పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నారాయణ శతకం


శోధన

  •  


పద శోధన

  •  

ప్రధమ స్కంధము : ఏక ఘట్టము

  •  
  •  
  •  

1-1-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీరామామణి పాణిపంకజ మృదుశ్రీతజ్ఞపాదాజ్ఞ! శృం
గారాకారశరీర! చారుకరుణాగంభీర! సద్భక్తమం
దారాంభోరుహపత్రలోచన! కళాధారోరు సంపత్సుధా
పారావారవిహార! నా దురితముల్ భంజింపు, నారాయణా!

టీకా:

శ్రీరామామణి = లక్ష్మి అనబడే స్త్రీరత్నం యొక్క; పాణి = చేతులు అనెడి; పంకజ = తామరపువ్వుల యొక్క; మృదుశ్రీ = మృదుత్వం యొక్క శోభను; తజ్ఞ = తెలుసుకున్నవాడా; శృంగార + ఆకార = శృంగారం మూర్తీభవించినట్టి; శరీర = దేహం కలవాడా; చారు = అందమైన; కరుణా = దయాగుణంతో; గంభీర = గాంభీర్యం కలవాడా; సత్+భక్త = మంచి భక్తుల పాలిటి; మందార =కల్పవృక్షమా; అంభోరుహ = నీట పుట్టిన పద్మము యొక్క; పత్ర = రేకులవంటి; లోచన = కన్నులు గలవాడా; కళా +ఆధార = సమస్త కళలకు ఆధారమైన; సంపత్ + సుధా = సంపదలతో అమృతమయంగా ఉన్న; పారావార = సముద్రంలో; విహార = విహరించేవాడా! నా దురితముల్ = నా పాపములను; భంజింపు = నాశనం చెయ్యి; నారాయణా = విష్ణుదేవా (నరుని వల్ల పుట్టినవి నారములు. నారములు అంటే జలం. ‘నారములు స్థానంగా కలవాడు నారాయణుడు’ అని మనుస్మృతి. ‘నరునిచే కలిగిన తత్త్వాలు నారములు. అవి స్థానంగా కలవాడు నారాయణుడు’ అని మహాభారతం. నారములు అంటే నాశనం లేని నిత్యవస్తువులు అని అర్థం. అటువంటి నారములకు ఆశ్రయమైనవాడు నారాయణుడు. ‘ఎవనికంటే సూక్ష్మవస్తువు కాని, గొప్ప వస్తువు కాని లేవో అతడు నారాయణుడు’ అని వేదవాణి).

భావము:

నారాయణా! లక్ష్మీదేవి అనే స్త్రీరత్నం యొక్క తామరపువ్వుల వంటి చేతుల మృదుత్వశోభను తెలుసుకున్న పాదపద్మాలు కలవాడవు. శృంగారం మూర్తీభవించిన శరీరం నీది. అందమైన గంభీరమైన దయాగుణం కలవాడవు. సద్భక్తుల కోరికలు తీర్చే మందారవృక్షానివి నీవు. తామర రేకుల వంటి అందమైన కన్నులు కలవాడవు. సమస్త కళలకు ఆధారమైన గొప్ప సంపదలతో అమృతమయమైన సముద్రంలో విహరించేవాడవు. నా పాపాలను నాశనం చెయ్యి.

1-2-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుం బాయక వెయ్యినోళ్ళు గల యాకాకోదరాధీశుఁడున్
ముట్ట న్వినుతింపలేక నిగుడన్ గ్రాలంగ నొప్పారు మి
మ్మరన్ సన్నుతిసేయ నాదువశమే? జ్ఞాని లోభాత్ముడన్
డుఁడ న్నజ్ఞుడ నైకజిహ్వుఁడ జనస్తబ్ధుండ, నారాయణా!

టీకా:

కడకున్+పాయక = చివరివరకు వదలకుండా; కాకోదర+అధీశుడు = పాములకు ప్రభువైన ఆదిశేషుడు; కడముట్టన్ = పూర్తిగా; నిగుడన్ = సంభ్రమించగా; అ+ఏకజిహ్వుడ = ఒక్క నాలుక లేనివాడను (వదరుబోతును); జనస్తబ్దుడన్ = పుట్టుకతోనే సోమరిని.

భావము:

నారాయణా! నిన్ను సంపూర్ణంగా పొగడలేక వేయి నోళ్ళున్న ఆదిశేషుడే సంభ్రమంలో పడ్డాడు. అటువంటిది అజ్ఞానం, స్వార్థబుద్ధి, మూర్ఖత్వం, వదరుబోతుతనం కలిగి పుట్టుకతోనే సోమరినైన నాకు నిన్ను స్తుతించడం సాధ్యమా?

1-3-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నే నీదాసుఁడ నీవు నాపతివి నిన్నే కాని యొండెవ్వరిన్
ధ్యానింపం బ్రణుతింప నట్లగుటకున్నానేర్చు చందంబునన్
నీనామస్తుతు లాచరించు నెడలన్నేతప్పులుం గల్గినన్
వానిం లోఁగొనుమయ్య తండ్రి! విహితవ్యాపార నారాయణా!

టీకా:

ఎడలన్ = సమయాలలో; విహిత వ్యాపార = విశేషంగా మేలు కలిగించే కార్యాలను నిర్వహించేవాడా!

భావము:

తండ్రీ! లోకాలకు విశేష హితాన్ని కలిగించే కార్యాలను నిర్వహించే నారాయణా! నేను నీ సేవకుడను. నీవు నా యజమానివి. నిన్ను తప్ప అన్యు లెవ్వరినీ తలచుకొనను, పొగడను. అందువల్ల నాకు తెలిసిన పద్ధతిలో నీ గుణాలను తెలిపే పేర్లను ప్రశంసించే సమయంలో తప్పు లేమైనా దొర్లితే క్షమించి స్వీకరించు.

1-4-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నెయన్ నిర్మల మైన నీస్తుతి కథానీకంబు పద్యంబులో
నొరుగుల్ మిక్కిలి గల్గె నేనియుఁ గడున్యోగంబె చర్చింపఁగాఁ
గుఱుగణ్పైనను వంకబోయినఁ గడుం గుజ్జైనఁ బేడెత్తినం
జెఱుకుం గోలకు తీపు గాక కలదే చే దెందు నారాయణా!

టీకా:

నెరయన్ = నిండుగా, పూర్తిగా; కథా+అనీకంబు = కథల సమూహం; ఒరుగుల్ = వంకలు;  యోగంబె = యుక్తమే; కుఱు+కణ్పు = చిన్న కణుపు; వంక = వంకర; గుజ్జు = పొట్టి; పేడు+ఎత్తినన్ =  పైతోడ్క పెరిగి పెద్దదైనచో; కోల = గడ; తీపు = తియ్యదనం.

భావము:

నారాయణా! పూర్తిగా పవిత్రమైన నీ కథలు కలిగిన కవిత్వంలో తప్పులెన్ని ఉన్నా అది మిక్కిలి యోగ్యమైనదే. ఎందుకంటే చిన్న కణుపులున్నా, వంగిపోయినా, పొట్టిగా ఉన్నా, పైన పేడు పెరిగినా, చెరుకుగడ తియ్యగా కాక చేదుగా ఉంటుందా?

1-5-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దువుల్ పెక్కులు సంగ్రహించి పిదపంజాలంగ సుజ్ఞానియై”
“మదిలోఁ బాయక నిన్ను నిల్పఁదగు నార్మంబు వీక్షింపఁడే
మొలం గాడిద చారుగంధవితతుల్ మోవంగ శక్యంబె కా
ది సౌరభ్యపరీక్ష జూడ కుశలే వ్యక్త నారాయణా!

టీకా:

సంగ్రహించి = సంపాదించి (నేర్చి); మర్మంబు = రహస్యం; గంధ వితతుల్ = పరిమళాల సమూహాలు; మోవంగ = మోయగా; సౌరభ్య పరీక్ష = సువాసనను పసిగట్టు పరీక్ష; కుశల+ఏ = చాతుర్యం కలదా? అవ్యక్త = ఇంద్రియగోచరం కానివాడా!

భావము:

ఇంద్రియాలకు గోచరం కాని నారాయణా! మానవుడు ఎన్నో చదువులు నేర్చి తగినంత సమ్యక్ జ్ఞానం కలవాడై కూడా నిన్ను మనస్సులో సర్వదా స్మరిస్తూ నిల్పుకొనే రహస్యాన్ని కనుగొనడు కదా! గాడిద గంధపు చెక్కల నెన్నింటినో మోయగలదు కాని వాటి పరిమళాన్ని పసికట్టే నేర్పు దానికి ఉంటుందా?

