పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (నిర్వక్ - పదకొండు)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


2757} నిర్వక్పేశస్కరులు  - నిర్వక్ (మూగవాడు) పేశస్కరుడు (నేర్పుకలిగించేవాడు), పురంజనోపాఖ్యానంలో కాళ్ళు, చేతులకు సంకేతంగా వాడబడెను. :-
[4-768-వ.]

2758} నిర్వక్రము  - వంకరలేనిది, స్పష్టమైనది :-
[10.2-101-క.]

2759} నిర్వాణసంధాయికుడు  - మోక్షమును కలింగించువాడు, కృష్ణుడు :-
[1-201-శా.]

2760} నిర్వికారత్వము  - షడ్విధ వికారములు లేకపోవుట (1గర్భములో ఉండుట 2పుట్టుట 3పెరుగుట 4ముదియుట 5కృశించుట 6చనిపోవుట) :-
[10.1-681-వ.]

2761} నిర్వికారము  - వికారము (మార్పు) లేనిది :-
[3-571-చ.]

2762} నిర్వికారుడు  - షడ్వికారములు (మార్పులు) నిర్ (లేని వాడు), షడ్విధ వికారములు లేనివాడు, విష్ణువు :-
[4-179.1-తే., 4-702.1-తే.]

2763} నిర్వేదము  - 1. తత్వజ్ఞాన దుఃఖ ఈర్ష్యాదుల చేత గలుగు హేయత్వ బుద్ధి, 2. తత్వం తెలిసి నిరాశచేసికొనుట. 3. దుఃఖము. 4. వైరాగ్యము. :-
[12-30-వ.]

2764} నిలాయన,నిలయన  - దాగుడుమూతలు ఆటలు :-
[10.1-1183-వ.]

2765} నిలింపపతి  - నిలింపుల (దేవతల)కు పతి (ప్రభువు), ఇంద్రుడు :-
[10.1-891-వ.]

2766} నిలింపవైరి  - నిలింప (దేవతా) వైరి (శత్రువు), రాక్షసుడు :-
[7-227-ఉ.]

2767} నిలింపారాతి  - నిలింప (దేవతల) ఆరాతి (శత్రువు), హిరణ్యకశిపుడు :-
[7-93-వ.]

2768} నిలింపాహితజిష్ణు  - నిలంప (దేవతల)కు అహిత (శత్రువులు) అగు రాక్షసులను జయించు శీలము కలవాడు, విష్ణువు :-
[3-148-మ.]

2769} నివాతకవచుడు  - బాణములచే ఛేదింపబడని కవచము కలవాడు, ఒక దైత్యుడు. :-
[1-366.1-ఆ.]

2770} నివాతము  - బాణములచే భేదింపరానిది :-
[8-182-వ.]

2771} నివాళించుట  - ఒక సత్కార సేవ, హారతిచ్చుట, హారతి గ్రహీత ఎదురుగా మంగళహారతి పళ్ళెరములను ప్రదక్షిణగా చుట్లుతిప్పి తరువాత నివాళించెడివారి కుడిఅరచేతులతో అందలి ధూపమును గ్రహీత వైపునకు చూపుట, హారతి పట్టుట :-
[4-558-వ.]

2772} నివృత్తుడు  - ప్రవృత్తులు లేనివాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

2773} నిశాంతము  - నిశ (రాత్రి, ప్రళయము) అంతము (చివర), కల్పము ఉదయించబోవు సమయము :-
[8-732-వ.]

2774} నిశాకరుడు  - నిశ (రాత్రి) ఆకరుడు (ప్రకాశించువాడు), చంద్రుడు :-
[3-498-ఉ., 11-99-వ.]

2775} నిశాచరనాథపుత్రుడు  - నిశాచర రాజు (రాక్షస రాజు యైన హిరణ్యకశిపుని) పుత్రుడు, ప్రహ్లాదుడు :-
[7-385-ఉ.]

2776} నిశాచరభేది  - రాక్షసులను హింసించువాడు, విష్ణువు :-
[10.1-1187-ఉ.]

2777} నిశాచరశత్రువు  - రాక్షసుల శత్రువు, విష్ణువు :-
[10.2-45-క.]

2778} నిశాచరసంహరుడు  - నిశాచర (రాక్షసులను) సంహరుడు (చంపినవాడు), రాముడు :-
[7-482-చ.]

2779} నిశాచరుడు  - నిశ (రాత్రి) చరించువాడు (తిరుగువాడు) రాక్షసుడు :-
[2-146-మ., 6-429-ఉ., 7-76-శా., 7-193-ఉ., 9-162-చ., 10.1-1058-ఉ.]

2780} నిశాటవిపాటన  - నిశాట (రాత్రించరుల, రాక్షసుల)ను విపాటన (పడగొట్టువాడు), విష్ణువు :-
[10.1-579-క.]

2781} నిశాటుడు  - నిశ (రాత్రి) ఆటుడు (చరించువాడు), రాక్షసుడు :-
[2-190-చ., 3-625-క., 6-276-చ., 7-326-క., 10.1-464-క., 10.1-1171-ఉ., 10.2-17-మ., 10.2-151-శా.]

2782} నిశానాయకుడు  - నిశ (రాత్రి)కి నాయకుడు, చంద్రుడు :-
[4-371-వ.]

2783} నిశాపతి  - రాత్రికాలమునకు అధిపతి, చంద్రుడు :-
[10.1-966-క.]

