పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (జంగమ - డోలాపాద)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


1654} జంగమములు  - కదలిక ఉన్న జీవులు, జంతువులు :-
[1-435-వ., 3-432.1-తే., 3-1019-మ.]

1655} జంగమములు  - తిరుగునది, చరిష్ణువు, జంతువులు, పక్షులు :-
[3-997-వ.]

1656} జంఘాలుడు  - పిక్క గట్టి కల వాడు, మిక్కిలి వేగంగా నడచువాడు. :-
[1-412-శా.]

1657} జంతువు  - పుట్టుక కలది, వ్యు. జన్+తు, జన్యతే శరీరాది ధారణేన ప్రాదుర్భవతి, శరీరాదులు ధరించి పుట్టునది. జీవుడు; ప్రాణి. :-
[1-326-వ.]

1658} జంభవిరోధి  - జంభాసురునికి శత్రువు, ఇంద్రుడు :-
[4-464-చ.]

1659} జంభవైరి  - జంభాసురునికి శత్రువు, ఇంద్రుడు :-
[4-442.1-తే., 4-467.1-తే.]

1660} జంభాంతకుడు  - జంభాసురుని సంహరించిన వాడు, ఇంద్రుడు. :-
[10.1-946-మ.]

1661} జంభారి  - జంభాసురుని అరి (శత్రువు), ఇంద్రుడు :-
[6-397.1-ఆ., 6-420-వ., 8-690-మ., 11-67-క.]

1662} జగతీజము  - జగతి (నేల) యందు జము (పుట్టినది), చెట్టు :-
[4-610-చ., 10.1-791-మ.]

1663} జగతీనాథుడు  - జగతి (భూమికి) నాథుడు (పతి), రాజు. :-
[6-152-మ., 8-213-క.]

1664} జగతీరుహము  - భూమిపై పుట్టునది, చెట్టు :-
[10.2-545-క.]

1665} జగతీశుడు  - జగతి (భూమి)కిన్ ఈశుడు (ప్రభువు), రాజు :-
[4-407-క., 10.2-84.1-ఆ.]

1666} జగతీసురుడు  - భూలోకమునకు దేవుడు, బ్రాహ్మణుడు :-
[10.1-1701.1-ఆ.]

1667} జగత్  - జాయతే గచ్చతి ఇతి జగత్ (వ్యుత్పత్తి), జనన లయములు గల పదునాలుగు లోకములు :-
[10.1-1236-దం.]

1668} జగత్పతి  - లోకములకు ప్రభువు, కృష్ణుడు, విష్ణువు :-
[1-190-మత్త., 2-236-మ.]

1669} జగత్పరిపాలనుడు  - జగత్ (విశ్వము)ను పరిపాలించువాడు, విష్ణువు :-
[3-572-చ.]

1670} జగత్పవిత్రుడు  - సకల భువనములను పవిత్రము చేయువాడు, విష్ణువు :-
[3-284-మ.]

1671} జగత్ప్రాణుడు  - సర్వలోకములకు ప్రాణము రూపమున ఉండువాడు, వాయువు :-
[10.1-1060-మ., 10.1-1162-శా., 10.1-1341-శా.]

1672} జగత్రయము  - ముల్లోకములు, 1స్వర్గలోకము 2మర్త్యలోకము 3పాతాళలోకము :-
[6-425-వ.]

1673} జగదంతర్యామి  - విశ్వము అందు అంతను వ్యాపించినవాడు, శంకరుడు :-
[3-473-వ.]

1674} జగదధీశ్వరుడు  - జగత్ (లోకము) లన్నిటికి అధీశ్వరుడు (సర్వోత్కృష్ట అధిపతి), విష్ణువు :-
[10.1-350-ఆ.]

1675} జగదభిరాముడు  - జగత్ (లోకములకు) అభి (మిక్కిలి) రాముడు (అందమైనవాడు), రాముడు :-
[8-1-క.]

1676} జగదవనవిహారుడు  - జగత్తును అవన (రక్షించుట)కై విహరించువాడు, రాముడు :-
[9-735-మాలి., 12-53-మాలి.]

1677} జగదాత్ముడు  - జగత్తు తన స్వరూపమైన వాడు :-
[2-93-ఉ., 3-373-మ., 3-439-ఉ.]