1-6-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిఁ గబ్బంబు కరాట మివ్వసుధ నెల్లన్ మించెఁ బో నీకధా
లి కర్పూరము నించినన్ నితరమౌ వ్యర్ధార్థకామోదముల్
పెలుచం బూనిన యక్కరాటము తుదిన్ బేతేకరాటంబెపో
 దిందీవరపత్రలోచన! ఘనశ్యామాంగ నారాయణా!

టీకా:

లలిన్ = క్రమంగా; కరాటము = బరిణ; ఆమోదముల్ = పరిమళములు; పెలుచన్ = అతిశయంగా; బేతే = వ్యర్థంగా; చలత్ + ఇందీవర పత్ర లోచన = చలించే నల్లకలువ రేకుల వంటి కన్నులు కలవాడా; ఘనశ్యామ + అంగ = మేఘం వంటి నల్లని శరీరం కలవాడా!

భావము:

చలించే నల్లకలువ రేకులవంటి కన్నులు, మేఘంవంటి నల్లని శరీరం కలిగిన నారాయణా! కావ్యం ఒక బరణి వంటిది. దానిని నీ కథల సమూహం అనే పచ్చకర్పూరంతో నింపితే దాని పరిమళాలు లోకంలో విస్తరించి శాశ్వతంగా నిలుస్తుంది. అలా కాకుండా దానిని వ్యర్థ ప్రయోజనా లనబడే వాసనలతో నింపితే చివరికి అది కేవలం చేతిలో పట్టుకొనే వస్తువే అవుతుంది.

1-7-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మారన్నచలేంద్రజాధిపతికిన్ స్తాగ్రమాణిక్య మై
మునికోపానలదగ్ధ రాజతతికిన్ముక్తిస్ఫురన్మార్గమై
యెయున్ సాయక శాయికిం జననియై యేపారుమిన్నేటికిం
నిమూలం బగు నంఘ్రి మాదుమదిలోఁర్చింతు నారాయణా!

టీకా:

మనము+ఆరన్ = మనసారా; అచల+ఇంద్రజ+అధిపతికిన్ = పర్వతరాజపుత్రికయైన పార్వతి యొక్క భర్త అయిన శివునకు; మస్త+అగ్ర = జటాజూటమందు; స్ఫురత్+మార్గము+ఐ = ప్రకాశించే (ముక్తికి) దారియై; ఎనయన్ = పొందికగా; సాయకశాయికిన్ = అంపశయ్యపై పడుకొన్న భీష్మునకు; ఏపారు = శోభించే; మిన్నేటికిన్ = ఆకాశగంగకు; జనిమూలంబు = జన్మస్థానం; అంఘ్రి = పాదము; చర్చింతు = ధ్యానం చేస్తాను.

భావము:

నారాయణా! శివుని జటాజూటానికి అలంకారమై, కపిలముని కోపాగ్నికి కాలి బూడిద అయిన సగరుని కుమారులైన రాజసమూహానికి ముక్తిమార్గాన్ని చూపినదై, భీష్మునకు తల్లియై వర్ధిల్లే ఆకాశగంగకు జన్మస్థానమైన నీ పాదాన్ని ధ్యానం చేస్తాను.

1-8-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీపుత్రుండు చరాచరప్రతతులం నిర్మించి పెంపారఁగా
నీపుణ్యాంగన సర్వజీవతతులం నిత్యంబు రక్షింపఁగా
నీపాదోదక మీజగత్త్రయములం నిష్పాపులం జేయఁగా
నీపెంపేమని చెప్పవచ్చు సుగుణా! నిత్యాత్మ నారాయణా!

టీకా:

ప్రతతులన్ = సమూహాలను; పెంపారఁగా = అతిశయిల్లగా; అంగన = స్త్రీ (భార్య); పెంపు = పెద్దరికం.

భావము:

సద్గుణాలు, శాశ్వతమైన జ్ఞానస్వరూపం కలిగిన నారాయణా! నీ కుమారుడైన బ్రహ్మ స్థావర జంగమాల సమూహాలను సృష్టించి అతిశయించగా, పుణ్యాత్మురాలైన నీ భార్య లక్ష్మీదేవి సమస్త జీవరాశులను ఎల్లకాలం రక్షిస్తూ ఉండగా, నీ పాదంనుండి జన్మించిన గంగానది ఈ ముల్లోకాలలోని వారి పాపాలను నాశనం చేస్తూ ఉండగా నీ గొప్పదనాన్ని ఏమని చెప్పవచ్చు?

1-9-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రహ్మాండావలిలోన సత్వగుణివై బాహ్యంబునం దాదిమ
బ్రహ్మాఖ్యం బరతత్వబోధములకున్ వ్యాధినాథుండవై
బ్రహ్మేంద్రామర వాయుభుక్పతులకున్ వ్యాధినాథుండవై
జిహ్మవ్యాప్తుల నెన్న నాదువశమే చిద్రూప నారాయణా!

టీకా:

ఆవలి = వరుస; ఆదిమ బ్రహ్మ+ఆఖ్యన్ = మొదటి బ్రహ్మ అనే పేరుతో; భవ్య+అధినాథుండవు = మేటి నాయకుడవు; వాయుభుక్+పతులకున్ = గాలిని ఆహారంగా స్వీకరించే నాగులకు అధిపతులైన వారికి; జిహ్మ = కుటింలంగా; వ్యాప్తులన్ = వ్యాపించిన నీ తత్త్వాలను; ఎన్న = ఊహించడం; చిత్+రూప = జ్ఞానమే రూపుదాల్చినవాడా!

భావము:

జ్ఞాన స్వరూపుడవైన నారాయణా! బ్రహ్మాండ సమూహంలో శుద్ధ సత్త్వగుణం కలిగి వెలుపల ఆదిమబ్రహ్మ అనే పేరుతో పరతత్త్వజ్ఞానానికి మేటి ప్రభుడవై బ్రహ్మకు, ఇంద్రునకు, దేవతలకు, నాగరాజులకు ఊహింపరాని మాయతో వ్యాపించి ఉన్న నీ తత్త్వాలను పరిగణించడం నాకు సాధ్యమా?

1-10-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

 సింహాసనమై నభంబు గొడుగై ద్దేవతల్ భృత్యులై
మామ్నాయము లెల్ల వందిగణమై బ్రహ్మాండ మాగారమై
సిరి భార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై
రుసన్ నీఘనరాజసంబు నిజమై ర్ధిల్లు నారాయణా!

టీకా:

ధర = భూమి; నభంబు = ఆకాశం; పరమ+ఆమ్నాయములు = శ్రేష్ఠమైన వేదాలు; వందిగణము = స్తుతి పాఠకులు; ఆగారము = ఇల్లు; సిరి = లక్ష్మీదేవి; విరించి = బ్రహ్మ; రాజసంబు = రాజఠీవి.

భావము:

నారాయణా! నీకు ఈ భూమి సింహాసనమై, ఆకాశం గొడుగై, దేవతలంతా సేవకులై, వేదాలు వందిమాగధులై, బ్రహ్మాండం నివాసగృహమై, లక్ష్మీదేవి భార్యయై, బ్రహ్మ కుమారుడై, గంగ కుమార్తెయై విలసిల్లగా నీ రాజరికం వర్ధిల్లుతున్నది.

1-11-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మీనాకృతి వార్ధిఁజొచ్చి యసురన్ ర్ధించి యవ్వేదముల్
గుడందెచ్చి విరించి కిచ్చి యతనిన్ న్నించి యేపారఁగాఁ
 సాధించినదివ్యమూర్తివని నే భావింతు నెల్లప్పుడున్
రాజధ్వజ! భక్తవత్సల! ధగత్కారుణ్య నారాయణా!

టీకా:

మీన+ఆకృతి = చేప రూపం; వార్థి = సముద్రం; మర్దించి = కొట్టి; మగుడన్ = వెనుకకు; మన్నించి = సమ్మానించి; ఏపారన్ = విజృంభిస్తూ; ఖగరాజ ధ్వజ = పక్షిరాజైన గరుత్మండు చిహ్నంగా కల ధ్వజం కలవాడా!.

భావము:

ధ్వజంపై గరుత్మంతుని చిహ్నం కలిగి, భక్తులను ప్రేమతోను, లోకాలను దయతోను చూచే నారాయణా! నీవు మగచేప రూపాన్ని ధరించి, సముద్రంలో ప్రవేశించి, సోమకాసురుని శిక్షించి, వేదాలను తిరిగి తెచ్చి, బ్రహ్మకిచ్చి మన్నించావు. ఆ విధంగా వేదాలను దొంగిలించినవానిపై విజృంభించి పగ సాధించిన నీ మత్స్యావతార రూపాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తాను.

