పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

టిప్పణి కోశాలు పట్టికలు : టిప్పణీ పట్టిక (అంక - అనంతు)

శ్రీరామ

up-arrow

ఇక్కడ చదువరులు చూసుకొనుటకు వీలుగా విడదీసి శీర్షికలుతో పెట్టాము. మొత్తం దస్త్రం కావలసినవారు శీర్షికలో తీసుకొనగలరు

: :తెలుగు భాగవత గ్రంథంలో వాడబడిన పద / పదబంధాలకు టిప్పణిల జాబితా: :


1} అంకపీఠము - అంక (ఒడి, తొడ) అను పీఠము (ఆసనము, పీట) :-
[3-930-చ.]

2} అంకరహితేందువదనలు - అంకరహిత (అంక కలంకముచేత) రహిత (విడువబడిన) (నిర్మలమైన) ఇందువదనలు (చంద్రుని వంటి ముఖములు కలవారు), అందమైన స్త్రీలు :-
[10.1-1086-క.]

3} అంకురార్పణ - నవధాన్యములను మొలకెత్తించి సమర్పించుట ద్వారా చేసెడి వేదోక్త ప్రారంభ కర్మ, కార్యం ప్రారంభము :-
[6-95-వ.]

4} అంకుశము - ఏనుగును నడపుట యందు, కుంభ స్థలమును పొడచుటకు వాడు చిన్న గునపము వంటి సాధనము :-
[1-344-మ., 3-645-క., 6-389-ఉత్సా.]

5} అంగజుడు - అంగము (దేహము)నందు పుట్టువాడు, ఇంద్రియములదు పుట్టెడివాడు, మన్మథుడు :-
[5.1-28-ఉ., 9-269.1-తే., 10.1-1013-ఉ., 10.1-1488-మ.]

6} అంగన - చక్కటి అంగ సౌష్టవము కల ఆమె, అందగత్తె, స్త్రీ :-
[3-734.1-తే., 3-1027-వ., 4-7.1-తే., 4-58.1-తే., 4-659-క., 4-849-వ., 10.1-789-ఉ., 10.1-1714-ఉ.]

7} అంగనామణి - అంగనలలో మణి వంటి ఆమె, స్త్రీ. :-
[3-916-చ., 3-931-ఉ.]

8} అంగభవకేళి - అంగభవ (మన్మథుని) కేళి (క్రీడ), సురతము :-
[10.1-1497-మ.]

9} అంగిరసులు - అంగిరసగోత్రపువారు :-
[9-76-వ.]

10} అంచితదేవతాకులోత్తంసము - అంచిత (చక్కగా) దేవతా (దేవతల) కుల (సమూహమునందు) ఉత్తంసము (శ్రేష్ఠమైనవాడు), బ్రహ్మ :-
[6-3-ఉ.]

11} అంచితభక్తఫలప్రదాయకుడు - అంచిత (చక్కటి) భక్తులకు ఫల (సత్ఫలములను) ప్రదాయకుడు (చక్కగా ఇచ్చువాడు), విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

12} అంచితమూర్తి - పూజనీయమైన స్వరూపము కలవాడు, బ్రహ్మదేవుడు :-
[3-500-ఉ.]

13} అంచితాత్మ - పూజింపదగిన ఆత్మ (వాడు), శివుడు :-
[4-685.1-తే.]

14} అంజనావతిఆది - దిగ్గజముల భార్యలు, 1తూర్పు దిగ్గజము ఐరావతము భార్య అభ్రము 2ఆగ్నేయము దిగ్గజము పుండరీకము భార్య కపిల 3దక్షిణము దిగ్గజము వామనము భార్య పింగళ 4నైఋతి దిగ్గజము కుముదము భార్య అనుపమ 5పడమర దిగ్గజము అంజనము భార్య తామ్రపర్ణి 6వాయవ్యము దిగ్గజము పుష్పదంతము భార్య శుభ్రదంతి 7ఉత్తరము దిగ్గజము సార్వభౌమము భార్య అంగన 8ఈశాన్యము దిగ్గజము సుప్రతీకము భార్య అంజనావతి :-
[8-40.1-తే.]

15} అంజనీసుతుడు - అంజనీదేవి యొక్క పుత్రుడు, ఆంజనేయుడు :-
[5.2-52-ఆ.]

16} అండకటాహము - అండ (బ్రహ్మాండ) కటాహము (పైడిప్ప) :-
[5.2-75-వ.]

17} అండకుంభము - బ్రహ్మాండములు కల కుండ, బ్రహ్మాండభాండము :-
[10.1-557.1-తే.]

18} అంతః+యామి - అంతర్యామి, విసర్గ సంధి, పరమాత్మ :-
[10.2-1203-వ.]

19} అంతఃకరణచతుష్టయము - 1మనస్సునకు సంకల్పము 2బుద్ధికి నిశ్చయము 3చిత్తమునకు చింతనము 4అహంకారమునకు అహంభావము :-
[3-891-వ., 10.1-119.1-ఆ.]

20} అంతఃకరణము - మనసు లోపలి ఇంద్రియము, మనోబుద్ధి చిత్తాహంకారములకు మూలమైన ప్రధానము :-
[3-156-వ., 10.1-683-వ.]

21} అంతఃకరణములు - అంతఃకరణచతుష్టయము, 1. మనస్సు, 2. బుద్ధి, 3. చిత్తము, 4. అహంకారము. :-
[1-130-వ.]

22} అంతఃకరణవాసి - అంతఃకరణములో నివసించెడివాడు, విష్ణువు :-
[4-705-వ.]

23} అంతఃపురము - రాణివాసపు స్త్రీలు నివసించు గృహము :-
[10.2-371-వ.]

