పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (చంచత్ - చౌలము)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


1472} చంచత్సూకరాకారుడు  - చంచత్ (చరిస్తున్న) సూకర (వరాహ) ఆకార (స్వరూపము) కలవాడు, విష్ణువు :-
[3-431-మ.]

1473} చంచరీకము  - పూలయందు చరించునది, తుమ్మెద. :-
[10.1-1456-చ.]

1474} చంచలములు  - మిక్కిలి చలించెడివి, అస్థిరములు :-
[7-241-వ.]

1475} చండ - చండతరము చండతమము :-
[10.2-283-చ.]

1476} చండకరతనయుడు  - చండకర (తీవ్రమైన కిరణములు గల సూర్యుని) తనయుడు, యముడు :-
[6-166-క.]

1477} చండకిరణుడు  - తీవ్రమైన కిరణములు కలవాడు, సూర్యుడు :-
[10.1-850-వ.]

1478} చండతరభండనుడు  - చండతర (మిక్కిలి భయంకరముగ) భండనుడు (యుద్ధము చేయువాడు), శివుడు :-
[6-2-ఉ.]

1479} చండప్రభారాశి  - తీవ్రమైన కాంతుల సమూహము కలవాడు, అగ్ని :-
[10.1-1648-మ.]

1480} చండభమార్గము  - సూర్యుని మార్గము, ఆకాశము, పైవైపు, చండ (భీకరమైన) భ (ఆకాశ, నక్షత్ర) మార్గము :-
[8-47-మ.]

1481} చండమరీచి  - భయంకరమైన ప్రకాశము కలవాడు, సూర్యుడు :-
[10.1-905-వ.]

1482} చండవేగ  - భయంకరమైన వేగము కలవాడు :-
[4-810-వ.]

1483} చండాంశుడు  - చండ (తీవ్రమైన) అంశుడు (కిరణములు కలవాడు), సూర్యుడు :-
[6-524-క., 8-533-శా.]

1484} చండిక  - అమరకుండకక్షేత్రమున చండిక, చండుడను దనుజుని సంహరించిన దేవి, పార్వతి శరీరమునుండి పుట్టిన దేవి, దుర్గ :-
[10.1-61-వ., 10.2-73-క.]

1485} చంద్రకళాధర  - చంద్రవంకను ధరించినవాడు, శివుడు :-
[4-167-చ.]

1486} చంద్రకేతువు  - 1.చంద్రుని గుర్తుకలవాడు, 2. వత్సరునికి భార్య సర్వర్థి యందు కలిగిన ఆరుగురు కొడుకులలో రెండవ వాడు, 3. లక్ష్మణుని రెండవ కొడుకు. :-
[4-390-వ.]

1487} చంద్రఖండపరిమండితమస్తకుడు  - చంద్రఖండ (చంద్రకళచే) పరిమండిత (చక్కగా అలంకరింపబడిన) మస్తకుడు (శిరస్సు గలవాడు), శివుడు :-
[6-2-ఉ.]

1488} చంద్రచూడుడు  - చంద్రకళ చూడామణిగా కలవాడు, శివుడు :-
[8-220-క.]

1489} చంద్రజూటుడు  - చంద్రుడు శిఖయందు కలవాడు, శివుడు :-
[10.2-747.1-తే.]

1490} చంద్రధరుడు  - చంద్రుని ధరించినవాడు, శివుడు :-
[4-216-క.]

1491} చంద్రబింబానన  - చంద్రబింబము వంటి ముఖము కల స్త్రీ :-
[10.2-604-తే.]

1492} చంద్రమండలశ్రీలు  - చంద్రమండలము యొక్క శ్రీలు (కాంతులు), వెన్నెల :-
[6-260.1-తే.]

1493} చంద్రముఖి  - చంద్రునివంటి మోము కల స్త్రీ :-
[1-237-మ.]

1494} చంద్రమౌళి  - చంద్రుడు శిఖయందు కలవాడు, శివుడు :-
[10.2-532-తే.]

1495} చంద్రశాల  - ఏడంతస్తులమీది ఒంటిస్తంభపు మేడ, పైమేడ, వలభి, శిరోగృహము. :-
[10.2-1323-వ.]

1496} చంద్రశేఖరుడు  - చంద్రవంక సిగదండగ కలవాడు, శివుడు :-
[4-117-తే.]

1497} చంద్రాదులు  - 1చంద్రుడు మనసునకు, 2దిక్కులు చెవికి, 3గాలి చర్మమునకు, 4సూర్యుడు కంటికి, 5వరుణుడు నాలుకకు, 6అశ్వినులు ముక్కునకు, 7అగ్ని వాక్కునకు, 8దేవేంద్రుడు హస్తమునకు, 9విష్ణువు పాదమునకు, 10మృత్యువు గుదమునకు, 11ప్రజాపతి గుహ్యమునకు అధిదేవతలు :-
[10.1-572.1-తే.]

1498} చంద్రార్థధరుడు  - అర్థచంద్రుని ధరించువాడు, శివుడు :-
[4-443.1-తే.]

1499} చంద్రావతంసుడు  - చంద్రుని వతంసుడు (సిగబంతిగా కలవాడు), శివుడు. :-
[3-561.1-తే.]