1-12-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుల్ రాక్షసనాయకుల్ కడకతో త్యంతసామర్ధ్యులై
భ్రరీదండము మందరాచలముగా బాథోనిధిం ద్రచ్చగా
కించెన్ భువనత్రయంబును గిరుల్ దంతావళుల్ మ్రొగ్గినం
ఠంబై ధరియించి మించిన జగత్కల్యాణ నారాయణా!

టీకా:

కడఁకతో = ప్రయత్నంతో; భ్రమరీదండము = కవ్వం; పాథోనిధి = సముద్రం; త్రచ్చఁగా = చిలుకగా; తమకించెన్ = చలించాయి; గిరుల్ = పర్వతాలు;  దంతావళుల్ = ఏనుగులు; మ్రొగ్గినన్ = ప్రక్కకు వాలిపోగా; కమఠంబై = తాబేలై.

భావము:

నారాయణా! దేవతలు, రాక్షస ప్రముఖులు శ్రద్ధతో గొప్ప సామర్థ్యం కలవారై మందర పర్వతం కవ్వంగా సముద్రాన్ని చిల్కగా ముల్లోకాలు చలించాయి. పర్వతాలు, దిగ్గజాలు ప్రక్కకు ఒరగగా కూర్మావతారుడవై మంధర పర్వతాన్ని మూపుపై ధరించి లోక కళ్యాణ కారకుడవై శోభించావు.

1-13-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భీమాకారవరాహమై భువనముల్ భీతిల్ల కంపింప ను
ద్ధామోర్విం గొనిపోయి నీరనిధిలో డాఁగున్న గర్వాంధునిన్
హేమాక్షాసురు వీఁకఁదాకి జయలక్ష్మిన్ గారవింపంగ నీ
భూమిం దక్షిణదంష్ట్ర నెత్తిన నినుం బూజింతు నారాయణా!

టీకా:

భీమ+ఆకార = భయంకరమైన రూపం కల; ఉద్దామ+ఉర్విన్ =  సస్యపూర్ణయైన భూమిని; నీరనిధి = సముద్రం; హేమాక్ష+అసురు = హిరణ్యాక్షుడు అనే రాక్షసుని; వీఁకన్+తాకి = పరాక్రమంతో ఎదుర్కొని; దంష్ట్రన్ = కోరతో.

భావము:

నారాయణా! గర్వాంధుడైన హిరణ్యాక్షుడు సస్యశ్యామలమైన భూమిని తీసికొనిపోయి సముద్రంలో దాగికొనగా భయంకరమైన వరాహ రూపాన్ని ధరించి లోకాలు భయంతో వణకిపోగా అతనిని పరాక్రమంతో ఎదుర్కొని విజయాన్ని సాధించి ఈ భూమిని కుడికోరపై ఎత్తినట్టి నిన్ను పూజిస్తాను.

1-14-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్తంభంబందు నృసింహమై వెడలి యచ్చండాట్టహాసధ్వనుల్
దంభోళిం గడువంగ హేమకశి పోద్దండా సురాధీశ్వరున్
శుంద్గర్భము వ్రచ్చి వానిసుతునిన్ శోభిల్ల మన్నించి య
జ్జంభారాతిని బ్రీతిఁదేల్చిన నినుం ర్చింతు నారాయణా!

టీకా:

చండ = భయంకరమైన; దంభోళిన్ = పిడుగును; కడువంగ = మించగా; హేమకశిప = హిరణ్యకశిపుడు అనే; ఉద్దండ = గొప్ప; అసుర+అధీశ్వరున్ = రాక్షసరాజును; శుంభత్ = ప్రకాశించే; వ్రచ్చి = చీల్చి; జంభ+అరాతిని = జంభుడనే రాక్షసునికి శత్రువైన ఇంద్రుని; తేల్చిన = సంతోషపెట్టిన.

భావము:

నారాయణా! స్తంభంనుండి నృసింహరూపంతో వెలువడి భయంకరంగా ఉన్న నీ అట్టహాసపు ధ్వనులు పిడుగునే మించగా హిరణ్యకశిపుడనే గొప్ప రాక్షసరాజు యొక్క శోభించే కడుపును చీల్చి అతని కుమారుని కనికరించి ఆ ఇంద్రుని సంతోషపెట్టిన నిన్ను స్మరిస్తాను.

1-15-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హియున్నాకసముం బదద్వయపరీమాణంబుగాఁ బెట్టి యా
గ్ర మొప్పం బలిమస్తకం బొకపదగ్రస్తంబుగా నెమ్మితో
విరించింద్ర విరించి శంకరమహావిర్భూతదివ్యాకృతిన్
జంబై విలసిల్లు వామనల సచ్చారిత్ర నారాయణా!

టీకా:

పరిమాణంబుగాన్ = కొలతలుగా; గ్రస్తంబుగా = ఆక్రమింపబడినదిగా; నెమ్మితో = సంతోషంతో; లసత్+చారిత్ర = ప్రకాశించే చరిత్ర కలవాడా!

భావము:

ప్రకాశవంతమైన చరిత్ర్ర కలిగిన నారాయణా! భూమ్యాకాశాలను రెండు అడుగుల కొలతతో ఆక్రమించి కోపంతో బలిచక్రవర్తి తలను ఒక అడుగుతో స్వాధీనం చేసికొని సంతోషంతో విహరించి ఇంద్ర బ్రహ్మ శంకరులు  ఆవిర్భవించిన దివ్యమైన వామనరూపం సహజంగా విలసిల్లింది.

1-16-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణిన్ రక్తమహాహ్రదంబు లెలమిం ద్రైలోక్య నిర్దిష్టమై
గం బైతృక తర్పణంబుకొఱకై ప్రఖ్యాతిగాఁ దీవ్రతన్
నిరువయ్యొక్కటిమారు క్షత్రవరులన్ నేపార నిర్జించి త
త్పశుభ్రాజితరామనామము కడున్ న్యంబు నారాయణా!

టీకా:

హ్రదంబులు = మడుగులు; ఎలమిన్ = ఆనందంతో; త్రైలోక్య నిర్దిష్టమై = ముల్లోకాలచేత చూపబడినదై; పరగన్ = ఒప్పగా; పైతృక తర్పణంబు = పితృకార్యము; పరశు భ్రాజిత = గండ్రగొడ్డలిచేత ప్రకాశించే.

భావము:

నారాయణా! పితృ తర్పణం కోసం ముల్లోకాలు వేలెత్తి చూపేవిధంగా భూమిపై రక్తపు మడుగులను ఏర్పరచడానికి ఉద్వేగంతో ఇరవై ఒక్కసార్లు రాజులను సంహరించిన పరశువు చేత ప్రకాశించే నీ రామనామం ఎంతో ధన్యమైనది.

1-17-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుసం దాటకిఁ జంపి కౌశికు మఘస్వాస్థ్యంబు గావించి శం
రుచాపం బొగిఁ ద్రుంచి జానకిఁ దగం ల్యాణమై తండ్రి పం
రుదారన్ వనభూమికేఁగి జగదాహ్లాదంబుగా రావణున్
ణింగూల్చిన రామనామము కడున్ న్యంబు నారాయణా!

టీకా:

కౌశికు = కుశికుని కుమారుడైన విశ్వామిత్రుని యొక్క; మఘ = యజ్ఞమునకు; స్వాస్థ్యంబు = నెమ్మదిని (రక్షణను); ఒగిన్ = బాగుగా; అరుదారన్ = అపూర్వంగా.

భావము:

నారాయణా! క్రమంగా తాటికిని చంపి, విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడి, శివుని విల్లు విరిచి, సీతను పెండ్లాడి, తండ్రి పంపగా వనవాసానికి వెళ్ళి లోకాలు ఆనందించే విధంగా రావణుని సంహరించిన నీ రామనామం ఎంతో ధన్యమైనది.

1-18-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దువంశంబునఁ గృష్ణు కగ్రజుఁడవై యాభీల శౌర్యోన్నతిన్
వద్ధేనుక ముష్టికాద్యసురులన్ ర్దించి లీలారసా
స్పకేళీరతి రేవతీవదన కంజాతాంతబృంగంబనన్
విదితంబౌ బలరామమూర్తివని నిన్ వీక్షింతు నారాయణా!

టీకా:

అగ్రజుఁడవై = అన్నవై; ఆభీల =భయంకరమైన; మదవత్ = గర్వం కలిగిన; మర్దించి = అణచి (చంపి); లీలా = విలాసంతో కూడిన; రస+ఆస్పద = శృంగార రసానికి స్థానమైన; కేళీ = క్రీడయందు; రతి = ఆసక్తి కలిగి; విదితంబు = ప్రకటింపబడినది.

