పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (వారిచరము - విశ్వోద్భవ)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


4630} వారిచరము  - వారి (నీటి) చరము (జంతువు), మొసలి :-
[8-109-మ.]

4631} వారిజగంధి  - వారిజ (పద్మముల)యొక్క గంధి (సువాసనగలామె) ఉత్తమస్త్రీ, పద్మినీజాతి స్త్రీ :-
[1-372-క., 7-474-క.]

4632} వారిజనయనుడు  - వారిజము (పద్మముల) వంటి నయనుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[8-189-క.]

4633} వారిజనాభుడు  - పద్మనాభుడు, విష్ణువు :-
[10.2-647-ఉ.]

4634} వారిజనివాసిని  - వారిజ (పద్మమునందు) నివాసిని (నివసించెడియామె), లక్ష్మి :-
[7-344-వ.]

4635} వారిజనేత్రుఁడు  - పద్మములవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[1-372-క., 1-427-ఉ.]

4636} వారిజరిపువంశుడు  - వారిజరిపుని (చంద్రుని) వంశమువాడు, అక్రూరుడు :-
[10.1-1512-క.]

4637} వారిజలోచన  - వారిజ (పద్మములవంటి) లోచన (కన్నులు కలామె), స్త్రీ :-
[10.1-814-క.]

4638} వారిజసంభవుడు  - వారిజ (పద్మమునందు) సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-335-ఉ., 7-344-వ.]

4639} వారిజాక్షి  - వారిజము (పద్మము) వంటి అక్షి (కన్నులున్నామె), స్త్రీ :-
[8-461.1-ఆ., 8-585-ఆ.]

4640} వారిజాక్షుడు  - వారిజ(పద్మమువంటి) అక్షుడు(కన్నులుగలవాడు), విష్ణువు :-
[7-381.1-తే., 8-139.1-తే.]

4641} వారిజోద్భవుడు - వారిజము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బహ్మ :-
[10.1-14.1-తే.]

4642} వారిధరములు  - నీటిని కలిగియుండునవి, మేఘములు :-
[1-211-ఉ.]

4643} వారిధిగర్వాతిరేకవారణబాణుడు  - వారిధి (సముద్రుని) గర్వాతిరేక(గర్వాతిశయమును) వారణ (వారించిన) బాణుడు (బాణముగలవాడు), రాముడు :-
[9-1-క.]

4644} వారినిధి  - నీటికి నివాసము, సముద్రము :-
[3-281-మ.]

4645} వారిప్రచారోత్తము  - వారి (నీటి)యందు ప్రచార (తిరిగెడి) ఉత్తము, మొసలి :-
[8-71-శా.]

4646} వారిరుహదళాక్షుడు  - వారిరుహ (పద్మముల) దళా (రేకులవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.1-908-క.]

4647} వారిరుహదళాయతాక్షుడు  - వారిరుహ (కలువ) దళ (పత్రముల)వంటి విశాలమైన కన్నులు కలవాడు, కృష్ణుడు :-
[10.2-1182-చ.]

4648} వార్ధి  - నీటికి నిధి, కడలి :-
[10.1-1572-క.]

4649} వార్ధిపుడు  - వార్ధి (సముద్రము)నకు ప్రభువు, వరుణుడు :-
[3-774.1-తే.]

4650} వాలఖిల్యులు  - 1. (వాలము) తోక (భిల్ ఉంఛే అవశేషే చ ఖిలతి, మిగులుట కల వారు ఖిల్యులు) మిగిలినవారు, 2. అంతరిక్షమున సుర్యుని స్తోత్రము చేయుచు తలక్రిందులుగనుండు వారు, 3 అంగుష్టమాతులు, 4. ఒక ఋషిగణు. 5. వానప్రస్తులలో విశేషము, 6. అహోరాత్రము అరువది గడియలు, ఒక్కొక గడియ వేయి వాలఖిల్యములు అని ఒక కాలమానము :-
[4-26-వ.]

4651} వాలుఁగన్నులక్రేవలు  - దీర్ఘములైనకన్నుల చివరలు, కడకన్నులు :-
[10.2-1025.1-తే.]

4652} వాలుగంటి  - వాలుచూపులు ఉన్నది, స్త్రీ (ద్రౌపది) :-
[1-360-క., 9-616-వ.]

4653} వాల్మీకి  - రామాయణ కర్త, వల్మీక+ఇఞ్, వల్మీకే భవః, పుట్టలో పుట్టినవాడు. :-
[6-11.1-తే.]

4654} వాశ్చరము  - వారి చరము, మొసలి :-
[2-148-మ.]

4655} వాసరమణి  - వాసర (దినమునకు) మణి, సూర్యుడు :-
[10.2-82-క.]

4656} వాసవనందనుడు  - వాసవు (ఇంద్రుని) కొడుకు, అర్జునుడు :-
[10.2-763-వ.]

4657} వాసవవందితుడు  - ఇంద్రునిచే పొగడబడువాడు, కృష్ణుడు :-
[10.2-258-క.]