1500} చంద్రాస్య  - చంద్రుని వంటి ముఖము కలామె, స్త్రీ :-
[1-363-మ., 10.2-178-మ.]

1501} చంద్రికారుచిరశరీరి  - చంద్రిక (వెన్నెల) వంటి రుచిర (రంగు కలిగిన) శరీరి (దేహము కలవాడు), శివుడు :-
[4-16-చ.]

1502} చక్రద్వితయము  - సంకేతం పాపపుణ్యములు :-
[4-771.1-తే.]

1503} చక్రధరుడు  - చక్ర (చక్రాయుధమును) ధరుడు (ధరించువాడు), విష్ణువు :-
[6-131-ఆ., 10.2-130-ఆ.]

1504} చక్రపాణి  - చక్రము చేతిన ధరించిన వాడు, విష్ణువు :-
[2-210-ఉ., 4-460.1-తే., 10.2-414-వ.]

1505} చక్రమండలకరణము  - పాదములను కుడియెడమలుగా మార్చి ఉంచుకొని రెండుమోకాళ్ళను కౌగలించుకొనుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1506} చక్రవర్తి  - రారాజు, రాజ చక్రము సమూహమును ఏలురాజు, భూమండలమంతా అధికారము వర్తించువాడు, సార్వభౌముడు :-
[9-183-వ.]

1507} చక్రవాకుడు  - సుడిగాలివాడు, తృణావర్తుడు :-
[10.1-1331.1-తే.]

1508} చక్రవాళబంధము  - తాళమాత్రపు కాలములోపల నృత్యమండలమును చుట్టివచ్చి హాస విన్యాసాదులను చూపునట్టిది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1509} చక్రసమీరదైత్యుడు  - చక్రసమీర (సుడిగాలి) దైత్యుడు (రాక్షసుడు), తృణావర్తుడు :-
[10.1-271-శా.]

1510} చక్రస్థుడు  - గ్రహాదులు తిరుగు చక్రము (జ్యోతిష్చక్రము)న తిరుగువాడు :-
[3-346-వ.]

1511} చక్రహస్తుడు  - చక్రాయుధము హస్తుడు (చేతిలో గలవాడు), విష్ణువు :-
[7-169.1-తే., 10.2-560.1-తే.]

1512} చక్రాంకహస్తుడు  - చక్రాయుధము హస్తుడు (చేతిలో గలవాడు), విష్ణువు :-
[10.1-1648-మ.]

1513} చక్రాయుధుడు  - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు :-
[1-58-వ., 3-253-క., 5.1-175-వ., 8-100-మ., 10.2-101-క., 10.2-198-మ.]

1514} చక్రి  - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు, కృష్ణుడు :-
[1-212-ఉ., 1-279-తే., 1-353-శా., 1-376-శా., 1-404-క., 1-445.1-తే., 1-525-మ., 2-51.1-ఆ., 2-155.1-తే., 7-18-శా., 7-25-శా., 7-170.1-ఆ., 7-275-క., 7-287-ఉ., 7-345-క., 7-399-క., 8-107-మ., 9-82.1-తే., 10.1-52.1-ఆ., 10.1-168-మ., 10.1-236-వ., 10.1-945-వ., 10.1-973-మ., 10.1-1577-ఉ., 10.1-1682-మ., 10.2-49-క., 10.2-165-వ.]

1515} చక్రిసూనుడు  - కృష్ణుని కొడుకు, ప్రద్యుమ్నుడు :-
[10.2-21-క.]

1516} చక్రీశ్వరుడు  - చక్రి (సర్పములకు) ఈశ్వరుడు (ప్రభువు), ఆదిశేషుడు :-
[10.2-591-క.]

1517} చక్షురాది  - జ్ఞానేంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము :-
[2-267-వ.]

1518} చక్షుస్సు  - కన్నుయైనవాడు :-
[4-390-వ.]

1519} చటులము - చటులతరము చటులతమము :-
[10.1-737-క.]

1520} చటులము - చటుల తరము చటులతమము :-
[3-983.1-తే.]

1521} చతురంగబలము  - 1రథములు 2ఏనుగులు 3గుఱ్ఱములు 4పదాతిదళము అనెడి నాలుగు అంగములు (విభగములు) కల సేన :-
[10.1-1708-ఉ.]

1522} చతురంగబలములు  - 1రథములు 2ఏనుగులు 3గుఱ్ఱములు 4పదాతిదళము అనెడి నాలుగు అంగములు (విభగములు) కల సేన :-
[1-31-ఉ., 1-243-వ., 3-691-చ., 10.2-541.1-తే., 10.2-687-వ.]

1523} చతురంగము  - 1రథములు 2ఏనుగులు 3గుఱ్ఱములు 4పదాతిదళము అనెడి నాలుగు అంగములు (విభగములు) కల సేన :-
[1-204-వ.]

1524} చతురంగములు  - దేహమురీత్యా 1పంచభూతములు 2జ్ఞానేంద్రియములు 3కర్మేంద్రియములు 4అంతరంగచతుష్కము అనెడి నాలుగు అంగములు కలది (ఇంకొక విధముగ) యుద్ధ సేన రీత్యా 1గజ 2తురగ 3రథ 4పదాతులను నాలుగు విభాగములు కల సేన :-
[10.1-1658-క.]

