పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (పుణ్య - ప్లవంగము)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


3216} పుణ్యజనానురాగసంధాత  - పుణ్యజన (పుణ్యాత్ము లైన మానవులకు, దేవతలకు) అనురాగ (ప్రేమను) సంధాత (కలిగించెడివాడు), బ్రహ్మ :-
[6-278-ఉ.]

3217} పుణ్యయోగిజనభావవిజేత  - పుణ్య (పావనమైన) యోగి జనముల భావ (హృదయములను) విజేత (జయించినవాడు), బ్రహ్మ :-
[6-278-ఉ.]

3218} పుణ్యరక్షానుసారుడు  - పుణ్యాత్ములను కాపాడెడివాడు, శ్రీరాముడు :-
[8-744-మాలి.]

3219} పుణ్యవిచారుడు  - ధర్మవిచారము కలవాడు, శ్రీరాముడు. :-
[10.2-1341-క.]

3220} పుణ్యవిస్పారుడు  - పుణ్యములకు విస్పారుడు (అధికముగా కలవాడు), విష్ణువు :-
[6-126-ఉ.]

3221} పుణ్యశ్రవణకీర్తనుడు  - పుణ్యవంతమై వినదగ్గ కీర్తనలు కలవాడు, కృష్ణుడు :-
[4-468-వ.]

3222} పుణ్యశ్లోకుడు  - పుణ్యవంతులచే శ్లోకుడు (కీర్తింపబడువాడు), విష్ణువు :-
[1-102.1-ఆ., 8-21-క.]

3223} పుణ్యాకరుడు  - పుణ్యములకు ఆకరుడు (నివాసమైనవాడ), శ్రీకృష్ణ :-
[5.1-181-మ.]

3224} పుణ్యాత్మకుడు  - పరిశుద్ధమైన మనసు కలవాడు, విష్ణువు. :-
[10.1-995-మ.]

3225} పుణ్యాహవాచనము  - దైవాది కర్మ ప్రారంభమున మంగళార్థము చేయు కర్మ :-
[10.1-891-వ.]

3226} పుణ్యుడు  - పుణ్యతరుడు పుణ్యతముడు :-
[3-487-క., 3-801.1-తే., 3-962-క., 3-969.1-తే.]

3227} పుణ్యుడు  - పుణ్యమే తానైనవాడు, విష్ణువు :-
[4-702.1-తే., 9-115-శా.]

3228} పుత్రకామేష్టి  - పుత్రుడు కామ (కావలెనని కోరి చేసెడి) ఇష్టి (యజ్ఞము) :-
[4-399-తే.]

3229} పుత్రశోకము  - పుత్రులు పోయిన దుఃఖము :-
[10.2-1155-క.]

3230} పుత్రికాధర్మము  - ఈ పుత్రిక యందు జన్మించువాడు నా పుత్రుడు కాగలడు అను నియమముతో కన్యాదానము చేయుట, పుత్రుడు పుట్టాక మాతామహునకు దత్తత ఇవ్వవలెనను నియమముతో కన్యాదానము చేయుట. :-
[4-3.1-తే.]

3231} పురంజనుడు  - పురమున (దేహమున) వసించెడివాడు (ఉండెడివాడు), జీవుడు, ఆత్మ :-
[4-742.1-తే., 4-756-వ., 4-763-క., 4-768-వ., 4-821-వ.]

3232} పురందరసుందరి  - పురందరుడు (ఇంద్రుడు) యొక్క సుందరి (భార్య), శచీదేవి, తత్పురుషసమాసము :-
[3-1047-వ.]

3233} పురందరసుతుడు  - పురందరుని (ఇంద్రుని) సుతుడు (పుత్రుడు), అర్జునుడు. :-
[10.2-1165.1-తే.]

3234} పురందరుడు  - శత్రు పురములను నశింపజేయు వాడు, వ్యు. పూర్ దౄ(ణిచ్) ఖచ్ ముమ్ నిపా, ఇంద్రుడు :-
[4-167-చ., 10.1-953-వ., 12-36-మ.]

3235} పురంధ్రి  - గృహమును ధరించునామె, గృహిణి, పుర+ధృ+ఖచ్, పురం గేహం రూపాది గుణసంపన్నం వపుర్వా దధాతి, రూపగుణాది సంపదలచే శరీరమును ధరించునది. స్త్రీ. :-
[10.1-1580-ఉ.]

3236} పురదాహుడు  - త్రిపురములను దహింపజేసినవాడు, శివుడు :-
[4-16-చ.]

3237} పురభంజనుడు  - త్రిపురసంహారుడు, శివుడు :-
[10.1-275-క.]

3238} పురము  - 1. దేహము, 2. పట్టణము :-
[4-819-వ.]

3239} పురవైరి  - త్రిపురాసురుని వైరి, శంకరుడు :-
[4-41-తే., 9-22.1-తే.]

3240} పురసూదనుడు  - పురములను కూల్చినవాడు, శంకరుడు :-
[4-8-క.]

3241} పురహరుడు  - త్రిపురములను కూల్చినవాడు, శివుడు :-
[4-159-క., 5.2-38.1-ఆ., 5.2-117-చ., 10.2-529-క., 10.2-1262-క.]

3242} పురాంతకుడు  - పురములను నాశముచేసిన వాడు, శివుడు :-
[4-23-ఉ., 10.2-318-వ.]

3243} పురాణదశలక్షణములు  - సర్గాది, 1సర్గము 2విసర్గము 3స్థానము 4పోషణము 5ఊతులు 6మన్వంతరములు 7ఈశానుకథలు 8నిరోధము 9ముక్తి 10ఆశ్రయము :-
[12-30-వ.]

3244} పురాణపంచలక్షణములు  - సర్గాది, 1సర్గము 2ప్రతిసర్గము 3వంశము 4మన్వంతరము 5వంశానుచరితము :-
[12-30-వ.]

3245} పురాణపురుషుడు  - ఆది పురుషుడు, పురాణములు స్తుతించు పురుషుడు, విష్ణువు, వ్యు. పురాణ+పురుష, పురాణైః ఉపస్తుత్యః పురుషః :-
[3-1000-వ., 6-192-వ., 6-258-వ., 10.1-567.1-ఆ., 10.2-67-వ.]

