పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (శంకరుడు - శ్వేత)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


4953} శంకరుడు  - సుఖమును కలుగజేయువాడు, శివుడు :-
[8-219-మ., 10.2-315-ఉ., 10.2-832-క., 12-39-వ.]

4954} శంఖబంధము  - మొదట ఒకరు ఆవల ఇరువురు వారికవతల ముగ్గురునుగా రెండుపక్కల నిలబడి నడుమనుండువారికి హస్త విన్యాసాదులను చూపునట్టిది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4955} శంఖాతీతము  - శంఖమునకు (మిక్కిలి పెద్ద సంఖ్యకు అనగా 10 ప్రక్కన 18 సున్నాలుండు సంఖ్యకు) మించినది, బహుఎక్కువైనది :-
[1-247-శా.]

4956} శంబరమృగము  - ఎఱ్ఱనివన్నెగల చిన్న జింక :-
[10.2-112-మ.]

4957} శంబరవిద్వేషి  - శంబరాసురుని విద్వేషి (శత్రువు), మన్మథుడు, ప్రద్యుమ్నుడు :-
[6-446.1-తే.]

4958} శంబరాంతకుడు  - శంబరాసురుని సంహరించిన వాడు, మన్మథుడు, ప్రద్యుమ్నుడు :-
[10.1-967.1-ఆ.]

4959} శంబరారాతి  - శంబరుని శత్రువు, మన్మథుడు, ప్రద్యుమ్నుడు :-
[9-230-వ.]

4960} శంబరారి  - శంబరాసురుని శత్రువు, ప్రద్యుమ్నుడు :-
[10.2-288-చ., 10.2-873-ఆ.]

4961} శంబరాసురభంజనుడు  - శంబరాసురుని శత్రువు, ప్రద్యుమ్నుడు. :-
[1-348.1-తే.]

4962} శంబరుడు  - ఒక అసురుడు, శంబ+అరచ్, శంబతి సజ్జనాన్ విరుద్ధం గచ్ఛతి, సజ్జనులకు విరుద్ధంగా వెళ్లువాడు. శంబరాసురుడు. :-
[2-190-చ., 7-29-వ.]

4963} శంభుడు  - శం+భూ+డు, శం మంగళం భవతి అస్మాత్, ఇతని నుండి శుభము జరుగును. శివుడు; :-
[10.2-413-క.]

4964} శకటవదనపార్థివచారము  - ముందరి వైపున బండిచక్రము వలె కనబడునట్లు పాదములను తిప్పితిప్పి పెట్టుచు పోవుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4965} శకటాసనజానువర్తన  - బండి నిలిచినట్టు ఒక కాలు వంచి దానిలో మరియొక కాలు చొప్పించి నిలిచి నటించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

4966} శకుని  - గాంధార దేశపు రాజు అగు సుబలుని కొడుకు. గాంధారికి సోదరుఁడు. దుర్యోధనుని మేనమామ. :-
[3-34-క., 7-29-వ.]

4967} శక్తి  - 1) చర్నాకోల, 2) బలిమి 3) ఇచ్ఛాది (ఇచ్ఛాశక్తి / ద్రవ్యశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి), 4) ఉత్సాహాది (ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము), 6) సత్వాది (సత్వము, రజస్సు, తమస్సు), 6. సర్వజ్ఞత్వాది, 7. పార్వతి, 8. పరాశరుని తండ్రి :-
[8-222.1-ఆ., 10.2-165-వ., 10.2-401-వ., 10.2-517-క.]

4968} శక్తినికరము  - అవ్యక్త, మహదహంకారాది శక్తుల సమూహము, సర్వజ్ఞ సర్వతంత్ర అనాదిబోధ నిత్యతృప్తి నిత్యలుప్త అనంతాది శక్తుల సమూహము :-
[10.1-1071-వ.]

4969} శక్తిమనుమడు  - పరాశరుని తండ్రి శక్తి కనుక అతని మనవడు, వ్యాసుడు :-
[10.2-929-వ.]

4970} శక్తులు  - సర్వజ్ఞత్వాది శక్తులు :-
[10.2-594-తే.]

4971} శక్రవైరి  - శక్రుడు (ఇంద్రుడు) యొక్క వైరి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-250-వ.]

4972} శక్రసూనుడు  - ఇంద్రుని పుత్రుడు, అర్జునుడు :-
[1-173-శా.]

4973} శక్రుడు - శక్రము (వజ్రాయుధము) కలవాడు, వజ్రి, ఇంద్రుడు :-
[6-507-వ.]

4974} శక్రుడు  - దుష్టులను శిక్షించు శక్తి కలవాడు, శక్+రక్, శక్నోతి దైత్యాన్ నాశయితుమ్, రాక్షసులను నశింపజేయు సామర్థ్యము కలవాడు. ఇంద్రుడు :-
[7-391-క., 9-135-ఆ., 10.1-888-శా., 10.1-945-వ., 10.2-407-మ., 10.2-438-చ.]

4975} శచీధవుడు  - శచీదేవి భర్త, ఇంద్రుడు :-
[3-113-మ.]

4976} శతచంద్రము  - నూరు చంద్రుళ్ళుకల ఒక డాలు పేరు, విష్ణువు చర్మము (డాలు) పేరు :-
[4-443.1-తే.]

4977} శతధృతి  - శత (నూరు)(100) ధృతి (యజ్ఞములు) :-
[4-684-వ.]

4978} శతబాహుడు  - ఒక అసురుడు, శత (నూరు) బాహుడు (చేతులు గలవాడు), హిరణ్యకశిపుని సేనలోని వాడు. :-
[7-29-వ.]

4979} శతరూపపతి  - శతరూప యొక్క భర్త, స్వాయంభువుడు :-
[8-8-మ.]

