పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (షట్కర్మలు - షోడశ్యుక్థ)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


5167} షట్కర్మలు  - 1యజనము 2యాజనము 3అధ్యయనము 4అధ్యాపనము 5దానము 6ప్రతిగ్రహము అనెడి ఆరు రకముల పనులు :-
[11-99-వ.]

5168} షట్పదము  - ఆరుకాళ్ళు గలది, తుమ్మెద :-
[5.1-30-చ., 10.1-1463-శా., 10.2-125-క.]

5169} షడంగములు  - వేదము నందలి ఆరు అంగములు 1 శిక్ష 2 వ్యాకరణము 3 ఛందస్సు 4 నిరుక్తము 5 జ్యోతిషము 6 కల్పము :-
[3-121-మ., 7-425-వ., 9-669-ఉ.]

5170} షడింద్రియములు  - 1కన్ను 2ముక్కు 3చెవి 4నాలుక 5 చర్మము 6మనస్సు :-
[7-460-వ.]

5171} షడూర్ములు  - 1ఆశన (ఆకలి) 2పిపాస (దాహము) 3శోక (దుఃఖము) 4మోహ (మోహము) 5జరా (ముసలితనము) 6మరణములు (చావు) అనెడి ఆరు బాధలు :-
[10.1-91.1-తే., 10.2-429.1-ఆ.]

5172} షడ్గుణములు  - భగవంతుని షడ్గుణములు ఐశ్వర్యాది (అ) 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము, (ఆ) 1వాత్సల్యము 2భవశోషణము 3ఉదారత్వము 4అభయప్రదానము 5ఆపత్కాల సంరక్షణము 6అక్షయపదము, (ఇ) 1. జ్ఞానము, 2. శక్తి, 3. ఐశ్వర్యము, 4. బలము, 5. వీర్యము, 6. ఓజస్సు. :-
[3-856.1-తే., 3-893.1-తే., 6-39.1-తే., 6-343-వ., 8-81.1-ఆ., 10.1-809-క., 10.2-1204.1-తే., 11-103-వ.]

5173} షడ్గుణైశ్వర్యములు  - (అ)1మహత్వము 2ధైర్యము 3కీర్తి 4శ్రీ 5జ్ఞాన 6వైరాగ్యములు, (ఆ)1శక్తి 2జ్ఞానము 3బలము 4ఐశ్వర్యము 5వీర్యము 6తేజస్సు :-
[10.1-809-క., 10.2-925-వ.]

5174} షడ్గుణైశ్వర్యసంపన్నుడు  - షట్ (ఆరు) గుణములు అను ఐశ్వర్యము సమృద్దిగా కలవాడు, శంకరుడు :-
[3-473-వ.]

5175} షడ్జమము(స)  - "స, రి, గ, మ, ప, ద, ని" అను సప్తస్వరములలో (1) మొదటి స్వరమునకు శాస్త్రరీత్యా ఇచ్చిన నామము షడ్జమము. దీనికి సంకేత అక్షరము "స". సప్తస్వరములలో ఋషభాది (6) ఆరు స్వరములును షడ్జము ఆధారముగా జనించుటచే ఏర్పడిన పేరు. (షడ్జమ్ షట్ + జమ్, షట్ నాసిక, కంఠము, ఉరస్సు, తాలువు, జిహ్వ, దంతములు (6) ఆరు స్థానుములందు జమ్ జనించు ధ్వనికి షడ్జమ్ అని పేరు కలిగెను.) :-
[10.1-773-శా.]

5176} షడ్జాది  - "స, రి, గ, మ, ప, ద, ని" అని సంకేతములు గల షడ్జ, ఋషభ, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత, నిషాద అను ఏడు (7) స్వరములు షడ్జాది అనబడును. పాఠ్యంతరము అ.) 1. నిషాదము, 2. ఋషభము, 3. గాంధారము, 4. షడ్జము, 5. మధ్యమము, 6. ధైవతము, 7. పంచమము. "నిషాదర్షభ గాంధార షడ్జ మధ్యమ ధైవతాః, పంచమశ్చేత్యమీ సప్తతంత్రీ కంఠోత్థితాః స్వరాః" [అమరకోశము 1 6 1] :-
[3-388-వ.]

5177} షడ్రసములు  - 1కషాయము (వగరు) 2మధురము (తీపి) 3లవణము (ఉప్పు) 4కటువు (కారము) 5తిక్తము (చేదు) 6ఆమ్లము (పులుపు) :-
[3-819.1-తే., 10.1-630-వ., 10.1-889.1-తే.]