1525} చతురంతఃకరణములు  - మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. :-
[1-59-క., 3-204.1-తే., 10.1-683-వ.]

1526} చతురంతయానము  - పల్లకీ, చతుర్దోలము (తెలుగు పర్యాయపద నిఘంటువు, జిఎన్ రెడ్డి), నలుగురు మోయు ఉయ్యాలవంటి వాహనము (ఆంధ్ర శబ్దరత్నాకరము) :-
[3-1046.1-తే., 10.2-1027.1-తే.]

1527} చతురనటమూర్తి  - చతుర (మిక్కిలినేర్పుగల) నటుని వంటి మూర్తి (స్వరూపము కలవాడు), కృష్ణుడు :-
[10.1-770.1-తే.]

1528} చతురాత్మతత్త్వము  - చతుర్వ్యూహముల (1వాసుదేవుడు 2సంకర్షణుడు 3అనిరుద్ధుడు 4ప్రద్యుమ్నుడు) సృష్టికి చతురహంకారములను (1మనస్సు 2బుద్ధి 3చిత్తము 4అహంకారము) ప్రసాదించిన తత్త్వము :-
[3-1033.1-తే.]

1529} చతురానననందనుడు  - చతురానన (చతుర్ముఖ బ్రహ్మ యొక్క) నందనుడు, నారదుడు :-
[10.2-623-క.]

1530} చతురాననాండము  - బ్రహ్మాండము, చతురానన (బ్రహ్మ) అండము :-
[9-230-వ.]

1531} చతురాననుడు  - చతుర్ముఖబ్రహ్మ, వ్యు. చత్వారి ఆననాని అస్య, బ.వ్రీ. నాలుగు ముఖములు కలవాడు, :-
[3-224-క., 3-275.1-తే., 3-292-వ., 3-720.1-తే., 3-1018-వ., 4-152-చ., 8-170-శా., 8-502-వ., 8-672.1-తే., 10.1-542-శా.]

1532} చతురామ్నాయవపుర్విశేషధరుడు  - చతుర (నాలుగు) ఆమ్నాయ (వేదము)లను వపుర్ (శరీర) విశేష (ప్రత్యేకతలు) వలె ధర (ధరించిన వాడు), విష్ణువు :-
[3-431-మ.]

1533} చతురాశ్రమములు  - 1బ్రహ్మచర్యము 2గార్హపత్యము 3వానప్రస్థము 4సన్యాసము అనెడి నాలుగు ఆశ్రమములు :-
[1-58-వ., 1-216-వ., 1-484.1-ఆ., 3-189.1-తే., 3-253-క., 4-51.1-తే., 7-408.1-ఆ., 10.1-96-క., 10.2-1122-వ., 11-106-క., 12-11-వ.]

1534} చతురాస్యజీవకోశము  - చతురాస్య (బ్రహ్మ) జీవకోశము (అండము), బ్రహ్మాండము :-
[9-113.1-ఆ.]

1535} చతురాస్యుడు  - నాలుగు (చతుర) ముఖము (అస్యము)లవాడు, బ్రహ్మదేవుడు :-
[3-226-క., 3-281-మ.]

1536} చతురుపాయప్రవీణుడు  - చతురుపాయములు (1సామ 2దాన 3భేద 4దండములు) అందు సమర్థుడు, కృష్ణుడు :-
[10.2-697.1-తే.]

1537} చతురోపాయములు  - 1సామ 2దాన 3భేద 4దండోపాయములు :-
[10.1-1533-మ.]

1538} చతుర్దశభువనములు  - సప్త ఊర్ధ్వలోకములు (1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము 4మహర్లోకము 5జనలోకము 6తపోలోకము 7సత్యలోకము) సప్త అధోలోకములు (1అతలము 2వితలము 3సుతలము 4రసాతలము 5మహాతలము 6తలాతలము 7పాతాళము) అను పద్నాలుగు లోకములు :-
[3-337-తే., 10.1-941-క.]

1539} చతుర్దశమనువులు  - 1స్వాయంభువుడు 2స్వారోచిషుడు 3ఉత్తముడు 4తామసుడు 5రైవతుడు 6చాక్షుసుడు 7వైవస్వతుడు 8సూర్యసావర్ణి 9దక్షసావర్ణి 10బ్రహ్మసావర్ణి 11ధర్మసావర్ణి 12భద్రసావర్ణి 13దేవసావర్ణి 14ఇంద్రసావర్ణి :-
[6-224-వ., 8-6-క., 9-3.1-తే.]

1540} చతుర్దశరత్నములు(విద్యలు)  - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము 4అధర్వణవేదము 5శిక్ష 6వ్యాకరణము 7ఛందస్సు 8నిరుక్తము 9జ్యోతిషము 10కల్పము 11మీమాంస 12న్యాయము 13పురాణము 14ధర్మశాస్త్రము :-
[9-704-మ.]