1678} జగదాధారుడు  - జగత్తునకు ఆధారభూత మైనవాడు, విష్ణువు. :-
[4-579-క., 10.1-675-క.]

1679} జగదీశుడు  - జగత్తు (లోకముల)కు ఈశ (ప్రభువు), విష్ణువు :-
[4-555.1-తే., 6-344-క., 6-438-చ., 7-193-ఉ., 8-477-మ., 10.1-622-ఉ., 10.1-1180.1-ఆ.]

1680} జగదీశ్వరుడు  - జగత్తునకు ఈశుడు (ప్రభువు), శ్రు. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏనజాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి, లోక స్థితి లయ కారణుడు, ఆదిశేషుడు, విష్ణువు :-
[4-276-చ., 7-108-ఉ., 7-334-క., 10.1-860-క., 10.1-869-వ.]

1681} జగదేకకీర్తి  - లోకముల అంతటిచేతను కీర్తింపబడువాడు, విష్ణువు :-
[3-423.1-తే.]

1682} జగదేకనాథుడు  - లోకములన్నిటికి ప్రధానతరమైన ప్రభువు, విష్ణువు :-
[11-36-క.]

1683} జగదేకప్రభువు  - విశ్వము సమస్తమునకు ప్రధాన ప్రభువు, విష్ణువు :-
[3-220-క.]

1684} జగదేకమాన్యచరితుడు  - భువనము లంతకును3 గౌరవింప దగినవాడు, విష్ణువు :-
[3-293.1-తే.]

1685} జగద్గీతకీర్తి  - లోకముచే గానము చేయబడిన కీర్తికలవాడ, విష్ణువు :-
[3-203-దం.]

1686} జగద్గురుడు = సకల లోకాలనుకాపాడువాడు, విష్ణువు - :-
[8-152-క.]

1687} జగద్గురుడు  - జగత్తు (విశ్వము) అంతటికి గురువైనవాడు (పెద్దవాడు), విష్ణువు :-
[5.2-74.1-తే.]

1688} జగద్గురువు  - జగత్తు (విశ్వము) అంతటికి గురువైనవాడు (పెద్దవాడు), విష్ణువు :-
[6-494-వ.]

1689} జగద్భరితుడు  - జగత్తును భరించెడివాడు, విష్ణువు :-
[2-110-మ., 4-963.1-తే.]

1690} జగద్భరితుడు  - విశ్వమును భరించు వాడు :-
[5.1-95.1-తే.]

1691} జగద్భర్త  - జగత్తు నకు భర్త (ప్రభువు), శంకరుడు :-
[3-473-వ.]

1692} జగద్వినుతయశుడు  - విశ్వమున వినుత (ప్రసిద్ధమైన) యశస్సు కలవాడు, శివుడు :-
[4-138.1-తే.]

1693} జగన్నాథుడు  - జగత్ (భువనములకు) నాథుడు (ప్రభువు), విష్ణువు :-
[3-203-దం., 6-221-వ., 7-12-మ., 8-659.1-తే., 9-226-మ., 11-57.1-తే.]

1694} జగన్నియంత  - లోకములను నియమించువాడు, భగవంతుడు :-
[2-272.1-ఆ.]

1695} జగన్నిర్మాత  - జగత్తును నిర్మాత (సృష్టించినవాడు), బ్రహ్మ :-
[7-85-మ.]

1696} జగన్నివాసుడు  - జగత్ (విశ్వము)లకు నివాసుడు (నివాసమైనవాడు), విష్ణువు :-
[3-31-ఉ., 3-718.1-తే., 3-924.1-తే., 11-66-చ.]

1697} జగన్నుతచారిత్రుడు  - జగత్ (లోకములచే) నుత (కీర్తింపబడు) చారిత్రుడు (చరిత్ర కల వాడు), శివుడు :-
[4-149.1-తే.]

1698} జగన్మాత  - జగత్తు (లోకముల)కు మాత (తల్లి), పార్వతి :-
[6-499-వ.]

1699} జట  - వేదము చెప్పుటలో విశేషము జట, ఘన :-
[8-539-క.]

1700} జఠరాగ్ని  - కడుపులోని ఆహారమును జీర్ణముచేయు అగ్ని :-
[4-26-వ.]