5178} షడ్విధవికారములు  - (అ)1జన్మ(పుట్టుట) 2సంస్థాన (నిలబడుట) 3వర్ధన (పెరుగుట) 4అపక్షయ (బలియుట) 5పరిపాక (పరిక్వమగుట) 6నాశము (నశించుట) అనెడి ఆరు మార్పులు, (ఆ) 1ఆకలి 2దప్పిక 3శోకము 4మోహము 5ముసలితనము 6చావు :-
[7-237-వ., 10.1-126.1-ఆ., 10.1-405.1-తే., 10.1-553.1-ఆ., 10.2-207-మ.]

5179} షణ్ణవతి  - షట్ (ఆరు, 6) నవతి (తొంభై, 90) 96 :-
[5.2-109-చ.]

5180} షణ్ముఖుడు  - షట్ (ఆరు (6)) ముఖుడు, ముఖములుగలవాడు, కుమారస్వామి :-
[5.2-65.1-ఆ.]

5181} షష్టవిధహాసములు  - 1. సిత్మము (కొద్ది నేత్రవికాసము, అధర చలనము గలది ), 2. హసితము (దంతములు ప్రకటింపబడునది), 3. విహసితము (మధురస్వర సంయుక్తము), 4. ఉపహసితము (అంస, శిరః కంపసమేతము), 5. అపహసితము (బాష్పయుక్తము), 6. అతిహసితము (శరీరకంపయుక్తము). [భరతనాట్యశాస్త్రము 6 52] :-
[10.2-1255-చ.]

5182} షోడశకర్మములు  - 1గర్భాదానము 2పుంసవనము 3సీమంతము 4జాతకర్మము 5నామకరణము 6అన్నప్రాశనము 7చౌలము 8ఉపనయనము 9ప్రాజాపత్యము 10సౌమ్యము 11ఆగ్నేయము 12వైశ్వదేవము 13గోదానము 14సమావర్తము 15వివాహము 16అంత్యకర్మము :-
[7-409-వ., 10.1-173-వ.]

5183} షోడశకర్మలు  - 1గర్భాదానము 2పుంసవనము 3సీమంతము 4జాతకర్మము 5నామకరణము 6అన్నప్రాశనము 7చౌలము 8ఉపనయనము 9ప్రాజాపత్యము 10సౌమ్యము 11ఆగ్నేయము 12వైశ్వదేవము 13గోదానము 14సమావర్తము 15వివాహము 16అంత్యకర్మము :-
[6-449-వ.]

5184} షోడశచంద్రకళలు  - 1అమృత 2మానద 3పూష 4తుష్టి 5సృష్టి 6రతి 7ధృతి 8శశిని 9చంద్రిక 10కాంతి 11జ్యోత్స్న 12శ్రీ 13ప్రీతి 14అంగద 15పూర్ణ 16పూర్ణామృత :-
[10.1-1779-వ.]

5185} షోడశతిథులు  - 1 అమావాస్య 2 పౌర్ణమి 3 పాడ్యమి 4 విదియ 5 తదియ 6 చవితి 7 పంచమి 8 షష్టి 9 సప్తమి 10 అష్టమి 11 నవమి 12 దశమి 13 ఏకాదశి 14 ద్వాదశి 15 త్రయోదశి 16 చతుర్దశి :-
[3-388-వ.]

5186} షోడశవికారములు  - ఏకాదశేంద్రియములు 11 [పంచ జ్ఞానేంద్రియములు (కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము), పంచ కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము), బుద్ధి] మరియు పంచ భూతములు 5 (భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము) :-
[3-363-వ., 4-889-వ., 10.1-119.1-ఆ.]

5187} షోడశాత్మక  - 5 పంచభూతములు, 5 జ్ఞానంద్రియములు, 5 కర్మేంద్రియములు మరియు 1 మనస్సు మొత్తం 16 :-
[2-68.1-తే.]

5188} షోడశోపచారములు  - 1ఆవాహనము 2ఆసనము 3పాద్యము 4అర్ఘ్యము 5ఆచమనీయము 6 స్నానము 7వస్త్రము 8యజ్ఞోపవీతము 9గంధము 10పుష్పము 11ధూపము 12దీపము 13నైవేద్యము 14తాంబూలము 15నమస్కారము 16ప్రదక్షిణము :-
[11-60-వ., 11-115-వ.]

5189} షోడశ్యుక్థ్యములు  - షోడశ (పదహారు, 16) తిథులకు యుక్తములు (అనుసరించ వలసినవి) యైన నియమములు దీక్షలు :-
[3-388-వ.]

5190} సంకరజాతులు  - అసమాన స్త్రీపురుషలవలన కలిగిన జాతులు :-
[7-419-వ.]