ప్రథమ స్కంధము : గోవృషభ సంవాదం
- ఉపకరణాలు:
లీలాకారము దాల్చెను
శ్రీలలనేశుండు ఖలుల శిక్షించి భవో
న్మూలనము సేయుకొఱకును
నాలుగు పాదముల నిన్ను నడిపించుటకున్
టీకా:
లీలాకారమున్ = లీలాకారము {లీలాకారము - క్రీడకై ధరించిన రూపమును}; నిజము కాని రూపమును}; తాల్చెను = ధరించెను; శ్రీలలనేశుండు = కృష్ణుడు {శ్రీలలనేశుడు - శ్రీకరమైన స్త్రీ రుక్మిణికి భర్త, కృష్ణుడు}; ఖలులన్ = దుష్టులను; శిక్షించి = శిక్షించి; భవ = సంసార బంధనములు; ఉన్మూలనమున్ = తొలగించుట; చేయు = చేయుట; కొఱకును = కోసము; నాలుగు = నాలుగు (4); పాదములన్ = కాళ్ళతో; నిన్ను = నిన్ను; నడిపించుట = నడపించుట; కున్ = కు.
భావము:
శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ కోసం, సంసార బంధాలను తొలగించుట కోసం, ధర్మస్వరూపుడవైన నిన్ను నాలుగు పాదాలతో నడిపించటం కోసం లీలామానుష దేహాన్ని ధరించాడు.