1701} జడము X చైతన్యము - :-
[2-139-వ.]

1702} జడిపించు  - జళిపించు, ఆడించు :-
[1-432-వ.]

1703} జనకజ  - జనకునికి పుట్టినామె, సీత :-
[9-266-క.]

1704} జనకనందన  - జనకుని పుత్రిక, సీత :-
[9-269.1-తే.]

1705} జనకవచోలబ్ధవిపినశైలవిహారుడు  - తండ్రి మాటవల్ల లభించిన అరణ్యాలలో పర్వతాలలో సంచారము కలవాడు, రాముడు :-
[9-734-క., 12-52-క.]

1706} జనకసుతాహృచ్చోరుడు  - జనకునిపుత్రిక సీత హృదయము దోచుకొన్నవాడు, రాముడు :-
[9-734-క., 12-52-క.]

1707} జనకాత్మజ  - జనకుని పుత్రిక, సీత :-
[2-162-చ.]

1708} జనకాత్మభవాననపద్మమిత్రుడు  - జనకాత్మభవ (సీతాదేవి యొక్క) ఆనన (ముఖము అను) పద్మమునకు మిత్రుడు (సూర్యుడు), శ్రీరాముడు :-
[10.2-1340-చ.]

1709} జనకాదిమహీశ్వరాతిశయసంచారుడు  - జనకుడు మున్నగు రాజర్షులను మించిన ప్రవర్తన కలవాడు, రాముడు . :-
[9-734-క.]

1710} జనకామితమందారుడు  - ప్రజల కామితములు తీర్చు కల్పవృక్షము వంటివాడు, రాముడు :-
[9-734-క., 12-52-క.]

1711} జనకుడు  - జననమునకు కారణమైనవాడు, తండ్రి, జనపథాధిపతి, ఒకానొక రాజు, సీతాదేవి తండ్రి :-
[3-219-తే., 4-101.1-తే., 10.2-1184-వ.]

1712} జననసంస్థితిసంహారచతురచిత్తుడు  - జనన (సృష్టి) సంస్థితి (స్థితి) సంహార (లయ) చతుర (నైపుణ్యము కల) చిత్తుడు (చిత్తముకలవాడ), విష్ణువు :-
[8-702.1-తే.]

1713} జననస్థితిలయకారణులు  - జనన సృష్టి; స్థితి స్థితి; లయ లయములకు; కారణులు కారణభూతులు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, పరమశివుడు. :-
[4-9-క.]

1714} జననాథుడు  - జన (ప్రజల) కు నాథుడు (ప్రభువు), రాజు :-
[4-3.1-తే., 4-432-వ., 5.1-113.1-ఆ., 5.2-101.1-ఆ., 8-121.1-ఆ., 10.1-280.1-ఆ., 10.2-113-క.]

1715} జననాదికనిత్యదుఃఖచయసంహారుడు  - పుట్టుక మొదలైన నిత్యము కలిగెడి దుఖ సముదాయములను తొలగించువాడు, రాముడు. :-
[12-52-క.]

1716} జననాయక  - జనులకు నాయకుడు, రాజు :-
[4-67-క., 7-8-క.]

1717} జనని  - జన్మను ఇచ్చిన ఆమె, అమ్మ :-
[3-1004-క.]

1718} జనపతి  - జనులకు (ప్రజలకు) పతి (ప్రభువు), రాజు :-
[4-783-క.]

1719} జనపాలుడు  - జనులను పాలించు వాడు, రాజు :-
[1-78-వ., 4-528-క., 4-973-క., 6-192-వ.]

1720} జనభర్త  - జనుల ప్రభువు, రాజు :-
[9-541-ఉ.]

1721} జనయిత్రి  - జననమును ఇచ్చినామె, తల్లి :-
[3-998-క.]

1722} జనలోకేశ్వరుడు  - జన(ప్రజలు) లోక (అందర)కు ఈశ్వరుడు(ప్రభువు), రాజు :-
[7-44-మ.]

1723} జనవరుడు  - జన (ప్రజల)కు వరుడు (పతి), రాజు :-
[4-603-క., 6-63-క.]