4980} శతానందుడు  - బ్రహ్మదేవుడు, వ్యు.శత+ఆ+నంద+అణ్, కృ.ప్ర., పలువురిని ఆనందపెట్టువాడు :-
[11-113-వ.]

4981} శత్రుభీకరచక్రశంఖగదాపద్మవిహితచతుర్భాహుడు  - శత్రువులకు భయంకరమైన చక్రము శంఖము గదా పద్మములు తో విహిత (కూడిన) చతుర్ (నాలుగు 4) బాహుడు (చేతులు కలవాడు) , విష్ణువు :-
[3-924.1-తే.]

4982} శత్రులోకప్రహారుడు  - శత్రువుల సమూహమును సంహరించువాడు, రాముడు :-
[9-735-మాలి., 12-53-మాలి.]

4983} శబ్దబ్రహ్మ  - ఆకాశ మనబడు దేవుడు, పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనబడు నాలుగు వాక్కులుగ శబ్దబ్రహ్మ ఉచ్చరింపబడును :-
[4-194-వ.]

4984} శబ్దము  - ధ్వని. ఆకాశ లక్షణము, శ్రవణేంద్రియముచే గ్రహింపబడునది, :-
[3-202-వ.]

4985} శబ్దాది  - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంథములు, ఇంద్రియవిషయములు :-
[4-286.1-తే., 7-464.1-తే.]

4986} శబ్దాదివిషయపంచకము  - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంథములు, ఇంద్రియవిషయములు :-
[3-756-వ.]

4987} శబ్దాదులు  - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంథములు, ఇంద్రియవిషయములు :-
[6-461-వ.]

4988} శమనుండు  - యముడు, శమ్+ణిచ్+ల్యుట్, శమయతి తస్య భావః కర్మ వా. శమింప చేయువాడు., పాపములను, ప్రాణములను శమింప (అణగునట్లు) జేయువాడు. :-
[4-426-క., 4-442.1-తే., 5.2-136-వ., 7-257.1-తే., 10.1-1429-క.]

4989} శమము  - శాంతగుణము, మనోవ్యాపారంబులను ఉపశమింపచేయుట, కామక్రోధాదులు లేక ఉండుట, శాంతి :-
[4-241-వ., 5.1-99-వ., 11-54-వ.]

4990} శమ్యాప్రాసము  - సరస్వతీ నదికి పడమటి ఒడ్డున కల ఋష్యాశ్రమము, శమము యను ఆహారము గలది, ఇక్కడనే వ్యాసునికి నారదుడు భాగవతం ఉపదేశించారు. :-
[1-136-వ.]

4991} శరణాగతసంగతజాడ్యహరుడు  - శరణ (శరణని) ఆగత (వచ్చినవారికి) సంగత (కలిగిన) జాడ్య (జడత, జిడ్డు) హరుడు (నశింపజేసెడివాడు), విష్ణువు :-
[6-530-తో.]

4992} శరణాగతామరానోకహుడు  - శరణాగత (శరణువేడినవారికి) అమర (దేవ, కల్ప) అనోకహుడు (వృక్షమువంటివాడు), విష్ణువు :-
[8-92-ఉ.]

4993} శరణ్యత  - శరణుజొచ్చుటకు తగి ఉండుట :-
[1-403-వ.]

4994} శరధిమదవిరాముడు  - శరధి (సముద్రము యొక్క) మద (గర్వమును) విరాముడు (అణచినవాడు), శ్రీరాముడు :-
[10.2-1342-మాలి.]

4995} శరనిధికన్యకామణి  - శరము (నీరు) కి నిథి వంటివాని, సముద్రుని కన్యకామణి (శ్రేష్ఠమైన పుత్రిక), లక్ష్మీదేవి :-
[3-534-చ.]

4996} శరనిధిగర్వభంజనుడు  - శరనిధి (సముద్రుని) గర్వ (గర్వమును) భంజనుడు (పోగొట్టినవాడు), రాముడు :-
[7-482-చ.]

4997} శరభము  - సింహములను తినునది, మీద కళ్ళు, 8 కాళ్ళు ఉండెడి జంతువు, మీగండ్లమెకము :-
[1-122-క., 9-595-క., 10.1-1610-క.]

4998} శరవిదళితసారంగుడు  - శర (బాణముచే) విదళిత (మిక్కిలిగా బేధింపబడిన) సారంగుడు (లేడిగలవాడు), రాముడు :-
[4-975-క.]

4999} శరీరధారులు  - దేహము ధరించినవారు, మానవులు :-
[7-142-ఉ.]

5000} శరీరము  - శౄ+ఈరన్, శీర్యతే రోగాదినా. రోగాదులచే క్షీణింపబడును. శీర్యతే శరీర, దేహము, మేను :-
[10.2-721-క.]

5001} శరీరులు  - శరీరము ధరించిన వారు, మానవులు :-
[2-210-ఉ.]

5002} శర్వాగ్రజన్ములు  - సృష్టాదిని బ్రహ్మదేవుడు సనకాదుల సృష్టించెను. తరువాత అతని కనుబొమముడినుండి రుద్రరూపమున శివుడు జన్మించెను. అందుచేత శివుని యగ్రజన్ములు సనకాదులు. :-
[4-604.1-తే.]

5003} శర్వాణి  - శర్వుని (శివుని) భార్య, సతి :-
[4-79.1-తే.]

5004} శర్వుడు  - ప్రళయమున భూతలములను హింసించువాడు, శౄ+వ, శృణాతి హినస్తి దుఃఖాని, దుఃఖములను పోగొట్టువాడు. శివుడు, శంకరుడు :-
[8-672.1-తే., 9-112-వ.]