3246} పురాణపూరుషుడు  - ఆది పురుషుడు, పురాణములు స్తుతించు పురుషుడు, విష్ణువు, :-
[6-422-ఉ., 6-438-చ.]

3247} పురాణము  - పురాతన చరిత్రము, 1సర్గ (సృష్టి) 2ప్రతిసర్గ (ప్రతిసృష్టి) 3(మను)వంశము 4మన్వంతరము 5వంశానుచరితము అను పంచలక్షణములు కలవి ఇవి 18 :-
[2-222-వ., 3-388-వ., 8-629.1-తే., 11-107-వ.]

3248} పురాణయోగిసంసేవితపాదపద్ముడు  - పురాణ (పూర్వపు) యోగి (యోగులచే) సంసేవిత (చక్కగాసేవింపబడిన) పాద (పాదములు యనెడి) పద్ముడు (పద్మములు గలవాడు), విష్ణువు :-
[7-459-ఉ.]

3249} పురాణయోగులు  - సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహర్షులు :-
[10.1-128-మత్త.]

3250} పురాణలక్షణములు  - పురాణదశలక్షణములు సర్గాది, 1సర్గము 2విసర్గము 3స్థానము 4పోషణము 5ఊతులు 6మన్వంతరములు 7ఈశానుకథలు 8నిరోధము 9ముక్తి 10ఆశ్రయము; పురాణపంచలక్షణములు సర్గాది, 1సర్గము 2ప్రతిసర్గము 3వంశము 4మన్వంతరము 5వంశానుచరితము :-
[1-21-మ.]

3251} పురాతనమౌని  - బహుపాత కాలపు ముని, నారాయణఋషి ఐనవాడు, విష్ణువు :-
[10.2-607-క.]

3252} పురాపురుషుడు  - పురాణపురుషుడు, విష్ణువు :-
[4-702.1-తే.]

3253} పురారాతి  - త్రిపురములకి ఆరాతి (శత్రువు), శంకరుడు :-
[9-230-వ.]

3254} పురారి  - త్రిపురాసురులకు శత్రువు, శివుడు :-
[10.2-311-తే., 10.2-530-క., 10.2-1255-చ.]

3255} పురుషభూషణుడు  - పురుషులలో భూషణుడు (శ్రేష్ఠుడు), విష్ణువు :-
[10.1-994-ఉ.]

3256} పురుషవరేణ్యుడు  - పురుషోత్తముడు, కృష్ణుడు :-
[10.2-1185-చ.]

3257} పురుషశ్రేష్ఠుడు  - పురుషులలో శ్రేష్ఠుడు, విష్ణువు :-
[1-271-మ., 3-835-మ.]

3258} పురుషసూక్తము  - పురుష (పురుషోత్తముని విరాడ్రూపము తెలిపెడి) సూక్తము (సు(మంచి) ఉక్తము (మాటలు), మంత్రములు), మరింకొకవిధముగ ఒక విశిష్ఠమైన విష్ణు స్తోత్రము, పురుష (శాస్త్రమును అనుసరించి, పరమపురుషుని గురించి) సూక్తము, పంచసూక్తములు 1నారాయణసూక్తము 2శ్రీసూక్తము 3భూసూక్తము 4నీలసూక్తము 5 పురుషసూక్తము :-
[10.1-14.1-తే., 10.2-440-తే.]

3259} పురుషాధముడు  - మానవులలో అధముడు, అల్పుడు :-
[10.1-1636-ఉ.]

3260} పురుషాధీశుడు  - పురుషులకు అధీశుడు (ప్రభువు), విష్ణువు :-
[3-306-మ., 4-733-క.]

3261} పురుషార్థములు  - కామాది, 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు యైన పురుష ప్రయోజనములు, పురుషులు సాధించదగిన ప్రయోజనములు, కర్తవ్యములు :-
[2-89-వ., 4-295-వ., 4-626-వ., 4-916-వ., 5.1-89-వ.]

3262} పురుషుడు  - 1.శరీరములు అను పురములలో నుండు వాడు, 2.మానవుడు, 3.లోకైకపురుషుడు, 4.విష్ణువు, వ్యుత్పత్తి. పురీ శరీరేశేత ఇతి పురుషః, సకల జీవశరీరముల యందు వసించువాడు పురుషుడు :-
[1-187-క., 3-259-తే., 7-453-వ., 10.1-942-ఆ., 11-77-వ.]

3263} పురుషుడు  - 1.శరీరములు అను పురములలో నుండు వాడు, 2.మానవుడు, 3.లోకైకపురుషుడు, 4.విష్ణువు, వ్యుత్పత్తి. పురీ శరీరేశేత ఇతి పురుషః, సకల జీవశరీరముల యందు వసించువాడు పురుషుడు 5. జీవసాక్షియైన బ్రహ్మ :-
[10.1-8-ఆ.]

3264} పురుషోత్తముడు  - పురుషులలో ఉత్తముడు, విష్ణువు :-
[2-238-వ., 3-151-క., 3-200-క., 3-271-వ., 3-365-క., 3-373-మ., 3-407.1-తే., 3-544-వ., 3-625-క., 3-1024-క., 4-963.1-తే., 5.1-95.1-తే., 6-192-వ., 7-169.1-తే., 7-371-వ., 8-163-క., 10.2-115-ఉ., 10.2-1031-వ.]

3265} పురుహూతుడు  - యజ్ఞములందు ప్రచురమైన పిలుపు కలవాడు, పురువు అనెడి రక్కసుని చంపినవాడు, ఇంద్రుడు :-
[8-561-క., 10.1-887-వ.]

3266} పురోడాశము  - యాగార్థమైన అపూపము (పిండితో చేసిన పిడచలు లేదా ముద్దలు) :-
[4-162-వ.]

3267} పురోహితుడు  - పుర (ఊరు) + హితుడు (కోరువాడు), శుభాశుభ వైదిక కర్మములను చేయించుచు మేలుకీడులను తెలుపు ఆచార్యుడు, ఒజ్జ :-
[10.2-527.1-తే.]

3268} పులుకడిగిన  - స్వచ్చమైన, పులు (ఆమ్లముతో) (రత్నమాలిన్యము) కడిగిన ముత్యాలు ఆదులు ఉండునంత స్వచ్ఛమైన :-
[10.1-1101-వ., 10.2-676-క.]

