పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణి పట్టిక (భుక్త- మల్లుడు)

శ్రీరామ

up-arrow

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


3689} భుక్తభోగము  - భుక్త (భుజింపబడినట్టి) భోగము (పిండివంట) ఇక మిగిలినది, ఎంగిలి మెతుకులు :-
[3-914-వ.]

3690} భుజంగమతల్పకుడు  - భుజంగమ (సర్పము, ఆదిశేషు)ని తల్పముగా కలవాడు, విష్ణువు :-
[4-730-చ.]

3691} భుజంగమము అంటే పాము  - శ్వాసకు గుర్తు :-
[4-829-వ.]

3692} భుజంగమము  - భుజములచే పాకునది, పాము :-
[9-520-వ.]

3693} భుజగరిపుడు  - సర్పములకు శత్రువైనవాడు, గరుత్మంతుడు :-
[11-72.1-తే.]

3694} భుజగాంతకుడు  - సర్పముల పాలిటి యముడు, గరుత్మంతుడు :-
[10.2-147-చ.]

3695} భుజగేంద్రారాతి  - సర్పశ్రేష్ఠముల శత్రువు, గరుత్మంతుడు :-
[10.2-215-మ.]

3696} భువనకారణుడు  - భువనముల సృష్టికి కారణము ఐనవాడు, బ్రహ్మదేవుడు :-
[3-330-క.]

3697} భువనత్రయము  - ముల్లోకములు, భూర్భువస్సువ ర్లోకములు 1భూ 2భువః 3సువః అను మూడు లోకములు. పాఠ్యంతరమున 1భూలోకము 2స్వర్గలోకము 3పాతాళలోకములు :-
[3-355.1-తే., 7-91-వ.]

3698} భువనపావనచరిత్రుడు  - భువన (జగత్తును) పావన (పవిత్రముచేయు) చరిత్ర కలవాడు, విష్ణువు :-
[4-629.1-తే.]

3699} భువనభరణచిత్తోత్కంఠుడు  - భువన (లోకములన) భరణ (కాపాడుటయందు) చిత్త (హృదయమున) ఉత్కంఠుడు (ఉత్కంఠగలవాడు), శివుడు. :-
[7-393-క.]

3700} భువనభరనివారుడు  - భూభారమును నివారించెడివాడు, శ్రీరాముడు :-
[8-744-మాలి.]

3701} భువనరక్షదక్షుడు  - జగత్తును రక్షించు సమర్థత కలవాడు, విష్ణువు :-
[10.2-697.1-తే.]

3702} భువనాతీతగుణాశ్రయుడు  - భువన (లోకములు అన్నిటికిని) అతీతమైన గుణములకు ఆశ్రయుడు (నిలయమైనవాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]

3703} భువనాధీశుడు  - భువన (జగత్తునకు) అధీశుడు (ప్రభువు), విష్ణువు :-
[8-506-మ.]

3704} భువనాధీశ్వరుడు  - భువనములకు అధీశ్వరుడు (ప్రభువు), బ్రహ్మ :-
[7-79-మ.]

3705} భువిఁదనకార్యాంశము - కాలము, సృష్టికార్యములోని (ఒక) భాగము, కాలము :-
[3-345.1-తే.]

3706} భూకాంతాకాంత  - భూకాంతుని (రాజు) కాంత (భార్య), రాణి :-
[10.2-804-వ.]

3707} భూచరులు  - భూమిపై చరించువారు, మానవులు, జంతువులు :-
[9-301-క.]

3708} భూజనములు  - భూలోకమన ఉండు జనులు, మానవులు :-
[3-940-తే.]

3709} భూజనులు  - భూ (రాజ్యము నందలి) జనులు, ప్రజలు :-
[4-454.1-తే., 10.2-757-ఉ.]

3710} భూజము  - భూమినుండి జము (పుట్టునది), వృక్షము :-
[5.1-74.1-తే., 7-36.1-ఆ., 10.2-549-చ.]

3711} భూతగణములు  - భూతములు ప్రేతములు పిశాచములు మొదలగు వాని సమూహములు :-
[3-461-మ.]

3712} భూతతన్మాతలు, పంచతన్మాత్రలు  - 1శబ్దము 2స్పర్శ 3 దృక్కు (చూపు) 4ఘ్రాణము (వాసన) మరియు 5రస (రుచి) వాని మూల తత్వములు (5) :-
[3-903-వ.]

3713} భూతధాత్రి  - భూత (జీవులను) ధాత్రి (ధరించునది), భూమి :-
[9-31-ఆ.]

3714} భూతనాథుసతి  - భూతనాథు (శివు)ని సతి, పార్వతి :-
[10.1-1709.1-తే.]

3715} భూతపంచకము  - పంచభూతములు, 1ఆకాశము 2 తేజస్సు 3వాయువు 4 జలము 5 పృథివి :-
[3-718.1-తే., 7-237-వ.]

3716} భూతపంచకములు  - పంచభూతములు, 1ఆకాశము 2 తేజస్సు 3వాయువు 4 జలము 5 పృథివి :-
[2-112-వ.]

3717} భూతపతి  - సమస్త భూతములకు నాథుడు, శివుడు :-
[4-51.1-తే.]

3718} భూతభావనరూపుడు  - జీవులకు కారణరూపమైనవాడు, శివుడు :-
[8-222.1-ఆ.]

3719} భూతభావనుడు  - సమస్తప్రాణులచేత ధ్యానించబడువాడు, విష్ణువు :-
[4-357-వ., 7-381.1-తే., 8-659.1-తే.]

3720} భూతభేతాళములు  - పిశాచవిశేషములు, భూతములు (శ్మశానవాసులు). భేతాళములు (యమకింకరులు) :-
[9-306.1-ఆ.]