5005} శశధరుండు  - శశము (కుందేలు)ను ధరించినవాడు, చంద్రుడు :-
[6-85.1-తే.]

5006} శశాంక  - శశ (కుందేలు) గుర్తు కలవాడు, చంద్రుడు :-
[1-2-ఉ.]

5007} శశి  - శశ (కుందేలు) గుర్తుగలవాడు, చంద్రుడు :-
[4-426-క., 10.1-340-క., 10.1-1648-మ.]

5008} శశికులతిలకుడు  - శశి (చంద్ర) కుల (వంశమునకు) తిలకుడు (ముఖ్యాభరణమైన వాడు), ధర్మరాజు. :-
[7-442-క.]

5009} శశిచూడామణి  - శశి (చంద్రుడు) చూడామణిగా (శిరోమణిగా) కలవాడు, శివుడు :-
[10.1-1648-మ.]

5010} శశిముఖి  - చంద్రునివంటి ముఖము కల స్త్రీ :-
[1-265-క.]

5011} శశిమౌళి  - చంద్రుడు సిగలో కలవాడు, ఈశానుడు, ఈశాన్య దిక్పతి, శివుడు :-
[10.2-773-చ.]

5012} శశ్వత్ప్రకాశుడు  - శశ్వత్ (శాశ్వతమైన) ప్రకాశకుండు (ప్రకాశము కలవాడు), విష్ణువు :-
[3-145.1-తే., 3-991.1-తే., 4-233.1-తే.]

5013} శశ్వత్ప్రదీపుడు  - శశ్వత్(శాశ్వతమైన) ప్రదీపుడు (వెలుగును ప్రసాదించువాడు), విష్ణుమూర్తి. :-
[3-294.1-తే.]

5014} శశ్వత్ప్రశాంతుడు  - శాశ్వతమైన ప్రశాంతి కలవాడు, భగవంతుడు :-
[2-207-క.]

5015} శశ్వత్స్వరూపుడు  - శాశ్వతమైన స్వరూపము కలవాడు, విష్ణువు :-
[3-302-తే.]

5016} శశ్వద్విలాసుడు  - శశ్వత్ (శాశ్వతముగా) విలాసుడు (విరాజిల్లువాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

5017} శశ్వన్మూర్తి  - శశ్వత్ మూర్తి, శాశ్వతమే మూర్తీభవించిన వాడు :-
[2-110-మ.]

5018} శస్త్రరాజము  - శస్త్రములలో శ్రేష్ఠమైనది, చక్రము :-
[3-693-క.]

5019} శాంకరి  - సుఖప్రదాయిని, శివుని భార్య, పార్వతీదేవి, శం+కృ+అచ్, శం సుఖం కల్యాణం కరోతి, కల్యాణము కూర్చు దేవి :-
[12-39-వ.]

5020} శాంతకుడు  - మరణము కలుగ జేయువాడు, యముడు :-
[7-295-మ.]

5021} శాంతము  - కామక్రోధాది రాహిత్యము, శమ్+క్త, జాత శమః, ఓర్పు కల్గి ఉండుట; ప్రసత; సౌమ్యము; శాంతరసము. :-
[9-637-క.]

5022} శాంతవిగ్రహుని  - శాంతమైన స్వరూపము కలవానిని, శివుని :-
[4-138.1-తే.]

5023} శాంతి  - శమము, కామక్రోధాది రాహిత్యము, వ్యు. శమ (ఉశమే) క్తిన్, కృ.ప్ర., శమ్+క్తిన్, శామ్యతి తస్య భావః కర్మ వా] శాంతి; చిత్తోపశమనము; ఇంద్రియ నిగ్రహము. :-
[4-6-వ., 4-28-వ.]

5024} శాంతుడు  - శాంతముకలవాడు, విష్ణువు :-
[4-702.1-తే., 6-327.1-తే.]

5025} శాకము  - 1. టేకు (వృక్షము) 2. కూర (ఆకు, పువ్వు, కాయ మున్నగువాని లోనిది, 3. శాక ద్వీపము :-
[5.2-67.1-తే.]

5026} శారద  - బ్రహ్మక్షేత్రమున శారద (నలుపు (తమోగుణము) తెలుపు (సత్త్వగుణము) ఎరుపు (రజోగుణము) లను శారను కలిగించునామె) :-
[10.1-61-వ.]

5027} శార్ఙ్గపాణి  - శార్ఙ్గము అనెడి విల్లు ధరించువాడు, విష్ణువు :-
[4-347.1-తే., 4-373-ఆ.]

5028} శార్ఙ్గము  - శృంగముతో చేయబడినది, విష్ణువు యొక్క విల్లు :-
[10.2-516.1-తే.]

5029} శార్ఙ్గి  - శార్ఙ్గము అను విల్లు కలవాడు, విష్ణువు :-
[10.1-1612.1-తే.]

5030} శాల్మలి  - 1. బూరుగు చెట్టు, దీని నుండే బూరుగు దూది వస్తుంది, ఈ దూదితో మెత్తని పరుపులు చేస్తారు, పట్టుదూది 2. శాల్మలి ద్వీపము :-
[5.2-61-క.]

5031} శాశ్వతుడు  - శాశ్వతముగానుండు వాడు, రాముడు, భగవంతుడు :-
[2-207-క., 11-1-క.]

5032} శింజని  - ధనుస్సుకు సంధించెడి తాడు, అల్లెతాడు, వింటినారి :-
[10.1-1557-మ.]

5033} శింశుమారచక్రము  - హరిపథము, ఓంకారపథము, జ్యోతిశ్చక్రము, గ్రహ నక్షత్ర మండలములు తిరిగెడు చక్రము :-
[2-30-వ., 4-322-వ.]