1541} చతుర్దశేంద్రియములు  - ఐదు జ్ఞానేంద్రియములు (కన్ను ముక్కు చెవి నాలుక చర్మము) ఐదు కర్మేంద్రియములు (కాళ్ళు చేతులు నోరు గుహ్యేంద్రియము గుదము) నాలుగు అంతరింద్రియములు (మనస్సు బుద్ధి చిత్తము ఆహంకారము) :-
[10.1-119.1-ఆ., 10.1-405.1-తే., 10.1-1472.1-తే., 10.1-1472.1-తే., 10.1-1779-వ.]

1542} చతుర్దిశలు  - నల్దిక్కులు, 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము :-
[9-510-ఉ.]

1543} చతుర్భద్రబంధము  - నాలుగు మూల లందును వెనుక మొగముగా నిలిచి హస్త విన్యాసదులను కనుపింప చేయునది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1544} చతుర్భాహుడు  - నాలుగు చేతులు గలవాడు, విష్ణువు :-
[2-237-మ.]

1545} చతుర్భుజుడు  - నాలుగు చేతులు గలవాడు, విష్ణువు :-
[1-218-వ., 10.1-236-వ.]

1546} చతుర్ముఖత్వము  - చతుర్ముఖు (నాలుగు ముఖముల వాని, బ్రహ్మదేవుని) తత్వము (పదవి), బ్రహ్మత్వము :-
[4-699-వ.]

1547} చతుర్ముఖబంధము  - నాలుగు వైపులకు ముఖములను తిప్పి లయబద్ధముగా తిరుగుచు హస్త విన్యాసాదులను కనుపింప చేయునది, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

1548} చతుర్ముఖుడు  - చతుః (నాలుగు, 4) ముఖములు కలవాడు, బ్రహ్మదేవుడు :-
[2-252-వ., 3-375-ఉ., 3-388-వ., 3-839-వ., 4-127-వ., 4-530-వ., 4-943.1-తే., 6-258-వ., 10.1-547-వ., 11-105-వ., 12-30-వ.]

1549} చతుర్యుగములు  - 1కృత 2త్రేత 3ద్వాపర 4కలియుగములు నాలుగు :-
[12-22-వ.]

1550} చతుర్వర్ణములు  - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర :-
[1-30-ఉ., 1-58-వ., 1-484.1-ఆ., 3-189.1-తే., 3-253-క., 10.2-1122-వ., 11-74.1-తే.]

1551} చతుర్వింశతితత్త్వములు  - అష్టప్రకృతులు (1అవ్యకత్తము 2బుద్ధి 3అహంకారము పంచ తన్మాత్రలు అను 4శబ్దము 5స్పర్శము 6దృక్కు 7ఘ్రాణము 8రసనము) మరియును షోడశ వికృతులును (పంచ భూతములు (1పృథివి 2జలము 3అగ్ని 4వాయువు 5ఆకాశము) పంచ జ్ఞానేంద్రియములు (6చర్మము 7కన్ను 8ముక్కు 9చెవి 10నాలుక) పంచ కర్మేంద్రియములు (11వాక్కు 12చేతులు 13కాళ్ళు 14గుదము 15ఉపస్థు) మరియు16మనస్సు) పంచ వింశకము (25వది) కాలము (పురుషుడు) పాఠ్యంతరమున దశేంద్రియములు (10) విషయ పంచకము (5) భూత పంచకము (5) అంతఃకరణ చతుష్టయము (4) :-
[3-891-వ., 7-330-ఉ., 10.1-537-వ.]

1552} చతుర్వింశతితత్త్వశాసకుడు  - 24 తత్త్వములను పాలించెడివాడు, విష్ణువు :-
[7-330-ఉ.]

1553} చతుర్విద్యలు  - 1ఆన్వీక్షకి (ఇందు విజ్ఞానము తెలుప బడును) 2త్రయి (ఇందు ధర్మాధర్మములు తెలుపబడును) 3వార్త (ఇందు అర్థానర్థములు తెలుపబడును) 4దండనీతి (ఇందు నయానయములు తెలుపబడును) :-
[9-531.1-తే.]

1554} చతుర్విధఋత్విక్కులు  - యజ్ఞ నిర్వహణకు కావలిసిన నలుగురు ఋత్విక్కులు 1 హోత 2 అధ్వర 3 ఉద్గాత 4 బ్రహ్మ :-
[3-388-వ.]

1555} చతుర్విధజన్మలు  - 1అండజములు 2స్వేదజములు 3జరాయుజములు 4ఉద్భిజ్జములు అనెడి విధానములైన జన్మలు కల ప్రాణులు :-
[10.2-1072.1-తే.]

1556} చతుర్విధపురుషార్థములు  - 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములు, 1ధర్మము (విధి నిర్వహణ) 2అర్థము (ప్రయోజనము) 3కామము (ఫలితము) 4మోక్షము (అంతిమ లక్ష్యము) :-
[4-244-క., 4-249.1-తే., 4-670-వ., 10.1-1392.1-తే., 10.2-249-వ., 10.2-1328-ఉ.]

1557} చతుర్విధఫలప్రదాయక  - చతుర్విధ (నాలుగు విధములైన) ఫల (పురుషార్థములను, 1ధర్మ 2అర్థ 3కామ 4మోక్షములను) ప్రదాయక (చక్కగా నిచ్చువాడు), విష్ణువు :-
[4-195-చ.]