24} అంతకపురికేగు - అంతక (యముని) పురి (నగరమునకు) ఏగు (వెళ్ళు), మరణించు :-
[10.2-302-క.]

25} అంతకుడు - 1. లయ కారణుడు, విష్ణువు, 2. అంతయతి అంత + ణ్వుల్. (కృ.ప్ర.) నశింపచేయువాఁడు. :-
[4-705-వ.]

26} అంతకుమూర్తి - అంతకు (అంతము చేసెడి) మూర్తి (స్వరూపము), యముడు, హరుడు :-
[6-318.1-తే.]

27} అంతరంగసంగతుడు - అంతరంగ (ఆత్మలలో) సంగతుడు (కూడి యుండువాడు), విష్ణువు :-
[6-438-చ.]

28} అంతరాత్మ - లోపల నుండెడి ఆత్మ, విష్ణువు :-
[4-705-వ.]

29} అంతరాళము - 1. ఎల్లదిక్కులకు నడిమి చోటు, 2. నడిమి భాగము :-
[4-135-వ.]

30} అంతరిక్షంబు - అంతర్ + ఈక్షంబు రెండు వస్తువుల మధ్యన చూడబడునది, ఆకాశము, space :-
[2-16-వ.]

31} అంతర్థానము - అదృశ్యము, లోపలి స్థానము, లోపల ధరించునది, లోపల అణగినది. :-
[2-252-వ.]

32} అంతర్యామి - లోపలంతా వ్యాపించినవాడు, పరమాత్మ, జీవాత్మ :-
[1-61-వ., 2-248-వ., 7-448-వ., 10.2-1215-వ., 10.2-1220-వ., 10.2-1230-వ.]

33} అంతస్థములు - య ర ల వలు, నడుమనున్నవి, హల్లులు 3 రకాలు. 1. స్పర్శాలు 'క నుండి మ' వరకు ఉన్నవి. 2. ఊష్మాలు 'శ, ష , స, హ' 3. అంతస్థాలు 'య, ర, ల, వ' ఈ అంతస్థాలకు హల్లులుగా ఉంటూ, అచ్చులకు ప్రత్యామ్నాయంగా కూడా వాడబడతాయి. అలా హల్లులకు అచ్చులకు నడిమివి కనుక కూడా అంతస్థాలు అంటారు. వీటి పలుకుబడిలో గాలి నిరోధం తక్కువగా ఉండి వరిపిడి లేకుండా గాలి మధ్యస్థంగా వదలబడుతుంది కనుక అంతస్థములు అంటారు. :-
[12-30-వ.]

34} అంతస్థ్సితగహ్వరి - అంతః (అంతరంగములో) స్థిత (ఉన్నట్టి) గహ్వరి (గుహ లందుండు వాడు), విష్ణువు :-
[6-33-క.]

35} అంతాదిరహితుడు - అంతాది (ఆద్యంతములు) రహితుడు (లేనివాడు), విష్ణువు :-
[8-177-క.]

36} అందలము - పార్శ్వముల మఱుగులేని పల్లకి :-
[10.2-214-వ.]

37} అంధకారపరిపంథి - చీకటికి శత్రువు, సూర్యుడు :-
[10.1-1615-వ.]

38} అంధకారవైరి - చీకటికి శత్రువు, సూర్యుడు :-
[1-255-ఆ.]

39} అంధకారారాతి - చీకటికి శత్రువు, సూర్యుడు :-
[10.1-1137.1-తే.]

40} అంధకూపము - గ్రుడ్డిగొయ్యి, నరక విశేషము :-
[5.2-136-వ.]

41} అంధతమసము - అంధ (గుడ్డి) తమసము (చీకటి) :-
[3-83.1-తే.]

42} అంధతామిశ్రము, అంధతామిస్రము - గాఢాంధకారము, చిమ్మచీఁకటి. అంధ (గ్రుడ్డి) తామిస్రము (చీకటి), నరక విశేషము, తామిశ్రము నరకవిశేషము ఏమున్నదో తెలియని చీకటిమయమైనది. :-
[3-721.1-తే., 5.2-136-వ., 5.2-139-క.]

43} అంధము - అంధతరము అంధతమము :-
[1-446-క.]

44} అంబరీషుడు - అథిధి సత్కారమున శ్రేష్ఠుడు, సాధు వర్తనమున దూర్వాసుని గెలిచినవాడు :-
[2-204.1-తే.]

45} అంబిక - సిద్ధవనక్షేత్రమున అంబిక (సర్వ మాతృ రూపిణి) :-
[10.1-61-వ.]

46} అంబికాతనయుడు - అంబిక (పార్వతీదేవి యొక్క) తనయుడు, విఘ్నేశ్వరుడు :-
[6-4-ఉ.]

47} అంబికాధీశుండు - అంబిక (పార్వతీదేవి) యొక్క అధీశుడు (భర్త), పరమశివుడు :-
[5.2-111.1-తే.]

48} అంబికావరుడు - అంబిక (పార్వతీదేవి) యొక్క వరుడు (భర్త), శివుడు :-
[10.2-445-వ., 10.2-1242.1-తే.]

49} అంబుజనాభుడు - అంబుజము (పద్మము) నాభిన కలవాడు, పద్మనాభుడు, విష్ణువు :-
[3-683-చ., 4-366-వ., 10.2-626-క.]

50} అంబుజనేత్ర - అంబుజము (పద్మములవంటి) నేత్ర (కన్నులుగలామె), స్త్రీ. :-
[5.1-36-క.]

51} అంబుజబంధువు - పద్మముల బంధువు, సూర్యుడు :-
[1-248-క.]

52} అంబుజము - అంబువు (నీటియందు) జము (పుట్టునది), పద్మము :-
[1-505-మ., 3-320.1-తే., 3-336-తే., 4-550-చ., 4-924-చ., 8-202.1-తే.]

