పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (హంస - హ్రీ)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


5738} హంస  - (1) బ్రహ్మదేవుని వాహనము, (2) సన్యాసాశ్రమములలో ఉన్నతమైనది. (3) పరమాత్మ :-
[4-16-చ.]

5739} హంసతురంగము  - హంసను తురంగము (వాహనము) గాగలవాడు, బ్రహ్మ :-
[6-3-ఉ.]

5740} హంసవాహనుడు  - హంస వాహనముగా కలవాడు, బ్రహ్మ :-
[7-86-వ.]

5741} హంసుడు  - పరమాత్మ తానైనవాడు, విష్ణువు :-
[11-77-వ.]

5742} హతదితిసుత  - సంహరించిన దితిసుతులు (దైత్యులు) కలవాడు, శ్రీకృష్ణుడు :-
[5.1-182-క.]

5743} హనుమద్వజుడు  - హనుమంతుని జండాపై కలవాడు, అర్జున :-
[1-371-క.]

5744} హయగ్రీవుడు  - హయ (గుఱ్ఱపు) గ్రీవుడు (శిరస్సు గలవాడు) :-
[2-139-వ., 7-29-వ.]

5745} హరపటుచాపఖండనుడు  - హర (శివుని) పటు (గట్టి) చాప (విల్లును) ఖండనుడు (విరిచినవాడు), రాముడు :-
[7-482-చ.]

5746} హరి  - సర్వ దుఃఖములను, పాపములను హరించు వాడు, ప్రళయకాలమున సర్వము తన గర్భమున హరించుకొనువాడు, విష్ణువు, హకారముతో కూడిన నిశ్వాసము రేఫతో కూడిన కంఠనాదము ఓంకారము :-
[1-186-వ., 1-218-వ., 1-227-మ., 2-30-వ., 2-103-క., 2-117.1-తే., 2-117.1-తే., 2-121.1-తే., 2-139-వ., 2-144-మ., 2-148-మ., 2-150.1-తే., 2-151-చ., 2-173.1-తే., 2-181-క., 2-199-వ., 2-209-చ., 2-214-మ., 2-217.1-తే., 2-225.1-తే., 2-247-చ., 2-257.1-తే., 2-262-క., 2-275-మ., 3-19-చ., 3-48-క., 3-54-క., 3-73-క., 3-99.1-తే., 3-105-క., 3-105-క., 3-143-క., 3-149-క., 3-158-క., 3-166-క., 3-196-వ., 3-212-చ., 3-222-ఉ., 3-336-తే., 3-366-క., 3-373-మ., 3-400-మ., 3-447.1-తే., 3-488-తే., 3-510-చ., 3-647-క., 3-688-క., 3-697-వ., 3-836-చ., 3-897.1-తే., 4-426-క., 6-33-క., 7-217-వ., 7-241-వ., 7-248-క., 8-18.1-ఆ., 8-116-శా., 8-477-మ., 9-15-వ., 9-82.1-తే., 9-420-క., 10.1-5-క., 10.1-11-ఆ., 10.1-16-క., 10.1-54-మ., 10.1-232-క., 10.1-543-వ., 10.1-580-వ., 10.1-670-క., 10.1-949-క., 10.1-1015.1-ఆ., 10.2-432-చ., 10.2-477-ఆ., 10.2-630-క., 10.2-630-క., 10.2-749-ఆ., 10.2-773-చ., 10.2-1204.1-తే., 11-77-వ., 11-77-వ.]

5747} హరిజుడు  - కృష్ణుని పుత్రుడు, ప్రద్యుమ్నుడు :-
[10.2-17-మ.]

5748} హరిణాక్షి  - హరిణము (లేడి)వంటి అక్షి (కన్నులు కలామె), స్త్రీ :-
[8-236-క., 10.2-174-క.]

5749} హరిణీనయన  - లేడివంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-1087-క.]

5750} హరిణీలోచన  - లేడివంటి కన్నులు కలామె, స్త్రీ :-
[10.1-1213-మ.]