4658} వాసవవర్ధకి  - విశ్వకర్మ, దేవతాశిల్పి, త్వష్ట, (వాసవ) ఇంద్రుని (వర్ధకి) రథకారుఁడు, వడ్లంగి. :-
[8-183.1-తే.]

4659} వాసవసూనుడు  - ఇంద్రుని కొడుకు, అర్జునుడు :-
[10.2-123-ఉ.]

4660} వాసవారి  - వాసవుని (ఇంద్రుని) అరి (శత్రువు), రాక్షసుడు :-
[8-737-ఆ.]

4661} వాసవీనందనుడు  - వాసవి యొక్క పుత్రుడు, వ్యాసుడు :-
[1-86.1-ఆ.]

4662} వాసవుడు  - వసువులు (రత్నములు) కలవాడు, ఇంద్రుడు :-
[8-471.1-ఆ., 9-68-క., 9-161.1-తే., 12-26-వ.]

4663} వాసవుపురి  - వాసవుని (ఇంద్రుని) పట్టణము, అమరావతి :-
[10.1-1593-ఆ.]

4664} వాసుదేవమూర్తి  - వాసుదేవ (వసుదేవుని పుత్రుడు) యొక్క మూర్తి (విగ్రహము), శ్రీకృష్ణుడు :-
[5.2-55-వ.]

4665} వాసుదేవాది  - వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షులు అనెడి చతుర్వ్యూహములు (మనోబుద్ధిచిత్తాహంకారములు ఈ నామములకు ఒప్పును) :-
[10.1-1236-దం.]

4666} వాసుదేవుడు  - 1.ఆత్మలందు వసించెడి దేవుడు, 2.విష్ణువు, 3.కృష్ణుడు, 4.వసుదేవుని పుత్రుడు, 5.వ్యు. వాసుదేవః సర్వత్రాసౌ వసత్యాత్మ రూపేణ, విశంభరత్వాదితి, (ఆంధ్ర వాచస్పతము) ఆత్మ యందు వసించు దేవుడు, 6. చతుర్వ్యూహముల లోని వాసుదేవుడు, బుద్ధికి అధిష్టానదేవత :-
[1-61-వ., 1-98-వ., 1-110-వ., 1-178-వ., 1-188-వ., 1-293-వ., 1-389-వ., 1-447-క., 2-7.1-ఆ., 2-23-వ., 2-84-వ., 3-644.1-తే., 3-720.1-తే., 3-866-వ., 3-1025-వ., 4-18.1-తే., 4-702.1-తే., 4-834-వ., 4-918.1-తే., 4-936-వ., 5.1-69-వ., 5.1-97-వ., 5.1-181-మ., 6-343-వ., 6-442.1-తే., 6-514-వ., 7-121-వ., 7-239-వ., 7-240.1-తే., 7-479-వ., 9-257-మ., 9-499-వ., 10.1-406-క., 10.1-724-క., 10.1-942-ఆ., 10.1-952.1-తే., 10.1-1653.1-ఆ., 10.1-1729-ఉ., 10.2-201-వ., 10.2-202.1-ఆ., 10.2-477-ఆ., 10.2-749-ఆ., 11-77-వ., 11-91-వ., 12-2-వ., 12-18-వ.]

4667} వాహిని  - 1. వాహిని అనే సేనావిశేషమునకు 81 రథములు 81 ఏనుగులు 243 గుఱ్ఱములు 405 కాల్బలము, 2. నది :-
[1-396-వ., 10.1-1547.1-తే.]

4668} వికచకమలనయన  - విరిసిన పద్మముల వంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-361-ఆ.]

4669} వికచజలజనయనుడు  - వికసించిన పద్మము (జలజము), వంటి నయనములు (కన్నులు) ఉన్నవాడు, విష్ణువు :-
[3-254-తే.]

4670} వికచతామరసాక్షుడు  - వికచ (వికసించిన) తామర (పద్మముల) స (వంటి) అక్షుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు :-
[3-705-క.]

4671} వికచాంభోరుహలోచనుడు  - వికచ (వికసించిన) అంభోరుహము (పద్మము) లవంటి లోచనుడు (కన్నులుకలవాడు), విష్ణువు :-
[3-752-క.]

4672} వికచాబ్జముఖి  - వికచ (వికసించిన) అబ్జ (పద్మము) వంటి ముఖి (ముఖముగలామె), అందమైన స్త్రీ. :-
[8-237-క.]

4673} వికత్థనము  - తననుతాను పొగడుకొనుట, స్వోత్కర్ష, వి+కత్థ+ల్యుట్, విశేషేణ కథ్యతే శ్లాఘతే ఆత్మానం తత్. :-
[3-656-క.]

4674} వికవిక  - విరగబడి నవ్వుటలోని ధ్వన్యనుకరణ :-
[10.1-313-క.]