53} అంబుజసంభవుడు - అంబుజ (అంబువు (నీటి)లో పుట్టునది, పద్మము) నందు పుట్టినవాడు, బ్రహ్మదేవుడు :-
[10.1-507-శా.]

54} అంబుజాకరము - అంబుజ (పద్మముల) ఆకరము (నివాసము), చెరువు, కొలను :-
[10.1-430.1-తే.]

55} అంబుజాక్షుడు - అంబుజము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), పద్మాక్షుడు, విష్ణువు. :-
[6-441.1-తే., 10.1-572.1-తే., 10.1-1504.1-ఆ., 11-16-మత్త.]

56} అంబుజాతము - అంబువు (నీరు)నందు జాతంబు (పుట్టునది), పద్మము :-
[3-116-మ., 3-507-వ., 7-342.1-తే.]

57} అంబుజాప్తుడు - పద్మబాంధవుడు, సూర్యుడు :-
[10.2-1304-ఉ.]

58} అంబుజాసనుడు - అంబుజము (పద్మము)న ఆసనుడు (ఆసీనుడగువాడు), బ్రహ్మ :-
[8-219-మ.]

59} అంబుజోదరుడు - అంబుజము (పద్మము) ఉదరుడు (ఉదరమున గలవాడు), విష్ణువు :-
[1-305-క., 6-126-ఉ., 7-150.1-తే.]

60} అంబుదము - అంబువు (నీరు) ద (ఇచ్చునది), మేఘము :-
[3-420-మ.]

61} అంబుధి - అంబువు (నీటికి) నిధి, సముద్రము :-
[3-423.1-తే., 6-384-ఉ., 10.1-696-క.]

62} అంబుభృద్వాహుడు - అంబుభృత్ (మేఘము) వాహుడు (వహించువాడు), ఇంద్రుడు :-
[8-369-శా.]

63} అంబురుహము - అంబు (నీటిలో) రుహము (పుట్టినది), పద్మము :-
[3-98-చ., 3-799-మ., 10.1-1452-శా., 10.2-617-క.]

64} అంబోజాక్షి - అంబుజము (పద్మము) వంటి అక్షి (కన్నులు గల స్త్రీ), పద్మాక్షి, స్త్రీ. :-
[10.1-307-క.]

65} అంభశ్చరము - అంభః (నీటిలో) చరించెడిది, చేప :-
[8-699-వ.]

66} అంభశ్శయుడు - అంభః (నీట) శయుడు (పరుండు వాడు), మత్స్యావతారుడు, విష్ణువు. :-
[8-729-మ.]

67} అంభోజగర్భుడు - అంభోజము (పద్మము)నందు గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మ :-
[3-368-మ., 7-160.1-తే., 8-239-మ., 10.1-1236-దం., 10.1-1236-దం.]

68} అంభోజనాభుడు - జగత్సృష్టికి కారణమైన బ్రహ్మ జనించిన కమలము నాభియందు కలవాడు, విష్ణుమూర్తి :-
[10.2-202.1-ఆ.]

69} అంభోజము - నీటిలో పుట్టినది, పద్మము :-
[2-178-మ., 3-203-దం., 3-203-దం., 12-28-వ.]

70} అంభోజాకరము - అంభోజము (పద్మము)ల ఆకరము (నివాసము), సరోవరము :-
[8-111-శా.]

71} అంభోజాతము - నీటిలో జాతము (పుట్టినది), పద్మము :-
[3-565.1-తే.]

72} అంభోజాసనుడు - అంభోజ (పద్మము) ఆసనుడు (ఆసనముగగలవాడు), బ్రహ్మదేవుడు :-
[7-282-శా.]

73} అంభోధి - అంభస్ (నీటికి) నిలిచి ఉండునది, సముద్రము :-
[6-195.1-తే., 6-439.1-ఆ.]

74} అంభోధిరాట్కన్యకాకాంత - అంభోధి (సముద్రు)ని రాట్కన్య (రాకుమారి) యొక్క భర్త, విష్ణువు :-
[3-203-దం.]

75} అంభోనిధి - అంభస్ (నీరు) కి నిధివంటిది, నీటికి ఉనికిపట్టు, సముద్రము :-
[3-333-క., 10.1-921-శా., 10.1-1236-దం., 10.2-17-మ., 10.2-396.1-తే.]

76} అంభోనిధిమేఖల - సముద్రములు పరివేష్టించినది (మొలనూలుగా కలది), భూమండలము :-
[10.1-1312-మ.]

77} అంభోనిధిశాయి - అంభోనిధి (సముద్రము)న శయనించువాడు, విష్ణువు :-
[3-588-ఉ.]

78} అంభోరుహనేత్రుడు - అంభోరుహ (పద్మముల) వంటి నేత్రుడు (కన్నులుగలవాడు), విష్ణువు :-
[7-279-క.]

79} అంభోరుహము - అంభః (నీరు) యందు రుహము (పెరుగునది), పద్మము :-
[3-931-ఉ., 4-140.1-తే., 6-142-ఉ.]

80} అంభోరుహవదన - అంభోరుహ (పద్మము) వంటి వదనముకలామె, స్త్రీ :-
[11-67-క.]

81} అంశుమంతుడు - కిరణములు కలవాడు, సూర్యుడు :-
[10.2-1001-క.]

82} అంసాంచితకర్ణకుండలాభరణుడు - అంస (మూపులపై) అంచిత (అలంకరింప బడిన) కర్ణకుండలములు ఆభరణములుగా గలవాడు, విష్ణువు :-
[6-35-క.]