5751} హరిణీసుతుడు  - విభాండకమునికి లేడి యందు కలిగినవాడు, ఋశ్యశృంగుడు :-
[9-695-వ.]

5752} హరితత్త్త్వవేది  - హరి (భగవంతుని) తత్త్వమును వేది (తెలిసినవాడు), భాగవతుడు :-
[3-157-క.]

5753} హరితత్పరుడు  - తను కానిది హరి మాత్రమే అని నడచువాడు :-
[1-140-క.]

5754} హరిదశ్వుడు  - హరిత (పచ్చని) అశ్వుడు (అశ్వములు గలవాడు), సూర్యుడు :-
[6-419-క.]

5755} హరిదిభేంద్రము  - హరిత్ (దిక్కు లందలి) ఇభ (గజము) ఇంద్రము (శ్రేష్ఠమైనది), దిగ్గజము :-
[8-40.1-తే.]

5756} హరినయన  - లేడి వంటి కన్నులు కలామె, రుక్మావతి :-
[10.2-284-వ.]

5757} హరిపదము  - విష్ణుమూర్తి స్థానము, వైకుంఠము :-
[4-668-క., 4-690-తే.]

5758} హరిమధ్య  - సింహము వంటి నడుము కల స్త్రీ :-
[4-317-మ., 10.1-837-వ., 10.1-1754-క., 10.2-28-క., 10.2-120-వ.]

5759} హరిహయదిక్కు  - ఇంద్రుని యొక్క దిక్కు, తూర్పు :-
[10.1-1615-వ.]

5760} హరిహయుడు  - 1. హరి (ఐరావతము అనెడి ఏనుగు) వాహనముగ కలవాడు, ఇంద్రుడు, 2. పచ్చని గుఱ్ఱములు కలవాడు, సూర్యుడు :-
[4-524.1-తే., 10.1-938-వ., 10.1-1025-క.]

5761} హరుడు  - లయకారుడు, ప్రళయకాలమున సర్వమును హరించువాడు, శివుడు :-
[3-465-క., 4-95-చ., 4-149.1-తే., 4-426-క., 4-697-వ., 7-387-క., 8-247-ఆ., 10.2-402-చ., 10.2-410-ఉ.]

5762} హర్యక్షము  - పచ్చకన్నుల మృగము, సింహము :-
[10.2-979.1-తే.]

5763} హర్యశ్వుడు  - హరి (పచ్చని) రంగు కల గుఱ్ఱము కలవాడు :-
[4-640-వ.]

5764} హలధరుడు  - నాగలి ఆయుధము ధరించువాడు, బలరాముడు :-
[3-105-క., 3-129.1-తే., 10.1-737-క., 10.2-298-క.]

5765} హలపాణి  - నాగలి ఆయుధము ధరించువాడు, బలరాముడు :-
[10.2-590-క.]

5766} హలాయుధుడు  - హల (నాగలి) ఆయుధము కలవాడు, బలరాముడు :-
[10.1-1561-శా., 10.1-1724-చ., 10.2-296-ఉ., 10.2-357-ఉ., 10.2-578-వ., 11-103-వ.]

5767} హలి  - హలాయుధము కలవాడు, బలరాముడు :-
[1-348.1-తే., 10.1-1564-లవి., 10.2-94-క., 10.2-417-మ., 10.2-554-క.]

5768} హవిర్ధానుడు  - హవిస్సును ధరించినవాడు, తండ్రి విజితాశ్వుడు, తల్లి నభస్వతి, భార్య హవిర్ధాని, పుత్రులు బర్హిష్మదుడు, గయుడు, శుక్రుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అని ఆరుగురు. :-
[4-675-క.]

5769} హవిర్భాగములు  - హవిస్సులు (యజ్ఞకుండమున దేవతలకై వేల్చబడిన అన్నము నెయ్యి) అందలి దేవతల వారివారి భాగములు :-
[2-16-వ., 3-742.1-తే.]