3269} పులోముడు  - ఒక దైత్యుడు, ఇంద్రుని మామ (భార్య శచీదేవి తండ్రి) :-
[7-29-వ.]

3270} పుళిందులు  - పుళింద దేశపు, ఒక అడవిజాతి మానవులు, గిరిజనులు :-
[3-38-క.]

3271} పువ్విలుతుడు  - పుష్పములు బాణములుగాఁగల ధనుస్సు కలవాడు, మన్మథుడు :-
[9-417-మ.]

3272} పువ్వుటంపఱజోదు  - పూల బాణముల వీరుడు, మన్మథుడు :-
[9-388-త.]

3273} పువ్వుబోడి  - పూల వంటి సుకుమారమైన స్త్రీ, అందగత్తె :-
[9-175-ఆ.]

3274} పువ్వుబోణి  - పూల వంటి సుకుమారమైన స్త్రీ, అందగత్తె :-
[6-255.1-తే.]

3275} పుష్కరనాభుడు  - పుష్కర (తామర) నాబిన కలవాడు, విష్ణువు :-
[4-371-వ.]

3276} పుష్కరము  - 1. మెట్టతామర, 2. ఒక తీర్థము, 3. పండ్రెండేండ్లకొకసారి వచ్చు జీవనదుల పండుగ. :-
[5.2-69.1-ఆ.]

3277} పుష్కరవైరి  - తామరల శత్రువు, చంద్రుడు :-
[10.1-1321-వ.]

3278} పుష్కరిణి  - తామర కొలను, కోనేఱు, ఆడ ఏనుగు :-
[4-390-వ.]

3279} పుష్టి  - బలము, సమృద్ధి :-
[4-28-వ.]

3280} పుష్పంధయము  - పూలలోని మధువును గ్రోలునది, తుమ్మెద :-
[10.1-1466-ఉ., 10.1-1697-ఉ., 10.2-153.1-తే.]

3281} పుష్పసాయకుడు  - పుష్పముల బాణములు కల వాడు, మన్మథుడు :-
[3-451.1-తే.]

3282} పుష్పాంజలి  - పుష్పములు గల దోసిలి జోడించి చేయు నమస్కారము :-
[4-17-వ.]

3283} పుష్పార్ణుడు  - పుష్పముల అర్ణుడు (సముద్రమైనవాడు). వత్సరుని కొడుకు :-
[4-390-వ.]

3284} పుష్ఫాస్త్రుడు  - పుష్పములు అస్త్రములుగ కలవాడు, మన్మథుడు :-
[3-732-క.]

3285} పూబోడి  - పూలవంటి సౌకుమార్యము కలామె, స్త్రీ :-
[4-791-మ., 10.1-372.1-ఆ., 10.2-183.1-తే.]

3286} పూయోదము  - చీము నెత్తురు మొదలగువాని యందు శిక్షించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

3287} పూరకము  - ప్రాణవాయువు అంతర్గతముగ నిలుపుట, ప్రాణాయామ ప్రక్రియ :-
[3-921-వ.]

3288} పూరుడు  - తండ్రి యైన యయాతి జరాభారమును ధరించిన వాడు, తరువాతి తరంవారు కురువు, కౌరవులు, పాండవులు, పరీక్షిత్తు :-
[3-11-చ., 4-812.1-తే.]

3289} పూరుషుడు  - కారణభూతుడు, విష్ణువు :-
[1-60-త.]

3290} పూర్ణకుక్షి  - నిండిన కడుపు కల వాడు, తృప్తుడు :-
[10.1-570-త.]

3291} పూర్ణిమ  - చంద్రుని పూర్ణ బింబము కల తిథి, పున్నమి :-
[4-7.1-తే., 6-507-వ.]

3292} పూర్ణుడు  - విశ్వమంతా నిండియున్నవాడు, పరిపూర్ణమైనవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

3293} పూర్ణేందుబింబానన  - పూర్ణ (నిండు) ఇందు (చంద్రుని) బింబ (బింబమువంటి) ఆనన (మోము కలామె), స్త్రీ :-
[10.1-827-శా.]

3294} పూర్ణేందుముఖి  - నిండు చంద్రునివంటి మోము కలామె, స్త్రీ. :-
[9-613-క.]

3295} పూర్తములు  - వాపీ (నడబావి) కూప (బావి) తటాక (చెరువు) ఆరామ (ఉపవనము) దేవాలయ (గుడి) నిర్మాణములు మరియు అన్నదానము (ధర్మసత్రము) :-
[2-222-వ., 10.2-465-వ.]

3296} పూర్వచిత్తి  - ముందు చిత్తము ఆలోచన కలామె, ఒక అప్సరస :-
[5.1-26-వ.]

3297} పూర్వదిగ్గజము  - తూర్పు దిక్కు నందలి ఏనుగు, ఐరావతము :-
[10.1-1615-వ.]

3298} పూవింటిజోదు  - పూల ధనుస్సు యోధుడు, ప్రద్యుమ్నుడు, మన్మథుడు :-
[10.2-23-క.]

3299} పృథివీతలేశుడు  - పృథివీ తలము (భూమి)కి ఈశుడు, రాజు :-
[4-657.1-తే.]

3300} పృథివీపతి  - భూమికి భర్త, రాజు :-
[9-491-క.]

3301} పృథివీవరశేఖర  - పృథివి (భూమి)కి వరుడు రాజు వారిలో శేఖరుడు (శ్రేష్ఠుడు), మహారాజు :-
[7-413-ఉ.]

3302} పృథివ్యాది  - (అ) పంచభూతములు, 1పృథివి 2అప్పు 3తేజస్సు 4వాయువు 5ఆకాశము, (ఆ) సత్త్వములు, 1పృథివి 2అప్పు 3తేజము 4వాయువు 5ఆకాశము 6కాలము 7దిక్కు 8ఆత్మ 9మనస్సు :-
[3-344-వ., 7-266.1-తే., 11-52-వ.]

3303} పృథివ్యాది, పంచభూతములు  - 1.భూమి 2.జలము 3తేజస్సు 4.వాయువు 5,ఆకాశము "పృథివ్యాపస్తేజో వాయురాకాశమితి భూతాని"[గౌతమన్యాయసూత్రములు 1 1 13] :-
[12-24-వ.]

3304} పృథు  - పృథుచక్రవర్తి :-
[3-44-ఉ.]