83} అకంపితశిరోభావాలు - సమముగా నిలిపిన శిరస్సులు కలవి, రాసక్రీడా నాట్య పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

84} అకర్మణుడు - కర్మములు అంచరించనివాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

85} అకలంకగుణాభిరాముడు - మచ్చలేని సుగుణములతో ఒప్పువాడు, కృష్ణుడు :-
[3-141-క.]

86} అకల్మషచిత్తుఁడు - అకల్మష (నిర్మలమైన) మనసు కలవాడు, విష్ణువు :-
[3-212-చ.]

87} అకారాదిత్రివర్ణకలితంబు - అకారము (సృష్టి) + ఉకారము (స్థితి) + పూర్ణానుస్వారము (లయము) కలిగిన ఓంకారము :-
[2-12-వ.]

88} అకుంచితశిరోభావాలు - నిగుడించిన శిరస్సు కలవి, రాసక్రీడా నాట్య పారిభాషిక పదం :-
[10.1-1084-వ.]

89} అకుంఠిత - కుంఠిత (మూఢురాలు) కాని యామె, వికాసము కలామె :-
[10.1-1735-వ.]

90} అకృష్టపచ్యాహారులు - పండించకయే (కృషి చేయకుండా) పచ్య (వండిన) ఆహారములు తీసుకొనువారు :-
[3-388-వ.]

91} అక్షతలు - క్షతము (బాధ) లేనివి, తడిపి పసుపు కలిపిన బియ్యపు గింజలు. :-
[10.1-260-వ., 10.1-1743-వ.]

92} అక్షయతూణీరము - తరగని అమ్ములుగల అమ్ములపొది, సంకేతము అనంత వాసనా రూపమైన అహంకార ఉపాధి :-
[4-771.1-తే.]

93} అక్షరుడు - క్షరము (నాశనము) లేనివాడు, శ్లో. క్షరస్సర్వాణిభూతాని కూటస్థోక్షర ఉచ్యతే (గీత), సర్వ భూతముల నాశము పిమ్మటను యుండువాడు అక్షరుడు, విష్ణువు :-
[3-364-చ., 3-833-క., 3-844-చ., 4-358.1-తే., 10.1-567.1-ఆ.]

94} అక్షహృదయము - 1 అధికసంఖ్యలలో కల వస్తువులనైనను చూచినంతమాత్రముననే లెక్కింపకయే మొత్తము చెప్పగల శక్తి, 2 జూదమునందలి పాచికలనడకలోని రహస్యము తెలియు విద్య :-
[9-235-ఆ.]

95} అక్షీణము - క్షీణము (తక్కువ) కానిది, పెద్దది :-
[10.1-704-క.]

96} అక్షీణుడు - తక్కువకానివాడు, అధికుడు :-
[10.1-1341-శా.]

97} అక్షోహిణి, అక్షౌహిణి - (1) 21,870 రథములు 21,870 ఏనుగులు 65,610గుఱ్ఱములు 109,350కాల్బలము కల సేనాసమూహము, (2) 10 అనీకిని కల సేన లేదా 270 వాహినులు కల సేన :-
[1-204-వ., 3-130-వ., 9-449-వ., 10.1-1530-క.]

98} అఖిల విశ్వోధ్భవ స్థితి విలయార్థధృత నిత్య విపుల మాయాగుణ విగ్రహుడవు - సమస్తమైన లోకములకు ఉద్భవ (సృష్టి) స్థితి లయముల అర్థ (ప్రయోజనములకు) ధృత (ధరింపబడిన) నిత్య (శాశ్వతమైన) విపుల (విస్తారమైన) మాయా (మాయతోకూడిన) గుణ (గుణములు) విగ్రహుడవు (రూపముకలవాడు), విష్ణువు :-
[4-918.1-తే.]

99} అఖిల - సమస్తమైన చతుర్దశ భువనములను :-
[10.1-117-క.]

100} అఖిలకారణకారణుడు - సమస్త కారణములకును కారణము యైనవాడు, విష్ణువు :-
[3-364-చ.]

101} అఖిలజగద్భర్త - సమస్త జగత్తునకు భర్త (ప్రభువు), విష్ణువు :-
[4-373-ఆ.]

102} అఖిలజేత - అఖిల (సమస్తమును) జేత (జయించువాడు), విష్ణువు :-
[3-897.1-తే.]

103} అఖిలదేవేశుడు - ఎల్లదేవతలకు ఈశ్వరుడు, విష్ణువు :-
[7-381.1-తే.]

104} అఖిలదేవోత్తసుడు - సమస్త దేవతలలోను ఉన్నతుడు, కృష్ణుడు :-
[1-215.1-తే.]

105} అఖిలధర్మదేహుడు - సమస్త ధర్మముల స్వరూపమైనవాడు, విష్ణువు :-
[4-703.1-తే.]

106} అఖిలధర్ముడు - సర్వ ధర్మములు తానైనవాడు, శివుడు :-
[4-697-వ.]

107} అఖిలధృతుడు - సమస్తమును ధరించువాడు, భగవంతుడు :-
[2-272.1-ఆ.]

108} అఖిలపాపహరుడు - సర్వ పాపములను హరించువాడు, శివుడు :-
[4-697-వ.]

109} అఖిలభావజ్ఞుడు - సర్వుల తాత్పర్యములు తెలిసిన వాడు, విష్ణువు :-
[10.2-1032-ఆ.]

110} అఖిలమోది - అఖిల (అందరను) మోది (సంతోషింప జేయువాడు), విష్ణువు :-
[6-333.1-ఆ.]

111} అఖిలలోకఖ్యాతవర్థిష్ణుడు - సమస్త లోకస్థులచే కీర్తింపబడి అతిశయించు శీలము కలవాడు, విష్ణువు :-
[3-148-మ.]