2784} నిశీథ  - అర్థరాత్రి కాలము, వ్యు. ని+శీ+థక్, నిశేరతే అత్ర, నితరాం శేరతే అత్ర, దీని యందు పడుకొందురు. :-
[4-390-వ.]

2785} నిశ్శ్రీకములు  - శ్రీకములు (శుభములు) లేనివి :-
[8-148-క.]

2786} నిశ్శ్రేయస్సు  - (ఇక పొందవలసిన) శ్రేయస్సులు లేనిది, ముక్తి :-
[1-148.1-ఆ.]

2787} నిషదము  - మేరు పర్వతం చుట్టూ ఉండే పర్వతాలలో ఒకటి, వ్యు. ని+సద్+అచ్, నిషీదంతి నిశ్చింతతయా నివసంతి అత్ర దేశః, ఇక్కడ చింత లేకుండ వుందురు. :-
[5.2-30-వ.]

2788} నిష్కంటకము  - కంటకము (ముల్లు)లు లేనిది, అడ్డులేనిదారి :-
[7-220-ఉ.]

2789} నిష్కము  - పాతకాలపు టంకము (డబ్బు బిళ్ళ), బిళ్ళ రూపు ధనము, బంగారు నాణెము, మాడ అని కొందరు, 108 మాడలు అని కొందరు, పది రూకలు (వెండినాణెములు) అని కొందరు :-
[10.2-605-వ., 10.2-965.1-తే.]

2790} నిష్కళంకుడు  - కళంకములు లేనివాడు, విష్ణువు :-
[2-279-మ., 4-179.1-తే., 10.1-942-ఆ.]

2791} నిష్కాముడు  - కామము లేనివాడు, కోరికలు లేకుండుటయే ధర్మముగా కలవాడు,శివుడు :-
[3-297-వ., 3-473-వ.]

2792} నిష్కించనుడు  - వెలితి లేని వాడు, భగవంతుడు :-
[2-279-మ.]

2793} నిష్క్రియారంభుడు  - క్రియలందు సంకల్పములు లేనివాడు, విష్ణువు :-
[4-179.1-తే.]

2794} నిష్ఠుర - నిష్ఠురతర నిష్ఠురతమ :-
[6-53-క.]

2795} నిష్ఠురము - నిష్ఠురతరము నిష్ఠురతమము :-
[10.2-880-చ.]

2796} నిస్తంద్రుడు  - మత్తులేనివాడు, మేల్కొని ఉన్నవాడు, తందర (తూగు, కునికిపాటు) నిః (లేని) వాడు, :-
[3-912-వ.]

2797} నిస్త్రింశము  - నరహరి గోర్లు, నిస్త్రింశః (ముప్పది మానములకంటె పెద్దవైన కత్తుల) వంటివి, నిస్త్రింశ (కనికరము లేనిది) ఐనవి :-
[7-330-ఉ.]

2798} నిస్సంగమము  - సంగము (బంధనాలు) (తగులములు) (వ్యసనములు) లేనిది :-
[2-217.1-తే.]

2799} నిస్సంగులు  - సంగములు అన్నింటిని విసర్జించినవారు, విరాగులు :-
[5.1-51-వ.]

2800} నిస్సాణ  - చర్మవాద్య విశేషము, రెండుప్రక్కల వాయించే పెద్ద డప్పు వంటి వాయిద్య విశేషము, నామాంతరాలు మావలి, లోహ్టి. దీనిని ముఱియా మున్నగు జాతుల వారు వాడుతున్నారు. :-
[10.1-1557-మ.]

2801} నీడము  - రథముపై రథికుడు కూర్చుండు చోటు, నాటు బండికి తొట్టె, హృదయమునకు సంకేతంగా వాడబడింది :-
[4-771.1-తే.]

2802} నీమొదలిటెంకి  - నీ (భగవంతుని యొక్క) మొదలి (మూల) టెంకి (నివాసము), వైకుంఠము, పరమపదము :-
[10.1-552-క.]

2803} నీరజగర్భుడు  - నీరజ (పద్మమున) గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-243-చ., 10.2-50-మ.]

2804} నీరజదళనేత్రుడు  - తామర రేకుల వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[10.2-49-క.]

2805} నీరజనాభుడు  - నీరజము (పద్మము) నాభుడు (బొడ్డున గలవాడు), విష్ణువు. :-
[6-340-క., 11-106-క.]

2806} నీరజనివాసము  - పద్మముల చోటు, సరస్సు :-
[9-607-శా.]

2807} నీరజనేత్ర  - నీరజ (కమలముల) వంటి నేత్ర (కన్నులు కలామె), స్త్రీ. :-
[10.1-1276-క.]

2808} నీరజబంధుడు  - నీరజము (కలువపూల)కు బంధువు ఐనవాడు, సూర్యుడు :-
[10.1-754.1-ఆ.]

2809} నీరజభవుడు  - నీరజము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[4-509.1-తే.]

2810} నీరజలోచనుడు  - (నీరజము) పద్మము వంటి కన్నుల ఉన్న వాడు :-
[1-255-ఆ.]

2811} నీరజాక్షుడు  - నీరజ (పద్మము)లవంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[1-189.1-తే., 9-129.1-తే.]

2812} నీరజాతేక్షణ - నీరజాతము (కమలము) వంటి ఈక్షణ (కన్నులు కలామె), స్త్రీ, సత్యభామ :-
[10.2-183.1-తే.]