5034} శింశుమారము  - 1.మొసలి, 2.జ్యోతిశ్చక్రము, శింశుమార ఛక్రము :-
[5.2-92-క.]

5035} శిఖి  - సిగలు కలది, 1. అగ్ని 2. నెమలి :-
[10.1-340-క., 10.1-548.1-ఆ., 10.2-773-చ.]

5036} శితికంఠుడు  - శితి (నల్లని, తెల్లని) కంఠుడు (కంఠముకలవాడు), శివుడు :-
[4-183-చ.]

5037} శితివాసము  - ఒక పర్వతము, మేరుపర్వతం తామరదుద్దు, దాని చుట్టూ కేసరాలుగా ఉన్న పర్వతలలో ఒకటి. శితి (నల్లని, తెల్లని) వాసము (నివాసము కలది) :-
[5.2-30-వ.]

5038} శిపివిష్టుడు  - వ్యు. శిపి + విశ + క్త కృ.ప్ర., వెలుగై వ్యాపించువాడు, కిరణముల స్వరూపమున అంతటను వ్యాపించి యున్నవాడు, యజ్ఞపశువునందు వ్యాపించి యున్నవాడు, విష్ణువు (శబ్దరత్నాకరము) :-
[4-400-వ., 8-503.1-తే.]

5039} శిబిక  - మనుష్యులు మోసెడి వాహనము, పల్లకి, వ్యు. శివం కరోతి శివ(ణిచ్) + ణ్వుల్ అక అతః ఇత్వమ్ వశ్య టాప్, కృ.ప్ర. సుఖమును కలుగజేయునది :-
[5.1-139.1-తే.]

5040} శిబిచక్రవర్తి  - కపోతరూపుని కిచ్చిన శరణము కొరకు తన కండలు కోసి ఇచ్చినవాడు, శిబి ఒక దేశము. :-
[2-204.1-తే.]

5041} శిరోమణి  - శిరసున ధరించు రత్నాభరణము వంటిది, ఉత్తమురాలు :-
[3-835-మ.]

5042} శిరోరుహములు  - శిరస్సున రుహములు పుట్టునవి, శిరోజములు, తలవెంట్రుకలు :-
[7-421-వ.]

5043} శిలీముఖము  - శల్యము (ముల్లు) కొనయందు కలది, ఇనప ముల్లు (ఉక్కుముఖము) బాణము :-
[10.1-1757-వ., 10.1-1766.1-ఆ., 10.2-436-ఉ.]

5044} శిలోంఛనము  - గృహస్థాశ్రమంలో ఒక వృత్తి, పొలం కోసేటప్పుడు రాలిన గింజలను ఏరుకుని జీవనోపాధి పొందుట శింలోఛనము. వ్యు. శిలోంఛ ఊల్+ఉఛి+ఘఞ్, శిలేన ఉంఛ ఉపాత్త సస్యాత్ క్షేత్రాత్ శేషాపచయనమ్] క్షేత్రములో పంటను కోసిన తరువాత మిగిలి వున్న ధాన్యము. :-
[3-388-వ.]

5045} శివ  - 1. శివునిభార్య, పార్వతి, వ్యు, శో+వన్, శ్యతి విశినష్టి అమంగళమ్, అమంగళమును పోగొట్టుదేవి. పార్వతి, మంగళ. 2. అమంగళమును పోగొట్టువాడు, శివుడు :-
[9-16.1-తే.]

5046} శివగురుపుత్రుడు  - శివుని గురువు అంగిరసుడు అతని కొడుకు బృహస్పతి :-
[9-377-వ.]

5047} శివము - శివతరము శివతమము :-
[3-312-చ., 4-553.1-తే.]

5048} శివవల్లభ  - శివుని భార్య, పార్వతి :-
[10.1-1746-ఆ.]

5049} శివుడు  - 1.శివము (మంగళము, సుఖము, మోక్షము) ప్రదుడు (కలిగించువాడు), త్రిమూర్తులలో లయకారుడు 2.అహంకారేంద్రియమునకు అధిదేవత, 3. శో+వన్, శ్యతి విశినష్టి అమంగళమ్] అమంగళమును పోగొట్టువాడు. శివుడు :-
[4-18.1-తే., 5.2-38.1-ఆ., 8-242-మ., 10.1-1236-దం.]

5050} శిశిరఋతువు  - మాఘ ఫాల్గుణమాసములు, చలిఋతువు :-
[7-448-వ.]

5051} శిశిరకిరణుడు  - శిశిర(చల్లని) కిరణుడు (కిరణములుగలవాడు), చంద్రుడు :-
[7-285-వ.]

5052} శిశిరము  - చల్లనిది, మాఘ ఫాల్గుణమాసములు, చలిఋతువు :-
[5.2-30-వ.]

5053} శిశుపాలుడు  - కృష్ణుని మేనల్లుడు, చైద్యదేశపు యువరాజు :-
[2-190-చ., 3-87-వ., 3-97-చ., 7-9-వ.]

5054} శిష్టనాథుడు  - శిష్టు (సదాచారు)లకు నాథుడు (రక్షకుడు), విష్ణువు :-
[4-703.1-తే.]

5055} శీతకరముఖి  - చంద్రముఖి, స్త్రీ :-
[10.1-1496-క.]

5056} శీతకరుడు  - చల్లని కరుడు (కిరణములవాడు), చంద్రుడు :-
[9-382-క.]

5057} శీతకిరణుడు  - చల్లని కిరణములు కలవాడు, చంద్రుడు :-
[10.1-1291-క.]

5058} శీతభానుడు  - శీత (చల్లగా) భానుడు (ప్రకాశించువాడు), చంద్రుడు :-
[8-61-ఆ.]