1558} చతుర్విధబలములు  - చతురంగబలములు రథ గజ అశ్వ పదాతి దళములు అను నాలుగు సైన్య విభాగముల పాఠ్యంతరమున చతుర్విధబలములు బాహు మనో ధన మరియు బంధు బలములు :-
[3-129.1-తే.]

1559} చతుర్విధభక్తియోగములు  - 1ఆర్తునకైనభక్తియోగము 2జిజ్ఞాసువుకైనభక్తియోగము 3అర్థార్థికైనభక్తియోగము 4జ్ఞానికైనభక్తియోగము :-
[3-1027-వ.]

1560} చతుర్విధభూతసర్గము  - చతుర్విధ భూత సృష్టి 1 అండజములు గ్రుడ్డు నుండి పుట్టునవి, పక్షులు, పాములు మున్నగునవి; 2 స్వేదజములు స్వేదముల (ఉక్క మొదలగునవి) వలన కలుగునవి పురుగులు మున్నగునవి; 4 ఉద్భిజములు నేలను పగుల్చుకుని పొడమునవి, చెట్లు, తీగెలు మొ. 4 జరాయుజములు (తల్లి గర్భకోశము నందలి) మావి నుండి జనించునవి, జంతువులు, మానవులు మున్నగునవి. :-
[8-155-వ.]

1561} చతుర్విధభూతసృష్టి  - చతుర్విధ భూత సృష్టి 1 అండజములు గ్రుడ్డు నుండి పుట్టునవి, పక్షులు, పాములు మున్నగునవి; 2 స్వేదజములు స్వేదముల (ఉక్క మొదలగునవి) వలన కలుగునవి పురుగులు మున్నగునవి; 4 ఉద్భిజములు నేలను పగుల్చుకుని పొడమునవి, చెట్లు, తీగెలు మొ. 4 జరాయుజములు (తల్లి గర్భకోశము నందలి) మావి నుండి జనించునవి, జంతువులు, మానవులు ము. :-
[4-480-క.]

1562} చతుర్విధయోగాభ్యాసములు  - మంత్ర లయ హఠ రాజ యోగాభ్యాసములు :-
[10.1-1474-ఆ.]

1563} చతుర్విధశృంగారములు  - 1వస్త్రములు 2భూషణములు 3చందనము 4పుష్పము అను నాలుగు రకముల అలంకారములు :-
[10.2-674.1-తే.]

1564} చతుర్విధాంతకరణములుఅధిదేవతలు  - 1 చిత్తము వాసుదేవుడు 2 అహంకారము సంకర్షణుడు 3 బుద్ధి ప్రద్యుమ్నుడు 4 మనసు అనిరుద్ధుడు :-
[3-57-వ.]

1565} చతుర్విధాన్నంబులు  - భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అనెడి నాలుగువిధముల ఆహారములు :-
[4-510-వ.]

1566} చతుర్విధాన్నములు - భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అనెడి నాలుగువిధముల ఆహారములు :-
[4-510-వ.]

1567} చతుర్వేదములు  - 1ఋగ్వేదము 2యజుర్వేదము 3సామవేదము 4అధర్వణవేదము :-
[10.1-573-శా., 10.1-1412-శా., 11-107-వ., 12-30-వ.]

1568} చతుర్వ్యూహములు  - 1వాసుదేవ 2ప్రద్యుమ్న 3సంకర్షణ 4అనిరుద్ధ రచనావిశేషములు, ఇంకొక విధముగ వాసుదేవాదులు (1వాసుదేవుడు 2అచ్యుతుడు 3అనంతుడు 4గోవిందుడు) :-
[3-892-క., 10.1-1236-దం., 12-39-వ.]

1569} చతుషష్టివిద్యలు  - అరవైనాలుగు విద్యలు, ఇతిహాసము, గంధవాదము, దృష్టివంచనము, నాటకము, జలవాదము, చిత్రక్రియ, జూదము, వాక్స్తంభము, దారుక్రియ, అవధానము, మోహనము, అదృశ్యకరణము, రత్నశాస్త్రము, కాలవంచనము, కృషి, దహదము, అంజనము, వేట, రసవాదము, చోరకర్మము, అలంకారము, జలస్తంభము, మృత్తికక్రియ, కామశాస్త్రము, ఆకర్షణము, అంబరక్రియ, వాచకము, మారణము, పశుపాలనము, సాముద్రికము, ఐంద్రజాలము, మిత్రభేదము, పాకశాస్త్రము, మణిమంత్రౌషధాదికసిద్ధి, కావ్యము, ఖనివాదము, అశ్వక్రియ, కవిత్వము, ఖడ్గస్తంభము, చర్మక్రియ, లిపికర్మము, వశీకరణము, వాణిజ్యము, శాకునము, ఉచ్చాటనము, అసవకర్మము, మల్లశాస్రము, పాదుకాసిద్ధి, ఆగమము, ధాతువాదము, సర్వవంచనము, గానము, అగ్నిస్తంభము, లోహక్రియ, దేశభాషలిపి, వాయస్తంభము, వేణుక్రియ, సర్వశాస్త్రము, విద్వేషము, దౌత్యము, రథాశ్వగజకౌశలము, పరకాయప్రవేశము, వ్యసాయము, ప్రశ్నము, :-
[10.1-1413-క.]