2813} నీరజేక్షణుడు  - నీరజ (పద్మములవంటి) ఈక్షణుడు (కన్నులు కలవాడు), కృష్ణుడు :-
[10.1-929-క.]

2814} నీరదశ్యామాంగుడు  - నీరదము (మేఘము) వంటి శ్యామాంగ (నల్లని దేహము గలవాడు), విష్ణువు. :-
[5.1-50-క.]

2815} నీరధి  - నీరు కి నిధి, కడలి, సముద్రము :-
[10.2-13-వ.]

2816} నీరరాశి  - నీరు రాశిగాగలది, కడలి, సముద్రము :-
[8-554.1-ఆ.]

2817} నీరాటము  - నీటిలో చరించునది, మొసలి :-
[8-19-క., 8-57-శా.]

2818} నీరేజగర్భుడు  - నీరేజము (పద్మము) నందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[3-383-మ.]

2819} నీరేజపత్రేక్షణుడు  - నీరేజము (పద్మము) రేకుల వంటి కన్నులు ఉన్న వాడ, విష్ణువు :-
[3-203-దం., 10.1-408-శా.]

2820} నీరేజభవుడు  - నీరేజము (పద్మము) నందు భవుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[6-489-క.]

2821} నీరేజముఖి  - నీరేజము (పద్మము) వంటి ముఖి (ముఖము గలామె),స్త్రీ :-
[6-204-క.]

2822} నీలకంఠము  - నీలముగా నున్న మెడ కలది, నెమలి :-
[10.2-180.1-ఆ.]

2823} నీలకంఠుడు  - నల్లని కంఠము కలవాడు, శంకరుడు :-
[4-105-శా.]

2824} నీలకంధరుడు  - నీల (నల్లని) కంధర (కంఠము) కలవాడు, శివుడు. :-
[4-65-చ.]

2825} నీలగళుడు  - నీల (నల్లని) గళ (గొంతుక) కలవాడు, శివుడు :-
[4-94-ఉ.]

2826} నీలనీరదనీలనీలోత్పలశ్యాముడు  - నీల (నల్లని) నీరద (మబ్బు వలెను) నీల (నల్లని) నీలోత్పల (నల్లకలువ వలెను) శ్యాముడు (నల్లగా ఉన్నవాడు) , విష్ణువు :-
[3-922.1-తే.]

2827} నీలనీరదశ్యామవర్ణుడు  - నల్లని మేఘమువలె నల్లని రంగుకలవాడు, విష్ణువు :-
[3-145.1-తే.]

2828} నీలలోహితుడు  - నీలము ఎరుపు రంగులు కలసి ఉన్నవాడు, రుద్రుడు, పరమ శివుడు :-
[3-367-వ., 3-368-మ., 4-149.1-తే., 11-105-వ.]

2829} నీలలోహితునిఏకాదశమూర్తులభార్యలు - 1 ధీ 2 వృత్తి 3 అశన 4 ఉమ 5 నియుతి 6 సర్పి 7 ఇల 8 అంబిక 9 ఇరావతి 10 సుధ 11 దీక్ష :-
[3-370-వ.]

2830} నీలవర్ణుడు  - నీలమైన రంగుగల దేహము గలవాడు, హరి :-
[6-1-శా.]

2831} నీలవేణి  - నల్లని శిరోజములు కలామె, స్త్రీ :-
[10.2-120-వ.]

2832} నీలోహితునిఏకాదశనామములు - 1 మన్యువు 2 మనువు 3 మహాకాలుడు 4 మహశ్చివుడు 5 ఋతధ్వజుడు 6 ఉరురేతసుడు 7 భవుడు 8 కాలుడు 9 వామదేవుడు 10 ధృతవ్రతుడు 11 నీలలోహితుడు :-
[3-370-వ.]

2833} నీవారము  - విత్తక పండెడు దూసర్లు లోనగు తృణధాన్యము, నివ్వరి ధాన్యం :-
[9-618-క.]

2834} నుతభక్తలోకమనోనేత్రవర్ధిష్ణుడు  - నుత (కీర్తింపబడిన) భక్తలోకముల మనోనేత్రమును వర్ధిష్టుడు (పోషించువాడు), విష్ణువు :-
[3-924.1-తే.]

2835} నుతవాణీసత్యధిభూభవవృత్రాసురరిపుదేవజాలుడు - నుత (పొగడబడుతున్న వాణీసత్యధిభూ (బ్రహ్మ) భవ (మహేశ్వరుడు) వృత్రాసురరిపు (ఇంద్రుడు) దేవజాలుడు (మున్నగుదేవతల సమూహము) కలవాడు, రాముడు :-
[11-1-క.]

2836} నూతనఫుల్లాబ్జలోచనుడు  - కొత్తగా విరిసిన పద్మములవంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[10.1-232-క.]

2837} నృప  - నృ (నరులను) ప (పరిపాలించువాడు), రాజు. :-
[1-373-క., 1-379-క., 3-97-చ., 6-419-క., 7-426-క., 9-153-క.]

2838} నృపతి  - నృ (నరులకు) ప్రభువు, రాజు :-
[3-16-క., 4-461-క., 9-427-క.]

2839} నృపముఖ్యుఁడు  - నరపాలకులలో ముఖ్యమైనవాడు, పరీక్షిత్తుడు :-
[1-443-ఉ.]

2840} నృపవరుడు  - నృప (రాజు)లలో వరుడు (శ్రేష్ఠుడు), మహారాజు :-
[7-418-క.]