భావము:

నారాయణా! యాదవ వంశంలో శ్రీకృష్ణునకు అన్నవై భయంకరమైన గొప్ప శౌర్యంతో గర్వాంధులైన ధేనుకుడు, ముష్టికుడు మొదలైన రాక్షసులను చంపి శృంగార రసానికి స్థానమైన క్రీడలో ఆసక్తి కలిగి రేవతిదేవి యొక్క ముఖమనే పద్మంలోని తుమ్మెదగా తెలియబడిన బలరామ రూపుడవని నిన్ను దర్శిస్తాను. 

1-19-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుముల్మూడుఁను మూఁడులోకములు నేప్రొద్దున్విదారింపఁ ద
త్పునారీ మహిమోన్నతుల్ సెడుటకై బుద్ధుండవై బుద్ధితో
బోధద్రుమ సేవఁజేయుటకునై వారిం బ్రబోధించి య
ప్పుముల్ గెల్చిన మీయుపాయము జగత్పూజ్యంబు నారాయణా!

టీకా:

విదారింపన్ = నాశనం చేయడానికి; బోధద్రుమ = బోధివృక్షము యొక్క.

భావము:

నారాయణా! త్రిపురాలు ముల్లోకాలను నాశనం చేస్తుండగా ఆ త్రిపురాలలోని స్త్రీల పాతివ్రత్యం చెడగొట్టడానికి బుద్ధుడవై తెలివితో బోధివృక్షాన్ని సేవించండని వారికి ఉపదేశించి ఆ త్రిపురాలను గెల్చిన నీ ఉపాయం లోకపూజ్యం కదా!

1-20-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిధర్మంబునఁ బాపసంకలితులై ర్వాంధులై తుచ్చులై
కుశీలంబులు మాని హేయగతులం గ్రొవ్వారు దుష్టాత్ములం
లిగాఁ జేయఁ దలంచి ధర్మ మెలమిం బాలించి నిల్పంగ మీ
నం గల్క్యవతార మొందఁగల నిన్ ర్ణింతు నారాయణా!

టీకా:

పాప సంకలితులై = పాపపు పనులతో కూడినవారై; హేయ గతులన్ = అసహ్యమైన ప్రవర్తనలతో; క్రొవ్వారు = గర్వించే.

భావము:

నారాయణా! కలికాలపు ధర్మానికి లొంగినవారై పాపపు పనులను చేస్తూ గర్వం చేత గ్రుడ్డివాళ్ళై, నీచులై, కుల మర్యాదలు సద్గుణాలు లేనివారై అసహ్యపడే ప్రవర్తనతో చెలరేగిన దుర్మార్గులను బలి చేయడానికి, లోకంలో ధర్మాన్ని నిలుపడానికి కల్కి రూపాన్ని పొందనున్న నిన్ను వర్ణిస్తాను.

1-21-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వొందన్ సచరాచరప్రతతులన్నెన్నంగ శక్యంబుకా
యన్ పద్మభవాండ భాండచయమున్నారంగ మీకుక్షిలో
రుదారన్నుదయించుఁ బెంచు నడఁగున్నన్నారికేళోద్భవాం
వాఃపూరము చందమొంది యెపుడున్ దైత్యారి నారాయణా!

టీకా:

ఇరవొందన్ = స్థిరంగా; ప్రతతులన్ = విస్తృతులను (సమూహాలను); పద్మభవాండ = బ్రహ్మాండం అనే; భాండ చయమున్ = కుండల సమూహాన్ని; ఆరంగ = నిండగా; అరుదారన్ = అపురూపంగా; అడఁగున్ = ఉపశమనాన్ని పొందుతుంది; నారీకేళ + ఉద్భవ+ అంతర + వాఃపూరము = కొబ్బరికాయలో పుట్టిన లోపలి నిండు జలం; దైత్య+అరి = రాక్షసులకు శత్రువైన విష్ణువు.

భావము:

రాక్షసవైరివైన నారాయణా! లెక్కపెట్టలేని స్థావర జంగమాలతో నిండిన బ్రహ్మాండ భాండాలను కొబ్బరికాయలోని నీళ్ళను వలె ఎల్లప్పుడూ నీ కడుపులో పుట్టించి, పోషించి, అంతం చేస్తుంటావు కదా!

1-22-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిందీవర నీలనీరదసముద్యద్భాసితాకార శ్రీ
నా కౌస్తుభచారువక్ష విబుధశ్లాఘోద్భవస్థాన కో
నాభీ చరణారవింద జనితామ్నాయాద్య గంగా లస
జ్జజాతాయతనేత్ర! నిన్నుమదిలోఁ ర్చింతు నారాయణా!

టీకా:

దళత్ = వికసిస్తున్న; ఇందీవర = నల్ల కలువ వలె; నీల నీరద = నల్లని మేఘం వలె; సముద్యత్ = పైకి వ్యాపించడం వలన; భాసిత = ప్రకాశించే; శ్రీలలనా = లక్ష్మి చేత; చారు = అందమైన; విబుధ = దేవతల (పండితుల) చేత; శ్లాఘ = పొగడబడే; ఉద్భవస్థాన = జన్మస్థలాలైన; కోమల = సున్నితమైన; నాభీ = బొడ్డు; చరణ + అరవింద = పాదపద్మాలనుండి; జనిత = పుట్టిన; ఆమ్నాయ + ఆద్య = వేదాలకు మొదటివాడైన బ్రహ్మ; గంగా = గంగానది కలవాడా; లసత్ = ప్రకాశించే; జలజాత + ఆయత నేత్ర = పద్మం వంటి విశాలమైన కన్నులు గలవాడా; చర్చింతు = ఆలోచిస్తాను.

భావము:

నారాయణా! వికసిస్తున్న నల్ల కలువలాగా, నల్లని మేఘం లాగా అతిశయించే రూపం కలవాడవు. లక్ష్మీదేవి, కౌస్తుభ మణుల చేత అందంగా ఉన్న వక్షఃస్థలం కలవాడవు. సున్నితాలైన నీ నాభి బ్రహ్మకు, పాదపద్మాలు గంగకు జన్మస్థాలలై  దేవతల చేత ప్రశంసింపబడ్డాయి. పద్మాల వలె విశాలమైన కన్నులు కలవాడవు. అటువంటి నీ గురించి ఆలోచిస్తాను.

1-23-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దాధారక! భక్తవత్సల! కృపాన్మాలయా పాంగ! భూ
నార్కేందుజలాత్మ పావక మరుత్కాయా! ప్రదీపప్రయో
గిణస్తుత్య! మహాఘనాశన! లసద్గీర్వాణసంసేవితా! 
త్రిగుణాతీత! ముకుంద! నాదుమదిలో దీపింపు నారాయణా!

టీకా:

జగత్ + ఆధారక = ప్రపంచానికి కారణమైనవాడా; జన్మ + ఆలయ = పుట్టినిల్లు; అపాంగ = కడకంటి చూపు కలవాడా; పావక = అగ్ని; మరుత్ = గాలి; ప్రదీప = దీపాలను వెలిగించిన; ప్రయోగి గణ = మహాయోగుల సమూహం చేత; స్తుత్య = పొగడబడేవాడా; మహా + అఘ + నాశన = గొప్ప పాపాలను నాశనం చేసేవాడా; లతస్ = ప్రకాశమానులైన; గీర్వాణ = దేవతల చేత; సంసేవితా = పూజింప బడినవాడా; ముకుంద = మోక్షము నిచ్చేవాడా!

భావము:

నారాయణా! నీవు ప్రపంచానికి కారణమైనవాడవు. భక్తులపై ప్రేమ కలవాడవు. దయకు పుట్టినిల్లైన కడకంటి చూపు కలవాడవు. భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు నీరు జీవుడు అగ్ని వాయువు మొదలైనవి కలిగిన ఈ జగత్తే శరీరంగా కలవాడవు. జ్ఞానంతో ప్రకాశించే మహాయోగుల చేత పొగడబడే వాడవు. గొప్ప పాపాలను నాశనం చేసేవాడవు. కాంతిమంతులైన దేవతల చేత పూజింపబడే వాడవు. సత్త్వరజస్తమో గుణాలు అంటనివాడవు. మోక్షాన్ని ఇచ్చేవాడవు. అటువంటి నీవు నా మనస్సులో ప్రకాశిస్తూ ఉండు.

1-24-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూవ్రాతము నంబుజాసనుఁడవై పుట్టింతు విష్ణుండవై
ప్రీతిం బ్రోతు హరుండవై చెఱుతు నిర్భేద్యుండవై త్రైగుణో
పేతంబై పరమాత్మవై నిలుతు నీపెంపెవ్వరుం గాన ర
బ్జాతోద్భూత! సుజాత పూజిత పదాబ్జశ్రేష్ఠ నారాయణా!