5059} శీతాంశుడు  - చల్లని కిరణాలు కలవాడు, చంద్రుడు :-
[1-144-మ., 3-421-తే.]

5060} శీతాంశుబింబానన  - శీతాంశుబింబ (చంద్రబింబమువంటి) ఆనన (మోము కలామె), సుందరి. :-
[10.2-137-శా.]

5061} శీతుంశుముఖి  - చంద్రముఖి, శీతాంశు (చంద్రుని వంటి) ముఖి (మోము కలామె), స్త్రీ. :-
[10.1-314-క.]

5062} శీలవిరహితుడు  - నిత్యనిర్మలుడు నిష్కర్ముడు కనుక మంచి చెడు నడవడికలకు అతీతుడు, విష్ణువు :-
[10.1-901-క.]

5063} శుండాలము  - శిండ (తొండము)తో నీరు గ్రహించునది, ఏనుగు :-
[10.1-1321-వ.]

5064} శుకతుండకరభావము  - చిలుకముక్కు వలె బొటనవేలిని తర్జనీ అనామికలను వంచి పట్టునది, శ్లో. అస్మిన్ననామికా వక్రాశుకతుండ కరోభవేత్, రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

5065} శుకుడు  - వ్యాసపుత్రుడు, భాగవత పురాణ ప్రయోక్త, శ్రోత పరీక్షిత్తు. :-
[6-11.1-తే.]

5066} శుక్తిపార్థివచారము  - అడుగులు వంపుగా బోరగిలం చేర్చి పెట్టుచు పోవుట, రాసక్రీడా పారిభాషిక పదము. :-
[10.1-1084-వ.]

5067} శుక్రకుమారకులు  - శుక్రాచార్యుని కుమారులు, చండామార్కులు :-
[7-134-ఉ.]

5068} శుక్లపక్షము  - తెల్ల (వెన్నెల) రాత్రులు ఉండు పక్షము, పూర్ణిమకు ముందరిరోజులు కల పక్షము (పదిహేను రోజులు) :-
[3-346-వ., 7-448-వ.]

5069} శుచి  - పరిశుద్ధుడైన వ్యక్తి. :-
[4-34-వ.]

5070} శుద్దాంతమందిరము  - అంతఃపురము, వ్యు. శుద్ధః అంతః అస్య, బ.వ్రీ. ఎట్టి ఉపద్రవములు లేకుండ శోధింపబడు ప్రాంతము గల మందిరము, శుద్ధస్య (శుద్ధే) అంతః ష.త. మందిరము (నివాసము) :-
[3-532-మ.]

5071} శుద్ధసత్త్త్వగుణుడు  - పరిశుద్ధమైన సత్త్త్వగుణము కలవాడును, విష్ణువు :-
[3-506-చ.]

5072} శుద్ధుడు  - పరిశుద్ధమైనవాడు, విష్ణువు :-
[4-936-వ.]

5073} శుభగుణములు  - సర్వజ్ఞత్వాది గుణములు :-
[10.2-1203-వ.]

5074} శుభప్రదుడు  - శుభకరుడు, విష్ణువు :-
[3-669-క.]

5075} శుభమూర్తి  - శుభములు (మేలైనవృత్తి) స్వరూపమైన వాడు, కృష్ణుడు :-
[10.1-787-మ.]

5076} శుభరాజీవాక్షుడు  - శుభ (చక్కని) రాజీవ (పద్మదళముల) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), హరి :-
[6-1-శా.]

5077} శుభస్వరూపములు  - సచ్చిదానందాది స్వరూపములు :-
[10.2-1203-వ.]

5078} శుభాంగుడు  - శోభనకరమైన (చక్కని) దేహము కలవాడు, కృష్ణుడు :-
[10.1-1331.1-తే.]

5079} శూన్యప్రవృత్తుడు  - శూన్యమైన ప్రవృత్తులు కలవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

5080} శూరసుతుడు  - శూరుని యొక్క పుత్రుడు, వసుదేవుడు :-
[10.1-146-క.]

5081} శూరసేనుడు  - శ్రీకృష్ణుని తాత, వసుదేవుని తండ్రి :-
[3-49-చ.]

5082} శూలప్రోతము  - శూలము పైన గుచ్చి శిక్షించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

5083} శూలము  - పొడవైన సన్నని కడ్డీ చివరన కొన బాగా సూదిగా ఉండెడి దళసరిగా నున్న ఆకు రూపు ఆయుధవిశేషము :-
[10.2-165-వ.]

5084} శూలి  - శూలాయుదము కలవాడు, శివుడు :-
[7-384-వ., 9-514.1-ఆ., 10.2-278-తే.]

5085} శృంగారరత్నాకరుడు  - శృంగార రసమునకు సముద్రము వంటివాడు, కృష్ణుడు :-
[1-201-శా.]

5086} శేషశాయి  - శేష (ఆదిశేషుని)పై శాయి (శయనించువాడు), విష్ణువు :-
[7-169.1-తే.]

5087} శేషుడు  - అనంతు డనెడి వేయిపడగలు కల సర్పరాజు, మహాప్రళయమున సర్వంసహా లయమైన తరువాత శేషముగా మిగిలి విష్ణుని సేవయందుండు వాడు, విష్ణువు పాలసముద్రమున శేషుడు శయనించుటకు పాన్పుగా ఉండును. :-
[5.2-107-వ., 10.1-16-క., 10.1-1232-ఉ.]

5088} శైలభేదనుశరాసనము  - శైలభేదను (పర్వతములను కొట్టెడివాని, ఇంద్రుని) శరాసనము (విల్లు), ఇంద్రధనుస్సు :-
[10.1-762.1-తే.]

5089} శైలము  - శిలలగుట్ట, కొండ :-
[10.1-921-శా.]

