పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : ధృతరాష్ట్రాదుల నిర్గమంబు

  •  
  •  
  •  

1-327-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి కాలరూపుఁ ఖిలాత్ముఁ డగు విష్ణుఁ
సురనాశమునకు వతరించి
దేవకృత్యమెల్లఁ దీర్చి చిక్కిన పని
కెదురుసూచుచుండు నిప్పు డధిప!

టీకా:

అట్టి = అటువంటి; కాల = కాలము; రూపుఁడు = రూపముగ కలవాడు; అఖిల = సమస్తమైనది; ఆత్ముఁడు = తానే ఐన వాడు; అగు = అయిన; విష్ణుఁడు = భగవంతుడు; అసుర = రాక్షస; నాశమున = నాశనము; కున్ = కొరకు; అవతరించి = అవతరించి; దేవ = దేవతల; కృత్యము = పని; ఎల్లన్ = సమస్తము; తీర్చి = పూర్తిచేసి; చిక్కిన = మిగిలిన; పని = పని; కిన్ = కోసము; ఎదురుసూచుచు = ఎదురుచూచుచు; ఉండున్ = ఉండును; ఇప్పుడు = ఇప్పుడు; అధిప = గొప్పవాడా.

భావము:

కాలస్వరూపుడై అఖిలాంతర్యామి అయిన భగవంతుడు అసురులను సంహరించటంకోసం అవతరించాడు. దేవకార్యం తీరిపోయింది. ఇప్పుడు మిగిలిన పనికోసం నిరీక్షిస్తున్నాడు.