112} అఖిలలోకేశుడు - సర్వ జగత్తులకు ఈశుడు, విష్ణువు :-
[11-85-తే.]

113} అఖిలలోకేశ్వరుడు - అఖిల (సమస్తమైన) లోక (లోకములకు) ఈశ్వరుడు, విష్ణువు :-
[8-18.1-ఆ.]

114} అఖిలలోకేశ్వరేశ్వరుడు - సమస్తమైన లోకపాలకును ప్రభువు యైనవాడు, విష్ణువు :-
[3-437.1-తే.]

115} అఖిలలోకైకగురుడు - సమస్తమైన లోకములకు ఒకేఒకడు యైన (అనితరమైన) పెద్ద, హరి :-
[4-163.1-తే.]

116} అఖిలలోకైకవంద్యమానుడు - సమస్తమైన లోకములకును వందనము చేయతగ్గ వాడైన ఒకేఒక్కడు, విష్ణువు :-
[3-307.1-తే.]

117} అఖిలవిశ్వాత్మకుడు - సమస్తమైన భువనములకు ఆత్మయైనవాడు, విష్ణువు :-
[3-362.1-తే.]

118} అఖిలవేది - సమస్తము నెఱిగిన వాడు, విష్ణువు :-
[10.1-1187-ఉ.]

119} అఖిలాండపతి - 1. సర్వులకు అండ (ఆశ్రయమ) ఐన పతి (ప్రభువు), 2. అఖిల (ఎల్ల) అండ (బ్రహ్మాండములకు) పతి (నాయకుడు), విష్ణువు :-
[10.2-440-తే.]

120} అఖిలాధారుడు - అఖిలమున (సమస్తమున)కు ఆధారమైనవాడు, విష్ణువు :-
[7-478-మ.]

121} అఖిలాధ్వరాదివిభుడు - అఖిల (సమస్తమైన) అధ్వర (యజ్ఞము)లకు ఆది (మొదలి, ప్రధాన) విభుడు (ప్రభువు), విష్ణువు :-
[4-509.1-తే.]

122} అఖిలేశ్వరుడు - సమస్తమునకు ఈశుడు, సర్వేశ్వరుడు, విష్ణువు, అఖిల పంచకృత్యము లన్నిటిని (1సృష్టి 2స్థితి 3లయ 4తిరోధాన 5అనుగ్రహ) చేయుటకు ఈశ్వరుడు (కర్త) :-
[4-572.1-తే., 10.1-389-క., 10.1-406-క.]

123} అగజాధీశుడు - అగజ (పర్వతునికూతురైన పార్వతి) యొక్క అధీశుడు (భర్త), శివుడు. :-
[7-395-క.]

124} అగణ్యుడు - 1. గణించుటకు రానివాడు, విష్ణువు. 2. ఇట్టివాడని ఎంచుటకు వాక్కుచేత కాని మనస్సుచేత కాని శక్యము కానివాడు, భగవంతుడు, విష్ణువు, 3. ప్రత్యక్షాది అష్ట ప్రమాణములచేతను ప్రమాణింప (గణింప) శక్యము కానివాడు, విష్ణువు. :-
[3-590-ఉ., 4-917-చ., 10.1-554-క., 10.1-1644-క.]

125} అగమ్యములు - దారి చిక్కనివి, అర్థము చేసికొనుటకు లొంగనివి, బోధపడరానివి, వేదములు :-
[2-194-చ.]

126} అగస్త్యుడు - 1. సప్తర్షులలో ఒకడు, 2. మనస్సునకు సంకేతము, 3. కుంభసంభవుఁడు, 4. వ్యు. అగంస్త్యాయతే ఇతి అగ + స్త్య క. (కృ.ప్ర.) వింధ్య పర్వతమును స్తంభింపచేసినవాఁడు. :-
[4-830.1-తే.]

127} అగుణుడు - గుణములు లేనివాడు, త్రిగుణాతీతుడు, విష్ణువు :-
[4-358.1-తే.]

128} అగ్నిజిహ్వుడు - అగ్నియే నాలుకగా కలవాడు, భగవంతుడు :-
[3-451.1-తే.]

129} అగ్నిజొచ్చుట - భర్త దేహము తోపాటు అగ్నిలో ప్రవేశించుట, సహగమనము :-
[5.1-124-ఆ.]

130} అగ్నియొక్కసప్తజిహ్వలు - 1కాళి 2కరాళి 3విస్ఫులింగిని 4ధూమ్రవర్ణ 5విశ్వరుచి 6లోహిత 7మనోజవ :-
[7-285-వ.]

131} అగ్నిష్టోమము - 1. వసంత కాలమున ఐదు దినములలో చేయు యాగవిశేషము, 2. అగ్ని+స్తు+మన్, అగ్నీనాం స్తోమః, అగ్నిని స్తుతించుట. ఒక యాగ విశేషము, జ్యోతిష్టోమమనబడు యాగమునకు వికృతియైన యాగము 3. ఈ యాగము చేసినవానికి సోమయాజియని పేరు. :-
[3-388-వ., 3-426-వ.]

132} అగ్నిష్వాత్తులు - పంచచత్వారింశత అగ్నులలో ఒకరు, వ్యు. అగ్ని + సు + ఆ + దా + క్త షత్వము. (కృ.ప్ర.) శ్రాద్ధాన్నాదికమును లెస్సగా పొందు అగ్నులు? :-
[4-34-వ.]

133} అగ్నిహోత్రము - 1. హోమగుండము లోని అగ్నియందు వేల్చుట ద్వారా చేయు యాగము, 2. అగ్ని+హు+త్ర, అగ్నయే హూయతే అత్ర, మంత్రములతో ఆధానము చేయబడిన అగ్నిలో ఆహుతులిచ్చుట. అగ్నిహోత్ర సంబంధమైనది; అగ్ని; ఘృతము. :-
[3-451.1-తే.]