4675} వికారము  - (అ) షోడశవికారములు కర్మేద్రియములు (5) జ్ఞానేంద్రియములు (5) మనస్సు భూతపంచకము (5) మొత్తము 16, (ఆ).షడ్వికారములు (1)పుట్టుట, (2)పెరుగుట, (3)ముదియుట, (4) చిక్కుట, (5)చచ్చుట, (6)గర్భనరకస్థితి. (ఇ) మానసిక లేదా స్వరూపములలో కలుగు మార్పు లేదా అసమక్రమత. (ఈ) శబ్దస్పర్శాది విషయ చాంచల్యములు (ఉ) తెవులు :-
[3-231-క.]

4676} వికారములు  - 1.షోడశవికారములు కర్మేద్రియములు (5) జ్ఞానేంద్రియములు (5) మనస్సు భూతపంచకము (5) మొత్తము 16, 2.షడ్వికారములు (1)పుట్టుట, (2)పెరుగుట, (3)ముదియుట, (4) చిక్కుట, (5)చచ్చుట, (6)గర్భనరకస్థితి. 3.మానసిక లేదా రూపములలో కలుగు మార్పు లేదా అసమక్రమత. 4.శబ్దస్పర్శాది విషయ చాంచల్యములు 5. తెవులు :-
[7-237-వ., 7-356-వ., 10.1-30-క., 10.2-1079.1-తే.]

4677} వికారవిదూరుడు  - వికారములకు (షోడశాది) మిక్కిలి దూరముగ ఉండువాడు, విష్ణువు :-
[3-212-చ., 3-402-ఉ., 4-167-చ.]

4678} వికాసచూడ్కులు  - చక్కగా తెరచిన చూపులు, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4679} విగతకలుషపోషుడు  - విగతకలుష (కళంకరహితులను) పోషించువాడు, రాముడు :-
[9-735-మాలి., 12-53-మాలి.]

4680} విగతజీవునిచేయు  - విగత (పోయిన) జీవుని (ప్రాణములు కలవానిని) అగునట్లు చేయు, సంహరించు :-
[10.1-620-వ.]

4681} విగతమోహుడు  - విగత (వదలిపెట్టేసిన) మోహము కలవాడు, విష్ణువు :-
[3-924.1-తే.]

4682} విగతరజస్తమోగుణుడు  - వదలిన రజోగుణమును తమోగుణములు గుణములు కలవాడు :-
[3-506-చ.]

4683} విచిత్రదైవమండలము  - చేతులను మీదికి చాచి నానావిధములుగాను వింతగాను తిప్పుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4684} విజయ  - వరాహశైల క్షేత్రమున విజయ (చండ మండ భండాసురులను గెల్చినామె) :-
[10.1-61-వ.]

4685} విజయయాత్ర  - 1. జైత్రయాత్ర, 2. సాధనపరిపక్వత :-
[4-460.1-తే.]

4686} విజయుడు  - విజయశీలము కలవాడు, అర్జునుడు :-
[1-371-క., 10.2-112-మ.]

4687} విజయుపౌత్రుడు  - అర్జునుని మనుమడు , పరీక్షితు :-
[1-432-వ.]

4688} విజితాశ్వుడు  - విజిత (విశిష్ఠముగ జయించిన) అశ్వుడు (అశ్వము కలవాడు), కాకుత్సుడు, పృథు మహారాజునకు అర్చియందు కలిగిన వాడు. తండ్రి యాగాశ్వాన్ని ఇంద్రుడు తీసుకుపోతుంటే వెనక్కి తెచ్చినవాడు :-
[4-640-వ., 4-675-క.]

4689} విజితేంద్రియుడు  - ఇంద్రియ జయము సాధించినవాడు, మహాపురుషుడు :-
[11-49-క.]

4690} విజ్ఞానమయుడు  - విజ్ఞాన స్వరూపమైన వాడు, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజనాత్ (శ్రుతి) విజ్ఞానమే పరబ్రహ్మ, విష్ణువు :-
[10.1-942-ఆ.]

4691} విజ్ఞానము  - 1.విశిష్ట జ్ఞానము, సర్వమునందును భగవంతుని అస్థిత్వమును జ్ఞప్తియందు ఉంచుకొనుట 2. అపరవిద్య, అవిద్య, లౌకిక విషయములను తెలుపునది :-
[3-203-దం., 3-845.1-తే.]

4692} విటపి  - విటపములు (కొమ్మలు) గలది, చెట్టు :-
[5.1-26-వ.]

4693} వితతయోగీంద్రనికరగవేష్యమాణచరణసరసిజయుగళు  - విస్తారమైన యోగీంద్ర సమూహములచే గవేష్యమాణ (వెదకబడుతున్న) పాదపద్మముల యుగళము (ద్వయము) కలవాడు, విష్ణువు :-
[4-233.1-తే.]

4694} వితతసంధ్యాభ్రరుచివిడంబితవినూత్నరక్తవర్ణుడు  - వితత (విస్తారమైన) సంధ్యాకాల అభ్ర (మేఘము) ని పోలిన వినూత్న (ప్రశస్తమైన) రక్త(ఎఱ్ఱని) వర్ణుడు (రంగువాడు), శివుడు :-
[4-138.1-తే.]