2841} నృపసత్తముడు  - నరులను పాలించు వారిలో శ్రేష్ఠుడు మహారాజ, పరీక్షిత్తు :-
[1-427-ఉ.]

2842} నృపాత్మజ  - నృప (రాజైన మనువు) యొక్క ఆత్మజ (కూతురు), దేవహూతి :-
[3-919-వ.]

2843} నృపాలకాంతలు  - రాజుల భార్యలు, రాణులు :-
[10.2-1114-వ.]

2844} నృపాలకుడు  - నృ (నరులను) పాలకుడు (పరిపాలించెడివాడు), రాజు :-
[1-290-చ., 5.1-61-చ., 6-157-ఉ.]

2845} నృపాలుడు  - నృ (నరులకు) పాలుడు (పాలించెడివాడు), రాజు :-
[3-11-చ., 3-26-చ., 3-33-తే., 4-300-మ., 4-751.1-తే.]

2846} నృపుడు  - నృ (నరులను) పాలించువాడు, రాజు :-
[1-360-క., 1-372-క., 1-398.1-ఆ., 1-425-క., 1-476-క., 3-124-చ., 6-376-క., 8-6-క., 8-123-మ., 8-495-క., 8-682-క., 10.1-66-క., 10.1-446-క., 10.1-1313-క.]

2847} నెమ్మొగము  - నెఱ (అందమైన) + మొగము (ముఖము) :-
[10.2-183.1-తే.]

2848} నెలత  - చంద్రునివలె చల్లని యామె, స్త్రీ :-
[8-466-ఆ.]

2849} నెలలు  - పన్నెండు, 1చైత్రము 2వైశాఖము 3జేష్ఠము 4ఆషాడము 5శ్రావణము 6బాధ్రపదము 7ఆశ్వయుజము 8కార్తీకము 9మార్గశిరము 10పుష్యమి 11మాఘము 12ఫాల్గుణము :-
[5.2-86-వ.]

2850} నేత(పు)  - నేత్రి (స్త్రీ) :-
[3-467.1-తే.]

2851} నేలపాలు  - 1.మట్టిలోకి పాలు చెందునట్లు, కలియునట్లు, 2.వ్యర్థము :-
[3-380-ఉ.]

2852} నైమిత్తికప్రళయము  - తాత్కాలమైన నాశనము, సృష్టి ఆగుటవలన కలుగునది, బ్రహ్మ పగలు వచ్చునది, మరియొక విధముగ బ్రహ్మ పగలు తరువాత వచ్చెడి సర్వనాశనము :-
[12-22-వ., 12-24-వ.]

2853} నైశ్రేయస్సు  - నిశ్రేయస్సు (మిక్కిలి శ్రేయస్సు, ముక్తి) ను కలిగించునది :-
[3-507-వ.]

2854} నొగ  - రథములకు బండ్లకాడికి ఆధారముగ ముందుండెడి పొడవాటి చట్రము, కూబరము, ఏడికోల :-
[10.1-1558-వ.]

2855} పంకజగర్భుడు  - పంకజ (పద్మమున) గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ. :-
[7-383-క.]

2856} పంకజజన్ముడు  - పంకజ (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-324-క.]

2857} పంకజనయనుడు  - పంకజము (పద్మము)వంటి నయనుడు (కన్నులు గలవాడు), విష్ణువు :-
[6-239.1-ఆ.]

2858} పంకజనాభుడు  - పంకజము (పద్మము) నాభిన కలవాడు, విష్ణువు :-
[1-188-వ., 3-360-క., 4-702.1-తే., 10.1-1708-ఉ., 11-92-ఉ.]

2859} పంకజనేత్రుడు  - పంకజము (పద్మము) లవంటి నేత్రములు కలవాడ, విష్ణువు :-
[3-423.1-తే.]

2860} పంకజము  - పంకము (నీరు, బురద) యందు జము (పుట్టునది), పద్మము :-
[2-221.1-తే., 3-429-మ., 3-845.1-తే., 4-582-వ., 4-832-తే., 7-297.1-తే.]

2861} పంకజలోచనుడు  - పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[4-189-చ.]

2862} పంకజసంభవుడు  - పంకజము (పద్మము)న సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-739.1-తే.]

2863} పంకజసఖుడు  - పంకజ (పద్మముల) సఖుడు (స్నేహితుడు), సూర్యుడు :-
[10.1-1308-క.]

2864} పంకజాకరము  - పంకజము (పద్మములకు) ఆకరము (నివాసము), సరోవరము :-
[8-108-వ.]

2865} పంకజాక్షి  - పంకజము (పద్మము)లవంటి అక్షి (కన్నులుగలామె), స్త్రీ :-
[4-753.1-తే.]

2866} పంకజాక్షుడు  - పంకజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[6-400-ఉ.]

2867} పంకజాతభవుడు  - పంకజాతము (పద్మము) న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[3-385-చ.]

2868} పంకజాతము  - పంక (నీరు, బురద) జాతము (పుట్టినది), పద్మము :-
[3-720.1-తే., 4-552-చ.]

2869} పంకజాతాక్షుడు  - పంకజాతము (పద్మము) వంటి కన్నులు ఉన్న వాడు, విష్ణువు :-
[3-566.1-తే.]

2870} పంకజాసనుడు  - పంకజము (పద్మము)న ఆసీనుడు (ఉన్నవాడు), బ్రహ్మదేవుడు :-
[3-227-క., 3-334-వ., 3-359.1-తే., 3-739.1-తే., 4-14-చ., 9-230-వ.]