3305} పృథులాత్ముడు  - పృథుల (విరివియైన, మహా) ఆత్ముడు, విష్ణువు :-
[8-503.1-తే.]

3306} పృథ్విరూపకుడు  - పృథ్వి (పెద్ద, బృహతి) రూపము కలవాడు, ఉరుగాయుడు, విష్ణువు :-
[4-702.1-తే.]

3307} పృథ్వీపతి  - పృథ్వి (భూమి)కి పతి (ప్రభువు), రాజు :-
[8-18.1-ఆ.]

3308} పృథ్వీశ్వరుడు  - పృథివికి ఈశ్వరుడు, రాజు. :-
[1-380-మ.]

3309} పృశ్నిగర్భుడు - అన్నం, నీరు, వేదం మొదలైన సమస్తం తన గర్భంలోనే ఉంటాయి కనుక దేవుడే పృశ్నిగర్భుడు. పృశ్ని అంటే కిరణం. పారమార్థిక పదకోశం 2010 (పొత్తూరి వేంకటేశ్వరరావు) :-
[10.1-131-వ.]

3310} పృశ్నిగర్భుడు  - పృశ్ని (అదితి పూర్వజన్మ నామము) పుత్రుడు, విష్ణువు, :-
[8-503.1-తే., 10.1-236-వ., 11-77-వ.]

3311} పెందెరువు  - పెంపు (ఉత్కృష్టమైన) తెరువు (దారి), పరమపదము, మోక్షము :-
[10.1-134-క.]

3312} పెంద్రోవ  - పెన్ (గొప్ప) త్రోవ (స్థితి), మోక్షము, పరమపదము :-
[10.1-957-ఉ.]

3313} పెటపెట  - పళ్ళు కొరుకుట యందలి ధన్వనుకరణ :-
[10.2-300-వ.]

3314} పెరుగు  - పాలు తోడుకొనుటచే ఏర్పడును, నీరు కలిపిన మజ్జిక అగును, చిలికిన వెన్న కలుగును. :-
[10.1-900-మ.]

3315} పెలుకుఱ  - భయముచేత అవయవములు స్వాధీనము తప్పుట, మిక్కిలి భయపడుట :-
[10.2-1290-చ.]

3316} పైతామహము  - తాతలకు సంబంధించినది, అనువంశికము :-
[1-228-వ.]

3317} పొంతనము  - మైత్రి కలిగించునది, గ్రహమైత్రి :-
[9-363-క.]

3318} పొట్టు  - గింజల యొక్క పై పొర :-
[5.1-129-వ.]

3319} పొడసూపు  - పొడవు చూపు, కనబడు :-
[11-124-చ.]

3320} పొత్తికలు  - పురుటికందులు, బొమ్మలు మొదలగువాని కొరకు వాడు మెత్తని గుడ్డలు, పొత్తిళ్ళు :-
[1-366.1-ఆ.]

3321} పొత్తిళ్ళు  - 1. మెత్తని సన్నని పాతవస్త్రములు; 2. పురిటికందులు, బొమ్మలు ఉంచు మెత్తటి గుడ్డల దొంతరలు, పొత్తికలు :-
[2-175-క.]

3322} పొలియజేయు  - చంపు, రుద్ర రూపమున సర్వమును తమోగుణముతో లయము చేయుట :-
[10.1-1180.1-ఆ.]

3323} పొల్తు  - పొలతి, స్త్రీ :-
[10.2-1068-చ.]

3324} పోకలు  - పంచకృత్యములు (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహములు) లోని వర్తించుట :-
[10.1-1236-దం.]

3325} పోరామి  - రాకపోకలు కొనసాగించడం, స్నేహము :-
[8-182-వ.]

3326} పౌండ్రకవాసుదేవుడు  - పౌండ్రక దేశ అధిపతి తనే వాసుదేవుని అసలు అవతారమని విఱ్ఱవీగినవాడు :-
[2-190-చ.]

3327} పౌగండము  - 5 నుండి 10 సంవత్సరముల బాల్యము :-
[10.1-1392.1-తే.]

3328} పౌత్రుడు  - పుత్రుని పుత్రుడు, మనవడు. :-
[3-491-వ.]

3329} పౌరంధ్రి  - పురందరుని (ఇంద్రుని) కొడుకు, అర్జునుడు :-
[10.2-1304-ఉ.]

3330} పౌరవముఖ్యుడు  - పురువంశస్థులలో ముఖ్యుడు, పరీక్షిత్తు. :-
[10.2-196-క.]

3331} పౌరవేంద్ర  - పురువంశస్థులలోశ్రేష్ఠుడ, పరీక్షిన్మహారాజు :-
[2-29.1-ఆ.]

3332} పౌరాణికుడు  - పురాణములు చెప్పువాడు, సూతుడు :-
[1-391-వ., 12-45-వ.]

3333} పౌరులు  - పురమున నుండెడివారు :-
[4-768-వ.]

3334} పౌలోమి  - పులోముని పుత్రిక, ఇంద్రుని భార్య, శచీదేవి :-
[6-507-వ., 8-487-మ., 10.1-1306.1-తే.]

3335} పౌలోములు  - మారీచునకు పులోమ యందు కలిగిన 60,00 దానవ సంతతి :-
[8-182-వ.]

3336} ప్రకటభవ్యభుజాభుజగేంద్రుడు  - ప్రకట (ప్రసిద్ధమైన) భవ్య (శుభమైన) భుజ (భుజము లనెడి) భుజగేంద్రుడు (గొప్ప సర్పములు గలవాడు), రాముడు :-
[4-974-చ.]

3337} ప్రకల్పితశయ్యాఫణి  - ప్రకల్పిత (చక్కగా ఏర్పరుపబడిన) శయ్య (పడక యైన) ఫణి (ఆదిశేషుడు గలవాడు), విష్ణువు :-
[6-34-క.]

3338} ప్రకాశత్వము  - శబ్ద స్పర్శాది వ్యాపారములందు ప్రవర్తించునట్లు చేయుట :-
[10.1-683-వ.]

3339} ప్రకృతి  - 1.చావు పుట్టుకల చక్రము లక్షణముగ కలది, 2. స్వభావముచేతనే, 3. సప్తాంగములు (1స్వామి 2మంత్రులు 3మిత్రులు 4కోశము 5రాష్ట్రము 6దుర్గము 7సైన్యము) :-
[1-381-వ., 4-457-వ.]

