పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : విదురాగమనంబు

  •  
  •  
  •  

1-300-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బంధుఁడు వచ్చె నటంచును
గాంధారీవిభుఁడు మొదలుగా నందఱు సం
బంములు నెఱపి ప్రీతిం
బంధురగతిఁ జేసి రపుడు న్నన లనఘా!

టీకా:

బంధుండు = బంధువు; వచ్చెన్ = వచ్చెను; అటంచును = అనుచు; గాంధారీ = గాంధారియొక్క; విభుఁడు = భర్త; మొదలుగాన్ = మొదలగువారు; అందఱున్ = అందరు; సంబంధములు = సంబంధములు; నెఱపి = నెరవేర్చుచు; ప్రీతిన్ = ప్రీతితో; బంధుర = తగు; గతిన్ = విధముగ; చేసిరి = చేసిరి; అపుడు = అప్పుడు; మన్ననలు = గౌరవములు; అనఘా = పాపములేనివాడా.

భావము:

ఆత్మ బంధుడైన విదురుడు తీర్థయాత్రలు ముగించి తిరిగి వచ్చాడని విని, ధృతరాష్ట్రుడూ, మొదలైన వారంతా ఎంతో సంతోషంతో ఎదురేగి స్వాగతం పలికారు.