5090} శైవలిని  - నాచుగలది, నది :-
[9-275-క.]

5091} శోణపురము  - బాణాసురుని పట్టణము :-
[10.2-318-వ.]

5092} శోభనచారిత్రుడు  - శుభకరమైన నడవడిక కలవాడు, విష్ణువు :-
[3-284-మ.]

5093} శోభనభాస్వత్పరిపూర్ణయౌవనకళాభ్రాజిష్ణు  - శుభకరమై ప్రకాశిస్తున్న నిండుజవ్వనము యొక్క శోభచే ప్రకాశించువాడు, విష్ణువు :-
[3-148-మ.]

5094} శోభనములు+కని  - శోభనములుగని, గసడదవాదేశ సంధి :-
[10.2-1235-క.]

5095} శౌచము  - నిర్మలత్వము, శుచిత్వము, ముఱికి లేకుండుట, పారిశుద్ధ్యము, ఇది భాహ్య, అభ్యంతర శౌచములని రెండు విధములు. :-
[12-20-వ.]

5096} శౌచాచారములు  - బాహ్యభ్యంతర శౌచము ఆచరించునవి, స్నానము, నీరు పుక్కిలించుట, వేదపారాయణము, దీక్షలుపట్టుట, నియమములు పాటించుట, అగ్నిహోత్రాది సేవించుటలు మొదలగునవి. :-
[5.1-121-మ.]

5097} శౌనకుడు  - శునకుడను ఋషివర్యుని పుత్రుడు, ఒక మహర్షి, భాగవతాది పురాణ ప్రవక్త సూతునికి శ్రోత శౌనకుడు :-
[4-973-క.]

5098} శౌరి  - శూరుని వంశపు వాడు, 1.శూరుని మనవడు, శ్రీకృష్ణుడు. 2.శూరిని పుత్రుడు, వసుదేవుడు :-
[8-109-మ., 9-229-ఆ., 9-463-క., 9-728.1-తే., 10.1-41-క., 10.1-144-క., 10.1-211-వ., 10.1-305.1-తే., 10.1-750-క., 10.1-1021.1-ఆ., 10.1-1171-ఉ., 10.1-1321-వ., 10.1-1363-క., 10.1-1454-చ., 10.1-1498-ఆ., 10.1-1692.1-ఆ., 10.2-47-ఆ., 10.2-88.1-తే., 10.2-159-శా., 10.2-534.1-తే., 10.2-614-క.]

5099} శౌర్యము - శౌర్యతరము శౌర్యతమము :-
[3-479-క.]

5100} శ్రవణమంగళనామధేయుడు  - శ్రవణ (వినినంతనే) మంగళ (శుభములను కలిగించెడి) నామధేయుడు (పేరు గలవాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

5101} శ్రవణేంద్రియములు  - వినుటకైన సాధనములు, చెవులు :-
[2-86-వ.]

5102} శ్రితజనత్రాణైకపారీణుడు  - ఆశ్రయించిన జనుల త్రాణము (రక్షించుట) అను మిక్కిలి నేర్పు కలవాడు, విష్ణువు :-
[3-373-మ.]

5103} శ్రితభయహరణుడు  - శ్రిత (ఆశ్రయించినవారి) భయ (భయమును) హరణుడు (హరించువాడు), విష్ణువు :-
[3-841-క.]

5104} శ్రితమందారుడు  - ఆశ్రయించినవారికి కల్పవృక్షము వంటి వాడు, విష్ణువు. :-
[8-657-క.]

5105} శ్రితవదనాలంకరిష్ణుడు  - శ్రిత (ఆశ్రయిచినవారి) వదన (మోములను) అలంకరిష్ణుడు (వికాసవంతము చేయు శీలముగల వాడు, ఆనందింపజేయు శీలముగల వాడు), విష్ణువు :-
[10.1-109-క.]

5106} శ్రియఃపతి  - శ్రియస్ (శ్రేయస్సు) నిచ్చు పతి (ప్రభువు), విష్ణువు) :-
[2-236-మ.]

5107} శ్రీ  - సంపద, భార్గవి (భృగువుసుత), లక్ష్మీదేవి, బ్రహ్మవిద్య :-
[4-26-వ., 10.1-1236-దం.]

5108} శ్రీకంఠచాపఖండనుడు  - శ్రీకంఠుని (కఱ కంఠుడు యైన శివుని) చాప (విల్లును) ఖండనుడు (విరిచినవాడు), రాముడు :-
[10.1-1-క.]

5109} శ్రీకంఠుడు  - కఱకంఠుడు, వ్యు. శ్రీ కఠే అస్య, బ.వ్రీ., కంఠమున వన్నెకలవాడు, శివుడు :-
[7-389-క., 7-393-క., 9-227-మ.]

5110} శ్రీకరుడు  - శ్రీ (శుభములను, సంపదలను) కరుడు (కలిగించెడివాడ), విష్ణువు, కృష్ణుడు, రాముడు :-
[5.1-1-క., 5.1-181-మ., 6-400-ఉ., 6-530-తో., 10.2-1-క.]

5111} శ్రీకాంతాతిలకము  - శుభకరమైన స్త్రీలలో ఉత్తమురాలు, శ్రేష్ఠురాలు శ్రీకాంత (లక్ష్మీదేవి), లక్ష్మి :-
[2-234-శా.]

5112} శ్రీకాంతాహృదయప్రియుడు  - శ్రీకాంత (లక్ష్మీదేవి) యొక్క హృదయమునకు ప్రియుడు (ప్రియమైనవాడు), విష్ణువు :-
[5.2-1-క.]

5113} శ్రీకాంతుడు  - శ్రీ (లక్ష్మీదేవి) కాంతుడు (భర్త), విష్ణువు :-
[6-188.1-ఆ.]