5770} హవిర్భుక్కు  - హవిస్సు (హోమద్రవ్యము) భుజించునది, అగ్ని :-
[4-26-వ.]

5771} హవిర్ముఖి  - ప్రకటమైన ముఖం కలది, గొప్ప వెలుగు కలది, కుడికన్నుకు సంకేతంగా పురంజనోపాఖ్యానంలో వాడబడింది :-
[4-768-వ.]

5772} హవిస్సు  - అగ్నిహోత్రమున హోమము చేయు ద్రవ్యములు (ఇగర్చబెట్టినఅన్నము నెయ్యి) :-
[4-394.1-తే., 4-589.1-తే., 5.2-58-వ., 9-10.1-తే.]

5773} హవ్యభుక్కు  - హవ్యములను భుజించువాడు, అగ్నిహోత్రుడు :-
[4-38-చ.]

5774} హవ్యము  - అగ్నిహోత్రమున హోమము చేయు ద్రవ్యములు (ఇగర్చబెట్టినఅన్నము నెయ్యి) :-
[3-738-వ., 4-197-మ., 7-455-వ.]

5775} హవ్యవాహనలోచనుడు  - హవ్యవాహనుడు (అగ్ని) లోచనుడు (కన్నుల గలవాడు), శివుడు :-
[4-940-చ.]

5776} హవ్యవాహనుడు  - హవిస్సులను తీసుకుపోవువాడు, అగ్నిదేవుడు :-
[2-277.1-తే., 4-682-చ., 12-34-వ.]

5777} హవ్యవాహుడు  - హవిస్సులను తీసుకుపోవువాడు, అగ్నిదేవుడు :-
[11-105-వ.]

5778} హస్తిదురవస్థావక్రి  - హస్తి (ఏనుగు యొక్క) దురవస్థ (ఆపదను) వక్రి (మరలించెడివాడు), విష్ణువు :-
[8-107-మ.]

5779} హస్తిలోకనాథుడు  - ఏనుగుల సమూహమునకు పతి, గజేంద్రుడు :-
[8-121.1-ఆ.]

5780} హాసమాత్రము  - నవ్వుఒక్కదానితో, అవలీలగా :-
[8-545-ఉ.]

5781} హింస  - మనస్సుచేగానీ, మాటచేగానీ, శరీరం చేత గానీ ప్రాణులను నొప్పించడం, చంపడం. ఇది సమంజసమైతే శిక్ష, కాకపోతే హింస. :-
[4-215-వ.]

5782} హింసనడంచుబ్రహ్మము  - హింసను అణచివేసెడి పరబ్రహ్మ, బ్రహ్మదేవుడు :-
[6-3-ఉ.]

5783} హింసాపరపరమస్తకమాంసకరాళితగదాభిమతహస్తుడు  - హింసపర (హింస యందు లగ్నమైన) పర (శత్రువుల) మస్తక (శిరస్సు లందలి) మాంస (మాంసము) కరాళిత (క్రూరము గల) గద (గదాయుధమును) అభిమత (కోరి ధరించిన) హస్తుడు (హస్తము గలవాడు), విష్ణువు :-
[6-35-క.]

5784} హితుడు  - హితము కోరెడివాడు, విష్ణువు :-
[6-438-చ.]

5785} హిమకరుడు  - చల్లదనము ఇచ్చు వాడు, చంద్రుడు :-
[2-164-క., 10.1-579-క.]

5786} హిరణ్మయాండము  - హిరణ్య (బంగారము, గొప్పతనము) మయ (నిండిన) అండము (గుడ్డు) :-
[3-719-వ.]

5787} హిరణ్యకశిపుడు  - బంగారు వస్త్రము ధరించు వాడు :-
[1-63-వ.]

5788} హిరణ్యగర్భుడు  - హిరణ్య (బంగారు అండము) నందు గర్భుడు (జనించిన వాడు), బ్రహ్మదేవుడు :-
[1-58-వ., 2-112-వ., 4-426-క., 8-658-వ.]

