిధిన్ = తగిన విధముగా; పూజించి = గౌరవించి; హరి = కృష్ణును; పాదంబులున్ = కాళ్ళను; తన = అతని; తొడల = తొడలు; మీదన్ = పైన; ఇడుకొని = ఉంచుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ తరువాత శ్రీకృష్ణుడు హస్తినాపురానికి అక్రూరుడిని పంపుదామని, బలరాముడు ఉద్ధవులతో కూడి అతని ఇంటికి వెళ్ళాడు. అక్రూరుడు వారిని చూడగానే లేచి బలరామకృష్ణులకు వందనం చేసాడు. ఉద్ధవుడిని కౌఁగిలించుకున్నాడు. వారిని అందరినీ తగురీతి పూజించాడు. అక్రూరుడు, కృష్ణుడి పాదములు తన ఒడిలో పెట్టుకుని ఒత్తుతూ ఇలా అన్నాడు.

10.1-1502-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అనుచరులుఁ దానుఁ గంసుఁడు
నియెన్ మీచేత జమునిదనంబునకున్
నులార! మీ బలంబున
నొరఁగ యాదవకులంబు నుద్ధృత మయ్యెన్.

టీకా:

అనుచరులున్ = తోటివారితోపాటు; తానున్ = అతను; కంసుండు = కంసుడు; చనియెన్ = చనిపోయెను; మీ = మీ; చేతన్ = చేత; జముని = యముని {యముడు (ప్ర) - జముడు (వి)}; సదనంబున్ = ఇంటి; కున్ = కి; ఘనులార = ఓ మహాత్ములు; మీ = మీ; బలంబునన్ = సామర్థ్యముచేత; ఒనరంగ = చక్కగా; యాదవ = యాదవుల; కులంబున్ = వంశము; ఉధృతము = ఉద్ధరింపబడినది; అయ్యెన్ = అయినది.

భావము:

“ఆర్యులారా! మీ శౌర్యంచేత కంసుడూ అతని అనుయాయులూ యమమందిరానికి వెళ్ళిపోయారు. యాదవకులం ఉద్ధరించబడింది.