3721} భూతములు  - 1. పిశాచభేదము, 2. దేహము విడచినను కోరికలు వదలక వర్తించు ఆత్మ, వాసం శ్మశానం 3. అహంకారము మహత్తు మరియు పంచభూతములు, 4. ఆ భూతజన్యములైన జీవులు, 5. ప్రస్తుతము ఐ (పుట్టి) ఉన్నవి (అశాశ్వతమైనవి), జీవులు :-
[2-274.1-తే., 4-654-వ., 5.2-103-క., 6-307-వ., 6-307-వ., 7-467-వ., 10.1-681-వ., 10.1-887-వ., 10.1-1757-వ., 10.2-405-చ.]

3722} భూతలోకేశ్వరుడు  - భూతలోక (సమస్తమైన ప్రాణులకు) ఈశ్వరుడు, విష్ణువు :-
[8-659.1-తే.]

3723} భూతశరణ్యుడు  - ఆశ్రయించిన ప్రజలకు శరణము ఇచ్చువాడు, రాజు. :-
[1-378-క.]

3724} భూతసూక్ష్మేంద్రియాత్ముడు  - జీవులకు సూక్ష్మేంద్రియములు (తన్మాత్రలు, ఇంద్రియములు) తానైన వాడు, విష్ణువు :-
[4-702.1-తే.]

3725} భూతాత్మకుడు  - జీవుల యందు ఆత్మగ ఉండువాడు, విష్ణువు :-
[4-357-వ., 8-222.1-ఆ., 10.1-942-ఆ.]

3726} భూతిభూషణుడు  - విభూతిచే అలంకరింపబడిన వాడు, శివుడు :-
[10.1-1101-వ.]

3727} భూతిలిప్తాంగుడు  - భూతి (బూడిద, విభూతి)ను లిప్త పూసుకొనిన) అంగుడు (దేహము కలవాడు), శివుడు :-
[3-467.1-తే.]

3728} భూతేశుడు  - సర్వ భూతములకు ప్రభువు, విష్ణువు, శివుడు :-
[4-357-వ., 4-502-వ., 8-222.1-ఆ.]

3729} భూతేశ్వరుడు  - భూతములు (సకల జీవులు) కి ఈశ్వరుడు (ప్రభువు), విష్ణువు, భూతనాథుడు, శివుడు :-
[2-222-వ., 10.2-1262-క.]

3730} భూదేవతలు  - భూమికి దేవతలు, బ్రాహ్మణులు :-
[2-38-వ.]

3731} భూదేవులు  - భూమికి దేవతలు, బ్రాహ్మణులు :-
[1-291-వ.]

3732} భూధవుడు  - భూమికి భర్త, రాజు :-
[5.1-95.1-తే.]

3733} భూనాథుడు  - భూ (రాజ్యమునకు) నాథుడు (ప్రభువు), రాజు :-
[5.1-3-క., 7-119-మ.]

3734} భూనాయకుడు  - భూమి (రాజ్యమువ)కు నాయకుడు, రాజు :-
[4-259-క., 6-453-క., 9-243-క.]

3735} భూనుతుడు  - భూలోకమునంతా స్తుతింపబడువాడు, గొప్పవాడు :-
[11-53-ఉ.]

3736} భూప  - భూమికి పతి, రాజు. :-
[2-263-తే.]

3737} భూపతి  - భూమికి భర్త, రాజు :-
[3-71.1-తే., 4-448-క.]

3738} భూపతికాంత  - భూ (భూమికి) పతి (ప్రభువు యొక్క) కాంత (భార్య), రాణి :-
[6-450-త.]

3739} భూపవరేణ్యుడు  - భూప (రాజు)లలో వరేణ్యుడు (ముఖ్యుడు), మహారాజు :-
[5.2-51-క., 11-55-క.]

3740} భూపవర్యుడు  - భూపు (రాజు)లలో వర్యుడు (ఉత్తముడు), మహారాజు :-
[5.2-42.1-తే.]

3741} భూపాలకుడు  - భూ (రాజ్యమును) పాలకుడు (ఏలెడివాడు), రాజు :-
[3-87-వ., 5.1-171-వ., 7-53.1-ఆ., 10.1-1381-క., 10.1-1550-క.]

3742} భూపాలుడు  - భూమిని పాలించెడివాడు, రాజు :-
[4-460.1-తే., 4-833-తే., 5.1-175-వ.]

3743} భూపాలోత్తముడు  - భూపాలు (రాజు)లలో ఉత్తముడు, మహారాజు :-
[1-522-ఉ., 7-471-శా.]

3744} భూపుడు - భూమికి పతి, రాజు :-
[6-267-ఆ.]

3745} భూపౌత్రుడు  - భూదేవి కొడుకైన నరకుని కొడుకు, భగదత్తుడు :-
[10.2-352-మ.]

3746} భూమండలోద్ధరణుడు  - భూమండలమును ఉద్దరించినవాడు, కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

3747} భూమి  - భరించునది, వ్యు. భూ+మిక్+ఙీప్, భవంతి అస్మిన్ భూతాని, దీనియందు ప్రాణులు వుందురు. :-
[4-426-క.]

3748} భూమిపతి  - భూమి(రాజ్యాని)కిపతి, రాజు :-
[9-72-ఆ.]

3749} భూమిపాలకుడు  - భూమిని పరిపాలించువాడు, రాజు :-
[3-255.1-తే.]

3750} భూమిభృత్  - భూమికి భర్త, రాజు :-
[1-416-శా.]

3751} భూమియొక్కటి  - మన్ను ఒకటే ఐన కుండలు అనేకములు ఐనట్లు అను తత్వవిచారసూత్రము సూచన :-
[10.2-1122-వ.]

3752} భూమిరుహము  - భూమి యందు పుట్టునది, చెట్టు :-
[10.2-544.1-తే.]

3753} భూమివరుడు  - భూమికి భర్త, రాజు :-
[9-148-ఆ.]