3340} ప్రకృతికంటెఁబరుడు  - పకృతికంటెను ఇంతరమైనవాడు, విష్ణువు :-
[3-874-వ.]

3341} ప్రకృతికారణవాదులు  - అవ్యక్త నామక ప్రకృతియే మూల కారణభూతము అనెడివారు :-
[10.2-1220-వ.]

3342} ప్రకృతిగుణములు  - త్రిగుణ సమ్మేళనము వలన పుట్టిన వ్యక్తిగతమైన ప్రత్యేక స్వభావము నందలి గుణములు :-
[4-355-వ.]

3343} ప్రకృతిచతుర్వింశతితత్త్వములు  - పంచ భూతములు (1పృథివి 2జలము 3అగ్ని 4వాయువు 5ఆకాశము), పంచ తన్మాత్రలు (6శబ్దము 7స్పర్శము 8రూపము 9రుచి 10వాసన), పంచ జ్ఞానేంద్రియములు (11చర్మము 12కన్ను 13ముక్కు 14చెవి 15నాలుక), పంచ కర్మేంద్రియములు (16వాక్కు 17చేతులు 18కాళ్ళు 19గుదము 20ఉపస్థు), అంతఃకరణ చతుష్టయము (21మనస్సు 22బుద్ధి 23చిత్తము 24అహంకారము) :-
[3-891-వ.]

3344} ప్రకృతులు  - 1మాయ 2మహత్తు 3అహంకారము మరియు పంచతన్మాత్రలు ఐదు (5) :-
[7-237-వ.]

3345} ప్రక్షీణులు  - మిక్కిలి క్షీణించినవారు (ఆపదలవలన), ఆపన్నులు :-
[8-698-క.]

3346} ప్రఘాణము  - తలవాకిటికి పక్కన ఉండెడి చిన్నగది, కొట్టుగది :-
[10.1-1597-శా.]

3347} ప్రచండము - ప్రచండతరము ప్రచండతమము :-
[10.1-470-మ.]

3348} ప్రచండము  - మిక్కిలి తీవ్రమైనది, భయంకరమైనది :-
[10.1-1558-వ.]

3349} ప్రచేతసులు  - ప్ర (గొప్ప) చేతస్సు (చైతన్యము) కలవారు :-
[4-379-వ., 4-385.1-తే., 4-684-వ.]

3350} ప్రజాగరుడు  - ప్రజల యొక్క మగతనము యైనవాడు :-
[4-810-వ.]

3351} ప్రజాపతి  - జీవుల ఉత్పత్తికి అధిపతి, ప్రజ (సంతానసృష్టికి) పతి, బ్రహ్మ, వీరు 9మంది, నవబ్రహ్మలు :-
[2-86-వ., 2-89-వ., 2-105-ఉ., 2-117.1-తే., 2-119-చ., 8-480-వ.]

3352} ప్రజాపతిపతి  - ప్రజాపతులందరికిని పతి (ప్రభువు), విష్ణువు :-
[6-197.1-తే.]

3353} ప్రజ్ఞాలభ్యుడు  - బుద్ధిబలముచేత అందని వాడు, విష్ణువు :-
[7-148-శా.]

3354} ప్రజ్వారుడు  - పెద్ద జ్వరమైనవాడు, సంకేతము :-
[4-817-వ., 4-820-క.]

3355} ప్రణతవత్సలుడు  - ప్రణత (కొలిచెడివారికి) వత్సలుడు (వాత్సల్యము చూపువాడు), విష్ణువు :-
[8-483.1-తే.]

3356} ప్రణతామ్నాయుడు  - నమస్కరించిన వేదములు కలవాడు, కృష్ణుడు :-
[10.2-240-మ.]

3357} ప్రతిపక్షవిపక్షదూరుడు  - ప్రతిపక్ష (శత్రుపక్షము) యందును విపక్ష (వైరము) విదూర (లేనివాడు), విష్ణువు :-
[8-92-ఉ.]

3358} ప్రతిలోమకులములు  - అశాస్త్రీయమైన వివాహములవలన పుట్టిన వంశములు, సమాన లేదా నిమ్న వర్ణమునుండి భార్యను పొందుట శాస్త్ర ధర్మము దానికి వ్యతిరేకము ప్రతిలోమము :-
[3-255.1-తే.]

3359} ప్రతిషిద్ధము  - అదికూడదు అని చెప్పెడిది, నిషిద్ధము :-
[5.2-132-వ.]

3360} ప్రతోషుడు  - 1. సంతతివలన తుష్టి కలవాడు, 2. మిక్కిలి సంతోషము కలవాడు :-
[4-6-వ.]

3361} ప్రత్యక్షము  - ప్రతి (ఎదురుగ) అక్షము (కంటికి) ఐ ఉన్నది, నమ్మకమైన ప్రమాణము :-
[3-294.1-తే.]

3362} ప్రత్యక్షాదిప్రమాణములు(8)  - 1ప్రత్యక్షము 2అనుమానము 3ఉపమానము 4శాబ్దము 5అర్థాపత్తి 6అనుపలబ్ధి 7సంభవము 8ఐతిహ్యము. వీనిలో మొదటి 4 తార్కికులమతము 6వేదాంతులమతము 8పౌరాణికుల మతము ప్రకారము ఎంచబడును :-
[10.1-554-క.]

3363} ప్రత్యగాత్ముడు  - ఎదురుగకనబడువాడు, ప్రత్యక్ (ప్రత్యక్షముగ) ఆత్ముడు (ఆత్మ), విష్ణువు :-
[4-359.1-తే., 6-343-వ.]

3364} ప్రత్యయములు  - అనుభవమునకు వచ్చునవి :-
[6-343-వ.]

3365} ప్రత్యాలీఢపాదము  - విలుకాడు ఎడమ కాలు ముందరికి చాచి నిలుచు స్థితి :-
[10.2-179-మ.]

3366} ప్రదక్షిణ  - కుడివైపుగా (సవ్యముగ) చుట్టును తిరుగుట :-
[4-111-చ., 10.1-894-వ.]

3367} ప్రదరాసనము  - ప్రదరము (బాణము)నకు ఆసనము, ధనస్సు :-
[4-462-చ.]