4695} విదర్భ  - 1. రుక్మిణీదేవి తండ్రి భీష్మకుని దేశము 2. ఆనర్తకభూముల సమీప దేశము 3.ఇప్పటి బీరారు, బీదరు ప్రాంతము 4.విశిష్టమైన దర్భలుగల దేశము, 3. కర్మప్రధానమని భావించెడివారుండు దేశము. :-
[4-829-వ., 5.1-64-వ., 10.1-1718-వ.]

4696} విదర్భతనయ  - విదర్భరాజు కుమార్తె, రుక్మిణి :-
[10.1-1721-మ.]

4697} విదర్భపుత్రి  - విదర్బ దేశపు రాకుమారి, రుక్మిణి :-
[10.2-29-ఉ.]

4698} విదర్భపురము  - విదర్భదేశపు పట్టణము, కుండిన :-
[10.1-1739-వ.]

4699} విదర్భరాజతనయ  - విదర్భరాజు (భీష్మకుడు) యొక్క పుత్రిక, రుక్మిణి :-
[10.1-1715-వ.]

4700} విదర్భుడు  - విదర్భదేశము వాడు, రుక్మి :-
[10.2-293-క.]

4701} విదర్భేశుడు  - విదర్భకు రాజు, రుక్మి :-
[10.2-281.1-తే.]

4702} విదురుడు  - 1. యమధర్మ రాజు అవతారము, 2. కురు పాండవుల పినతండ్రి 3. విచిత్రవీర్యుని భార్య అంబిక యందు ధృతరాష్ట్రుడు, అంబాలిక యందు పాండురాజు. ఆమె దాసి యందు విదురుడు వ్యాసుని వలన జన్మించారు. :-
[2-204.1-తే.]

4703} విదూరభూరిసంసారి  - మిక్కిలి దూరముగా ఉంచబడిన విస్తారమైనట్టి సంసారము కలవాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

4704} విదూరుడు  - విగత దూరము కలవాడు, దూరము దగ్గరలు లేనివాడు :-
[3-273-తే.]

4705} విదేహరాజవినుత  - విదేహ దేశపు రాజు (జనకుని)చే వినుత (స్తుతింపబడినవాడు), రాముడు :-
[11-125-క.]

4706} విద్యాధరులు  - దేవయోని విశేషము, గ్రహణ, ధారణాది శక్తుల కధిపతులు :-
[2-274.1-తే.]

4707} విధాత  - 1. బ్రహ్మదేవుడు, సమస్త సృష్టికి విధిని నిర్ణయించు వాడు, 2. సూర్యుడు, ద్వాదశాదిత్యులలో ఒకడు, 3. మన్మథుడు, రాత్రికి అధిపతి :-
[2-225.1-తే., 3-404-తే., 4-26-వ., 6-507-వ., 9-108-శా., 12-22-వ.]

4708} విధి  - జీవుల విధిని నిర్ణయించువాడు (నుదుట వ్రాయువాడు), బ్రహ్మదేవుడు :-
[3-447.1-తే., 3-933-క.]

4709} విధుంతుదుడు  - చంద్రుని బాధపెట్టు వాడు, రాహువు :-
[10.2-858-చ.]

4710} వినంబలుకు  - వినునట్లు పలుకు, చెప్పు :-
[3-445-చ.]

4711} వినివర్తితతానకము  - పాదము వెలి పక్కకు అడ్డముగా తిప్పి మడమలు పిరుదులు సోకునట్లు నిలిచి నర్తించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4712} వినిశ్చలనిర్మలధర్మమూర్తి  - వినిశ్చల (మిక్కిలి చాంచల్యరహితమైన) నిర్మల (కల్మషరహితమైన) ధర్మమూర్తి (ధర్మము యొక్క స్వరూపము అయినవాడు), విష్ణువు :-
[3-506-చ.]

4713} వినుతగుణోత్తరుండు  - వినుత (స్తుతింపబడిన) గుణములతో విశిష్టుడు, విష్ణువు :-
[3-1022-చ.]

4714} వినుతనిఖిలబృందారకుడు  - వినుత (స్తుతించుచున్న) నిఖిల (సమస్తమైన) బృందారకుడు (దేవగణములు కలవాడు), విష్ణువు :-
[3-723-క.]

4715} వినుతమంగళయశోవిభవుడు  - స్తోత్రము చేయబడుతున్న శుభకరమైన కీర్తి యొక్క వైభవము కలవాడు, విష్ణువు :-
[4-553.1-తే.]

4716} వినుతమందారుడు  - వినుత (స్తుతించువారికి) మందారుడు (కోరికలు వర్షించువాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

4717} వినుతాసూనుడు  - వినుత యొక్క పుత్రుడు, గరుత్మంతుడు, అరుణుడు :-
[3-101-మ.]