3754} భూమిసుత  - భూదేవి యొక్క పుత్రిక, సీత :-
[6-306.1-తే.]

3755} భూమిసుతుడు  - భూదేవి కొడుకు, నరకుడు :-
[10.2-199-శా.]

3756} భూమిసురుడు  - భూమికిదేవత, విప్రుడు :-
[9-138-క.]

3757} భూమీశుడు  - భూమి (రాజ్యము)నకు ఈశుడు, రాజు :-
[4-742.1-తే., 4-830.1-తే., 4-852-క., 9-8.1-తే., 10.1-1311-క.]

3758} భూమీశ్వరుడు  - భూమికి ఈశ్వరుడు (ప్రభువు), రాజు :-
[3-63-తే., 3-230-క., 5.1-87-క.]

3759} భూమీసురులు  - భూమి మీది దేవతలు, బ్రాహ్మణులు :-
[4-42.1-తే.]

3760} భూరమణుడు  - భూమికి రమణుడు (భర్త), రాజు :-
[3-431-మ., 4-888-చ., 6-38-క.]

3761} భూరి భూరితరము భూరితమము - :-
[2-260-క.]

3762} భూరి  - 1. ఒకటి (1) తరువాత 34 సున్నాలు కల సంఖ్య అదే కోటైతే తరువాత ఏడు (7) సున్నాలు. 2. చాలా ఎక్కువ, 3. అత్యధికమైన :-
[1-364-శా., 3-804-ఉ., 3-859.1-తే., 3-869-ఉ., 3-1001.1-తే., 3-1028.1-తే., 4-14-చ., 4-71-ఆ., 4-578-చ., 4-610-చ., 4-764-చ., 8-116-శా., 9-111-ఆ., 9-279-శా., 10.2-552-మత్త., 10.2-611-తే.]

3763} భూరిభవబంధవిమోచనుడు  - భూరి (అత్యధికమైన) భవ(సంసారమనెడి) బంధ (బంధనములను) విమోచనుడు (విడిపించువాడు), విష్ణువు :-
[7-106-ఉ.]

3764} భూరిశివేతరాపహవిభూతిసమేతుడు  - భూరి (గొప్ప) శివ (శుభములకు) ఇతర (వ్యతికర మైనవాటిని) అపహ (పోగొట్టెడి) విభూతి (వైభవము) సమేతుడు (తో కూడి ఉండెడివాడు), విష్ణువు :-
[4-923-ఉ.]

3765} భూరిసంసారతాపనివారగుణకథామృతాపూర్ణుడు - అత్యధికమైనసంసారతాపములను నివారించుగుణముకల కథల అమృతమున నిండినవాడు, విష్ణువు :-
[4-282.1-తే.]

3766} భూరుహము  - భూమి నుండి పుట్టునది, వృక్షము :-
[3-289-ఉ., 5.1-74.1-తే.]

3767} భూర్భువరాది  - భూ భువర్ సువర్ లోకములు మూడు :-
[3-356-ఉ.]

3768} భూవనితామణి  - భూమి అనెడి స్త్రీలలో మణి వంటి యామె, భూదేవి :-
[4-499-క.]

3769} భూవరుడు  - భూమికిభర్త, రాజు :-
[1-369-చ., 1-392-క., 1-411-వ., 1-461-వ., 3-32-ఉ., 3-42-చ., 3-775-మ., 3-791-క., 4-398-క., 4-627-ఉ., 4-784-తే., 5.1-25-మ., 5.1-63.1-తే., 7-123-శా., 7-193-ఉ., 9-143-మత్త., 9-428-వ., 10.1-1518-ఉ.]

3770} భూవరేంద్రుడు  - భూవర (రాజులలో) ఇంద్ర (శ్రేష్ఠుడు), మహారాజు :-
[2-5-ఆ., 7-452-ఆ., 8-247-ఆ., 8-689-తే., 9-365-తే.]

3771} భూవరేణ్యుడు  - భూవరు (రాజులలో) వరేణ్యుడు (గొప్పవాడు), మహారాజు. :-
[2-136.1-తే., 10.1-239-ఆ.]

3772} భూవల్లభుడు  - భూమి (రాజ్యమున)కు వల్లభుడు (భర్త), రాజు. :-
[5.1-92-మ., 8-123-మ., 10.1-973-మ.]

3773} భూవినుతుడు  - భూలోకమున కీర్తింపబడు వాడు :-
[12-33-క.]

3774} భూవిభుడు  - భూమికి ప్రభువు, రాజు :-
[3-65-మ., 3-65-మ.]

3775} భూషము  - స్వాప్నికమైన విచిత్ర సృష్టి, ఆభరణము, కైసేత :-
[4-771.1-తే.]

3776} భూసుతుడు  - భూదేవి కొడుకు, నరకుడు :-
[10.2-185-క.]

3777} భూసురుడు  - భూమికి సురుడు (దేవుడు), బ్రాహ్మణుడు :-
[1-289-వ., 1-289-వ., 1-296-వ., 1-357-క., 1-502-ఉ., 1-504-క., 2-213-చ., 3-135-ఉ., 3-184-వ., 3-216-క., 3-524-వ., 3-560-చ., 3-1037-క., 4-113.1-తే., 4-589.1-తే., 5.1-54-వ., 6-74-క., 7-34.1-తే., 7-380-వ., 8-522-వ., 10.1-711-క., 10.1-1700-వ., 10.2-668-వ.]

3778} భూసురోత్తములు  - భూసురు (బ్రాహ్మణు)లలో ఉత్తములు, బ్రాహ్మణోత్తములు :-
[1-391-వ.]

3779} భృంగము  - నీలిమను వహించునది, తుమ్మెద, స్త్రీలింగము భృంగి :-
[10.1-1460-శా., 11-99-వ.]

3780} భృంగి  - శివుని ప్రమథగణములలో ఒకడు :-
[6-490.1-తే.]