3368} ప్రదోష  - సూర్యాస్తమయము తరువాతి కాలము. మునిమాపు, రాత్రి ప్రారంభకాలము :-
[4-390-వ.]

3369} ప్రద్యుమ్నుడు  - చతుర్వ్యూహములలోని ప్రద్యుమ్నుండు, అహంకారము సంజ్ఞగా కలవాడు, ప్రకర్షణేద్యుమ్నంద్రవిణం అన్యేతి ప్రద్యుమ్నః (వ్యుత్పత్తి), ప్రసిద్ధముగ ప్రజ్ఞాన మనెడి ధనము కలవాడు, విష్ణువు :-
[4-705-వ., 10.2-4-వ., 11-77-వ.]

3370} ప్రధానపూరుషుడు  - ప్రధాన (ముఖ్యమైన, ఆది) పూరుషుడు (కారణాత్మకమైనవాడు, పురుషము (కారణభూతము) తానైనవాడు), విష్ణువు :-
[7-459-ఉ., 10.1-103-మత్త.]

3371} ప్రధానము  - 1. మూలప్రకృతులు ఇరవైనాలుగు. ఆ పైన ఇరవైయైదోవాడు పురుషుడు, 2. త్రిగుణాత్మకం, అవ్యక్తం, నిత్యం, సదసదాత్మకం అను ప్రకృతి లక్షణములకు ఆధారమైనది, వేదములలో అదితి అనబడును :-
[3-886.1-తే., 3-890-క.]

3372} ప్రప  - చలిపందిరి, పానీయశాలిక :-
[10.1-1597-శా.]

3373} ప్రపంచకములు  - పంచభూతములు పంచతన్మాత్రలు పంచేంద్రియములు మొదలగు పంచకములు :-
[3-297-వ.]

3374} ప్రపంచము  - పంచపంచముల వలన వ్యాపించినది, పంచ (5) పంచములు (1పంచభూతములు 2పంచకర్మేంద్రియములు 3పంచజ్ఞానేంద్రియములు 4పంచతన్మాత్రలు 5పంచవాయువులు)చేత ఏర్పడిన సృష్టి, జగము :-
[2-89-వ., 3-210-క., 3-244-వ., 4-64-వ., 10.1-560.1-తే.]

3375} ప్రపత్తి  - నీవేతప్ప వేరు దిక్కు లేదను భక్తి :-
[11-41-వ.]

3376} ప్రపన్నానీకరక్షామణి  - ప్రపన్న (ప్రపత్తిని [భక్తులు చేయు శరణాగతిని] పొందిన వారి) అనీక (సమూహమును, గుంపును) రక్షా (రక్షించునట్టి) మణి (శ్రేష్ఠుడు), విష్ణువు. :-
[10.1-574-మ.]

3377} ప్రపన్నార్తిహరుడు  - ప్రపన్నుల (శరణుకోరినవారి) ఆర్తిని (బాధలను) హరుడు (నాశనము చేయువాడు), విష్ణువు :-
[3-143-క., 3-722-వ.]

3378} ప్రబోధమాత్రుడు  - జ్ఞానముచే మాత్రమే తెలియబడువాడు, భగవంతుడు :-
[2-207-క.]

3379} ప్రభ  - వెలుగు, పగలు :-
[4-390-వ.]

3380} ప్రభంజనతనయుడు  - ప్రభంజన (వాయుదేవుని) తనయుడు, భీముడు :-
[9-230-వ.]

3381} ప్రభంజననందనుడు  - ప్రభంజన (వాయుదేవుని) నందనుడు, భీముడు :-
[10.2-668-వ.]

3382} ప్రభవిష్ణుడు, ప్రభవిష్ణువు  - అవతరించు శీలము కలవాడు, సృష్టిగా పుట్టుకువచ్చే స్వభావము కలవాడు, విష్ణువు :-
[1-290-చ., 3-148-మ., 10.2-67-వ.]

3383} ప్రభాకరుడు  - ప్రకాశము కలుగజేయువాడు, సూర్యుడు :-
[11-99-వ.]

3384} ప్రభాసము  - మిక్కిలి భాసించునది, ద్వారకాపురికి సమీపమున ఉండు ఒకానొక పుణ్యతీర్థము, :-
[1-389-వ., 10.1-1416-శా.]

3385} ప్రభువు  - ప్రభుత్వము కలవాడు, అధికారి, ఏలిక, సమర్థుడు, విష్ణువు :-
[1-428-వ., 3-373-మ., 10.2-119-మ.]

3386} ప్రమథగణములు  - ప్రమథనము (వధించుట) చేసెడి శివుని భటుల గణములు (సమూహములు) :-
[10.2-402-చ.]

3387} ప్రమద  - సుఖమును ఇచ్చునామె, యౌవ్వనాది మదము గలామె, స్త్రీ :-
[3-729-చ., 4-747-వ., 4-756-వ., 10.1-787-మ., 10.1-1091-మ., 10.1-1458-మ.]

3388} ప్రమదప్రదుడు  - ప్రమద (సంతోషము)ను ప్రదుడు (ఇచ్చెడివాడ), విష్ణువు :-
[4-924-చ.]

3389} ప్రమదారత్నము  - స్త్రీలలో శ్రేష్ఠురాలు, లక్ష్మి :-
[10.1-1461-శా.]

3390} ప్రమదోత్తమ  - ప్ర (మిక్కిలి) మద (మదించిన, మత్తు కలి గుండెడి) ఆమె (స్త్రీ) వారిలో ఉత్తమురాలు, ఉత్తమస్త్రీ, బుద్ధికి సంకేతముగా వాడబడెను. :-
[4-853-వ.]

3391} ప్రమాణములు  - 1 ప్రత్యక్షము 2అనుమానము 3ఉపమానము 4శాబ్దము 6అర్థాపత్తి 7అనుపలబ్ధి 8ఐతిహ్యము, వీనిలో మొదటి నాలుగు (4) తార్కికుల మతమునందు ఆరు (6) వేదాంతుల మతమునందు ఎనిమిది (8) పౌరాణికుల మతమందు చెల్లును :-
[10.2-477-ఆ.]

3392} ప్రమోదము+అందుచున్  - ప్రమోదమందుచున్, ఉకార సంధి. :-
[10.2-1271-చ.]