4718} విపక్షక్షమాభృత్సహస్రాక్షుడు  - విపక్ష (శత్రువులు) అను పర్వతములకు ఇంద్రునివంటివాడు, విష్ణువు :-
[3-203-దం.]

4719} విపత్తు  - సంపత్తు x విపత్తు, ఆపద,ఇడుము, రోగములు అవమానములు, మృత్యువు, అప్పులు మొదలగునవి, వీనికి కారణములు ఆదిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికములు :-
[3-242-చ.]

4720} విపత్పయోధితరి  - విపత్తు (ఆపదలనెడి) పయోధి (సముద్రమును) తరి (దాటించువాడు), విష్ణువు :-
[10.2-80-మ.]

4721} విపన్నుడు  - తాపత్రయములచేత విపత్తు పొందినవాడు. విపత్తులో ఉన్నవాడు :-
[10.1-1664-వ.]

4722} విప్రగ్రహములు  - పిశాచబేధము :-
[6-307-వ.]

4723} విప్రచిత్తి  - దానవులలో ప్రదానుడు, కశ్యపునికి దనువునందు పుట్టిన పుత్రుఁడు, సింహిక అను రాక్షసి భర్త, కొడుకులు రాహువు, కేతువు, నముచి, వాతాపి, ఇల్వలుఁడు, నరకుఁడు, స్వర్భానుఁడు, పులోముఁడు, వక్త్రయోధి మొదలగువారు. :-
[7-29-వ.]

4724} విప్రాది  - చతుర్వర్ణములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు :-
[3-246.1-తే.]

4725} విబుధగేహము  - విబుధులు (దేవతలు) గోహము (నివాసము), స్వర్గము :-
[9-504.1-ఆ.]

4726} విబుధలోకేశుడు  - దేవతల ప్రభువు, ఇంద్రుడు :-
[10.2-10.1-తే.]

4727} విబుధాధిపుడు  - దేవతలకు ప్రభువు దేవేంద్రుడు :-
[2-126-క.]

4728} విబుధాహితులు  - విబుధ (దేవతలకు) అహితులు (శత్రువులు), రాక్షసులు :-
[7-216-ఆ.]

4729} విబుధులు  - విశిష్టమైన బుద్ధి కలవారు, దేవతలు, జ్ఞానులు :-
[4-461-క.]

4730} విబ్రాజితకీర్తిలతావృతరాజీవభవాండభాండుడు  - విభ్రాజిత(మిక్కిలి మెరయుచున్న) కీర్తి (కీర్తి యనెడి) లతా (తీగలచే) ఆవృత (చుట్టబడిన) రాజీవభవాండ (బ్రహ్మాండము అనెడి) భాండుడు (భాండము గలవాడు), రాముడు :-
[7-480-క.]

4731} విభావరి  - 1. వరుణుని ముఖ్యపట్టణము (విభా (వైభవముతో) వరి (శ్రేష్ఠమైనది)), 2. ఒక సంవత్సరం పేరు :-
[3-617-చ.]

4732} విభావసుడు  - 1. విశేషమైన కాంతియను ధనము కలవాడు, సూర్యుడు, 2. అష్టవసువలలో ఒకడు :-
[10.1-1648-మ., 12-48-వ.]

4733} విభీషణుడు  - రావణాసురుని తమ్ముడు, రామునకు శరణాగతి యైనవాడు, మిక్కిలి భయంకరుడు :-
[2-204.1-తే., 4-26-వ.]

4734} విభుడు  - ప్రభువు, భగవంతుడు, సర్వవ్యాపకుడు, విష్ణువు, శ్రుతి. నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం, నేమా విద్యుతోభాంతి కుతోయమగ్నిః, తమేవ భాంతిమనుభాతి సర్వం, తస్య సర్వమిదం విభాతి., వ్యు. వి+భూ+డు, విశేషేణ భవతి సర్వగతః, విశేషంగా వుండువాడు; అంతట వుండు సర్వవ్యాపకుడు. భగవంతుడు, :-
[2-108-క., 2-207-క., 3-236-చ., 4-6-వ., 4-509.1-తే., 8-94-ఆ., 10.1-540-ఉ., 10.1-819-శా., 10.1-1497-మ.]

4735} విభ్రాజితకీర్తిసుధావృతరాజీవభవాండభాండుడు  - విభ్రాజిత (ప్రకాశించెడి) కీర్తి అనెడి సుధ (అమృతము)చేత ఆవృత (ఆవరింపబడిన) రాజీవభవ అండభాండ (బ్రహ్మాండభాండము కలవాడు), రాముడు :-
[11-125-క.]

4736} విభ్రాజితము  - మిక్కిలి రాజిత మగుట, వెలుగొందుట, పురంజయోపాఖ్యానంలో విభ్రాజితములు దృశ్యములకు సంకేతం :-
[4-768-వ.]

4737} విమతుడు  - వ్యతిరేకమైన ఆలోచనా విధానములు కలవాడు, శత్రువు :-
[3-937-వ., 10.1-71.1-తే., 10.1-1556-చ.]