3781} భృగువు  - భృగుమహర్షి, తెల్లని తేజస్సు :-
[4-26-వ.]

3782} భృగుసత్కులాభిరాముఁడు  - భృగువు యొక్క సత్కుల (చక్కటి వంశమునకు) అభిరాముడు (మనోహరమైనవాడు), పరశురాముడు :-
[6-305-క.]

3783} భేరీ  - పెద్ద డప్పు వంటి వాయిద్యము, దుందుంభి, రాండోళ్ళు వంటి వాయిద్యము :-
[3-130-వ.]

3784} భోగవతి  - 1 భోగుల (పాముల)కి నివాసము, 2. భోగవతి అనెడి నాగలోకపు ముఖ్యపట్టణము. 3. పాతాళలోకమున పారు గంగ, 4. పాతాళము :-
[4-744.1-తే., 10.2-663-మ.]

3785} భోగవతీనగరము  - 1 భోగుల (పాముల)కి నివాసము, 2. భోగవతి అనెడి నాగలోకపు ముఖ్యపట్టణము. :-
[1-256-వ.]

3786} భోగాష్టకములు  - 1పుష్పమాలిక 2గంధము 3వస్త్రము 4అన్నము 5శయ్య 6తాంబూలము 7స్త్రీ 8గానములు, (స్రక్చందనాదులు) :-
[7-241-వ.]

3787} భోగి  - 1. సర్పము, 2. హరి నివాసమున శయ్యగా ఉండునది, ఆదిశేషుడు :-
[3-513-మ.]

3788} భోగినాయకుడు  - భోగి (సర్పము)లకు నాయకుడు, శేషుడు :-
[6-336.1-తే.]

3789} భోగిభూషణుడు  - భోగి (పాము)లను భూషణుడు (అలంకారముగాగలవాడు), శివుడు :-
[8-221-వ.]

3790} భోగిరాట్కంకణుడు  - భోగిరాట్ (సర్పరాజు, వాసుకి) కంకణముగా కలవాడు, శివుడు :-
[10.2-315-ఉ.]

3791} భోజరాజు  - భోజదేశమునకు రాజు, కంసుడు :-
[10.1-148.1-తే.]

3792} భోజసింహుడు  - భోజులలో సింహము వంటివాడు, కంసుడు :-
[10.1-1327-క.]

3793} భోజేంద్రుడు  - భోజవంశపు ప్రభువు, కంసుడు :-
[10.1-1311-క.]

3794} భోజేశ్వరుడు  - భోజరాజు వంశము వారిలో శ్రేష్ఠుడు, కంసుడు. :-
[10.1-28-మ.]

3795} భోజ్యముు  - భుజింపఁదగినది, కొరకనక్కర లేక తినునది, పాయసము, అన్నము మొదలగునవి :-
[4-510-వ.]

3796} భౌతికములు  - భూమికి చెందినవి, భౌతిక స్వరూపము కలవి, సమస్త సృష్టి :-
[2-252-వ., 2-252-వ.]

3797} భ్రమరజానువర్తన  - రెండు మోకాళ్ళను ఒకసారిగా ఎత్తిఎత్తి పెట్టుచు నటించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3798} భ్రమరము  - భ్రమించుచు ఉండునది, తుమ్మెద, భ్రమింప చేయునది :-
[10.1-1458-మ.]

3799} భ్రమి  - భ్రమించెడిది, భ్రమణము, తిరుగుడు. :-
[4-322-వ.]

3800} భ్రాంతి  - లేనిది ఉన్నదనుకొనుట :-
[3-950-వ.]

3801} మంగళతీర్థపాదుడు  - శుభకరమైన తీర్థము (గంగ) పాదములవద్ద కలవాడు, విష్ణువు :-
[9-142-మ.]

3802} మంగళాభరణములు  - నుదుట తిలకము, మెడలో మంగళసూత్రములు, చేతులకు గాజులు, కాళ్ళకి పట్టీలు, కాలి వేళ్ళకి మట్టెలు మొదలగు శుభకరమైన స్త్రీలు ధరించెడి ఆభరణములు :-
[6-521-వ.]

3803} మంజులవాణి  - మృదువుగా మాటలాడెడి యామె, స్త్రీ. :-
[10.1-329-క.]

3804} మండలతానకము  - నటనము చేయుచు నృత్యమండలమును చుట్టి వచ్చుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3805} మంత్రము  - 1.గాయత్రి వంటివి, మంతారం త్రాయత ఇతి మంత్రః. (వ్యుత్పత్తి), 2. తలచుట (మననము) చేయు వానిని దుఃఖమునుండి రక్షించునది మంత్రము 3. ఉపాయము చూపునది, ఇది చేయువాడు మంత్రి :-
[9-170.1-తే., 10.1-1228-వ.]

3806} మంత్రి  - మంత్రాంగమున సహాయము చేయువాడు :-
[1-370.1-తే.]

3807} మంద  - యాదవులు మొదలైన జాతులవారి జనవాసము, ఊరుకంటె చిన్నది, పల్లె :-
[3-104-క.]

3808} మందగమన  - మెల్లని నడక కలామె, స్త్రీ :-
[10.1-841-వ., 10.1-968-వ.]

3809} మందరధరుడు  - మందర పర్వతమును ధరించినవాడు, కృష్ణుడు, విష్ణువు :-
[3-96-క., 10.2-1059-క.]

3810} మందాకిని  - దివిని పారు గంగ, మందముగ వక్రగమనముతో ప్రవహించునది, ఆకాశగంగ. :-
[9-226-మ., 10.2-663-మ.]

3811} మందాకినీనందనుడు  - గంగాదేవి పుత్రుడు, భీష్ముడు :-
[1-216-వ., 1-218-వ.]

3812} మందారుడు  - కల్పవృక్షము (మందారము) వలె కోరికలు తీర్చు వాడు :-
[1-528-క.]