1724} జనవరేణ్యుడు  - జనులచే వరేణ్యుడు (పూజింపదగినవాడు), రాజు. :-
[3-123.1-తే., 4-615-తే., 4-854.1-తే., 7-297.1-తే., 10.2-84.1-ఆ.]

1725} జనవిభుడు  - జన (ప్రజల)కు విభుడు (ప్రభువు), రాజు :-
[4-748-క., 6-446.1-తే., 8-739-ఆ., 9-90-క.]

1726} జనాధిపసూనుడు  - జనాధిప (రాజు యొక్క) సూనుడు (పుత్రుడు), రాకుమారుడు :-
[4-940-చ.]

1727} జనార్దనుడు  - 1.సం.విణ.లోక హింసకరుడు, వ్యు. 2. (జనైః అర్ద్యతే యాచ్యతే జన + అర్ద + ల్యూట్) కృ. ప్ర. జనులచే పురుషార్థ విషయమై కోరబడువాడు. 3. వ్యు. (జనాన్ అర్దయతి) (సమస్త)జనులకును అర్దనుడు (గమ్యమైన వాడు), విష్ణువు. 4. వ్యు. జనన మరణాద్యర్థియతీ నాశయతీతి, జనన మరణములను పోగొట్టు వాడు, (వాచస్పతము), జనులను రక్షించువాడు, విష్ణువు :-
[3-627-చ., 3-666-చ., 3-759-వ., 3-833-క., 4-877.1-తే., 7-217-వ., 7-386-మ., 8-477-మ., 10.1-1145-ఉ., 10.1-1488-మ., 11-77-వ., 12-18-వ.]

1728} జన్మకర్మములు  - ఆగామికర్మములు (పుణ్య, పాపపు పనులు ఫలితము ఇంకను ప్రారంభింపబడనివి) సంచితకర్మములు (కూడబెట్టబడి ఫలితము ప్రారంభింపబోవునవి) ప్రారబ్ధ కర్మములు (ఫలితము ప్రారంభించినవి), జన్మహేతువులైన కర్మములు, జన్మసంశ్రయములు :-
[10.1-1450.1-ఆ.]

1729} జన్మలెత్తు  - పునర్జన్మలు పొందుట. :-
[10.1-1711.1-ఆ.]

1730} జన్మసంశ్రయములు  - జన్మపొందుటకు హేతువులైన ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మములు :-
[10.1-1504.1-ఆ.]

1731} జపము  - నియమించుకొని మరల మరల స్మరించుట, ఏకాగ్రమననము :-
[2-62-చ., 4-684-వ., 10.2-1198-వ.]

1732} జమదగ్నిరాముఁడు  - జమదగ్ని యొక్క కొడుకైన రాముడు, పరశురాముడు :-
[10.2-1037.1-తే.]

1733} జమునిగూడు  - జముని (యముని) కూడు (కలియు), మరణించు :-
[7-326-క.]

1734} జయంతుడు  - జయించు వాడు, విష్ణువు, ఇంద్రుని పుత్రుడు, వ్యు. జీ+ఝచ్, జయతి అసౌ. జయించు వాడు :-
[11-77-వ.]

1735} జయవిజయులు  - వైకుంఠమున విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు :-
[3-524-వ., 3-579-తే.]

1736} జయుడు  - జయము కలవాడు :-
[4-390-వ.]

1737} జరాతనయుడు  - మగధ దేశపురాజు, బృహద్రథుని కొడుకు నిలువుగా చీలిన రెండు ముక్కలుగా పుట్టుటచే తల్లి పారవేయగా జర అను రాక్షసిచేత రెండు భాగములు అతకబడి బతికిన వాడు, జరాసంధుడు :-
[10.1-1627-మ., 10.2-713-చ.]

1738} జరాసంధుడు  - మగధ దేశపురాజు, బృహద్రథుని కొడుకు నిలువుగా చీలిన రెండు ముక్కలుగా పుట్టుటచే తల్లి పారవేయగా జర అను రాక్షసిచేత రెండు భాగములు అతకబడి బతికిన వాడు, జరాసంధుడు :-
[3-129.1-తే., 10.1-1524-వ.]