1570} చతుష్పాదులు  - నాలుగు కాళ్ళు కలవి, జంతువులు పశువులు మున్నగునవి :-
[4-853-వ., 11-91-వ.]

1571} చదువులముదుకడు  - చదువుల (వేదజ్ఞానమునందు) ముదుకడు (వృద్ధుడు), బ్రహ్మ :-
[8-716-క.]

1572} చపలత  - రాగద్వేషాదులచే పనుల యందు కలుగు తబ్బిబ్బు :-
[9-658-క., 10.1-874-క., 10.1-1348-వ.]

1573} చమరము  - దీనినుండి చామరములు చేయబడును, సవరపు మెకము :-
[9-595-క.]

1574} చయనం  - యజ్ఞకుండానికి ఇటుకలు పేర్చడం, ఒక్కొక యజ్ఞానికి ఒక్కొక విధమైన యజ్ఞ కుండం అవసరమవుతుంది. అలాగే ఒక్కొక వేద శాఖవారికి ఒక్కొక పద్ధతి ఉంటుంది. పారమార్థిక పదకోశము (పొత్తూరి వేంకటేశ్వర రావు) :-
[3-388-వ.]

1575} చరాచరప్రచయనేత  - చరాచర (సమస్తమైన జీవుల) ప్రచయ (సమూహముల)కును నేత, బ్రహ్మదేవుడు :-
[3-500-ఉ.]

1576} చరాచరవిభుడు  - కదల గలవి లేనివి రెంటికి ప్రభువు, విష్ణువు :-
[10.1-218-శా.]

1577} చర్వితచర్వణము  - తిన్నదే మరల తినుట, చేసినదే మరల మరల చేయుట :-
[7-181-ఉ.]

1578} చలనమందకుండుట  - నిశ్చల శ్థితి :-
[3-75-తే.]

1579} చల్లడము  - తొడలకు సగమువరకు వచ్చునట్లు కట్టుకొనెడి వస్త్రవిశేషము, పాఠ్యంతరమున మోకాలివరకు గోచిపోసి కట్టుకోనెడి వస్త్ర కవచము, గుడిగి :-
[10.1-430.1-తే., 10.1-1342-క.]

1580} చాక్షుషమన్వంతరము  - చాక్షుషుడను మనువు కాలం కనుక చాక్షుషమన్వంతరము :-
[1-63-వ.]

1581} చాచి(ప్ర)  - సాచి (వి) :-
[10.1-1558-వ.]

1582} చాచు(ప్ర)  - సాచు (వి) :-
[10.1-1565-శా.]

1583} చాణూరముష్టికాదులు  - కంసుని వద్ద మల్లురు :-
[10.1-1627-మ.]

1584} చాతురాశ్రమములు  - బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్త, సన్యాస. :-
[1-82-వ., 1-405-క.]

1585} చాతుర్ధర్మములు  - 1బ్రహ్మచర్యములు 2గృహస్థధర్మములు 3వానప్రస్థధర్మములు 4 సన్యాసధర్మములు :-
[3-789-క.]

1586} చాతుర్మాసములు  - నాలుగు నెలలచొప్పున యుండెడి త్రికాలములు (ఎండాకాలము, వర్షాకాలము, చలికాలము) :-
[5.1-95.1-తే.]

1587} చాతుర్మాస్యము  - యోగులు ప్రతి సంవత్సరము ఆషాఢశుద్ధము మొదలు కార్తికశుద్ధము వఱకు నాలుగు నెలలు ఒకే ప్రదేశమున ఉండు దీక్ష :-
[1-103-వ., 3-754-వ.]

1588} చాతుర్వర్ణములు  - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు :-
[1-82-వ., 1-216-వ., 1-405-క., 4-51.1-తే., 7-408.1-ఆ., 7-419-వ., 11-106-క., 12-11-వ.]

1589} చాతుర్హోతలు  - బ్రహ్మ, హోత, అధ్వర్యుడు, అగ్నీధ్రుడు :-
[2-94.1-తే.]

1590} చాతుర్హోత్రరూపుడు  - చాతుర్హోత్రము (బ్రహ్మ, హోత, అధ్వర్య, అగ్నీధ్ర అను చాతుర్హోతల తంత్రములు) స్వరూపమైనవాడు, విష్ణువు :-
[4-705-వ.]

1591} చాపము  - విల్లు, సూర్యుడు గమనము చేసెడి మార్గము :-
[4-460.1-తే.]

1592} చాపాచార్యుడు  - విలువిద్యకొరకైన గురువు, ద్రోణుడు :-
[3-28-క.]

1593} చామరము  - చమరీమృగముకుచ్చుతో చేయబడి గాలి విసురుటకు ఉపయోగపడెడి సాధనము, తెల్లగా ఉండును కనుక వింజామరము :-
[9-319.1-ఆ.]

1594} చామీకరకుంభస్తనులు  - చామీకర (బంగారు) కుంభ (కుండలవంటి) స్తనులు (స్తనములు కలవారు), స్త్రీలు :-
[10.2-149-క.]