5789} హిరణ్యవీర్యుడు  - హిరణ్యగర్భాండమునకు వీర్యము (కారణభూతము) యైనవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

5790} హిరణ్యాక్షుడు  - హిరణ్య (బంగారము) వంటి కన్నులు ఉన్నవాడు, హిరణ్యాక్షుడు అను రాక్షసుడు :-
[3-447.1-తే.]

5791} హుతాశనుడు  - అగ్నిదేవుడు, హుత+అశ్+అణ్, హుతం ద్రవ్యం అశ్నాతి, హోమ ద్రవ్యమును భుజించువాడు. అగ్ని. :-
[2-277.1-తే., 3-631-చ., 4-589.1-తే., 4-619.1-తే., 7-295-మ.]

5792} హృదయగ్రంధి  - 1. హృదయమున ఉండు గ్రంధి (ముడి, సంధి), సందేహము, హృత్+అయమ్ ఇదిగో ఇక్కడున్నా, 2. అనాహతచక్రము :-
[3-889-వ.]

5793} హృదయబంధకములు  - హృదయమును జ్ఞానము వంక పోనీయక కట్టివేసెడివి, తగులములు :-
[7-371-వ.]

5794} హృదయేశుడు  - హృదయ (ఆత్మలకు) ఈశ (ప్రభువు), విష్ణువు, భర్త :-
[3-482-క., 8-727-క.]

5795} హృదయేశ్వరుడు  - మనసు నందు అధికారము కలవాడు, భర్త :-
[3-507-వ.]

5796} హృదీశుడు  - హృదయేశ్వరుడు, మనసునకు దేవుడు, భర్త :-
[3-458-క.]

5797} హృదీశ్వరుడు  - హృదయములకు ఈశ్వరుడు, విష్ణువు, భర్త :-
[3-930-చ.]

5798} హృద్గ్రంథి  - హృదయమునందలి యజ్ఞానము యనెడి ముడి :-
[4-619.1-తే.]

5799} హృన్నాథుడు  - హృదయమునకు ప్రభువు, భర్త :-
[9-246-శా.]

5800} హృషీకేశుడు  - హృషీకములు (ఇంద్రియములు)కు ఈశుడు, విష్ణువు, వ్యు. హృషీకేశః హృషీకాణాం (ఇంద్రియాణాం) ఈశః (నియామకుడు) :-
[1-188-వ., 2-89-వ., 3-400-మ., 4-355-వ., 7-109-వ., 7-149-తే., 8-136-వ., 10.1-236-వ., 10.1-683-వ., 10.2-427-తే., 10.2-629-ఆ.]

5801} హేతు  - ఆ అహంకార వృత్తియే జననకారణముగా గల అపంచీకృత పంచమహాభూత రూపముగా నుండుట :-
[10.1-537-వ.]

5802} హేమంతఋతువు  - మార్గశిర పుష్యమాసములు :-
[7-448-వ.]

5803} హేమక్ష్మాధరము  - హేమ (బంగారు) క్ష్మాధరము (కొండ), మేరుపర్వతము :-
[8-112-శా.]

5804} హేమగిరీంద్రచారుకోదండుడు  - హేమగిరీంద్ర (మేరుపర్వతోత్తమును) చారు (అందమైన) కోదండుడు (విల్లుగా గలవాడు), శివుడు :-
[6-2-ఉ.]

5805} హేమవాసుడు  - బంగారు అంబరములను ధరించువాడు, విష్ణువు :-
[6-124.1-ఆ.]

5806} హేమాద్రి  - బంగారు కొండ, మేరు పర్వతము :-
[3-413.1-తే.]

5807} హోత  - ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కు :-
[8-536.1-తే., 9-10.1-తే., 9-342.1-తే.]

5808} హ్రీ  - లజ్జ, హ్రీ+క్విప్, జిహ్రీయతి తస్య భావః కర్మ వా. :-
[4-28-వ.]