5114} శ్రీకారము  - శ్రీ అను అక్షరము యొక్క రూపము, శుభకరము :-
[3-288-వ.]

5115} శ్రీతరుణీహృదయస్థితుడు  - శ్రీతరుణీ (లక్ష్మీదేవిని) హృదయమందు స్థితుడు (నిలుపుకున్నవాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]

5116} శ్రీదయితాచిత్తచోరుడు  - శ్రీ (లక్ష్మి) దయిత (దేవి)యొక్క చిత్తచోర (మనసు దొంగిలించిన వాడు), విష్ణువు :-
[8-657-క.]

5117} శ్రీదయితుడు  - శ్రీ (లక్ష్మీదేవి) దయితుడు (భర్త), విష్ణువు, :-
[9-498-క.]

5118} శ్రీదేవుడు  - లక్ష్మీదేవి (శ్రీ) యొక్క దేవుడు, విష్ణువు :-
[3-227-క.]

5119} శ్రీధరుడు  - శ్రీ (లక్మీదేవిని) (వక్షమున) ధరుడు (ధరించినవాడు), విష్ణువు :-
[6-324-లగ్రా.]

5120} శ్రీనాథనాథుడు  - శ్రీ (లక్ష్మీదేవి)కి నాథ (భర్త) ఐన నాథుడు (ప్రభువు), విష్ణువు :-
[3-203-దం.]

5121} శ్రీనాథుడు  - 1. శ్రీ (లక్ష్మీదేవి)కి నాథుడు (భర్త), విష్ణువు. 2. శ్రీ (చిచ్ఛక్తి యైన లక్ష్మీదేవి)కి నాథుడు (భర్త), విష్ణువు, 3. మరుత్తరాట్చరిత్ర, కాశీఖండము, హరవిలాసము మున్నగునవి వ్రాసిన ప్రౌఢకవి, వీరు పోతనకు మేనమామ అని నానుడి :-
[4-451-క., 6-11.1-తే., 7-169.1-తే., 10.1-66-క., 10.1-1651-శా.]

5122} శ్రీనాయకుడు  - శ్రీ (లక్ష్మీదేవికి) నాయకుండు (ప్రభువు), విష్ణువు :-
[5.1-43.1-తే., 11-17-క.]

5123} శ్రీనికేతనుడు  - శ్రీ (సిరికి, లక్ష్మీదేవికి) నికేతనుడు (నివాసమైనవాడు), విష్ణువు :-
[3-507-వ.]

5124} శ్రీనిధి  - సంపదలకు నిలయమైనవాడు, కృష్ణుడు :-
[10.2-1019-ఉ.]

5125} శ్రీనిలయశరీరుడు  - శ్రీ (సంపదలకు) నిలయమైన శరీరముగలవాడు, కృష్ణుడు :-
[5.2-165-చ.]

5126} శ్రీపతి  - శ్రీ (లక్ష్మీదేవి) పతి (భర్త), విష్ణువు :-
[3-56-క., 3-106-క., 6-32-క., 6-121-క., 6-179-క., 10.2-651-క.]

5127} శ్రీపు  - శ్రీ (లక్ష్మీదేవి) పతి, విష్ణువు :-
[5.1-98.1-తే.]

5128} శ్రీభర్త  - శ్రీ (లక్ష్మీదేవి)కి భర్త (పెనిమిటి), విష్ణువు :-
[10.1-876-మ.]

5129} శ్రీభవనుడు  - సంపదలకు నిలయమైన వాడు, కాలయవనుడు :-
[10.1-1639-ఉ.]

5130} శ్రీమన్నాముడు - శ్రీమత్ (మంగళవంతమైన) నామ (పేరు గలవాడు), రాముడు :-
[8-1-క.]

5131} శ్రీమన్నారాయణదేవుడు - అత్యంత శుభకరమైన నారాయణు డగు దేవుడు :-
[1-63-వ.]

5132} శ్రీమన్నారాయణుడు  - శ్రీమత్ (అణిమాది సంపదలతో కూడినవాడు) ఐన నారాయణుడు (విష్ణువు) :-
[5.2-164-వ., 6-258-వ., 6-507-వ., 10.1-19-క.]

5133} శ్రీమహితోన్నతుడు  - శ్రీ (శుభకరమైన) మహిత (గొప్ప) ఉన్నతుడు (ఉన్నతమైనవాడు), పరశురాముడు :-
[6-305-క.]

5134} శ్రీమహిళ  - శ్రీ (సంపదలకు) మహిళ (దేవి), లక్ష్మిదేవి :-
[7-359-ఉ.]

5135} శ్రీమహిళాధిపుడు  - శ్రీ (లక్ష్మీ) మహిళ (దేవి) యొక్క అధిపుడు (భర్త), విష్ణువు :-
[3-505-ఉ.]

5136} శ్రీయుతాకారుడు  - సౌందర్య సంపదలతో కూడి ఉన్న వాడు, కృష్ణుడు :-
[10.1-1704.1-తే.]

5137} శ్రీయుతుడు  - శ్రీ (లక్ష్మీదేవి, సంపదల)తో యుతుడు (కూడి యుండువాడు), విష్ణువు :-
[9-420-క., 10.1-1243-క.]

5138} శ్రీరమణీమనోవిభుడు  - శ్రీరమణీ (లక్ష్మీదేవి) మనసునకు విభుడు, విష్ణువు :-
[3-109-ఉ.]

5139} శ్రీరమణీరమణుడు  - శ్రీరమణీ (లక్ష్మీదేవి) రమణుడు (భర్త), విష్ణువు :-
[6-38-క., 12-47-క.]