3813} మందిరపతి  - మందిరము (నివాసము)నకధిపతి, గృహస్తుడు :-
[4-608-చ.]

3814} మందిరము+కున్  - మందిరమునకున్, నుగాగమ సంధి :-
[10.2-1263-వ.]

3815} మంద్ర  - (అ) 1. నాభిస్థానమున పలుకు ధ్వని మంద్ర, 2. హృదయ స్థానమున పలుకు ధ్వని మధ్య, 3. మూర్థమునందు పలుకు ధ్వని తారా, ఇవి సంగీత పారిభాషిక పదములు, (ఆ) గంభీరమైన స్వరము :-
[2-188.1-తే.]

3816} మకరకుండలములు  - కర్ణాభరణ విశేషములు, మకర (మొసలి ఆకృతిలో గల) కుండలములు :-
[7-285-వ., 8-507-వ., 10.2-516.1-తే.]

3817} మకరకేతనాత్మజుడు  - మకరకేతనుడు (మన్మథుడు) ప్రద్యుమ్నుడు యొక్క ఆత్మజుడు (కొడుకు), అనిరుద్ధుడు :-
[10.2-844-చ.]

3818} మకరకేతనుడు  - మకరము (మొసలి) కేతనము (జండాపై) గుర్తుకల జండా కలవాడు, మన్మథుడు :-
[3-941.1-తే., 9-230-వ.]

3819} మకరద్వజుడు  - మకరము (మొసలి గుర్తు) ధ్వజము (జండా) పైగలవాడు, మన్మథుడు :-
[5.2-125-వ.]

3820} మకరాకరము  - మకరముల (మొసళ్ళ)కి ఆకరము (నివాసము), సముద్రము, సరస్సు :-
[8-701-వ.]

3821} మకరాలయము  - మొసళ్ళకు నిలయము, సముద్రము, సరస్సు :-
[8-114-క.]

3822} మగధనాథుడు  - మగదదేశాధీశుడు, జరాసంధుడు :-
[10.1-1535-ఆ.]

3823} మగధుడు  - మగధదేశాధీశుడు, జరాసంధుడు :-
[10.1-1549-ఉ.]

3824} మగధేశ్వరుడు  - మగధ దేశపు రాజు, జరాసంధుడు :-
[10.1-1670-చ.]

3825} మగ్నాంగుడు  - మునిగినదేహము కలవాడు, నీటిలో మునిగిన వాడు :-
[10.1-1231-శా.]

3826} మఘాద్యష్టనక్షత్రములు  - 1మఘ 2పుబ్బ 3 ఉత్తర 4హస్త 5చిత్త 6స్వాతి 7విశాఖ 8అనూరాధ అనెడి ఎనిమిది నక్షత్రములు :-
[5.2-97-వ.]

3827} మచ్చెకంటి  - చేపవంటి కన్నులు కలామె, స్త్రీ :-
[9-619-వ.]

3828} మడుగు  - ఏటిలో లోతైన నిడుపాటి ప్రాంతము, హ్రదము :-
[10.1-636.1-తే.]

3829} మణిగ్రీవుడు  - మణి (శ్రేష్ఠమైన) గ్రీవుడు (కంఠము) కలవాడు, కుబేరుని కొడుకులలో ఒకఁడు, నారదుని శిష్యుఁడైన గంధర్వకుమారుఁడు. నలకూబరుని సహోదరుఁడు. వీరిద్దరూ అత్యంత అందమైనవారుగా చెప్పబడుదురు. నారదశాపంతో జంటమద్దులై శైశవకృష్ణుని వలన శాపవిమోచనం పొందారు :-
[10.1-391-వ.]

3830} మణిపర్వతము  - ఇంద్రుడు కొలువుదీరు మేరుపర్వత ప్రదేశము :-
[10.2-150-వ.]

3831} మణిపూరక చక్రము - మూలాధారాది షట్చక్రములలో నాభితలమున ఉండునది :-
[2-29.1-ఆ.]

3832} మణిసన్నద్ధుడు  - అణిమాదిసిద్ధుడు :-
[4-460.1-తే.]

3833} మతల్లిపార్థివచారము  - ప్రతి పర్యాయమున కాళ్ళు ముందు వెనుకలుగా ఎత్తి పెట్టుచు పోవుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3834} మత్తకాశిని  - మదముచేత ప్రకాశించు ఆమె, స్త్రీ :-
[1-391-వ., 10.2-208-వ., 10.2-344-వ., 10.2-804-వ., 10.2-1172-వ.]

3835} మత్తదైత్యనివారణడు  - మత్త (మదించిన) దైత్య (రాక్షసులను) నివారణుడు (నిరోధించెడివాడు), కృష్ణుడు :-
[5.2-167-మత్త.]

3836} మత్తద్విరేఫాలక  - మత్తుగొన్న తుమ్మెదలవంటి ముంగురులు కల స్త్రీ. :-
[10.2-350-మ.]

3837} మదనాంతకుండు  - మన్మథుని దేహము అంతము చేసినవాడు, శివుడు :-
[10.2-388-క.]

3838} మదనారాతి  - మన్మథుని శత్రువు, శివుడు :-
[10.2-1246-క.]

3839} మదనుడు  - మదింపజేయువాడు, మన్మథుడు :-
[10.1-967.1-ఆ.]

3840} మదము  - 1కొవ్వు 2గర్వము, అష్టవిధమదములు 1విత్త 2వయో 3రూప 4విద్యా 5బల 6ఐశ్వర్య 7కర్మ 8జన్మల సంబంధించిన మదములు :-
[8-661.1-తే.]

3841} మదవతి  - యౌవనమదము కలామె, స్త్రీ :-
[10.1-1091-మ.]

3842} మదిరాక్షి  - మదము కప్పిన అక్షి (కన్నులు కలది), మత్తిల్లిన కాటుక పిట్ట వంటి కన్నులు గల స్త్రీ, అందగత్తె :-
[4-99-క.]