టీకా:

భూత వ్రాతము = ప్రాణుల సమూహాన్ని; అంబుజ + ఆసనుడవై = పద్మంపై కూర్చునే బ్రహ్మవై; అప్ + జాత +ఉద్భూత = నీటిలో పుట్టిన కమలం నుండి జన్మించిన బ్రహ్మ చేత; సుజాత = మంచి పుట్టుక కల దేవతల చేత.

భావము:

బ్రహ్మ చేతను, దేవతల చేతను పూజింపబడే గొప్ప పాదపద్మాలు గల నారాయణా! బ్రహ్మవై ప్రాణికోటిని సృష్టిస్తావు. విష్ణుమూర్తివై కాపాడుతావు. శివుడవై నాశనం చేస్తావు. భేదింపరాని వాడవై, సత్త్వరజస్తమో గుణాలతో కూడిన వాడవై, పరమాత్ముడవై విలసిల్లుతావు. నీ మాహాత్మ్యాన్ని ఎవ్వరూ తెలిసికొనలేరు.

1-25-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాభీధవళాంబుజోదరమునన్ వాణీశుఁ గల్పించి య
ప్పురుషశ్రేష్ఠుని ఫాలమందు శివునిం బుట్టించి యామేటికిం
మోత్తంసముగా వియత్తలనదిం బాదంబులం గన్న మీ
రి యెవ్వారలు మీరుదక్కఁగ రమాసాధ్వీశ నారాయణా!

టీకా:

వర = శ్రేష్ఠమైన; నాభీ = బొడ్డు అనే; ధవళ + అంబుజ + ఉదరమునన్ = తెల్లతామర గర్భంలో; పరమ + ఉత్తంసముగా = శ్రేష్ఠమైన సిగబంతిగా; వియత్ + తల నదిన్ = ఆకాశగంగను; రమా సాధ్వీ + ఈశ = లక్ష్మి అనే పతివ్రతకు భర్తవైనవాడా!

భావము:

లక్ష్మీనాథుడవైన నారాయణా! నీ తెల్లని బొడ్డు తామరలో బ్రహ్మను, ఆ బ్రహ్మ నుదుటినుండి శివుణ్ణి, ఆ శివునకు తలపువ్వుగా ఉండడానికి ఆకాశగంగను పాదాలనుండి పుట్టించిన మీతో సమానులు మీరు కాక వేరెవ్వరున్నారు?

1-26-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్ర మీనాభి జనించినట్టి విలసత్పద్మోరుసద్మంబునం
బ్రవంబైన విరించిఫాలజనితప్రస్వేదసంభూతుఁడై
భిధానంబును గోరి కాంచెను భవుం డార్యేశు లూహింపఁగా
వాఖ్యుండవు నిన్నెఱుంగ వశమే బ్జక్ష నారాయణా!

టీకా:

ప్రభన్ = తేజస్సుతో; విలసత్ = ప్రకాశించే; పద్మ + ఉరు + సద్మంబునన్ = కమలమనే గొప్ప భవనంలో; ప్రభవంబు + ఐన = జన్మించిన;  ఫాల జనిత = నుదుటినుండి పుట్టిన; ప్రస్వేద = గొప్ప చెమట నుండి; సంభూతుడై = పుట్టినవాడై; అభిదానంబును = పేరును; భవుండు = శివుడు; ఆర్య + ఈశులు = ఏకాదశ రుద్రులు; అభవ + ఆఖ్యుండవు = అభవుడు (పుట్టుక లేనివాడు) అనే పేరు గలవాడవు; అప్ + జ + అక్ష = నీటిలో పుట్టిన తామరల వంటి కన్నులు కలవాడా!

భావము:

కమల లోచనుడవైన నారాయణా! నీ నాభి కమలం నుండి జన్మించిన బ్రహ్మ నొసటి చెమట నుండి శివుడు జన్మించి కోరి కోరి భవుడు (పుట్టినవాడు) అనే పేరును పొందాడు. ఏకాదశ రుద్రులు భావించినట్లు అభవుడు (పుట్టుక లేనివాడు) అనే పేరు పొందిన నీ గురించి తెలుసుకొనడం ఎవరికైనా సాధ్యమౌతుందా?

1-27-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టుగర్భాంతరగోళభాగమున నీబ్రహ్మాండభాండంబు ప్రా
దివ్యాద్భుతలీలఁ దాల్చి మహిమం ల్పాంత మంబోధిపై
పత్రాగ్రముఁ జెంది యొప్పిన మిమున్ ర్ణింపఁగా శక్యమే
నిలాక్షాంబురుహాసనాదికులకున్ నిర్వాణ నారాయణా!

టీకా:

పటు = సమర్థమైన; ప్రాకట = ప్రసిద్ధమైన; వటపత్ర + అగ్రము = మఱ్ఱియాకుపైన; నిటల + అక్ష = ఫాలనేత్రుడైన శివునకు; అంబురుహ + ఆసన = నీట బుట్టిన తామర ఆసనంగా గల బ్రహ్మకు; నిర్వాణ = మోక్ష స్వరూపుడ వైనవాడా!

భావము:

మోక్షస్వరూపుడవైన నారాయణా! కడుపులో ఈ బ్రహ్మాండభాండాన్ని సమర్థంగాను, అద్భుతంగాను ధరించి, ప్రళయకాలంలో సముద్రం మీద మఱ్ఱియాకు మీద మహిమతో విలసిల్లిన విధానాన్ని వర్ణించడం శివుడు, బ్రహ్మ మొదలైన వారికి సాధ్యమా?

1-28-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశేషోరుసువర్ణ బిందువిలసచ్చక్రాంకలింగా కృతిన్
వుచే నుద్దవుచేఁ బయోజభవుచేఁ ద్మారిచే భానుచే
దివిజేంద్రాది దిశాధినాయకులచే దివ్యన్మునీంద్రాళిచే
దివ్యార్చన లందుచుందువు రమానారీశ! నారాయణా!

టీకా:

ఉరు = గొప్పనైన; సువర్ణ = మంచి వన్నె కలిగిన బంగారంతో (వర్ణ మంటే అక్షరమని కూడా అర్థం. ఇక్కడ `సువర్ణ’ అంటే మంచివైన బీజాక్షరాలతో); బిందు

భావము:

లక్ష్మీపతివైన నారాయణా! విశేషంగా బీజాక్షరాలతో, చిద్రూపంతో ప్రకాశించే నీ సుదర్శన చక్రమనే లింగరూపం ధరించి శివుడు, ఉద్ధవుడు, బహ్మ, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు, అష్టదిక్పాలకులు, దివ్యజ్ఞానులైన మహర్షులు మొదలైన వారిచేత నిత్యనూతనంగా దివ్యమైన పూజలను అందుకుంటావు కదా!

1-29-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్వంబున్ వసియించు నీతనువునన్ ర్వంబునం దుండఁగా
ర్వాత్వా! వసియించు దీవని మదిన్ సార్ధంబుగాఁ జూచి యా
గీర్వాణాదులు వాసుదేవుఁ డనుచున్ గీర్తింతు రేప్రొద్దు నా
శీర్వాదంబు భవన్మహామహిమ లక్ష్మీనాథ నారాయణా!

టీకా:

గీర్వాణ + ఆదులు = దేవతలు మొదలైనవారు; వాసుదేవుడు = జగత్తంతా ప్రకాశించే విష్ణువు.

భావము:

అన్నింటికీ ఆత్మయైన వాడవు, లక్ష్మీపతివి అయిన నారాయణా! నీలో సర్వం ఉంతుందని, నీవు అన్నింటా ఉంటావని అర్థం చేసికొన్న దేవతలు మొదలైనవారు ఎల్లప్పుడు నిన్ను వాసుదేవుడవని పొగడుతారు. నీ మహిమాన్వితత్వమే నాకు ఆశీర్వాదం కదా!

1-30-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాద్యంచిత పంచభూతమయమై కంజాత జాండావలిన్
గుణబ్రహ్మమయాఖ్యతం దనరుచున్ సంసారివై చిత్కళా
సుగుణంబై విలసిల్లు దీవు విపులస్థూలంబు సూక్షంబునై
నిమోత్తంస! గుణావతంస! సుమహా నిత్యాత్మ నారాయణా!

టీకా:

అంచిత = ఒప్పిన; కంజాతజ + అండ + ఆవలిన్ = బ్రహ్మాండాల వరుసను; ఆఖ్యతన్ = పేరుతో; తనరు = ఒప్పు; స్థూలంబు = పెద్దది; నిగమ + ఉత్తంస = వేదాలు భూషణాలుగా కలవాడా; గుణ + అవతంస = సద్గుణాలు అలంకారాలుగా కలవాడా.