4738} విమల  - రాగద్వేషాలులేని, నిర్మలమైన, వి+మల, విగతః మలః పాపం యస్మాత్, పాపము లేనిది. :-
[10.2-255-మ.]

4739} విమలగుణసంఘాతుడు  - విమల (స్వచ్ఛమైన) గుణ (సుగుణముల) సంఘాత (సమూహములు కలవాడు), శ్రీరాముడు. :-
[10.1-1790-క.]

4740} విమలచరిత్రుడు  - నిర్మలమైన నడవడి కలవాడు, పరీక్షిత్తు. :-
[10.2-1261-క.]

4741} విమలప్రభావుడు  - విమల (స్వచ్ఛమైన) ప్రభావుడు (మహిమ గలవాడు), విష్ణువు :-
[8-92-ఉ.]

4742} విమలము - విమలతరము విమలతమము :-
[10.2-506-క.]

4743} విమలాస్య  - తేటయైన అస్య (మోముగలామె), స్త్రీ :-
[10.1-71.1-తే.]

4744} విమలేందుముఖి  - స్వచ్ఛమైన చంద్రుని వంటి మోము కలామె, స్త్రీ. :-
[10.1-328-క.]

4745} విమానము  - 1.చక్రవర్తి సౌధము, 2.ఆకాశయాన సాధనము :-
[3-45-ఉ.]

4746} విముక్తలింగుడు  - లింగదేహము (ప్రజ్ఞా మాత్రమగు సుక్ష్మ శరీరము) నుండి విడువబడినవాడు, పరమహంస :-
[5.1-89-వ.]

4747} విముక్తుడు  - ప్రకృతి పాశములనుండి విముక్తి పొందినవాడు :-
[10.1-683-వ.]

4748} వియచ్చరులు  - వియత్ + చరులు (శ్చుత్వ సంధి), ఆకాశ గమనులు, దేవతలు :-
[10.1-753-వ., 10.1-1089-క., 10.1-1677-వ., 10.2-1039-వ.]

4749} వియన్నది  - వియత్ + నది (శ్చుత్వ సంధి), వియత్ (ఆకాశ) నది, గంగ :-
[10.2-396.1-తే.]

4750} విరక్తి  - దేని అందు తగులము లేకపోవుట :-
[1-317-వ.]

4751} విరజము  - రజస్తమో గుణులు లేనిది, సాత్వికము :-
[3-471-వ.]

4752} విరజుడు  - రజోగుణము లేనివాడు :-
[4-7.1-తే., 4-26-వ.]

4753} విరటజ  - విరటుని సంతానము, ఉత్తర :-
[1-185-మ.]

4754} విరటుపుత్త్రిక  - విరటరాజు పుత్రిక, ఉత్తర :-
[1-189.1-తే.]

4755} విరాజితసుగుణుడు  - విరాజిత (ప్రకాశించెడి) సుగుణుడు (సుగుణాలు కలవాడు), రాముడు :-
[11-125-క.]

4756} విరాటకన్యక  - ఉత్తర, విరాట రాకుమారి, అభిమన్యు భార్య, పరీక్షిత్తు తల్లి :-
[1-530-గ.]

4757} విరాట్చరీరుడు  - విరాట్ (విశ్వము సమస్తమును) దేహముయైన వాడు, విశ్వరూపుడు, విష్ణువు. :-
[4-703.1-తే.]

4758} విరాట్పురుషుడు  - విశ్వము స్వరూపముగ కలవాడు, విష్ణువు :-
[2-258-వ., 2-260-క., 3-1025-వ.]

4759} విరాట్ప్రభువు  - విరాట్టు స్వరూపమై ప్రభావము చూపువాడు, విష్ణువు :-
[3-246.1-తే.]

4760} విరాడ్రూపంబు  - విరాట్టు (భగవంతుని) స్వరూపమైనది, జగత్తు :-
[11-52-వ.]

4761} విరించి  - వివరముగ రచించువాడు, బ్రహ్మదేవుడు :-
[2-79-వ., 4-16-చ., 7-303-వ., 8-249-క., 10.1-950-వ., 10.1-1726-శా.]

4762} విరూపాక్షుడు  - విరూపమైన కన్నులుకలవాడు, శివుడు :-
[4-685.1-తే.]

4763} విరోచననందనుడు  - విరోచనుని పుత్రుడు, బలి :-
[8-182-వ.]

4764} విలసత్కాకుత్థ్సవంశమండనుడు  - విలసత్ (ప్రసిద్ధి కెక్కిన) కాకుత్థ్సవంశ (కకుత్థ్స మహరాజ వంశమునకు) మండనుడు (అలంకారమైనవాడు), రాముడు :-
[10.1-1-క.]

4765} విలసత్పద్మాకళత్రుడు  - ప్రకాశమానమైన పద్మ (లక్ష్మీదేవి) కళత్రుడు(భర్త), విష్ణువు :-
[3-284-మ.]