3843} మదిరాక్షిసతి  - మదిరాక్షి (అందమైన) సతి (భార్య) :-
[4-832-తే.]

3844} మదోద్ధతరాజకులోత్సాదుడు  - మద (గర్వముతో) ఉద్దత (అతిశయించిన) రాజ (రాజుల) కుల (వంశములను) ఉత్సాదుడు (పెల్లగించి వేయువాడ), విష్ణువు :-
[6-528-క.]

3845} మద్రపతిసుత  - మద్రదేశ రాజు యొక్క పుత్రిక, లక్షణ, కృష్ణుని అష్టమహిషలలో ఒకతె. :-
[10.2-1083.1-తే.]

3846} మద్రరాజకన్యక  - మద్రదేశపు రాకుమారి, లక్షణ, కృష్ణుని అష్టమహిషలలో ఒకతె. :-
[10.2-1082-వ.]

3847} మధు విరోధి - మధుడు అనెడి రాక్షసుని శత్రువు, హరి :-
[4-869-క.]

3848} మధునిషూదనుడు  - మధు అను రాక్షసుని నిషూద (సంహరించిన)వాడు, విష్ణువు :-
[3-170-క., 4-617.1-తే.]

3849} మధుపము  - మధువు తాగునది, తుమ్మెద, కల్లు తాగుటచేత వలె మనసును కలతపెట్టునది :-
[10.1-1459-మ.]

3850} మధురిపుడు  - మధు యనెడి రాక్షసుని శత్రువు, విష్ణువు :-
[6-156-క., 7-253-క., 9-82.1-తే.]

3851} మధువిదారి  - మధు యనెడి రాక్షసుని విదారి (సంహరించినవాడు), విష్ణువు :-
[6-146.1-తే.]

3852} మధువిరోధి  - మధు అనెడి రాక్షసుని శత్రువు, విష్ణువు :-
[10.1-1692.1-ఆ.]

3853} మధువైరి  - మధు యనెడి రాక్షసుని వైరి (శత్రువు), విష్ణువు :-
[7-169.1-తే., 10.1-236-వ.]

3854} మధువ్రతము  - మధు (తేనె) గ్రహించెడి వ్రతము కలది, తుమ్మెద, చక్కటి వర్తన కలది :-
[3-291-క., 10.1-1464-ఉ.]

3855} మధుసూదనుడు  - మధు అనెడి రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు, మధుసూదన మధుం సూదయతి నాశయతి, అసుర స్వభావ సంహారకత్వాత్, అసుర స్వభావమును నశింప చేయునది (ఆంధ్ర వాచస్పతము) :-
[2-228.1-తే., 3-496-క., 4-371-వ., 4-969-క., 10.1-1402-క., 10.2-262-వ.]

3856} మధ్యందినము - మధ్యాహ్నము :-
[4-390-వ.]

3857} మధ్యమపూజ్యుడు  - 1. ఉత్కృష్టము కాక, అపకృష్టము కాక మధ్యస్థముగా పూజింపబడువాడు, 2. ప్రప్రథమంగా పూజింపబడువాడు కాకుండా మధ్యమముగా పూజిపబడువాడు. :-
[4-51.1-తే.]

3858} మధ్యమలోకము  - లోకత్రయము (స్వర్గ భూ నరక లోకముల)లో నడుమది, భూలోకము :-
[9-230-వ., 10.2-347.1-తే.]

3859} మనసాది,ఏకదశేంద్రియములు  - 1మనస్సు 5జ్ఞానేంద్రియములు 5కర్మేంద్రియములు. :-
[10.1-539-వ.]

3860} మనసిజుడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[3-469-క., 4-795-క.]

3861} మనసుకట్టి  - మనసును ఇంద్రియ వ్యాపారములందు ప్రవర్తింపనీయక నిలిపికొనుట, మనసును స్వాధీనమున ఉంచుకొనుట :-
[10.1-1662-ఆ.]

3862} మనస్సు  - సంకల్పరూపమైనది, సంకల్పాత్మకమైన అంతఃకరణము :-
[10.1-682.1-తే., 10.1-1472.1-తే., 10.2-1203-వ.]

3863} మనుచరిత  - శాశ్వతముగా జీవించు వర్తన కలవాడు, ధర్మరాజు :-
[10.2-702-క.]

3864} మనుజనాథుడు  - మనుజులకు నాథుడు (ప్రభువు), రాజు :-
[8-687-తే.]

3865} మనుజనాయకుడు  - మనుజల (మానవుల) యొక్క నాయకుడు, రాజు :-
[4-760.1-తే.]

3866} మనుజపతి  - మనుజుల (మానవుల)కు పతి (ప్రభువు), రాజు :-
[9-75-క., 9-200.1-తే.]

3867} మనుజవరేణ్యుడు  - మానవులలో గౌరవనీయుడు, రాజు. :-
[3-8-క., 3-40-క.]

3868} మనుజవల్లభుడు  - మానవులకు భర్త, రాజు :-
[1-370.1-తే.]

3869} మనుజవిభుడు  - మనుజులకు విభుడు రాజు, పరీక్షిత్తు. :-
[1-459.1-తే., 4-559.1-తే.]

3870} మనుజవిశేషభోజనులు  - మానవులను విశేషముగా తినెడివారు, రాక్షసులు :-
[6-276-చ.]

3871} మనుజాధీశుడు  - మనుజులకు అధీశుడు, రాజు. :-
[1-359-క., 7-94-క., 10.2-45-క.]

3872} మనుజుడు - మనువు యొక్క వంశము వారు :-
[4-663-క.]