భావము:

వేదాలు, సద్గుణాలు అలంకారాలుగా గలిగి. మంచిది, మహత్తరమైనది, శాశ్వతమైనది అయిన ఆత్మ కలిగిన నారాయణా! ఆకాశం మొదలైన పంచభూతాలతో కూడిన బ్రహ్మాండంలో సగుణబ్రహ్మవనే పేరుతో సంసారివై జ్ఞానంతోను, నూతన కళలతోను నీవు విలసిల్లుతూ ఉంటావు. 

1-31-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రారన్ భవదీయనామకథనం బేమర్త్యుచిత్తంబులోఁ
బొలుపారం దగిలుండునేని యఘముల్ పొందంగ నెట్లో పెడున్
యం బావకుచేతఁ బట్టువడు నక్కాష్టంబుపైఁ గీటముల్
నిలువన్నేర్చునె భక్తపోషణ! కృపానిత్యాత్మ నారాయణా!

టీకా:

ఎలరారన్ = ఒప్పునట్లుగా; మర్త్యు = మానవుని; పొలుపారన్ = ప్రకాశించగా; ఎట్లు + ఓపెడున్ = ఎలా సాధ్యపడుతుంది?; కలయన్ = కూడగా, కలువగా; పాగకు చేతన్ = అగ్ని చేత; ఆ + కాష్ఠంబుపై = ఆ కఱ్ఱపైన; కీటముల్ = పురుగులు.

భావము:

భక్తులను పోషించే దయగల శాశ్వతమైన ఆత్మ కలిగిన నారాయణా! ఏ మానవుని మనస్సులో నీ నామజపం తగిలి ఉంటుందో అతడు పాపాలను పొందడం ఎలా సాధ్యపడుతుంది? మండుతున్న కఱ్ఱపై ఉన్న పురులుగు నిలువగలవా?

1-32-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యం దిక్కులు నిండి చండతరమై ప్పారు మేఘౌఘముల్
వెయన్ ఘోరసమీరణస్ఫురణచే వేపాయుచందంబునన్
దంభోళిమృగాగ్ని తస్కర రుజా త్రోరగవ్రాతముల్
దొలఁగున్న్మీగదు దివ్యమంత్రపఠనన్ దోషాఘ్న నారాయణా!

టీకా:

కలయన్ = కూడగా; చండతరమై = దట్టంగా; కప్పారు = ఆవరించిన; మేఘ + ఓఘముల్ = మబ్బుల గుంపులు; వెలయన్ = పుట్టిన; సమీరణ స్ఫురణచే = గాలులు వీచడం వల్ల; వే = వేగంగా; పాయు = తొలగిపోయే; దంభోళి = పిడుగు యొక్క; రుజా = రోగాల యొక్క; ఉరగ వ్రాతముల్ = పాముల సమూహాలు; దోషఘ్న = పాపాలను నశింపజేసేవాడా!

భావము:

పాపాలను నాశనం చేసే నారాయణా! అన్ని దిక్కుల్లో దట్టంగ అలముకున్న మేఘాలు తీవ్రంగా వీచే గాలి వల్ల చెల్లా చెదరవుతాయి. అలాగే నీ మంత్రాన్ని పఠించడం వల్ల వరదలు, పిడుగులు, క్రూరమృగాలు, అగ్నిప్రమాదాలు, దొంగలు, రోగాలు, శత్రువులు, పాములు మొదలగు వాని వల్ల సంభవించే ఆపదలు తొలగిపోతాయి.

1-33-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుషాగాథవినాశకారి యగుచుం గైవల్య సంధాయియై
లి నొప్పారెడు మంత్రరాజమగు నీనామంబు ప్రేమంబుతో
రన్నెవ్వనివాక్కునం బొరయదే న్నీచు ఘోరాత్మయున్
వెయన్ భూరుహకోటరంబదియ సూ వేదాత్మ నారాయణా!

టీకా:

కలుష + అగాధ = అంతులేని పాపాలకు; కైవల్య సంధాయియై = మోక్షాన్ని ఒనగూర్చేదై; నలి = మిక్కిలి; భూరుహ కోటరంబు = చెట్టు తొఱ్ఱ.

భావము:

వేదమే ఆత్మగా కలిగిన నారాయణా! అంతులేని పాపాలను నాశనం చేసేదై, మోక్షాన్ని సమకూర్చేదై విలసిల్లే గొప్పమంత్రం నీ నామం. దానిని ఎవడైతే నోరార పలుకడో ఆ నీచుని మనస్సు చెట్టుతొఱ్ఱతో సమానం.

1-34-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంబై పరతత్వమై సకలసంత్సారమై భవ్యమై
సుసిద్ధోరగ యక్షపక్షిముని రక్షోహృద్గుహాభ్యంతర
స్థిసుజ్జానసుదీపమై శ్రుతికళాసిద్ధాంతమై సిద్ధమై
రిలేకెప్పుడు నీదునామ మమరున్ త్యంబు నారాయణా!

టీకా:

పరమంబై = శ్రేష్ఠమై; భవ్యమై = శుభకరమై.

భావము:

నారాయణా! నీ నామం శ్రేష్ఠమై, పరత్వాన్ని బోధించేదై, అన్ని సంపదలకు నెలవై, శుభకరమై. దేవతలు సిద్ధులు నాగులు యక్షులు పక్షులు మునులు రాక్షసులు మొదలైనవారి హృదయాలనబడే గుహల లోపల స్థిరంగా వెలిగే జ్ఞాన దీపమై, వేదాలకు కళలకు సిద్ధాంతమై, ఎప్పుడూ అందుబాటులో ఉండేదై సాటి లేకుండా విలసిల్లుతున్నది.

1-35-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధికాఘౌఘతమో దివాకరమునై ద్రీంద్రజా జిహ్వకున్
సుయై వేదవినూత్న రత్నములకున్ సూత్రాభిధానంబునై
బుసందోహ మనోహరాంకురమునై భూదేవతాకోటికిన్
విధులై మీబహునామరాజి వెలయున్ వేదాత్మ నారాయణా!

టీకా:

అఘ = పాపాలయొక్క; ఓఘ = సమూహం అనే; తమః = చీకటికి; దివాకరము = సూర్యబింబము; అది + ఇంద్రజా = పర్వతరాజ కుమారి అయిన పార్వతి యొక్క; సూత్ర + అభిధానంబు = దారము అనే పేరు గలది; అంకురము = మొలక; భూదేవతా కోటికిన్ = బ్రాహ్మణుల సమూహానికి; విధులై = అవశ్యం చేయదగినవై.

భావము:

వేదస్వరూపుడవైన నారాయణా! అసంఖ్యాకంగా ఉన్న నీ నామాలు పాపాల చీకట్లను పారద్రోలే సూర్యబింబాలై, పార్వతీదేవి నాలుకకు అమృత బిందువులై, వేదమంత్రాలు అనబడే రత్నాలను గుదిగుచ్చే దారమై, పండితులకు అందమైన మొలకలై, బ్రాహణులకు నిత్యకర్మ విధానాలై విరాజిల్లుతున్నది.

1-36-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పొరన్ముక్తికిఁ ద్రోవ వేదములకుం బుట్టిల్లు మోదంబునం
దునికిస్థానము నిష్టభోగములకున్నుత్పత్తి యేప్రొద్దునున్
పాపంబులవైరి షడ్రిపులకున్ గాలావసానంబు మీ
వినుతాంఘ్రిద్వయపద్మసేవనగదా విశ్వేశ నారాయణా!

టీకా:

పొనరన్ = ఒప్పగా; షట్ + రిపులకున్ = కామ క్రోధ లోభ మోహ మద్య మాత్సర్యాలు అనబడే అంతశ్శత్రువులకు.

భావము:

సమస్త విశ్వానికి అధిపతివైన నారాయణా! పొగడబడే నీ పాదపద్మాల సేవయే మోక్షానికి మార్గం, వేదాలకు పుట్టినిల్లు, ఆనందానికి నెలవు, ఇష్టసుఖాలకు మూలకారణం, సర్వదా మహాపాతకాలకు విరోధి, కామక్రోధాది అరిషడ్వర్గానికి అంత్యకాలం అవుతుంది కదా!

1-37-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రోగంబుల మందు పాతకతమో బాలార్క బింబంబు క
ర్మ విషజ్వాలసుధాంశుగామృతతుషావ్రాతపాథోధిమూ
ర్తివి కైవల్యపదావలోకన కళాదివ్యాంజనశ్రేష్ఠమై
భువిలో మీదగుమంత్రరాజ మమరున్ భూతాత్మ నారాయణా!