3393} ప్రయాగ  - త్రివేణీసంగమముగల చోటు :-
[7-451-వ.]

3394} ప్రయాసంబు+కున్  - ప్రయాసంబునకున్, నుగాగమ సంధి :-
[10.2-1254-వ.]

3395} ప్రలంబవైరి  - ప్రలంబాసురిని శత్రువు, బలరాముడు :-
[10.1-760-శా.]

3396} ప్రలంబుడు  - ఒక అసురుడు, ప్ర (మిక్కిలి) లంబుడు (పొడవుగా ఉన్న వాడు), బలరాముని చేతిలో మరణించెను :-
[2-190-చ., 10.1-727-వ.]

3397} ప్రవర్గ్యము  - మహావీతము అగ్నిష్ఠోమాది యాగములకు విభాగములలో ఒకరకమైన యాగము, యాగవిశేషము, సోమయాగమునకు ముందు చేయబడునొక యజ్ఞ క్రతువు, గానమునకు ముందు గాత సంకల్పమునకు సంకేతము :-
[3-425.1-తే., 5.1-42-వ.]

3398} ప్రవిమలము - ప్రవిమలతరము ప్రవిమలతమము :-
[3-734.1-తే.]

3399} ప్రవిమలశుభమూర్తి  - మిక్కిలి నిర్మలమైన శుభకరమైన రూపము కలవాడు, శ్రీరాముడు :-
[8-744-మాలి.]

3400} ప్రవిమలాకారుడు  - మిక్కిలి నిర్మలమైన ఆకారము కలవాడు, విష్ణువు :-
[3-308.1-తే., 10.2-257.1-తే.]

3401} ప్రవిమలానందుడు  - మిక్కిలి నిర్మలమైన ఆనందమైనవాడు, విష్ణువు :-
[4-179.1-తే., 4-286.1-తే.]

3402} ప్రశాంతకీలహుతాశనము  - ప్రశాంత (చల్లారిన) కీలన్ (మంటలు) కల హుతాశన (అగ్ని), నివురుగప్పిననిప్పు :-
[4-388.1-తే.]

3403} ప్రశాంతదివ్యమంగళవిగ్రహుడు  - ప్రశాంతమైన దివ్యమైన మంగళ (శుభ) కరము ఐన విగ్రహుడు (స్వరూపము కలవాడు), విష్ణువు :-
[3-524-వ.]

3404} ప్రశ్రయము  - అనునయము, ఓదార్చుట :-
[4-28-వ.]

3405} ప్రసంఖ్యలసేనలు  - పదకొండు ఇంద్రియ వృత్తులకు సంకేతము :-
[4-771.1-తే.]

3406} ప్రసన్నుడు  - అనుకూలమైనవాడు, విష్ణువు :-
[3-748-క.]

3407} ప్రసవసాయకుడు  - ప్రసవ (పూల) సాయకుడు (బాణములవాడు), మన్మథుడు :-
[10.2-342-చ.]

3408} ప్రసాదము  - 1. ప్రసన్నత, 2. అనుగ్రహము, 3. కోపాదులు లేక సౌమ్యతతో యుండుట, 4. భగవంతునికి సమర్పించిన నైవేద్యం :-
[4-28-వ., 7-413-ఉ.]

3409} ప్రసూతి  - శిశుప్రసవము, కానుపు :-
[4-6-వ.]

3410} ప్రసేనుడు  - సత్రాజిత్తు తమ్ముడు :-
[10.2-55-చ.]

3411} ప్రస్థ  - తూము మొదలగు ఘనపరిమాణ కొలమానములోనిదైన కొలత :-
[3-346-వ.]

3412} ప్రహరణములుఐదు  - పంచకర్మేంద్రియములకు సంకేతము :-
[4-771.1-తే.]

3413} ప్రహ్లాదుడు  - పరమ విష్ణుభక్తుడు, మిక్కిలి హ్లాదము (సంతోషము)గలవాడు, హిరణ్యకశిపుని పుత్రుడు :-
[5.2-114.1-ఆ., 7-250-వ.]

3414} ప్రాకటలక్ష్మీకళత్రుడు  - ప్రాకట (ప్రసిద్ధమైన) లక్ష్మీదేవికి కళత్రుడు (భర్త), శ్రీకృష్ణ :-
[5.1-1-క.]

3415} ప్రాకారచక్రము  - కోట యొక్క సరిహద్దుగా కల గోడ, బురుజులు, కందకము మున్నగు రక్షణ వలయములు :-
[10.1-1532-వ.]

3416} ప్రాకృతప్రళయము, ప్రాకృతికప్రళయము  - బ్రహ్మ రాత్రి వచ్చునది, మరియొక విధముగ బ్రహ్మ జీవితకాలాంతమున జరుగు మహా ప్రళయము ప్రకృతి సృష్టి సమస్తము నాశనమగుట :-
[12-22-వ., 12-24-వ.]

3417} ప్రాక్కర్మసాక్షి  - ప్రాక్ (సృష్టిలో మొదటి)కర్మకి సాక్షియైనవాడు, విష్ణువు :-
[4-569.1-తే.]

3418} ప్రాగాది  - తూర్పు మొదలగు నాలుగు దిక్కులు, 1 తూర్పు 2 దక్షిణము 3 పడమర 4 ఉత్తరము అను నాలుగు దిక్కులు :-
[3-388-వ.]

3419} ప్రాగ్జోతిషపురము  - నరకాసురుని పట్టణము :-
[10.2-156-వ.]

3420} ప్రాగ్వంశము  - యజ్ఞశాల ప్రాంత గృహము :-
[4-118-వ.]

3421} ప్రాచీనబర్హి  - తూర్పునకు పరచిన దర్భలు కలవాడు :-
[4-680.1-తే.]

3422} ప్రాణదశకము  - 1 ప్రాణము 2 అపానము 3 వ్యానము 4 ఉదానము 5 సమానము 6 నాగము 7 క్రుకరము 8 కూర్మము 9 దేవదత్తము 10 ధనంజయము అను దశప్రాణవాయువులు :-
[3-246.1-తే., 10.1-91.1-తే.]

3423} ప్రాణనిరోధము  - ముక్కుమొదలగు ప్రాణద్వారములను బందించుట, నరక విశేషము :-
[5.2-136-వ.]