1739} జరాసుతుడు  - మగధ దేశపురాజు, బృహద్రథుని కొడుకు నిలువుగా చీలిన రెండు ముక్కలుగా పుట్టుటచే తల్లి పారవేయగా జర అను రాక్షసిచేత రెండు భాగములు అతకబడి బతికిన వాడు, జరాసంధుడు :-
[3-92-చ.]

1740} జలచరము  - నీటతిరుగునది, చేప మొసలి మున్నగు జంతువులు :-
[6-257.1-తే., 8-695-వ., 11-99-వ.]

1741} జలజగర్భుడు  - జలజ (పద్మము) అను గర్భమున పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు :-
[2-241-ఆ., 3-716.1-తే.]

1742} జలజనాభుడు  - జలజ (పద్మము) నాభుడు (బొడ్డున కలవాడు), విష్ణువు :-
[2-263-తే., 10.2-260-ఆ.]

1743} జలజనేత్ర  - జలజము (పద్మము) వంటి కన్నులు ఉన్నామె, స్త్రీ. :-
[4-69.1-తే.]

1744} జలజనేత్రుడు  - జలజము (పద్మము)ల వంటి నేత్రములు (కన్నులు) కలవాడు, విష్ణువు :-
[3-790-ఆ., 9-161.1-తే., 10.1-592.1-ఆ., 10.1-592.1-ఆ.]

1745} జలజబంధుడు - జలజము (పద్మము)నకు బంధుడు, సూర్యుడు :-
[9-8.1-తే.]

1746} జలజభవసుతుడు  - జలజభవ (బ్రహ్మదేవుని) సుతుడు, నారదుడు :-
[10.2-626-క.]

1747} జలజభవాదిదేవమునిసన్నుతుడు  - జలజభవ (బ్రహ్మ) ఆది (మొదలైన) దేవతలు, మునులు చే (సన్నుతుడు) స్తుతింపబడువాడు, కృష్ణుడు :-
[5.2-165-చ.]

1748} జలజభవుడు  - జలజము (పద్మము)న భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[3-779-క., 4-442.1-తే., 8-228-క.]

1749} జలజము  - జలమున పుట్టునది, పద్మము :-
[2-188.1-తే., 3-77-క., 3-573.1-తే.]

1750} జలజలోచన  - పద్మముల వంటి కన్నులామె, స్త్రీ :-
[10.2-603-తే.]

1751} జలజాక్షి  - పద్మముల వంటి కన్నులామె, స్త్రీ :-
[10.1-1692.1-ఆ.]

1752} జలజాక్షుడు  - జలజ (పద్మముల) వంటి కన్నులు ఉన్నవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[1-265-క., 3-311.1-తే., 4-206-క., 4-367.1-తే.]

1753} జలజాతనేత్రుడు  - జలజాతము (పద్మముల)వంటి నేత్రములు గలవాడు, విష్ణువు :-
[6-485-శా.]

1754} జలజాతప్రభవుడు  - జలజాత (పద్మమున) ప్రభవుడు (ఉద్భవించినవాడు), బ్రహ్మ :-
[7-386-మ.]

1755} జలజాతభవుడు  - జలజాత (పద్మము యందు) భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[1-294.1-తే.]

1756} జలజాతము  - జలమున పుట్టినది, పద్మము :-
[3-307.1-తే.]

1757} జలజాతములు  - జలమున పుట్టునవి (జాతంబులు), పద్మములు :-
[3-220-క.]

1758} జలజాతాక్షుడు  - జలజాత (పద్మములవంటి) అక్షుడు, కృష్ణుడు, విష్ణువు :-
[1-244-మ., 1-259-ఉ., 3-663-క., 3-704-చ., 6-171-క., 8-604-మ., 12-36-మ.]

1759} జలజాప్తుడు  - జలజ (పద్మము) నకు ఆప్తుడు, సూర్యుడు :-
[3-275.1-తే.]

1760} జలజేక్షణుడు  - జలజముల వంటి ఈక్షణములు (కళ్ళు)కలవాడు, విష్ణువు. :-
[10.1-592.1-ఆ., 10.1-592.1-ఆ.]

1761} జలదశ్యాముడు  - జలదము (మేఘము) వలె శ్యాముడు (నల్లగ ఉన్నవాడు), విష్ణువు. :-
[3-633-క.]