టీకా:

భవరోగంబుల = సంసారమనే వ్యాధులకు; పాతకతమః = పాపాలనే చీకటికి; బాలార్కబింబంబు = ఉదయించే సూర్యబింబం; సుధా + అంశు = చంద్రుని; గ = పొందిన; తుషార = అమృతం యొక్క; వ్రాత = సమూహం గల; పాథోధి = సముద్రం యొక్క; మూర్తివి = రూపం కలవాడవు; కైవల్యపద = మోక్షపదాన్ని; అవలోకన కళా = చూపించే కళకు.

భావము:

ప్రాణులకు ఆత్మవైన నారాయణా! నీవు కర్మలనే విషజ్వాలకు చంద్రున్ని పొందిన శీతలామృతరాశి అయిన సముద్రం యొక్క రూపం కలవాడవు. నీ గొప్పమంత్రం సంసార వ్యాధులకు ఔషధం, పాపాలనే అంధకారానికి సూర్యోదయం, మోక్షపదాన్ని చూడగోరే కళకు దివ్యమైన అంజనమై విలసిల్లుతున్నది.

1-38-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుసన్ గర్మపిపీలికాకృత తనూల్మీకనాళంబులోఁ
రుషాకారముతో వసించిన మహా పాపోరగశ్రేణికిం
మోచ్చాటనమై రహస్యమహిమం బాటింపుచున్నుండుమీ
తిరుమంత్రంబగు మంత్రరాజ మమరుం దివ్యాత్మ నారాయణా!

టీకా:

కర్మ పిపీలికా = కర్మ లనెడు చీమలచేత; కృత = చేయబడిన; తనూ = శరీరమనెడి; నాళంబులో = రంధ్రంలో; పరుష + ఆకారముతో = ఘోరమైన రూపంతో; వసించిన = నివసించిన; పాప + ఉరగ శ్రేణికి = పాతకాలనెడి పాముల సమూహానికి; పరమ + ఉచ్చాటనము + ఐ = గొప్ప మంత్రమై; దివ్య + ఆత్మ = అప్రాకృత స్వరూపం కలవాడా!

భావము:

అప్రాకృతమైన స్వరూపం కలిగిన నారాయణా! క్రమంగా కర్మ లనబడే చీమలచేత చేయబడిన పుట్ట వంటి ఈ దేహంలోని రంధ్రాలలో ఘోరమైన రూపాలతో చేరిన పాపా లనబడే పాముల సమూహాన్ని తరిమి వేసే ఉచ్చాటన గలదై రహస్య మహిమను పాటిస్తున్న ‘ఓం నమో నారాయణాయ’ అనే నీ తిరుమంత్ర పరిభాష ఒప్పుచున్నది.

1-39-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుని న్నద్రిజ నాంజనేయుని గుహు న్నయ్యంబరీషున్ ధ్రువుం
రిఁ బ్రహ్లాదు విభీషణాఖ్యుని బలిన్ ఘంటాశ్రవున్ నారదున్
మొప్పన్ విదురున్ బరాశరసుతున్ గాంగేయునిన్ ద్రౌపదిన్
రు నక్రూరునిఁ బాయకుండును భవన్నామంబు నారాయణా!

టీకా:

హరునిన్ = శంకరుని; అద్రిజన్ = పార్వతిని; కరిన్ = ఏనుగును; విభీషణ + ఆఖ్యుని = విభీషణుడు అనే పేరు గలవానిని; ఘంటాశ్రవున్ = ఘంటాకర్ణుని; పరాశర సుతున్ = వ్యాసుని; గాంగేయునిన్ = భీష్ముని; నరున్ = అర్జునుని.

భావము:

నారాయణా! శివుడు, పార్వతి, ఆంజనేయుడు, గుహుడు, అంబరీషుడు, ధ్రువుడు, ఏనుగు, ప్రహ్లాదుడు, విభీషణుడు, బలి, ఘంటాకర్ణుడు, నారదుడు, విదురుడు, వ్యాసుడు, భీష్ముడు, ద్రౌపది, అర్జునుడు, అక్రూరుడు మొదలైన భాగవతోత్తములను నీ నామం వదలకుండా ఉంటుంది.

1-40-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీకిన్మందిరమైన వక్షము సురజ్యేష్ఠోద్భవస్థాననా
భీకంజాతము చంద్రికాంతర సుధాభివ్యక్తనేత్రంబులున్
లోస్తుత్యమరున్నదీజనక మాలోలాంఘ్రియున్ గల్గు నా
లోకారాధ్యుడవైన నిన్నెపుడు నాలోఁ జూతు నారాయణా!

టీకా:

శ్రీకిన్ = లక్ష్మీదేవికి; మందిరమైన = నివాసమైన; సురజ్యేష్ఠ = తొలివేలుపైన బ్రహ్మకు; ఉద్భవస్థాన = పుట్టినచోటైన; నాభీ కంజాతము = బొడ్డు తామర; చంద్రికా + అంతర = వెన్నెలలో ఉన్న; సుధా = అమృతాన్ని; అభివ్యక్త = వెదజల్లే; లోక స్తుత్య = లోకులచే పొగడబడే; మరుత్ + నదీ = దేవనది అయిన గంగకు; జనక = జన్మస్థానమైన; మా = లక్ష్మీదేవికి; లోల = ప్రియమైన; అంఘ్రి = పాదం.

భావము:

నారాయణా! లక్ష్మీదేవికి నివాసమైన నీ వక్షాన్ని, బ్రహ్మకు జన్మస్థానమైన నీ బొడ్డు తామరను, వెన్నెలలోని అమృతాన్ని ప్రసరించే నీ కన్నులను, లోకాలు పొగడే గంగానది పుట్టిన లక్ష్మీదేవి కిష్టమైన నీ పాదాన్ని కలిగి సకల లోకాలకు పూజ్యుడవైన నిన్ను నాలో ఎప్పుడు చూస్తాను? (నిన్ను నాలో ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాను).

1-41-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విందుల్ విందులటంచు గోపరమణుల్ వ్రేపల్లెలోఁ బిన్ననాఁ
డందెల్ మ్రోయఁగ ముద్దుమో మలర నిన్నాలింగితున్ సేయుచో
డెందంబుల్ దనివార రాగరసవీటీలీలలన్ దేల్చుమీ
మంస్మేరముఖేందురోచులు మమున్ న్నించు నారాయణా!

టీకా:

రాగ = ఎరుపురంగుతో కూడిన; రస = రసవంతమైన; వీటీ = తాంబూలం యొక్క; లీలలన్ = శృంగార చేష్టలలో; తేల్చు = అలరించే; మందస్మేర = చిరునవ్వుతో కూడిన; ముఖ + ఇందు రోచులు = ముఖమనే చంద్రకాంతులు.

భావము:

నారాయణా! వ్రేపల్లెలో నీ చిన్నతనంలో అందెలు మ్రోగుతుండగా ముద్దుమోముతో అందంగా ఉన్న నిన్ను గోపస్త్రీలు ‘విందులు విందులు’ అంటూ కౌగిలించుకుని తమ తాంబూలం సేవించిన పెదాలతో ముద్దు పెట్టుకొనగా నీ ముఖ చంద్రబింబం కురిపించే చిరునవ్వుల వెన్నెలలు మమ్ము కాపాడుతాయి.

1-42-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విందుల్వచ్చిరి మీయశోదకడకున్ వేగంబె పొ మ్మయ్యయో
నందానందన! చందనాంకురమ! కృష్ణా! యింకఁ బోవేమి మా
మందం జాతరసేయఁ బోదమిదె రమ్మా యంచు మిమ్మెత్తుకో
చందంబబ్బిన నుబ్బకుండుదురె ఘోస్త్రీలు నారాయణా!

టీకా:

విందుల్ = చుట్టాలు; నంద + ఆనందన = నందునకు ఆనందాన్ని కూర్చేవాడా; చందన + అంకురమ = గంధపు మొలకా; మందన్ = గొల్లపల్లెలో; ఉబ్బకుండుదురె = సంతోషించకుండా ఉంటారా; ఘోషస్త్రీలు = గొల్లెతలు.

భావము:

నారాయణా! “నందునకు ఆనందాన్నిచ్చే గంధపు మొలకవైన కృష్ణా! మీ యశోద దగ్గరికి చుట్టాలు వచ్చారు. తొందరగా వెళ్ళిపో. అయ్యయ్యో! ఇంకా పోవడంలే దెందుకు? సరే! మా గొల్లపల్లెలో జాతరకు పోదాం రా!” అంటూ నిన్నెత్తుకొనే అదృష్టం దక్కిన గొల్లెతలు సంతోషించకుండా ఉంటారా?