2871} పంకజోదరుడు  - పంకజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-242-చ., 3-437.1-తే., 3-703-మ., 3-897.1-తే.]

2872} పంకరుహగర్భుడు  - పంకరుహము (పద్మము) నందు గర్భుడు (పుట్టిన వాడు), బ్రహ్మదేవుడు :-
[3-375-ఉ.]

2873} పంకరుహజాతుడు  - పంకరుహము (పద్మము)నందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[3-545-చ.]

2874} పంకరుహము  - పంక (బురద)లో రుహము (పుట్టునది), పద్మము :-
[2-155.1-తే., 2-239-క., 3-49-చ., 3-534-చ.]

2875} పంకరుహసంభవుడు  - పద్మజుడు, పంకరుహము (పద్మము)నందు పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[10.2-773-చ.]

2876} పంకరుహసఖుడు  - పద్మమునకు సఖుడు సూర్యుడు :-
[2-155.1-తే.]

2877} పంకరుహాక్షి  - పంకరుహము(పద్మము) వంటి అక్షి(కన్నులు గలామె), స్త్రీ :-
[6-452-ఉ.]

2878} పంకరుహోదరుడు  - పంకరుహ(పద్మము) ఉదరుడు విష్ణువు :-
[2-101-చ., 3-194-చ.]

2879} పంకేజపత్రేక్షణుడు  - పంకేజము (పద్మము) యొక్క పత్ర (రేకు) ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు :-
[3-1016-మ.]

2880} పంకేజలోచనుఁడు  - పద్మముల వంటి కన్నులుగలవాడు, విష్ణువు :-
[4-300-మ.]

2881} పంకేరుహగర్భాండము  - పంకేరుహగర్భుని (పద్మమునందు పుట్టినవాని, బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[10.1-1308-క.]

2882} పంకేరుహనాభుడు  - పంకేరుహము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు :-
[3-931-ఉ.]

2883} పంకేరుహభవుడు - పంకేరుహ (పద్మము) నందు భవుడు (పుట్టిన) వాడు :-
[2-217.1-తే.]

2884} పంకేరుహమిత్రుడు  - పంకేరుహము (పద్మము)నకు మిత్రుడు, సూర్యుడు :-
[4-352-ఉ.]

2885} పంకేరుహము  - పంకే (బురద)లో రుహము (పుట్టునది), పద్మము :-
[3-937-వ., 5.2-69.1-ఆ., 10.2-647-ఉ.]

2886} పంకేరుహాకరము  - పంకేరుహ (పద్మముల)కు ఆకరములు (నివాసములు), కోనేళ్ళు. :-
[3-37.1-తే.]

2887} పంకేరుహాక్షుడు  - పంకేరుహము (పద్మము) వంటి కన్నులు కలవాడు, విష్ణువు :-
[4-292-తే.]

2888} పంకేరుహాప్తుడు  - పంకేరుహ (పద్మముల)కు ఆప్తుడు, సూర్యుడు :-
[10.2-403.1-తే.]

2889} పంకేరుహోదరుడు  - పంకేరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు :-
[3-1016-మ.]

2890} పంక్తి  - 1.పది, 2.దశ, 3.వరుస, 4.వచనములో పంక్తి పద్యంలో పాదం :-
[2-160-క.]

2891} పంచకర్తలు  - బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు అను ఐదుగురు పురుషులు (కారణభూతులు, కర్తలు) :-
[10.2-441-వ.]

2892} పంచకర్మేంద్రియములు  - 1కాళ్ళు 2చేతులు 3నోరు 4గుదము 5మర్మావయవము, (1వాక్ 2పాణి 3పాద 4పాయు 5ఉపస్థులు) :-
[3-204.1-తే., 4-485-వ., 7-363.1-తే.]

2893} పంచకళలు  - 1సత్తు 2చిత్తు 3ఆనందము 4నిర్మలము 5పరిపూర్ణము :-
[10.2-248.1-తే.]

2894} పంచకోశములు  - 1అన్నమయకోశము 2ప్రాణమయకోశము 3మనోమయకోశము 4 విజ్ఞానమయకోశము 5ఆనందమయకోశము :-
[3-921-వ., 10.2-1211.1-తే.]

2895} పంచక్రోధాదులు  - 1కామం 2క్రోధం 3భయం 4నయం 5భక్తి :-
[7-19-వ.]

2896} పంచజనుడు  - 1. పంచజనుడు సాందీపుని పుత్రుని ప్రభాసతీర్థములోనికి తీసికొనిపోయిన రాక్షసుడు. వానిని కృష్ణుడు చంపి గురుదక్షిణగా ఆ కుమారుని తెచ్చి ఇచ్చెను, ఆ పంచజనుని దేహమునుండి వచ్చిన శంఖము పాంచజన్యము, వ్యు. పాంచ+జన్య, పంచజనే దైత్యభేదే భవః 2. పంచజన ప్రజాపతి ఈయన పుత్రిక అసిక్ని దక్షుని భార్య. 3. ప్రహ్లాదుని తమ్ముడు సంహ్లాదుని కొడుకు, 4 మనుష్యుడు, వ్యు. పంచభిః భూతైః జన్యతే పంచ+జన+ఘుఞ న వృద్ధిః, కృ.ప్ర. :-
[2-190-చ., 3-122-ఉ., 6-224-వ.]