3424} ప్రాణము  - ఓంకారము ఉచ్ఛారణ తరువాతి మౌనరూపము :-
[7-467-వ.]

3425} ప్రాణములు, దశవాయువులు  - పంచవాయువులు ఐదు (ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు) పంచ ఉపవాయువులు ఐదు (నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయములు) :-
[10.1-682.1-తే.]

3426} ప్రాణవల్లభ  - ప్రాణములతో సమానమైన వల్లభ (ప్రియురాలు), భార్య :-
[8-546-వ., 9-173.1-ఆ.]

3427} ప్రాణవల్లభుడు  - ప్రాణముతో సమానమైన వల్లభుడు(ప్రియుడు ఇష్టము గలవాడు), భర్త :-
[7-417-క.]

3428} ప్రాణహాని  - ప్రాణములు హాని (నష్టమగుట), చావు :-
[7-213-వ.]

3429} ప్రాణాయామము  - ప్రాణము (ముక్కుపుటముల యందు సంచరించెడి వాయువు) ద్వారా పంచప్రాణములను నియమించుట :-
[3-471-వ.]

3430} ప్రాణుడు  - ప్రాణము కలవాడు, విధాతకు నియతియందు పుట్టిన కొడుకు. వేదశిరుని తండ్రి. :-
[4-26-వ.]

3431} ప్రాణేశుడు  - ప్రాణములకు ఈశుడు (ప్రభువు), భర్త :-
[1-266-మ., 3-470-క., 7-42-శా., 9-246-శా., 9-590.1-తే., 10.2-151-శా.]

3432} ప్రాతః  - ఉదయము, పుష్పార్ణుడు భార్య దోషల ముగ్గరు కొడుకులలో ఒకడు. వారు ప్రాతః, మధ్యందిన, సాయం. :-
[4-390-వ., 6-507-వ.]

3433} ప్రాతస్సంగమము  - పొద్దు పొడుచుటకు ముందు మూడుగడియల కాలము, ఉదయసంధ్య :-
[6-307-వ.]

3434} ప్రాదేశ  - బొటకన వేలు చూపుడు వేలు చాపినంత పొడుగు, జాన పొడుగు, జత్తిలి :-
[2-26-వ.]

3435} ప్రాపితసనకాదితతుడు  - ప్రాపిత (తనను పొందిన) సనక (సనకుడు) ఆది (మొదలగువారి) తతుడు (సమూహము గలవాడు), విష్ణువు :-
[6-32-క.]

3436} ప్రాభవము  - ప్రభావము కలిగి ఉండుట ప్రభావము చేయ కలవాడు ప్రభువు అతని తత్వము ప్రభుత్వము :-
[2-18.1-తే.]

3437} ప్రాయశ్చిత్తము  - పొరపాటు జరిగిన దాని దోష విమోచనమునకైన విధానములు :-
[3-388-వ.]

3438} ప్రాయోపభేదములు  - 1బాల (16సం. వరకు) 2యౌవన (30సం. వరకు) 3పౌఢ (40సం. వరకు) 4లోల (40సం. పైన) ఆయా ప్రాయోబేధమును అనుసరించి ఉపచారలక్షణములు ఉండును :-
[10.1-1495-ఉ.]

3439} ప్రాయోపవిష్టుడు  - ఆహారాదులు మాని మరణమునకు ఎదురుచూచుట అను నిష్ఠలో ఉన్నవాడు :-
[1-508-వ., 7-2-వ., 9-2-వ., 11-2-వ.]

3440} ప్రాయోపవేశము  - అన్నపానాదులు విడిచి మరణమున కెదురు చూచుచుండు నిష్ఠ, ఆమరణనిరాహారదీక్ష :-
[1-499-వ., 8-22-వ.]

3441} ప్రారబ్ధకర్మములు  - ఆగామి సంచిత కర్మములు, పునర్జన్మకు కారణములైన కర్మములు :-
[10.1-555-శా.]

3442} ప్రాహ్ణము  - ఉదయము మొదలు పదిగడియలు వరకు గల కాలము, లేబగలు :-
[6-307-వ.]

3443} ప్రియ - ప్రియతరము ప్రియతమము :-
[2-255-క.]

3444} ప్రియధరిత్రీనాథుడు  - ప్రియమైన భూదేవికి భర్త, శ్రీకృష్ణ :-
[5.1-181-మ.]

3445} ప్రియము - ప్రియతరము ప్రియతమము :-
[3-397-క., 4-624-వ.]

3446} ప్రియలు - ప్రియతరులు ప్రియతములు :-
[4-698.1-తే.]

3447} ప్రియవ్రతుడు  - ప్రియమే వ్రతముగా కలవాడు, స్వాయంభువ మనువు శతరూపల పెద్దకొడుకు :-
[4-217-తే., 4-968-వ.]

3448} ప్రియాంగన  - ప్రియమైన అంగన (స్త్రీ), భార్య :-
[4-810-వ.]

3449} ప్రియుడు - ప్రియతరుడు ప్రియతముడు :-
[3-196-వ., 3-561.1-తే., 3-564-క., 4-878-వ.]

3450} ప్రియుడు  - ప్రియమైనవాడు, భర్త :-
[2-23-వ.]

3451} ప్రీత  - సర్వులకు ప్రీతి యైనవాడు, ప్రసన్నము నొందినవాడు; సంతోషించినవాడు; తృప్తి నొందినవాడు. విష్ణువు :-
[8-503.1-తే.]

3452} ప్రీతివిశేషములు  - శృంగారశాస్త్ర పారిభాషిక పదం, 1అభ్యాసయోగము 2అభిమానయోగము 3సంప్రత్యయోగము 4వైషయికము 5స్వభావసాత్వికము :-
[10.1-1495-ఉ.]

3453} ప్రేతనాయకుడు  - శవములకు నాయకుడు, యముడు :-
[6-69-క.]

3454} ప్రేతములు  - పిశాచబేధము, పీనుగు :-
[5.2-103-క., 6-307-వ.]

3455} ప్రేషవాక్యము  - యజ్ఞములలో దేవతలనాహుతి గ్రహించుటకై పిలిచెడి పిలుపు :-
[12-26-వ.]

3456} ప్లక్షము  - జువ్విచెట్టు :-
[5.2-61-క.]

3457} ప్లవంగము  - దాటుచు పోవునది, కోతి :-
[10.2-541.1-తే.]