4766} విలసన్నుతసూరి  - విలసత్ (చక్కగా) నుత (కీర్తించు) సూరి (జ్ఞానులు) కలవాడు, విష్ణువు :-
[3-335-ఉ.]

4767} విలసితవామాంకవిన్యస్తదక్షిణచరణారవిందుడు  - విలాసముగా ఎడమతొడపైన ఉంచిన కుడికాలు యొక్క పాదము అను పద్మము కలవాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

4768} విలాసవతి  - విలాసవంతమైన స్త్రీ :-
[10.2-543-చ.]

4769} వివశుడు  - 1. మరణకాలము సమీపించుట చేత కలత పొందిన బుద్ధి కలవాడు, 2. 2. స్వవశముగాని బుద్ధిగలవాఁడు :-
[9-304-క.]

4770} వివస్వంతుడు  - కాంతిచేనన్నిటిని కప్పెడువాడు, సూర్యుడు, ద్వాదశాదిత్యులలో ఒకడు. :-
[12-41-వ.]

4771} వివిధప్రాణిలలాటలేఖనమహావిద్యానుసంధాత  - వివిధ (అఖిలమైన) ప్రాణి (జీవుల) లలాట (నొసటి) లేఖన (వ్రాయుట యందు) మహా (గొప్ప) విద్యా (విద్యను) అనుసంధాత (కలిగినవాడు), బ్రహ్మ :-
[7-85-మ.]

4772} వివేకము  - దేహాత్మాది బేధ జ్ఞానము కలిగి యుండుట (ఆంధ్ర వాచస్పతము), యుక్తాయుక్త నిర్ణయ బుద్ధి (శబ్దార్థ చంద్రిక), యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము :-
[4-372-ఉ.]

4773} వివ్వచ్చుడు  - అర్జునుడు, భీభత్సుడు, వివచ్చము (భీభత్సము) గా యుద్ధము చేయువాడు :-
[10.2-116-వ.]

4774} విశసనము  - నరకుటలు, నరక విశేషము, విశసన అంటే కత్తి :-
[5.2-136-వ.]

4775} విశాలము - విశాలతరము విశాలతమము :-
[10.1-523-చ.]

4776} విశాలము - విశాలాంతరము విశాలాంతము :-
[10.1-997.1-ఆ.]

4777} విశాలవక్షుడు  - విశాలమైన వక్షస్థలము కలవాడు, కృష్ణుడు :-
[10.1-1251-క.]

4778} విశిఖము  - ముల్లులేని బాణము :-
[10.1-1767-వ.]

4779} విశుద్ధ చక్రము - కుండలినీ షట్ చక్రములలో వక్షస్థానమున ఉండునది :-
[2-29.1-ఆ.]

4780} విశుద్ధజ్ఞానానందమయుడు  - విశుద్ధ (స్వచ్ఛమైన) జ్ఞానముయొక్క రూపుడు (స్వరూపమైనవాడు), విష్ణువు :-
[7-109-వ.]

4781} విశుద్ధజ్ఞానుడు  - పరిశుద్ధమైన జ్ఞానము కల వాడు :-
[2-110-మ.]

4782} విశ్రుతచారుయశుడు  - ప్రసిద్ధికెక్కిన చక్కని కీర్తి కలవాడు :-
[3-506-చ.]

4783} విశ్వంభరుడు  - విశ్వము (జగత్తును) భరుడు (ప్రోచువాడు), విష్ణువు, కృష్ణుడు :-
[1-198-మ., 1-396-వ., 7-24-వ., 7-239-వ., 8-483.1-తే., 8-586-మ., 8-719-వ., 9-230-వ.]

4784} విశ్వకర్మశాస్త్రము  - విశ్వ (నిర్మించుట) చేయు విద్య, నిర్మాణవిద్య :-
[3-388-వ.]

4785} విశ్వక్షేమంకరుడు  - విశ్వమునకు క్షేమము (శుభము)ను కరుడు (చేయువాడు) ,విష్ణువు :-
[3-723-క.]

4786} విశ్వగర్భుడు  - విశ్వము గర్భమున కలవాడు, విష్ణువు :-
[3-198.1-తే., 3-524-వ., 8-158-వ., 8-501-తే., 10.1-77-ఆ.]

4787} విశ్వగురుడు  - 1.విశ్వమునకు గురువు (పెద్దవాడు), బ్రహ్మదేవుడు 2.జగద్గురువు, విష్ణువు :-
[3-370-వ., 3-539-వ.]

4788} విశ్వతోముఖుడు  - విశ్వమంతయు వ్యాపించిన వాడు, విష్ణువు :-
[3-1048.1-తే., 4-285-చ.]

4789} విశ్వద్రష్ట  - విశ్వమునందు సమస్తమును ద్రష్ట (చూసెడివాడు, సాక్షి), విష్ణువు :-
[4-556-వ.]