2897} పంచజ్ఞానేంద్రియములు  - 1కన్ను 2చెవి 3ముక్కు 4నాలుక 5చర్మము :-
[3-204.1-తే., 5.1-155-వ., 10.1-91.1-తే.]

2898} పంచతన్మాత్రలు  - 1శబ్దము 2స్పర్శ 3 దృక్కు (చూపు) 4ఘ్రాణము (వాసన) మరియు 5రస (రుచి) వాని మూల తత్వములు (5) :-
[2-112-వ., 2-238-వ., 2-259-తే., 3-204.1-తే., 3-718.1-తే., 4-889-వ., 5.1-93-వ., 7-237-వ., 7-366-వ., 10.2-203-వ., 10.2-1211.1-తే.]

2899} పంచత్వము  - పంచభూతములకు తిరిగి చెందుట, మరణము :-
[4-104-వ., 10.1-464-క.]

2900} పంచపాండవులు  - పాండురాజు సంతానము, 1ధర్మరాజు, 2భీముడు, 3అర్జునుడు, 4నకులుడు, 5సహదేవుడు :-
[1-186-వ.]

2901} పంచప్రస్థము  - పంచేద్రియము ప్రవృత్తులకు సంకేతం :-
[4-772-వ.]

2902} పంచప్రాణములు  - 1. ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (గుదమున నుండునది), 3. సమానము (నాభి మండలమున నుండునది), 4. ఉదానము (కంఠమున నుండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది). :-
[4-853-వ., 4-855-వ., 10.1-236-వ., 10.1-405.1-తే., 10.1-1236-దం., 10.1-1472.1-తే., 10.1-1779-వ., 10.2-1203-వ.]

2903} పంచప్రాణవాయువులు  - 1. ప్రాణము (హృదయమున నుండునది), 2. అపానము (గుదమున నుండునది), 3. సమానము (నాభి మండలమున నుండునది), 4. ఉదానము (కంఠమున నుండునది), 5. వ్యానము (శరీరమంతట వ్యాపించి యుండునది). :-
[3-899-తే.]

2904} పంచబంధనములు  - పంచప్రాణములకు సంకేతం. :-
[4-771.1-తే.]

2905} పంచబాణుడు  - 1ఉన్మాదన 2తాపన 3శోషణ 4స్తంభన 5సమ్మోహనములను ఐదు (5) బాణములు కలవాడు, పాఠ్యంతరమున 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము అను ఐదు (5) పూలబాణములు కలవాడు, మన్మథుడు :-
[1-272-మత్త., 10.1-798-వ., 10.2-11-వ.]

2906} పంచబుద్దులు, పంచతన్మాత్రలు  - 1శబ్దము 2స్పర్శ 3 దృక్కు (చూపు) 4ఘ్రాణము (వాసన) మరియు 5రస (రుచి) వాని మూల తత్వములు (5) :-
[5.1-155-వ.]

2907} పంచభక్ష్యములు  - 1భక్ష్యము (కొరికి తినగలిగినవి, అరిసెలు, జంతికలు వగైరా) 2భోజ్యము (పిడుచగా తిన గలిగినవి, కూర అన్నము వగైరా) 3లేహ్యము (నాకి చప్పరించ గలవి, తేనె, తిమ్మనం వగైరా) 4చోష్యము (జుఱ్ఱుకో దగినవి, పెఱుగు వగైరా) 5పానీయము (తాగ గలిగినవి, పాలు, పళ్ళరసములు వగైరా) ఐన ఆహార పదార్థములు :-
[10.1-859-వ.]

2908} పంచభల్లుడు  - ఐదు (పూల) బాణములు కలవాడు, మన్మథుడు :-
[10.1-968-వ.]

2909} పంచభూతగుణములు  - (1)శబ్దాది, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము, (2) 1.భూమి (తన్మాత్ర గంధము, గుణములు శబ్ద స్పర్శ రూప రస గంధములు) 2.జలము (తన్మాత్ర రసము, గుణములు శబ్ద స్పర్శ రూప రసములు) 3తేజస్సు (తన్మాత్ర రూపము, గుణములు శబ్ద స్పర్శ రూపములు) 4.వాయువు (తన్మాత్ర స్పర్శ, గుణములు శబ్ద స్పర్శలు) 5,ఆకాశము (తన్మాత్ర శబ్దము, గుణము శబ్దము) :-
[10.1-1779-వ.]

2910} పంచభూతములు  - 1.భూమి 2.జలము 3తేజస్సు 4.వాయువు 5,ఆకాశము "పృథివ్యాపస్తేజో వాయురాకాశమితి భూతాని"[గౌతమన్యాయసూత్రములు 1 1 13] :-
[1-386-వ., 2-68.1-తే., 3-309.1-తే., 3-363-వ., 3-1025-వ., 4-355-వ., 4-849-వ., 7-237-వ., 7-469-వ., 8-216-వ., 8-235-క., 8-614-క., 10.1-66-క., 10.1-89.1-ఆ., 10.1-405.1-తే., 10.1-682.1-తే., 10.2-160-వ., 10.2-203-వ.]

2911} పంచభూతములు  - 1నభస్ (ఆకాశము) 2వాయు (గాలి) 3కుంభిని (భూమి) 4సలిల (నీరు) 5తేజస్ (అగ్ని) :-
[3-204.1-తే.]

2912} పంచమలములు  - 1ఆణవ 2కార్మిక 3మాయిక 4మాయేయ 5తిరోధానములు అనెడి ఆధ్యాత్మవిధ్యార్జనలో కలిగెడి మలములు :-
[10.1-682.1-తే., 10.1-766-వ.]