3873} మనుజేంద్రుడు  - మనుజులకు ఇంద్రునివంటివాడు, రాజు :-
[3-78-క., 3-123.1-తే., 3-129.1-తే., 4-482-క., 4-531.1-తే., 4-593-క., 4-760.1-తే., 8-16.1-ఆ., 10.1-838-క., 10.1-1333-మ.]

3874} మనుజేశుడు  - మనుజులకు ఈశుడు (ప్రభువు), రాజు :-
[5.2-23-ఆ.]

3875} మనుజేశ్వరుడు  - మానవులకు ప్రభువు, రాజు :-
[1-464-చ.]

3876} మనువు  - వైవస్వాది చతుర్దశ మనువు లందలివాడు, సృష్ట్యాదియందు భగవన్నియామకుఁడు అయి భూమిని పాలించు రాజు. :-
[5.1-13-ఆ.]

3877} మనువులు  - పద్నాలుగురు, 1 స్వాయంభువుడు 2 స్వారోచిషుడు 3 ఉత్తముడు 4 తామసుడు 5 రైవతుడు 6 చాక్షుసుడు 7 వైవస్వతుడు 8 సూర్యసావర్ణి 9 దక్షసావర్ణి 10 బ్రహ్మసావర్ణి 11 ధర్మసావర్ణి 12 భద్రసావర్ణి 13 దేవసావర్ణి 14 ఇంద్రసావర్ణి ( పాఠాంతరములు కూడ కలవు) ప్రస్తుతము వైవశ్వత మన్వంతరము జరుగుచున్నది. :-
[2-97-చ., 3-249-తే., 3-305-త.]

3878} మనుష్యులు  - మనసుతో బ్రతుకు జీవులు :-
[2-222-వ.]

3879} మనుసుత  - (స్వాయంభువ) మనువు యొక్క సుత (పుత్రిక), దేవహూతి :-
[3-956-చ.]

3880} మనోజాతుడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[3-477-మ.]

3881} మనోజుడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[9-560-శా., 10.1-1735-వ.]

3882} మనోనిరోధము  - మనస్సును విషయాసక్తము కానీకుండ లోబరచుకొనుట :-
[10.1-1474-ఆ.]

3883} మనోభవుడు  - మనసున పుట్టువాడు, మన్మథుడు :-
[9-541-ఉ., 10.1-1734-మ.]

3884} మనోరంజనుడు  - మనసును రంజింప చేయువాడు, ఇష్టుడు :-
[10.1-590-క.]

3885} మనోరథము  - కోరిక, మనస్సును అటు ఇటు తీసుకుపోయే రథము, మనసున రథ (తిరుగునది), :-
[1-396-వ., 3-751-వ., 4-68-వ.]

3886} మనోరథవరదానసుశీలుడు  - మనోరథ (మనసులోకలిగిన)(కోరిన) వరములను దాన (ఇచ్చు) సుశీలుడు (మంచిగుణము) కలవాడు, విష్ణువు :-
[3-748-క.]

3887} మనోవల్లభ  - మనసునకు వల్లభ (నాయిక), సతి :-
[8-474-వ.]

3888} మనోవల్లభుడు  - మనసుకు వల్లభుడు (నాయకుడు), భర్త :-
[10.2-236-వ.]

3889} మనోవృత్తులు  - 1.మనసున కేర్పడు వృత్తులు 2. క్షిప్త, మూఢ, విక్షిప్త, ఏకాగ్ర, నిరుద్ధ. 3. ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి. :-
[5.1-155-వ.]

3890} మనోహరము  - మనసును దొంగిలించెడిది, అందమైనది :-
[4-688-క.]

3891} మనోహరుడు  - మనః (మనసును) హరుడు (దొంగిలించినవాడు), భర్త :-
[8-102-శా.]

3892} మన్మథమన్మథుడు  - మన్మథునికే మోహము పుట్టించువాడు, కృష్ణుడు :-
[10.1-1467.1-తే.]

3893} మన్మథుడు  - మనసును కలత పెట్టువాడు, రతీదేవి భర్త, వ్యు. యత్ బుద్ధిః తాం మంథాతీతి మన్మథః :-
[10.1-1014.1-ఆ.]

3894} మన్మథునిపంచబాణములు  - 1మోహనము 2ఉన్మాదము 3సంతపనము 4శోషణము 5నిశ్చేష్టీకరణము :-
[10.1-787-మ., 10.2-1168-ఆ.]

3895} మన్వంతరము  - ఒక మనువు పాలించు కాలపరిమితి, డెబ్బైయొక్క మహాయుగములు :-
[1-63-వ., 7-372.1-ఆ.]

3896} మన్వంతరములు  - పద్నాలు, 1 స్వాయంభువ 2 స్వారోచిష 3 ఉత్తమ00 4 తామస 5 రైవత 6 చాక్షుస 7 వైవస్వత 8 సూర్యసావర్ణి 9 దక్షసావర్ణి 10 బ్రహ్మసావర్ణి 11 ధర్మసావర్ణి 12 భద్రసావర్ణి 13 దేవసావర్ణి 14 ఇంద్రసావర్ణి ( పాఠాంతరములు కూడ కలవు) ప్రస్తుతము వైవశ్వత మన్వంతరము జరుగుచున్నది. :-
[4-945-వ.]

3897} మమత  - మమకారము (నాది యనెడి భావము) :-
[1-304-క., 4-818.1-తే.]

3898} మమత్వము  - మమకారము, ఇది నాది అను అభాస భావము యొక్క బంధనములు :-
[2-203-వ.]

3899} మయాదిశక్తులు  - 1పరాశక్తి 2ఆదిశక్తి 3జ్ఞానశక్తి 4ఇచ్చాశక్తి 5క్రియాశక్తి, పంచవిధశక్తులు. త్రివిధ మాయలు, 1. అవిద్య, 2. ఆవరణము, 3. విక్షేపము. నవవిధ శక్తులు 1. ప్రభ, 2. మాయ, 3. జయ, 4. సూక్ష్మ, 5. త్రిశుద్ధ, 6. నందిని, 7. సుప్రభ, 8. విజయ, 9. సిద్ధిద [కృష్ణుడు శక్తీశ్వరుడు] (సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002) [పాండురంగమహాత్మ్యము 3 134] :-
[10.1-537-వ.]