1762} జలధరము  - జలమును ధరించునది మేఘము. :-
[2-184-తే., 10.1-112.1-తే.]

1763} జలధి  - జలము (నీటి)కి నిధి (నివాసము) ఐనది, సముద్రము :-
[3-615-క., 3-637.1-తే., 4-29.1-తే., 8-215-క., 8-224.1-తే., 8-706.1-ఆ., 8-719-వ., 9-323-ఆ., 10.1-340-క., 10.1-559-క., 10.1-1321-వ., 10.2-4-వ.]

1764} జలధికన్య  - జలధి (సముద్రము) యొక్క కన్య (పుత్రిక), లక్ష్మీదేవి :-
[6-6-క.]

1765} జలధిపతి  - జలధి (సముద్రము)నకు అధిపతి, వరుణుడు :-
[4-426-క.]

1766} జలధిసుత  - అమృత మథన కాలమందు సముద్రమున పుట్టిన దేవి, లక్ష్మీదేవి :-
[11-72.1-తే.]

1767} జలనిధి  - జలము (నీటి)కి నిధి (నివాసము) ఐనది, సముద్రము :-
[2-164-క., 3-8-క., 3-79-వ., 4-222-క., 5.2-15-క., 10.1-1607-క.]

1768} జలపతి  - నీటికి అధిపతి, వరుణుడు :-
[4-442.1-తే.]

1769} జలప్రాశనము  - నీరు ఆహారముగా తీసుకొనుట, :-
[10.1-1113-వ.]

1770} జలరాశి  - ఎక్కువ జలము రాశిగా ఉన్నది, సముద్రము :-
[3-420-మ.]

1771} జలరుహగర్భుడు  - జలరుహము (పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు :-
[4-492-చ.]

1772} జలరుహజాతాండము  - బ్రహ్మ (జలరుహజాత) అండము, బ్రహాండము :-
[3-206-క.]

1773} జలరుహనాభుడు  - జలరుహ (పద్మము) బొడ్డున కలవాడు, విష్ణువు :-
[3-173.1-తే.]

1774} జలరుహము  - జలమున పుట్టినది, పద్మము :-
[3-158-క.]

1775} జలరుహాక్షుడు  - జలరుహము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు గలవాడు), విష్ణువు :-
[6-342-ఆ.]

1776} జలవేలాకీర్ణము  - జలముతో తీరంవరకు ఎడములేక నిండియున్నది, సముద్రము :-
[3-182-మ.]

1777} జలాదివిలక్షణత్రయము  - జలము వాయువు అగ్ని :-
[3-896-వ.]

1778} జలాదులు  - 1పృథ్వి 2జలము 3 అగ్ని 4 వాయువు 5ఆకాశము 6అహంకారము 7మహత్తు అనునవి :-
[3-897.1-తే.]

1779} జలాశయము  - జలమునకు ఆశ్రయము ఐనది, సరస్సు :-
[3-815-తే.]

1780} జలేశుడు  - నీటికి ప్రభువు, వరుణుడు :-
[8-224.1-తే.]

1781} జల్పనము  - ఉపయుక్తముకాని, పెక్కు మాటలాడుట, వదరుట, వాచాలత్వము :-
[8-531-శా.]

1782} జవనికాంతరితుడు  - తెర వెనుక నుండి ఆడించెడి వాడు :-
[10.2-1122-వ.]

1783} జాంబవతీనందనుడు  - జాంబవతి అందు కృష్ణునికి జన్మించిన వాడు, సాంబుడు :-
[10.2-561-వ.]

1784} జాంబూనదము  - మేరుపర్వత సమీపమున ఉన్న నేరేడుపండ్ల రసముచే పాఱిన నది యందు పుట్టినది, బంగారము :-
[10.2-201-వ.]

1785} జాడ  - పోయిన దారి చూపు చిహ్నములు, ఆనవాళ్ళు :-
[10.2-60-మ.]

1786} జాతకర్ణుడు  - ఒక మహర్షి, ఇతఁడు శాకల్యుని శిష్యుఁడు, పుట్టుకచే కర్ణునివంటివాడు, సూర్యవంశంలోని అగ్నివేశుడు అను దేవదత్తుని కుమారుడు. కానీనుడు అనబడి జాతకర్ణుడు అను పేర మహర్షిగా విలసిల్లాడు. :-
[9-42-వ.]