1595} చారణులు  - ఒకజాతి ఖేచరులు, దేవగాయక జాతి వారు, వ్యు. చారయతి కీర్తనమ్ చర (ణిత్)+ల్యు, కీర్తిని నలుగడలకు వ్యాపింప జేయువారు. :-
[2-274.1-తే., 10.1-107-క.]

1596} చారు - చారుతర చారుతమ :-
[1-53-క., 4-458.1-తే., 4-484.1-తే.]

1597} చారు - చారుతరము చారుతమము :-
[5.1-132-క., 10.1-1750-మ.]

1598} చారుముఖి  - చారు (చక్కనైన) ముఖి (ముఖము, గుర్తింపు) కలామె, స్త్రీ :-
[10.1-980.1-ఆ.]

1599} చారులక్ష్మీవిలాసుడు  - చారు (అందమైన) లక్ష్మీ (లక్ష్మీకళతో) విలాసిల్లెడివాడ, శ్రీకృష్ణ :-
[5.1-183-మాలి.]

1600} చింతామణి  - చింత (చింతించినవానిని యిచ్చెడి) మణి (రత్నము) :-
[6-260.1-తే., 6-326-వ., 10.1-1738-మ.]

1601} చిట్టి  - 1. చిట్టకము కలవి, 2. లీలమాత్రపు, చిన్న :-
[8-619-ఆ.]

1602} చితి  - శవదహనార్థమైన కట్టెల పోగు :-
[4-844-చ.]

1603} చిత్  - తత్వజ్ఞానపరితమైన :-
[10.1-537-వ.]

1604} చిత్+శక్తి  - చిత్ + ఛక్తి (ఛత్వసంధి), చిత్ + ఛక్తి చిచ్ఛక్తి (శ్చుత్వసంధి) :-
[3-198.1-తే.]

1605} చిత్తజగురువు  - చిత్తజు (మన్మథుని) గురువు (తండ్రి), విష్ణువు :-
[11-27-క.]

1606} చిత్తజన్ముడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[10.1-1280.1-ఆ.]

1607} చిత్తజాతజనకము  - చిత్తజాత (మన్మథుని) జనకము, కోరిక :-
[10.1-1321-వ.]

1608} చిత్తజాతజనకుడు  - చిత్తజాత (మన్మథుని) జనకుడు, కృష్ణుడు :-
[10.1-1321-వ.]

1609} చిత్తజుడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[3-452-చ.]

1610} చిత్తము  - ఇంద్రియములతో కూడిన మనస్సు, సంశయ రూపము :-
[2-16-వ., 10.1-682.1-తే.]

1611} చిత్తాదివర్తనములు  - 1చిత్తము 2అహంకారము 3మనస్సు 4బుద్ధి రూపములైన చతురంతఃకరణముల చలన కర్తవ్య సంకల్ప నిశ్చయ వ్యాపారములు నిర్వహించునవి :-
[10.1-683-వ.]

1612} చిత్తి  - ద్రవ్యము (పదార్థము)ను కూడబెట్టునది, చిత్తము తానైనది :-
[4-26-వ.]

1613} చిత్తేశుడు  - మనసునకు ప్రభువు, భర్త :-
[10.1-1707-మ.]

1614} చిత్రకేతుడు  - రంగురంగుల కేతనము(జండా) కలవాడు :-
[4-26-వ.]

1615} చిత్రము  - చిత్తమును రమింప జేయునది, మనోజ్ఞమైనది :-
[7-6-క.]

1616} చిదచిదాత్మకుడు  - చిత్ ఆచిత్ ఆత్మకుడు, చేతనా అచేతనములు తానే అయిన వాడు :-
[2-109-చ.]

1617} చిదచిదానందమయుడు  - చిత్ (చైతన్యవంతములు) అచిత్ (జడములు) సర్వములోను మయుడు, విష్ణువు :-
[4-367.1-తే.]

1618} చిదచిదానందస్వరూపకుడు  - సచేతన అచేతన ఆనందములు తన స్వరూపమే అయిన వాడు, భగవంతుడు :-
[2-277.1-తే.]

1619} చిదాత్మకుడు  - చేతనా రూపమైన ఆత్మ కలవాడు, జ్ఞాని :-
[1-67-వ.]

1620} చిదానందమయుడు  - చిత్ (చైతన్యవంతమైన) ఆనందముతో మయుని (నిండినవానిని), విష్ణువు :-
[4-963.1-తే.]

1621} చిన్మయాకారుడు  - చిత్ (చైతన్యముతో) మయ (కూడిన) ఆకార (స్వరూపము కలవాడు), జ్ఞాన స్వరూపుడు, కృష్ణుడు, విష్ణువు :-
[4-171.1-తే., 10.2-1150-క.]

1622} చిన్మయాత్మకుండు  - చిత్ (చైతన్యముతో) మయ (కూడిన) ఆకార (స్వరూపము కలవాడు), జ్ఞాన స్వరూపుడు, కృష్ణుడు, విష్ణువు :-
[2-272.1-ఆ.]

1623} చిన్మయుడు  - చిత్ (చైతన్యముతో) మయ (కూడిన) ఆకార (స్వరూపము కలవాడు), జ్ఞాన స్వరూపుడు, కృష్ణుడు, విష్ణువు :-
[2-237-మ.]

