పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

స్తోత్రాలు కీర్తనలు : శ్రీకృష్ణలీలాతరంగిణి

తీర్థులువారు ప్రాతఃస్మరణీయులు. కృష్ణ జననం మొదలు రుక్మిణీ కల్యాణం వరకు యక్షగాన ప్రక్రియలో శ్రీకృష్ణలీలాతరంగిణి రచించారు.కీర్తనలు, శ్లోకాలు, గద్యం సమ్మిశ్రమం చేసిన అమృతధారావాహిని ఇది. కర్ణాటక సంగీతాన్ని, భజనను దైవారాధనగా మలచిన విశిష్ఠ శైలిలో అందించిన తీర్థ ప్రసాదం. పరమాద్భుతమైనది రసపూర్ణామృతోపమేయమైనది శ్రీ నారాయణతీర్థుల వారి శ్రీకృష్ణలీలాతరంగిణి.
ఇట్టి అమృతగుళికలు అందించే మహా భాగవతులు, పరమ పుణ్యమూర్తులు ఆంధ్రభారతి వారు తెలుగు వారికి తరతరాల పాటు ఎడతెగక ప్రసరించేలా ఈ అమృతఝరిని, ఈ తేనెకలిపిన బలవర్థక ఔషధాన్ని కూడ తమ దయార్థ్రహృదయంతో అందించారు. ఆస్వాదించండి. మీవారందరికీ పంచండి. కృతార్థులు కండి.
ఉడతా భక్తిగా ఇక్కడ ఎక్కడ నొక్కినా ఆ శ్రీ నారాయణతీర్థుల వారి పవిత్ర తీర్థం శ్రీకృష్ణలీలాతరంగిణి కలిసేలా పెట్టాము.
ఇది మన ఆంధ్రభారతి వారి సౌజన్యం.