2913} పంచమహాపాతకములు  - 1స్వర్ణస్థేయము 2సురాపానము 3బ్రహ్మహత్య 4గురుపత్నీగమనము 5ఇవి చేయువారి తోడి స్నేహము, పంచమహాపాతకములు :-
[6-146.1-తే.]

2914} పంచమహాభూతములు  - 1నభస్ (ఆకాశము) 2వాయు (గాలి) 3కుంభిని (భూమి) 4సలిల (నీరు) 5తేజస్ (అగ్ని) :-
[3-1005-వ., 4-485-వ., 6-327.1-తే., 7-217-వ., 10.1-126.1-ఆ., 10.1-1472.1-తే.]

2915} పంచమహాయజ్ఞములు  - 1వేదపఠనము (దేవ యజ్ఞము) 2వైశ్వదేవాది హోమము (బ్రహ్మ యజ్ఞము) 3అతిథి పూజ (అతిథి యజ్ఞము) 4పితృతర్పణము (పితృ యజ్ఞము) 5భూతబలి (భూత యజ్ఞము), పంచ ఇష్టులు :-
[10.2-465-వ., 10.2-619.1-తే.]

2916} పంచమహావాద్యములు  - 1. భేరి, 2. కాహళము, 3. పటహము, 4. శంఖము, 5. జయఘంట. :-
[5.1-133-వ.]

2917} పంచమాతలు  - 1రాజు భార్య 2అగ్రజుని భార్య 3గురు భార్య 4భార్య జనని 5స్వజనని :-
[2-38-వ., 9-348-క.]

2918} పంచయజ్ఞములు  - 1వేదపఠనము (దేవ యజ్ఞము) 2వైశ్వదేవాది హోమము (బ్రహ్మ యజ్ఞము) 3అతిథి పూజ (అతిథి యజ్ఞము) 4పితృతర్పణము (పితృ యజ్ఞము) 5భూతబలి (భూత యజ్ఞము), పంచ ఇష్టులు :-
[7-415-ఉ.]

2919} పంచవన్నెలు  - 1శుక్లము (తెలుపు) 2కృష్ణము (నలుపు) 3పీతము (పసుపు పచ్చ) 4హరితము (ఆకుపచ్చ) 5రక్తము (ఎరుపు) :-
[10.2-346-వ.]

2920} పంచవింశతితత్త్వములు  - పంచభూతములు (1 5), పంచజ్ఞానేంద్రియములు (6 10) పంచకర్మేంద్రియములు(11 15) పంచతన్మాత్రలు(16 20) మనసు(21) బుద్ధి(22) చిత్తము(23) అహంకారము(24) పురుషుడు(25). పాఠ్యంతరము, 1 అవ్యక్తము 2మహత్తు 3అహంకారము 4మనసు 5నుండి14జ్ఞానేంద్రియకర్మేంద్రియములు పది 15నుండి19 తన్మాత్రలు ఐదు 20నుండి24మహాభూతములు ఐదు 25పురుషుడు :-
[6-225.1-ఆ., 6-234-మత్త.]

2921} పంచవిక్రమము  - పంచేంద్రియ ఇంద్రియముల వ్యాపారములకు సంకేతము. :-
[4-771.1-తే.]

2922} పంచశరాకారుడు  - పంచశరుని (మన్మథుని) వంటి ఆకారము కలవాడు, కృష్ణుడు :-
[10.1-1281-క.]

2923} పంచశరుడు  - అయిదు (పుష్ప) బాణములు కలవాడు, మన్మథుడు :-
[1-241.1-తే., 3-126.1-తే., 3-378.1-తే.]

2924} పంచశిలీముఖుడు  - పంచ (ఐదు, 5) శిలీముఖములు (బాణములు) గలవాడు, మన్మథుడు :-
[6-446.1-తే.]

2925} పంచాగ్నులు  - 1దక్షిణాగ్ని కామాగ్ని వెన్నెముక దిగువ భాగమునకు (దక్షిణము)నకు చెందినది 2గార్హపత్యము ఆకలి ఉదరస్థానమైనది 3ఆహవనీయము జ్ఞానాగ్ని తలలోనుండును 4సథ్యము ప్రాణాగ్ని వక్షముననుండును 5అవసథ్యము ఆత్మాగ్ని ప్రకృతి నుండి తనను వేరుగ గుర్తింపజేయునది :-
[4-648.1-తే.]

2926} పంచాయుధగేహము  - పంచాయుధుని (మన్మథుని) గేహము (నివాసము), స్త్రీల రహస్యేంద్రియము, ఉపస్తు :-
[10.1-840-క.]

2927} పంచాయుధుడు  - (అ) 1ఉన్మాదన 2తాపస 3శోషణ 4స్తంభన 5సమ్మోహనములను ఐదు (5) బాణములు కలవాడు, (ఆ) 1అరవిందము 2అశోకము 3శోషణ 4స్తంభన 5సమ్మోహనములను ఐదు (5) పూలబాణములు కలవాడు, మన్మథుడు :-
[10.2-26-మ.]

2928} పంచారామములు  - పంచ (ఐదు) ఆరామములు, ఇంద్రియ గోచర మగు విషయములకు సంకేతము, తోటలు :-
[4-849-వ.]

2929} పంచాశుగుడు  - 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము అనెడి ఐదు బాణములు కలవాడు, మన్మథుడు :-
[10.1-787-మ., 10.1-1281-క.]