1787} జాతకర్మ  - వ్యు. జ్యాతే కర్మ, షోడశకర్మములలో శిశువు పుట్టినప్పుడు చేయు కర్మము :-
[9-347-వ., 9-623-వ., 10.1-173-వ.]

1788} జాతవేదుడు  - పుట్టిక తోనే వేదములను తెలుసుకున్న వాడు, అగ్నిదేవుడు :-
[8-155-వ.]

1789} జాతులు  - సంగీతము నందలి పారిభాషిక పదము, తాళ భేదములు :-
[2-188.1-తే.]

1790} జామదగ్న్యుడు  - జమదగ్ని పుత్రుడు, పరశురాముడు :-
[9-476-ఆ.]

1791} జాయ  - పెండ్లాము, భార్య, వ్యు. జాయతే అస్యామ్ల జనీ ప్రాదుర్భావే జనీ + యక్, కృ.ప్ర., పతి ఈమె యందు పుత్ర రూపంగా మరలా పుట్టుటచే ఈ వ్యవహారము :-
[10.2-492.1-తే.]

1792} జారుడు  - పరస్త్రీ సంగమము చేయువాడు, వ్యభిచారి :-
[10.1-969-మ.]

1793} జితాత్మకసాధువు  - చిత్తమనెడి ఆత్మను జయించిన సాధు స్వరూపుడు, ఆత్మకము (స్వరూపము అను బంధము) జయించిన సాధుస్వరూపుడు, విష్ణువు :-
[4-704-తే.]

1794} జితారి  - జయింపబడిన శత్రువులు కలవాడు, అర్జునుడు. :-
[1-352-క.]

1795} జితాశ్వుడు  - జిత (జయించిన) అశ్వము కలవాడు, పృథుని కొడుకు :-
[4-519-వ.]

1796} జితేంద్రియులు  - ఇంద్రియములను జయించినవారు :-
[11-36-క.]

1797} జిష్ణుడు  - జయశీలము గలవాడు, కృష్ణుడు. :-
[1-207-క., 8-94-ఆ., 10.1-109-క., 10.1-187-ఉ., 10.1-579-క., 10.1-948-వ.]

1798} జిష్ణువు  - జయశీలము గలవాడు, కృష్ణుడు. :-
[4-702.1-తే., 8-105-మ., 10.1-1182-శా., 10.2-906-క.]

1799} జిహ్మగము  - వంకరగా పోవునది, సర్పము :-
[6-259.1-తే.]

1800} జీవతృప్తుడు  - జీవమనెడు తృప్తము (పురోడాశము, యజ్ఞార్థమైన ఆపూపము) కలవాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

1801} జీవన్ముక్తి  - జీవించి యుండగనే కలిగెడు ముక్తి :-
[3-1041-క., 6-347-వ.]

1802} జీవన్మృతుడు  - జీవించియున్నను మరణించినవాడు, జీవచ్చవము :-
[5.1-145.1-తే.]

1803} జీవాత్మ  - జీవులలో నుండెడి జీవి (ఆత్మ) :-
[5.1-155-వ., 10.1-568-వ.]

1804} జీవాత్మస్వరూపకుడు  - సకల జీవులలోన ఉండెడి ఆత్మయే తన రూపైన వాడు, శ్లో. ప్రకృతిం పురుషంచైవ క్షేత్రం క్షేత్రమేవచ, ఇందం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతితద్విదః, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వ క్షేత్రేషు భారత (భగవద్గీత), అర్జునా క్షేత్రమనగా ప్రకృతి, ప్రకృతి అనగా దేహము, దానిని తెలియువాడు క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞుడను నేనని తెలియుము, విష్ణువు :-
[10.1-568-వ.]

1805} జీవితేశుడు  - జీవితమునకు ఈశుడు (ప్రభువు), భగవంతుడు :-
[6-480.1-తే.]

1806} జీవుడు  - జీవము ఉన్నవాడు, మానవుడు :-
[2-266.1-తే.]

1807} జీవులు  - జీవనము (జ పుట్టుక, న మరణములకు మధ్య కాలము) కలవారు, సకల ప్రాణులు. :-
[2-222-వ.]