5140} శ్రీరమణీశ్వరుడు  - శ్రీ (లక్ష్మీ) రమణి (దేవి) యొక్క ఈశ్వరుడు (భర్త), విష్ణువు :-
[3-154-క., 3-503-క.]

5141} శ్రీరమణుడు  - శ్రీ (లక్ష్మీదేవి) రమణుడు (భర్త), విష్ణువు :-
[3-142-క.]

5142} శ్రీరమాధిపుడు  - లక్ష్మీవల్లభుడు, విష్ణువు :-
[11-90-క.]

5143} శ్రీరమేశుడు  - శ్రీరమ (శ్రీకరమగు లక్ష్మీదేవి)కి ఈశుడు (భర్త), విష్ణువు :-
[5.2-112.1-ఆ.]

5144} శ్రీరాజితుడు  - శ్రీ (రాచరికము, బుద్ధి)చేత రాజితుడు (ప్రకాశించెడి వాడు), రాముడు :-
[9-1-క.]

5145} శ్రీలలనేశుడు  - శ్రీకరమైన స్త్రీ రుక్మిణికి భర్త, కృష్ణుడు :-
[1-402-క., 1-408-క., 3-520-క.]

5146} శ్రీవత్సము  - విష్ణుమూర్తి వక్షస్థలముపైనుండెడి పుట్టుమచ్చ :-
[5.1-43.1-తే., 6-219.1-ఆ.]

5147} శ్రీవత్సలాంఛనుడు  - శ్రీవత్సము అనెడి పుట్టుమచ్చ గలవాడు, విష్ణువు :-
[6-217-వ.]

5148} శ్రీవత్సాంకితకౌస్తుభస్ఫురితలక్ష్మీచారువక్షస్థలశ్రీవిభ్రాజితుడు  - శ్రీవత్స మనెడి పుట్టుమచ్చ అంకిత (గుర్తుగాగలిగి) కౌస్తుభమణిచే స్ఫురిత (ప్రకాశిస్తున్న) లక్ష్మీదేవితోకూడిన చారు (అందమైన) వక్షస్థలసంపదచే విభ్రాజితుడు (విశేషముగా ప్రకాశించుచున్నవాడు), హరి :-
[6-1-శా.]

5149} శ్రీవనితాధిపుడు  - లక్ష్మీ ( శ్రీవనిత) పతి (అధిపుడు), విష్ణువు :-
[3-192-క.]

5150} శ్రీవరుడు  - శ్రీ (లక్ష్మీదేవి) యొక్క వరుడు (భర్త), హరి :-
[6-74-క.]

5151} శ్రీవల్లభుడు  - శ్రీ (లక్ష్మీదేవి) వల్లభుడు (భర్త), విష్ణువు :-
[1-275-క., 7-122.1-తే., 8-206-ఆ., 9-127-మ., 10.1-940-క., 10.1-1295-క.]

5152} శ్రీవిభుడు  - శ్రీ (లక్ష్మీదేవి, సంపదలు) కి విభుడు, విష్ణువు :-
[3-791-క.]

5153} శ్రీవిలసితధరణీతనయావదనసరోజవాసరాధిప  - శ్రీ (లక్ష్మీదేవివలె, శుభకరమైన) విలసిత (ప్రకాశముగల) ధరణీ (భూదేవి యొక్క) తనయా (పుత్రిక, సీతాదేవి) వదన (మోము అనెడి) సరోజ (పద్మమునకు) వాసరాధిప (వాసరములకు (పగళ్ళకు) అధిపతి, సూర్యుడా), శ్రీరామ :-
[4-1-క.]

5154} శ్రీశ  - శ్రీ (లక్ష్మి) ఈశ (పతి), విష్ణువు. :-
[8-727-క.]

5155} శ్రీహరి  - శోభనకరమైన హరి, విష్ణువు :-
[3-447.1-తే.]

5156} శ్రుతకీర్తి  - కృష్ణుని మేనత్త, వసుదేవుని చెలియలు. కేకయరాజైన ధృష్టకేతుని భార్య. ఈమె కొడుకులు ప్రతర్దనాదులు అయిదుగురు. :-
[10.2-145-మ.]

5157} శ్రుతధరుడు  - శ్రుతులను (వేదములను, వినుటను) ధరించినవాడు :-
[4-768-వ., 4-768-వ.]

5158} శ్రుతము  - వినబడినది, శాస్త్రము :-
[4-28-వ.]

5159} శ్రుతి - శ్రు. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. :-
[10.2-1150-క.]

5160} శ్రుతినితంబినీసీమంతవీధి - వేదములనెడి స్త్రీల పాపిట ప్రదేశములు, ఉపనిషత్తులు :-
[10.1-1084-వ.]

5161} శ్రుతివధూసీమంతవీధులు  - శ్రుతి (వేదములు అనెడి) వధూ (స్త్రీ యొక్క) సీమంత (పాపిట) వీధులు (ప్రదేశములు), ఉపనిషత్తులు :-
[10.1-1031.1-ఆ.]

5162} శ్రేష్ఠము - శ్రేష్ఠతరము శ్రేష్ఠతమము :-
[4-26-వ.]

5163} శ్రోతలు  - (చదువులను) వినెడివారు, చదువుకొనువారు :-
[7-133-వ.]

5164} శ్వపచుడు  - కుక్క మాంసము తినువారు, అపరిశుభ్రులు :-
[3-556-చ., 3-1037-క., 7-351-మ.]

5165} శ్వఫల్కతనూభవుడు  - చంద్రవంశపు శ్వఫల్కుని కొడుకు, అక్రూరుడు :-
[10.2-844-చ.]

5166} శ్వేతద్వీపపతి  - శ్వేతద్వీపవాసిని (లక్ష్మీదేవి) పతి (భర్త), విష్ణువు :-
[10.1-236-వ.]