3900} మయుడు  - దానవ శిల్పి :-
[10.2-837-వ.]

3901} మయూఖమాలి  - కిరణములు కలవాడు, సూర్యుడు :-
[1-2-ఉ.]

3902} మయూరలలితకరణము  - నెమలి వలె ఒయ్యారముగా మెడను నిక్కించి కదలించుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3903} మయూరుడు - ఒక సంస్కృత కవి. ఇతఁడు అంధుఁడు అయి సూర్యశతకము చేసి కన్నులు పడసినాఁడు అని వాడుదురు. :-
[6-11.1-తే.]

3904} మరకతాచలము  - మలయపర్వతము :-
[3-287.1-తే.]

3905} మరీచి  - మరీచిమహర్షి, కిరణము, వ్యు. మృ+ఈచి, మ్రియంతే నశ్యంతి క్షుద్రజంతవః తమాంసి చ అనేన, దీనితో (క్షుద్ర) చిన్న జంతువులు మరియు చీకటి నశింపబడును. కిరణము., :-
[4-7.1-తే., 5.2-10-వ.]

3906} మరీచ్యాదులు  - నవబ్రహ్మలు, 1 మరీచి 2 అత్రి 3 అంగీరసుడు 4 పులస్త్యుడు 5 పులహుడు 6 క్రతువు 7 వసిష్టుడు పాఠ్యంతరం నవబ్రహ్మలు, 1 మరీచి 2 భరద్వాజుడు 3 అత్రి 4 అంగీరసుడు 5 పులస్త్యుడు 6 పులహుడు 7 క్రతువు 8 వసిష్టుడు 9 వామదేవుడు :-
[3-305-త.]

3907} మరుత్తు  - మారుతము (వాయువునకు) అధిపతి, వాయుదేవుడు, వ్యు. మృ+ఉతి, మ్రియతే ప్రాణినః అస్య అభావాత్, ఇది లేకపోయినచో ప్రాణులు మరణించును. వాయువు, గాలి దేవత. :-
[4-426-క.]

3908} మరుత్తులు  - 1.సప్తసప్త సంఖ్యు లగు వేల్పులు, ఏడు గణములలో ఏడుగురు చొప్పున 49 మంది వాయువులు. 2.అగ్నిష్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, పితలు, ఆజ్యపులు, సాగ్నులు, విరగ్నులు అని ఏడు విధాలైన ఆ అగ్నులు, 3.దితికి కశ్యపమహర్షివలన పుట్టిన వాయవేల్పులు. (శబ్దకల్పద్రుమము నందు వీరి పేర్లు ఇవ్వబడినవి) :-
[2-38-వ., 6-286.1-ఆ., 6-448-ఉ., 8-634-వ.]

3909} మరుత్సుతుడు  - వాయుపుత్రుడు, హనుమంతుడు :-
[9-325-మ.]

3910} మరుత్సూనుడు  - మరుత్ (వాయుదేవుని) సూనుడు (పుత్రుడు), భీముడు :-
[10.2-731-ఉ.]

3911} మరుదశనపతిశయనుడు  - మరుత్ (గాలిని) అశన (భక్షణముచేసెడి వారి)( సర్పముల) పతి (ప్రభువైన ఆదిశేషుని పైన) శయనుడు (పరుండువాడు), విష్ణువు :-
[12-1-క.]

3912} మరున్నగరము  - మరుత్ (దేవతల) నగరము, స్వర్గము :-
[9-231-మ.]

3913} మర్త్యులు  - మరత (మరణించు లక్షణము) కలవారు, మానవులు :-
[2-194-చ., 3-346-వ., 3-946.1-తే., 7-241-వ., 10.1-903-శా.]

3914} మర్దితపాదకర్మలు  - బంకమన్ను కలియదొక్కునట్లు అడుగులెత్తి వేయుట, రాసక్రీడా పారిభాషిక పదము :-
[10.1-1084-వ.]

3915} మర్మములు  - ప్రాణములు దాగిన దేహభాగములు, జీవస్థానములు :-
[4-335-చ.]

3916} మర్మర  - గాలికి వస్త్రములు, ఆకులు చేసెడి ధ్వన్యనుకరణ :-
[10.1-766-వ.]

3917} మలయకేతనుడు  - 1.మలయ (విష్ణుభక్తి ప్రధానముగా కల దక్షిణ దేశము) అందు కేతనుడు (శ్రేష్ఠుడు), పురంజనోపాఖ్యానంలో, 2.విదర్భ రాకుమారిగా పుట్టిన పురంజయుని భర్త, 3. పాండ్యదేశపురాజు. :-
[4-830.1-తే.]

3918} మలయకేతు  - 1.భరతవర్షంలోని తొమ్మిది దేశాలలో ఒక దేశము. 2.మలయు (తపసు చేయుటకు) కేతు (గుర్తు కలది), తపో భూమి, :-
[5.1-64-వ.]

3919} మలయజము  - మలయ పర్వతమున పుట్టిన మంచి గంధము :-
[10.2-1143.1-తే.]

3920} మలహరుడు  - మల (దోషములను) హరుడు (తొలగించెడివాడు), శంకరుడు :-
[9-515-చ.]

3921} మలినోపాధులు  - చెడ్డవృత్తులు ఉదా. దొంగతనము, వేశ్యావృత్తి, వడ్డీవ్యాపారము మొదలైనవి :-
[2-222-వ.]

3922} మల్లుడు  - మల్లయుద్దము (కుస్తీ) జట్టీ, కంసుని ఆస్థాన మల్లయోధుడు :-
[2-190-చ.]