134} అగ్నిహోత్రాదిపంచకము - 1 అగ్నిహోత్రము 2 హవిస్సు 3 వేదిక 4నేయి 5 హోమము చేయువాడు :-
[4-197-మ.]

135} అగ్నీధ్రశాల - అగ్నిని ధరించు ఋత్విక్కు యొక్క శాల :-
[4-118-వ.]

136} అగ్రజాతుడు - ముందు పుట్టినవాడు, అగ్ర (ముందుగా) జాతుడు (పుట్టినవాడు), అన్న :-
[10.1-466-క.]

137} అగ్రజుడు - ముందు పుట్టినవాడు, అగ్ర (ముందుగా) జుడు (పుట్టినవాడు), అన్న :-
[3-42-చ., 4-820-క., 5.1-73-వ., 8-681-వ., 10.1-1687-చ., 10.2-591-క.]

138} అఘనాశకుడు - పాపమును నాశనము చేయువాడు, విష్ణువు :-
[4-550-చ.]

139} అఘమర్షణము - అఘము (పాపము)లను మర్షణము (క్షాళనము చేసెడిది) :-
[6-212-వ.]

140} అఘారి - అఘము (పాపము)లను హరించువాడు, విష్ణువు :-
[3-335-ఉ., 10.1-1175-శా., 10.2-139-చ.]

141} అఘాసురుడు - కొండచిలువ రాక్షసుడు :-
[10.1-487-వ.]

142} అచిర - ఎక్కువ కానిది, కొద్ది, చిరకాలము కానిది. కొద్ది సమయముండునది. :-
[3-565.1-తే.]

143} అచ్యుతలోకము - అచ్యుతుని (వైకుంఠుని) లోకము, వైకుంఠము :-
[4-665-క.]

144} అచ్యుతుడు - చ్యుతము లేనివాడు, పతనము, నాశము లేనివాడు, స్థిరుడు, విష్ణువు, కృష్ణుడు :-
[1-185-మ., 1-269.1-ఆ., 1-380-మ., 2-68.1-తే., 2-89-వ., 2-92-క., 2-98-క., 2-101-చ., 2-209-చ., 2-214-మ., 2-236-మ., 3-71.1-తే., 3-145.1-తే., 3-201.1-తే., 3-215-వ., 3-215-వ., 3-300-చ., 3-373-మ., 3-552-చ., 3-844-చ., 4-150.1-తే., 4-175-చ., 4-233.1-తే., 4-370.1-తే., 4-385.1-తే., 4-901-క., 4-917-చ., 4-963.1-తే., 5.1-119.1-తే., 5.2-74.1-తే., 6-1-శా., 6-197.1-తే., 6-220-క., 7-160.1-తే., 7-243-క., 8-123-మ., 8-177-క., 8-483.1-తే., 9-82.1-తే., 10.1-236-వ., 10.1-928-వ., 10.1-1136-వ., 10.2-81-ఉ., 10.2-1187-తే., 10.2-1219-మ., 10.2-1313-వ., 11-30-వ., 11-66-చ.]

145} అజగరము - మేకను మింగునది. కొండచిలువ :-
[11-99-వ.]

146} అజగవ - అజ (మేకపోతు) గవ (గోవు, ఎద్దు)ల కొమ్ములు కలది :-
[4-462-చ.]

147} అజనాభము - ఒక రాష్ట్రము పేరు, అజము (మేషము) నాభము (ప్రముఖమైనవి), రాశిచక్రము :-
[5.1-60-వ., 5.1-93-వ.]

148} అజము - మేకపోతు, అజము కొన్ని పనసలు గల వేదభాగము, అనువాకము :-
[9-568.1-తే.]

149} అజాండభాండము - అజాండ (బ్రహ్మాండముల) భాండము (పెద్ద కుండ), బ్రహ్మాండభాండము :-
[6-384-ఉ.]

150} అజాండము - అజుని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము :-
[8-209-క.]

151} అజాతశత్రువు - శత్రువులు లేనివాడు, ధర్మరాజు :-
[10.2-804-వ.]

152} అజాదిదుర్లభుడు - అజ (బ్రహ్మదేవుడు) ఆది (మున్నగువారికిని) దుర్లభుడు (అందనివాడు), విష్ణువు :-
[7-478-మ.]

153} అజితుడు - జయింపబడుటకు రానివాడు, విష్ణువు :-
[3-844-చ., 4-917-చ., 4-963.1-తే.]

154} అజితుసదనము - అజితు (జయింపరాని వాడు, విష్ణువు) యొక్క సదనము (నివాసము), వైకుంఠము :-
[8-152-క.]

155} అజినము - లేడి మొదలైన వాని చర్మములు కట్టుకొనుటకు, ఆసనముగాను పనికి వచ్చునవి :-
[3-136-క.]

156} అజుడు - పుట్టుక లేని వాడు, భౌతిక జన్మము లేనివాడు, బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు, భగవంతుడు :-
[1-34.1-ఆ., 1-196-క., 2-110-మ., 2-239-క., 2-277.1-తే., 3-99.1-తే., 3-200-క., 3-212-చ., 3-293.1-తే., 3-338-క., 3-371-ఉ., 3-388-వ., 3-506-చ., 3-722-వ., 3-738-వ., 3-861-క., 4-8-క., 4-18.1-తే., 4-53.1-తే., 4-126-తే., 4-359.1-తే., 4-445.1-తే., 5.1-119.1-తే., 6-198-క., 8-147-క., 8-177-క., 8-714-మ., 10.1-559-క., 10.1-975-వ., 10.2-1147-ఉ., 12-22-వ., 12-30-వ.]