4790} విశ్వప్రభోధుడు  - జగతికి చైతన్యము కలిగించువాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

4791} విశ్వబంధువు  - లోకమునకు మంచి కోరువాడు, శివుడు :-
[4-138.1-తే.]

4792} విశ్వభరణుడు  - విశ్వమును భరించువాడు, విష్ణువు :-
[3-307.1-తే.]

4793} విశ్వభవస్థితివ్యయాస్పదమహితావతారుఁడు  - విశ్వము యొక్క పుట్టుక మనుగడ అంతములు అను కార్యములు చేయు గొప్ప అవతారములు కలవాడు, విష్ణువు :-
[3-194-చ.]

4794} విశ్వభావనుడు  - విశ్వ (లోకమంతటిచే) భావనుడు (ధ్యానింపదగిన వాడు), విష్ణువు :-
[3-570-ఉ., 6-224-వ., 10.1-949-క.]

4795} విశ్వభావనోదారుడు  - విశ్వ (జగత్తును) భావన (కల్పన) లో ఉదారుడు (అతిశయించిన వాడు) :-
[2-211-ఉ.]

4796} విశ్వభావాభావసందర్శనము  - భగవంతుడు ప్రపంచోత్పత్తికి ముందు లయము తరువాత నుండువాడు కనుక ఉండుట లేకపోవుటలు రెండు చూచును :-
[10.1-683-వ.]

4797} విశ్వమయుడు  - జగత్తంతను నిండి యున్నవాడు, హరి :-
[8-94-ఆ.]

4798} విశ్వము  - వ్యు. విశ్+క్వన్, విశతి ప్రవిశతి స్వకారణం మూలప్రకృతిమ్, కారణమైన మూలప్రకృతిని ప్రవేశించునది. జగత్తు, :-
[10.1-576-ఆ.]

4799} విశ్వమూర్తి  - విశ్వ (జగత్తు, ఓంకార) మూర్తి (స్వరూపుడు), విష్ణువు. :-
[10.1-576-ఆ.]

4800} విశ్వయోని  - విశ్వమునకు ఉత్పత్తిస్థానమైనవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

4801} విశ్వరూపుడు  - సమస్తమైన విశ్వము తన రూపమైన వాడు, విరాట్పురుషుడు, విష్ణువు :-
[9-105-ఆ., 10.1-748-ఉ., 11-77-వ.]

4802} విశ్వవిభుడు  - సకలలోకాలకి ప్రభువు, విష్ణువు. :-
[11-76-ఆ.]

4803} విశ్వసంపాద్యుడు  - విశ్వ (లోకములను) సంపాద్యుడు (సంపాదింపదగినవాడు), విష్ణువు :-
[4-233.1-తే.]

4804} విశ్వసంబోధ్యుడు - విశ్వ (లోకమునకు) సంబోధ్యుడు (మేల్కొలుపువాడు), విష్ణువు :-
[4-179.1-తే.]

4805} విశ్వసంవేద్యుడు  - విశ్వమంతటిని సంవేద్యుడు (చక్కగా తెలిసిన వాడు), విష్ణువు :-
[10.2-460-తే.]

4806} విశ్వసన్నుతుడు  - లోకములచే (సన్నుతుడు) స్తుతింపబడువాడు, విష్ణువు :-
[12-35-తే.]

4807} విశ్వస్తుత్యుడు  - విశ్వ (లోకముల) చేత స్తుత్యుడు (స్తుతింపబడువాడ), విష్ణువు :-
[3-755-మ.]

4808} విశ్వాకృతి  - ప్రపంచమే తన రూపమైన వాడు, విశ్వంవిష్ణుః (శ్రుతి) :-
[10.1-949-క.]

4809} విశ్వాత్ముడు  - విశ్వమునకు ఆత్మ ఐనవాడు, పరమాత్మ, విశ్వమే తానైనవాడు, భగవంతుడు :-
[2-106-మ., 2-207-క., 4-126-తే., 4-193.1-తే.]

4810} విశ్వేదేవతలు  - దేవయోని విశేషము, ధర్మునకుగల పదిమంది భార్యలలో విశ్వ యందు జన్మించినవారు :-
[9-707-వ.]

4811} విశ్వేదేవము  - విశ్వేదేవతల గురించి చేసెడి హోమాధికము :-
[9-76-వ.]

4812} విశ్వేశుడు  - విశ్వమునకు ఈశుడ (ప్రభువు), హరి :-
[1-198-మ., 9-725-క., 10.1-949-క., 10.1-1469-మ., 12-35-తే.]

4813} విశ్వేశ్వరుడు  - విశ్వమునకు ఈశ్వరుడు, విష్ణువు :-
[2-89-వ., 9-113.1-ఆ., 10.1-1182-శా.]

4814} విశ్వోద్భవస్థితివిలయకారణభూతుడు  - విశ్వ (జగత్తునకు) ఉద్భవ (సృష్టికి) స్థితికి విలయ (నాశమునకు) కారణభూతుడైనవాడు, విష్ణువు :-
[8-483.1-తే.]