2930} పంచాశ్వములు  - పంచజ్ఞానేంద్రియములు :-
[4-771.1-తే.]

2931} పంచాస్యము  - తెరచిననోరు గల మృగము, తెఱనోటిమెకము, సింహము :-
[3-419-మ., 10.1-1378-శా.]

2932} పంచితిలు(క్రియ)  - గోవు మూత్రము విడుచు :-
[1-412-శా.]

2933} పంచేంద్రియములు  - కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మము :-
[1-459.1-తే.]

2934} పంచేంద్రియములు  - పంచ జ్ఞానేంద్రియములు, 1కన్ను 2చెవులు 3ముక్కు 4నాలిక 5చర్మము, (త్వక్చక్షుశ్శ్రోత్రజిహ్వాఘ్రాణము లనెడి యైదింద్రియములు) :-
[4-485-వ., 7-117.1-ఆ., 8-44.1-తే., 8-65-శా., 9-122-క.]

2935} పంచేషుడు  - పంచ ఇషుడు, పంచబాణుడు, మన్మథుడు :-
[10.1-1488-మ.]

2936} పక్వకషాయుడు  - పరిపక్వము చెందిన విషయాభిలాషములు కలవాడు, విషయములపై కోరికలు లేనివాడు :-
[4-834-వ.]

2937} పక్షములు  - 1శుక్లపక్షము 2కృష్ణపక్షము అని మాసమునకు రెండు పక్షములు :-
[5.2-86-వ.]

2938} పక్షిరాట్పత్రుడు  - పక్షులకురాజు (గరుత్మంత్రుడు) యొక్క పత్రుడు (వాహనముగా కలవాడు), విష్ణువు. :-
[3-284-మ.]

2939} పక్షీంద్రుడు  - పక్షులకు ఇంద్రుడు (శ్రేష్ఠుడు. ప్రభువు), గరుడుడు :-
[8-98-మ., 10.1-1377-శా.]

2940} పగ్గములు  - గుఱ్ఱము మున్నగువాని కళ్ళెమునకు తగిలించెడి తోలుటకైన తాళ్ళు :-
[10.1-20.1-ఆ.]

2941} పచ్చవిలుకాడు  - పచ్చని (చెఱుకుగడ) విల్లు కలవాడు, మన్మథుడు :-
[9-47-క.]

2942} పటు - పటుతరము పటుతమము :-
[1-374-చ., 7-173-చ., 8-121.1-ఆ.]

2943} పటువు - పటుతరము పటుతమము :-
[10.1-1622-క.]

2944} పట్టము  - రాజ్యాభిషేక కాలమున నుదట కట్టెడు పట్టీ :-
[1-385.1-ఆ.]

2945} పట్టాభిషేకము  - రాజ్యాధికారము స్వీకరించు సమయమున చేసెడి పట్టము కట్టుట అభిషేకము మొదలైన కర్మములు, రాజ్యాధికారదత్తము :-
[4-409.1-తే.]

2946} పతంగ  - సూర్యుడు, పక్షి, వ్యు. పత్+గమ్+డ, పతన్ ఉత్ప్లవన్ గచ్ఛతి] ఎగురుతూ వెళ్లునది. :-
[5.2-30-వ.]

2947} పతంగపుంగవవిహారుడు  - పతంగ పుంగవ (పక్షులలో ఉత్తముడు గరుత్మంతుడు) పై విహారుడు (విహరించెడి వాడు), విష్ణువు :-
[6-173-చ.]

2948} పతకము  - మెడలోని హారమునకు వేళ్ళాడు బిళ్ళ :-
[10.1-1587.1-తే.]

2949} పతగరాజు  - పతంగ (పక్షుల)కు రాజు, గరుత్మంతుడు :-
[5.2-119-వ.]

2950} పతత్రి  - రెక్కలు గలది, పక్షి వ్యు. పత్+అత్రిన్, పతన్ గచ్ఛతి, ఎగురుతూ వెళ్లునది. పక్షి. :-
[5.2-62-వ.]

2951} పతాకకరభావము  - జండావలె బొటకనవేలు తప్ప తక్కినవేళ్ళన్నియు చాచి పట్టునది, శ్లో. అంగుళ్యఃకుంచితైంగుష్టా స్సంశ్లిష్టాః ప్రసృతాయది, సపతాకకరఃప్రోక్తోనృత్యకర్మవిశారదైః.. రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

2952} పతాకాత్రితయము  - 1సత్త్వ 2రజః 3 తమః అనెడి త్రిగుణములు (సంకేతము) :-
[4-771.1-తే.]

2953} పతిదైవతశీలసమంచిత  - పతియే దైవముగ భావించెడి శీలము గలామె, పతివ్రత :-
[4-836-క.]

2954} పతివ్రత  - పతినే దైవముగా వ్రతముగా నిష్ఠకలయామె, పతిదైవత శీల సమంచిత, పతియే దైవతముగా ధరించెడి శీలము (స్వభావము)తో చక్క నామె :-
[4-662-వ., 4-837-తే., 7-416.1-ఆ., 10.2-267-ఉ.]

2955} పత్నీశాల  - యజమాని భార్య యొక్క శాల :-
[4-118-వ.]

2956} పదకొండుయింద్రియములు  - 5 జ్ఞానేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. 5 కర్మేంద్రియములు పాయుము, ఉపస్తు, చేతులు, కాళ్ళు, నోరు మరియు మనస్సు :-
[2-68.1-తే.]