157} అజేయుడు - జయింపరానివాడు, విష్ణువు :-
[4-298-చ.]

158} అటే - అట (స్త్రీల నుద్దేశించి చెప్పుట), దేశ్యము :-
[10.1-1252.1-తే.]

159} అణిమాది - అష్టైశ్వర్యములు, అష్టసిద్ధులు, అష్టవిభూతులు అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అను ఎనిమిది (8). 1 అణిమ అణువుగ సూక్ష్మత్వము నందుట, 2 మహిమ పెద్దగ అగుట, 3 గరిమ బరువెక్కుట, 4 లఘిమ తేలికగనౌట, 5 ప్రాప్తి కోరినది ప్రాప్తించుట, 6 ప్రాకామ్యము కోరిక తీర్చుట, 7 ఈశత్వము ప్రభావము చూపగలుగుట, 8 వశిత్వము వశీకరణము చేయగలుగుట :-
[2-30-వ., 2-222-వ., 3-798-మ., 4-502-వ., 9-431.1-తే., 10.1-537-వ., 11-105-వ.]

160} అణుమాత్రము - అణువు అంత, బహు కొంచము :-
[4-395-వ.]

161} అణువు - శ్లో. జాలసూర్యమరీచిస్థం యచ్ఛసూక్ష్మ తమంరజః, తస్య షష్టాష్టమో భాగస్త్వణురిత్యభి ధీయతే. తస్యమష్టాష్టమోభాగః పరమాణుః ప్రకీర్తితః. తా. కిటికీ కన్నం లోనుండి వచ్చెడి సూర్యకిరణంలోని చిన్న దుమ్ము కణంలో ఆరవైలోఎనిమిదవ (షష్ట అరవై కనుక 60x8, 480వ వంతు) పాలు అణువు. ఆ అణువులో ఆరవైఎనిమిదవ పాలు (60x8, 480వ వంతు)పరమాణువు. :-
[10.2-1220-వ.]

162} అతనుడు - 1. ముక్కంటి చూపుకి భస్మమగుటచే తనువు లేని వాడు, మన్మథుడు, 2. మాయచేత మానుషదేహము ధరించిన ఆ కృష్ణుడు :-
[10.1-8-ఆ., 10.2-327.1-తే.]

163} అతి - అత్యంతరము అత్యంతము :-
[3-232.1-తే.]

164} అతిపూర్ణకాముడు - పూర్తిగా తీరిన కోరికలు గలవాడు, విష్ణువు :-
[6-327.1-తే.]

165} అతివిఖ్యాతసురార్చితపదాబ్జుడు - అతి (మిక్కిలి) విఖ్యాత (ప్రసిద్దిచెందిన) సురా (దేవతలచే) అర్చిత (పూజింపబడెడి) పద (పాదములు యనెడి) అబ్జుడు (పద్మములు కలవాడు), కృష్ణుడు :-
[5.2-166-క.]

166} అతిశాంతిమానసుడు - మిక్కిలి శాంతి స్వభావము గలవాడు,విష్ణువు :-
[4-918.1-తే.]

167} అతులగుణసాంద్రుడు - అతుల (మిక్కిలి) గుణ (సుగుణముల) సాంద్రుడు (చిక్కదనము కలవాడు), మహాసుగుణశాలి :-
[4-635.1-తే.]

168} అతులదివ్యమూర్తి - అతుల (సాటిలేని) దివ్యమైన మూర్తి (స్వరూప మైనవాడు), విష్ణువు :-
[4-373-ఆ.]

169} అత్త - తండ్రి సోదరి (మేనత్త), తల్లి యొక్క సోదరుని భార్య, భార్య / భర్త యొక్క తల్లి. :-
[10.2-106-క.]

170} అదితి - దేవతల తల్లి, కశ్యపుని భార్య :-
[10.2-150-వ.]

171} అదితిసంతానము - ఆదిత్యులు దేవతలు :-
[2-150.1-తే.]

172} అద్భుతచరిత్రుడు - అద్భుతమైన నడవడిక కలవాడు, కృష్ణుడు :-
[10.2-697.1-తే.]

173} అద్రితనయ - అద్రి (పర్వతరాజు యొక్క) తనయ (పుత్రిక), పార్వతి :-
[6-504-వ.]

174} అద్రినందన - అద్రి (హిమవంతుడు అను పర్వత రాజు) నందన (కూతురు), పార్వతి :-
[10.2-317-ఉ.]

175} అద్వయుడు - శ్రు. ఏకమేవాద్వితీయంబ్రహ్మ, ఒక్కడై ఉండి తను తప్పించి రెండవ వస్తువు (స్వేతరము) లేనివాడు పరబ్రహ్మ అనబడును, విష్ణువు :-
[10.1-567.1-ఆ.]

176} అద్వితీయము - ద్వితీయము (సాటి కాగల రెండవది) లేనిది :-
[2-250.1-ఆ.]

177} అద్వితీయుడు - సాటిరాగల రెండవవాడులేనివాడు, అంతాతానైనవాడు, విష్ణువు :-
[2-110-మ., 3-272.1-తే., 4-358.1-తే.]

178} అద్వైతత్రయము - భావాధ్వైతము, ద్రవ్యాద్వైతము, క్రియాద్వైతములు :-
[7-469-వ.]

179} అధరసుధాపానము - పెదవినుండి స్రవించెడి అమృతములు గ్రహించుట, చుంబనములు, సంగీతాస్వాదన, ఉపదేశములు ఆస్వాదించుట :-
[10.1-1004-మ.]

180} అధరామృతములు - పెదవినుండి స్రవించెడి అమృతములు, చుంబనములు, గానములు, ఉపదేశములు :-
[10.1-1355.1-తే.]