1624} చిమ్మనక్రోవి  - జలక్రీడ లందు నీళ్ళు చిమ్ము గొట్టము :-
[10.2-804-వ.]

1625} చిమ్ముట  - కొమ్ములతో పొడిచి దూరముగ తోయుట, జలాదులను విస్తారముగా జల్లుట :-
[1-416-శా.]

1626} చిర - చిరతర చిరతమ :-
[4-451-క.]

1627} చిరదయాకరుడు  - చిర మిక్కిలి దయ (కృప)ను ఆకరుడు (ఇచ్చువాడ), విష్ణువు :-
[3-753.1-తే.]

1628} చిరదయాకారుడు  - చిర మిక్కిలి దయ (కృప)ను ఆకరుడు (ఇచ్చువాడ), విష్ణువు :-
[4-203.1-తే.]

1629} చిరభాగ్యోదయుడు  - చిర (మిక్కిలి) భాగ్య (భాగ్యములను) ఉదయుడు (కలిగించువాడు), విష్ణువు :-
[3-574-మ.]

1630} చిరము - చిరతరము చిరతమము :-
[3-887-క., 4-587.1-తే., 4-839-క., 7-15-క., 8-492-వ.]

1631} చిరము - చిరతరము చిరతమము :-
[3-957-క.]

1632} చిరశుభాకారుడు  - చిర (మిక్కిలి) శుభమైన ఆకారము కలవాడు, విష్ణువు :-
[3-304.1-తే., 3-423.1-తే., 3-573.1-తే.]

1633} చీకటిగొంగ  - చీకటికి గొంగ (శత్రువు), సూర్యుడు :-
[9-8.1-తే.]

1634} చీనిచీనాంబరము  - చీనీ (చైనా దేశమునుండి వచ్చిన) చీనాంబరము (చైనాగుడ్డ, పట్టువస్త్రము) :-
[4-58.1-తే.]

1635} చీరజిక్కు  - చీర చాలలేదు, కడుపు వచ్చెను :-
[8-493-క.]

1636} చుంచు  - పిలక, బలము, నేర్పరితనం , చుంచుప్ ప్రత్యయం ("తేనవిత్తః చుంచుప్ చణపౌ"అని కౌముదీ సూత్రం) :-
[10.1-419-క.]

1637} చుక్కలత్రోవ  - చుక్కలు (నక్షత్రములు) త్రోవ (తిరుగు స్థలము), ఆకాశము :-
[8-509-క.]

1638} చుఱచుఱ  - కోపముతో చుఱచుఱమను నిప్పులాంటి చూపులు, నిప్పులు కాలుటయందలి ధ్వన్యను కరణము, :-
[10.1-619-క.]

1639} చెంగల్వ  - చెన్ను (ఎఱ్ఱదనము కలిగిన) కల్వ (కలువపువ్వు) :-
[10.1-804-క.]

1640} చెచ్చెర  - చెర (వేగము) వంతమైన చెరన్ (వేగము), శీఘ్రము. :-
[3-515-మ.]

1641} చెఱకువింటిజోదు  - చెరుకుగడ విల్లుగా కలవీరుడు, మన్మథుడు :-
[9-540-వ.]

1642} చెఱకువింటివాడు  - చెరుకుగడ వింటివాడు (విల్లుగ గలవాడు), మన్మథుడు :-
[9-391-వ.]

1643} చెఱకువిలుతుడు  - చెరకుగడ ధనుస్సుగా కలవాడు, మన్మథుడు :-
[10.1-1747-వ.]

1644} చెలువ  - చెలువు (అందము, చక్కదనము) అ (కలామె), అందగత్తె :-
[4-910.1-తే., 10.1-1475-మ.]

1645} చేతోజాతుడు  - చిత్ (మనసున) జాత (పుట్టువాడు), మన్మథుడు :-
[9-549-శా.]

1646} చేతోవిభుడు  - చేతస్ (చిత్తమునకు) విభుడు, భర్త :-
[10.1-810-క.]

1647} చేదీశుడు  - చేది దేశపు ప్రభువు, శిశుపాలుడు :-
[10.1-1707-మ.]

1648} చేపట్టు  - చేయి పట్టు, స్వీకరించు :-
[3-31-ఉ.]

1649} చైద్యవసుధావరుడు  - చేదిదేశపు రాజు, శిశుపాలుడు :-
[10.2-1218-చ.]

1650} చైద్యుడు  - చేదిదేశపురాజు,శిశుపాలుడు :-
[3-123.1-తే., 7-11-ఉ., 10.1-973-మ., 10.1-1682-మ., 10.1-1698-ఉ., 10.1-1706-ఉ., 10.2-231-మ., 10.2-794-వ.]

1651} చోద్యము  - చోదన (తోలుట) చేయబడినది, ఆశ్చర్యము :-
[2-213-చ.]

1652} చోష్యములు  - దంతములతో నమిలి రసము పీల్చి పిప్పి పాఱవేయునవి, చెఱకు మొ.వి :-
[4-510-వ.]

1653} చౌలము  - చూడాకర్మ, ఉపనయనమునకు ముందు జరిపెడి కేశసంస్కారము :-
[5.1-121-మ.]