1808} జుఱ్ఱుట  - ఇష్టముతో కూడిన ఆత్రుత కలిగి పీల్చుకొనుచు తినుట యందలి శబ్దానుకరణము జుఱ్ఱు. అట్టి జుఱ్ఱు అని శబ్దము తో పీల్చుకొనుచు తినుట జుఱ్ఱుట :-
[4-386-క.]

1809} జేగీయమానము  - జయజయ ధ్వానములు కలది, కొనియాడబడునది :-
[10.2-439-వ.]

1810} జేన, జాన  - బాగా సాచిన బొటకనవేలు చిటికినవేలుల చివర్ల మధ్య దూరము, (సుమారు 10 అంగుళము లుండును), అంగుష్ట, బెత్త, జాన, మూర, బార లేదా నిలువు అను కొలమానము లోని జాన, 7 జానలు 1.మనిషి నిలువు/ఎత్తు 2.బార కు సమానము అని శాస్త్ర ప్రమాణము :-
[2-91.1-ఆ., 10.1-557.1-తే.]

1811} జైవాతృకుడు  - దీర్ఘాయువు, చంద్రుడు :-
[9-664-క.]

1812} జోకనార్చు  - జోకను (ఉత్సాహముతో) అర్చు (అరచుట), గర్జించు :-
[6-321-మత్త.]

1813} జ్ఞానక్రియారూపుడు  - తత్త్వజ్ఞానము వేదక్రియలు స్వరూపము యైనవాడు, విష్ణువు :-
[4-705-వ.]

1814} జ్ఞానపురుషుండు  - జ్ఞానమే పురుషరూపము అయినవాడు, విష్ణువు :-
[3-1025-వ.]

1815} జ్ఞానము  - పరావిద్య, ఆధ్యాత్మికమైన విషయములను తెలుపునది :-
[3-845.1-తే.]

1816} జ్ఞానేంద్రియములు - 1చెవులు 2కళ్ళు 3నాలుక 4చర్మము 5ముక్కు :-
[7-237-వ.]

1817} జ్ఞానేంద్రియములు  - 1త్వక్ 2చక్షుస్ 3శోత్ర 4జిహ్వ 5ఘ్రాణములు, పాఠ్యంతరము 1చెవులు 2కళ్ళు 3నాలుక 4చర్మము 5ముక్కు :-
[1-403-వ., 2-112-వ., 6-88-వ.]

1818} జ్ఞానోదయము  - జ్ఞానము కలిగి ఉండుట :-
[5.1-155-వ.]

1819} జ్యోతిశ్చక్రము  - గ్రహనక్షత్రాదులైన జ్యోతిర్మండల భ్రమణము గల చక్రము, అంతరిక్షము :-
[4-379-వ., 5.2-86-వ.]

1820} ఝంఝా  - ఝంఝం అని చప్పుడు చేస్తు వీస్తున్న గాలి, ఝంఝామారుతము :-
[3-462-మ.]

1821} డగ్గుతిక  - దుఃఖాదులచే నోట మాట వెడలుటలోని ఇబ్బంది, గొంతు బొంగురు పోవుట :-
[10.1-1445-క.]

1822} డాకిని  - దాగి ఉండు స్త్రీ పిశాచభేదము :-
[2-274.1-తే., 10.1-1757-వ., 10.2-405-చ.]

1823} డాపలజన్నమరినవేల్పు  - డాపల (ఎడమ ప్రక్కన) చన్ను (స్తనము) అమరిన (చక్కగా నున్న) వేల్పు (దేవుడు), శివుడు :-
[6-177-క.]

1824} డామరము  - కొల్ల మొదలగు దేశోపద్రవము, హావడి, ఉపద్రవము :-
[12-20-వ.]

1825} డిండిమము  - రాయడిగిడిగిడిమను వాద్యవిశేషము :-
[10.2-801.1-తే.]

1826} డొక్కరము  - మూపుమీద మోకాళ్ళు మోపి చేతులతో అణచిపట్టుట, మల్లపోరు పారిభాషిక పదం :-
[10.1-1348-వ.]

1827} డోలాపాదవ్యోమాచారి  - కాలు పైకి ఎత్తి ఊపిఊపి అడుగు లుంచుట, రాసక్రీడా పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]