181} అధర్వుడు - అథర్వణవేదమున నధికారి, బ్రాహ్మణుఁడు :-
[4-26-వ.]

182} అధికము - అధికతరము అధికతమము :-
[4-624-వ., 8-491-ఆ.]

183} అధిదేవతలు - అధికారము కల దేవతలు, ఇంద్రియాదుల అధిష్టాన దేవతలు :-
[3-57-వ.]

184} అధీశుడు - సర్వజగత్తులకు అధి (పై) ఈశుడు (ప్రభువు), విష్ణువు. :-
[7-332-క.]

185} అధీశ్వరుడు - సర్వోన్నత ఈశ్వరుడు, విష్ణువు, పంచకర్తలైన బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివుల సృష్టి స్థితి లయములను నియమించువాడు, పరమాత్మ :-
[10.2-67-వ., 10.2-110-మ.]

186} అధోక్షజుడు - ఇంద్రియ జ్ఞానములతో తెలియరాని వాడు, అధః+అక్షజ+వాడు వ్యు. (అక్షజం ఇంద్రియ జ్ఢానము, అధి అధరం, అధి అక్షజ అస్య అధోక్షజ (బహువ్రీహి సమాసము), వేనిని తెలియుటకు ఇంద్రియ జ్ఞానము అసమర్థమైనదో అతడు, విష్ణువు, (ఆంధ్రశబ్దరత్నాకరము) :-
[2-89-వ., 3-213-వ., 3-373-మ., 3-697-వ., 4-366-వ., 4-510-వ., 7-217-వ.]

187} అధ్యాత్మికము - తాపత్రయము మూడు విధాల తాపములు (తపింపజేసేవి). ప్రారబ్ధం వీటికి కారణమై ఉంటుంది. ఆధ్యాత్మికం ఆత్మకు సంబంధించినవి. శరీరకంగా, మానసికంగా అనుభవించేవి. శోకం, కోరిక, ఆకలి, నిద్ర మొదలైనవి. ఆధిభౌతికం పంచభూతాల నుండి, మిగిలిన ప్రాణుల నుండీ కలిగే బాధలు. జబ్బులు, ప్రమాదాలు. ఆధిదైవికం ప్రకృతివల్ల కలిగే విపరీతాలు. వరదలు, భూకంపాలు, కరువుకాటకాలు, జరా మరణాలు మొదలైనవి. :-
[3-209-క., 3-725-వ.]

188} అధ్వర్వుడు - అధ్వర్వుడు, ఉద్గాత, బ్రహ్మ, హోత. అను నాలుగు విధముల ఋత్విజులు యందు ఒకడు (ఆంధ్రవాచస్పతం), యజ్ఞమునందు అధర్వణవేదతంత్రము నడపు ఋత్విక్కు (ఆంధ్రశబ్దరత్నాకరం) :-
[4-162-వ., 9-10.1-తే.]

189} అనంగబ్రహ్మ - అనంగ (దేహములేని) బ్రహ్మ (దేవుడు), మన్మథుడు :-
[6-95-వ.]

190} అనంగుడు - దేహము లేనివాడు, మన్మథుడు :-
[5.1-28-ఉ.]

191} అనంతము - దేశ కాల వస్తువులచేత భాగింపరానిది :-
[10.1-537-వ.]

192} అనంతమూర్తి - అనంతమైన స్వరూపము కలవాడు, విష్ణువు :-
[3-212-చ.]

193} అనంతశక్తి - అనంతమైన శక్తి కలవాడు, విష్ణువు, 1సర్వజ్ఞత్వ 2సర్వేశ్వరత్వ 3సర్వభోక్తృత్వ 4సర్వపాలకత్వాది సామర్థ్యములు కలిగ ఉండుట, సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వభోక్తృత్వ సర్వ నియంతృత్వ సర్వనియామక సర్వాంతర్యామిత్వ సర్వసృష్టత్వ సర్వపాలక సర్వసంహారకాది మేరలేని సమర్థత కలవాడు, విష్ణువు :-
[3-19-చ., 3-506-చ., 10.1-681-వ., 10.2-202.1-ఆ.]

194} అనంతామేయశక్తియుక్తుండు - అనంతమైన అమేయమైన (పరిమితిలేని) శక్తులు యుక్తి (సమర్థతలు) కలవాడు, విష్ణువు :-
[4-366-వ.]

195} అనంతుడు - అంతము లేనివాడు, దేశ కాల వస్తు విభాగము లేనివాడు, నాశరహితమైన భగవంతుడు, కాల ప్రదేశ భావముల పరిమితులకు మీరిన వాడు, విష్ణువు :-
[2-98-క., 2-103-క., 2-109-చ., 2-192-మ., 2-209-చ., 2-211-ఉ., 2-236-మ., 2-262-క., 2-277.1-తే., 3-19-చ., 3-99.1-తే., 3-124-చ., 3-212-చ., 3-236-చ., 3-293.1-తే., 3-315-మ., 3-362.1-తే., 3-364-చ., 3-506-చ., 3-510-చ., 3-523-చ., 3-532-మ., 3-588-ఉ., 3-629-చ., 3-836-చ., 3-844-చ., 3-861-క., 3-1024-క., 5.2-128-వ., 6-172-చ., 7-3.1-ఆ., 7-217-వ., 7-353-క., 9-205.1-తే., 9-420-క., 10.1-565-క., 10.1-622-ఉ., 10.1-682.1-తే., 10.1-935-వ., 10.1-941-క., 10.1-1773-క., 10.2-88.1-తే., 10.2-219-చ., 10.2-432-చ., 10.2-959-వ., 10.2-1031-వ., 11-30-వ., 11-66-చ.]