1-43-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నా కృష్ణమ నేఁడు వేల్పులకు మీఁన్నార మీచట్లలో
వెన్నల్ ముట్టకు మన్ననాక్షణము నన్విశ్వాకృతిస్ఫూర్తివై
యున్నన్ దిక్కులు చూచుచున్ బెగడి నిన్నోలి న్నుతుల్ సేయుచున్
న్నుల్ మూయ యశోదకున్ జిఱుతవై న్పించు నారాయణా!

టీకా:

వేల్పులు = దేవతలు; చట్లు = ఉట్లు = చిఱుత; చిన్న = పిల్లాడవు.

భావము:

నారాయణా! యశోద “అన్నా! కృష్ణా! దేవతలకు నైవేద్యంగా ముడుపు కట్టాము. ఉట్టిమీది కుండలోని వెన్నను ముట్టకు” అని చెప్పగా వెంటనే విశ్వరూపాన్ని ధరించావు. బెదరి నలుదిక్కులు చూస్తూ, నిన్ను స్తోత్రం చేస్తూ కన్నులు మూసుకొన్న యశోదకు చిన్న బాలుడవై కనిపిస్తుంటావు.

1-44-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లోలంబులుగాఁ గురుల్ నుదుటిపై నుప్పొంగ మోమెత్తి ధ
మ్మిల్లం బల్లలనాడ రాగరస సమ్మిశ్రంబుగా నీవు వ్రే
ల్లెందాడుచు గోపగోనివహ గోస్త్రీల యుల్లంబు మీ
పిల్లంగ్రోవిని జుట్టిరాఁ దిగుదు నీ పెంపొప్పు నారాయణా!

టీకా:

ఉత్+లోలంబులుగాన్ = కెరటాలవలె; కురుల్ = వెంట్రుకలు; ధమ్మిల్లంబు = కొప్పు;  అల్లలన్+ఆడ = చలించగా; రాగ = ప్రేమయొక్క; రస = శృంగారరసం యొక్క; సమ్మిశ్రంబుగా = కలయికగా; తాడుచు = ఒకటిగా పెనవేస్తూ; గో నిహవ = గోవుల సమూహం యొక్క; చుట్టి రాన్ = అనుసరించి రాగా; తిగుచు = చేరదీసే; పెంపు = మహత్వం.

భావము:

నారాయణా! నుదుటిపై ముంగురులు కెరటాల వలె ఉప్పొంగగా, మోము పైకెత్తి కొప్పు చలిస్తుండగా ప్రేమను శృంగారాన్ని కలగలిపి పేనినట్లుగా సంచరిస్తూ గోపాలుర, గోవుల, గోపస్త్రీల హృదయాలు నీ మురళీగానాన్ని అనుసరించి రాగా వారిని చేరదీసే నీ గొప్పతనం విలసిల్లుతుంది.

1-45-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వొప్పన్ పసి మేసి ప్రొద్దుగలుగం గాంతారముం బాసి య
ప్పసియున్నీవును వచ్చుచో నెదురుగాఁ బైకొన్న గోపాంగనా
వద్వృత్తపయోధరద్వయహరిద్రాలేపనామోదముల్
సిఁ గొంచున్ బసిఁగొంచువచ్చుటలు నేభావింతు నారాయణా!

టీకా:

కసవు = గడ్డి; పసి = గోగణం; ప్రొద్దు + కలుగన్ = ప్రొద్దు ఉండగానే; కాంతారమున్ = అడవిని; పాసి = వదలి; పైకొన్న = మీద పడిన; రసవత్ = శృంగార రసం కలిగిన; వృత్త = గుండ్రని; పయోధర = స్తనాల యొక్క; ద్వయ = జంట మీది; హరిద్రా లేపన = పసుపు పూతల; ఆమోదముల్ = వాసనలను; కొంచున్ = ఆఘ్రాణిస్తూ; కొంచు = తీసికొని.

భావము:

నారాయణా! గడ్డి మేసిన ఆలమందను తీసికొని ప్రొద్దు ఉండగానే అడవిని వదలి నీవు వస్తుండగా ఎదురుగా వచ్చి మీదపడ్డ గోపస్త్రీల సింగారపు గుండ్రని స్తనాల మీది పసుపు పూతల సువాసనలను ఆఘ్రాణిస్తూ వస్తున్న నీ రూపాన్ని నేను భావిస్తాను.

1-46-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నుల్ మీఁదికి చౌకళింప నడుముం వ్వాడ కందర్పసం
న్నాఖ్యంబు నటించు మాడ్కి కబరీభారంబు లూటాడఁగా
విన్నాణంబు నటింప గోపజన గోబృందంబుతో వచ్చు మీ
న్నెల్ కన్నుల ముంచి గ్రోలుటలు నే ర్ణింతు నారాయణా!

టీకా:

చౌకళింప = చలింపగా; జవ్వాడ = ఊగగా; కందర్ప = మన్మథుని యొక్క; సంపన్న + ఆఖ్యంబు = సంపద అనే పేరు; మాడ్కి = వలె; కబరీ భారంబు = కేశపాశాలు; ఊటాడగా = కదులుతుండగా; విన్నాణంబు = నేర్పరితనం; వన్నెల్ = అందాలు; క్రోలుటలు = త్రాగడమనే చర్యలు.

భావము:

నారాయణా! చన్నులు పైపైకి కదులుతుండగా, నడుము ఊగాడగా, కేశపాశం కామసంపద అన్నట్లు చలిస్తుండగా, నేర్పరితనంతో ప్రవర్తిస్తున్న గోపికలతోను, గోవులతోను వస్తున్న నీ అందాలను కన్నులనే గిన్నెలుగా చేసి ముంచి త్రాగడాన్ని వర్ణిస్తాను.

1-47-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పెరుగుల్ ద్రచ్చుచు నొక్కగోపిక మిముం బ్రేమంబునం జూచి రా
సావేశత రిత్త ద్రచ్చనిడ నావ్వంబు నీవున్ మనో
లీలం గనుఁగొంచు ధేనువని యయ్యాఁబోతునుం బట్టితీ
వృత్తాంతము లేను పుణ్యకథగా ర్ణింతు నారాయణా!

టీకా:

త్రచ్చుచున్ = చిలుకుతూ; రాగరస = ప్రేమరసపు; ఆవేశత = ఆవేశంలో; రిత్తన్ = వట్టి కుండను.

భావము:

నారాయణా! ఒక గోపిక పెరుగు చిలుకడానికి సిద్ధపడి నిన్ను ప్రేమతో చూసి ఆ ప్రేమావేశంలో కవ్వాన్ని ఉత్తకుండలో పెట్టి చిలుకుతుండగా నీవు ఆమెను మనోహరంగా చూస్తూ ఆవు అనుకొని ఆబోతును పట్టుకున్నావు. ఇటువంటి గొప్ప ఉదంతాలను నేను పుణ్యకథలుగా వర్ణిస్తాను.

1-48-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కేలన్ గోలయు గూటిచిక్కము నొగిం గీలించి నెత్తంబునం
బీలీపింఛముఁ జుట్టి నెన్నడుమునం బింఛావళిన్ గట్టి క
ర్ణాలంకార కదంబగుచ్చ మధుమత్తాలీస్వనం బొప్ప నీ
వాలన్ గాచిన భావ మిట్టిదని నే ర్ణింతు నారాయణా!

టీకా:

కేలన్ = చేతిలో; కోల = కఱ్ఱ; కూటి చిక్కము = చద్దిమూట; ఒగిన్ = వరుసగా; కీలించి = తగిలించి; నెత్తంబునన్ = సిగపై; పీలీపింఛము = నెమలి ఈకను; కదంబ గుచ్ఛ = పూలగుత్తులలోని; మధు = తేనె చేత; మత్త = మత్తెక్కిన; అలీ = తుమ్మెదల యొక్క; స్వనంబు = ఝంకారాలు.

భావము:

 నారాయణా! చేతిలోని కఱ్ఱకు చద్దిమూటను తగిలించి, తలపై నెమలి ఈకను ధరించి, నడుము చుట్టూ నెమలి ఈకలను చుట్టి, చెవులకు అలంకారాలైన పూగుత్తులలోని మకరందాన్ని గ్రోలిన తుమ్మెదలు ఝంకారం చేస్తుండగా ఆవులను కాచిన రూపం ఇటువంటిదని నేను వర్ణిస్తాను.

1-49-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాళిందీతటభూమి నాలకదుపుల్ కాలూఁది మేయన్ సము
త్తాలాలోల తమాలపాదపశిఖాంస్థుండవై వేణురం
ధ్రాలిన్ రాగరసంబునిండ విలసద్రాగంబు సంధించి గో
పావ్రాతము గండుగోయిలలుగా ర్ణింతు నారాయణా!

టీకా:

కాళిందీ తట భూమిన్ = యమునానది తీరభూమిలో; ఆల కదుపుల్ = ఆవుల మందలు; కాలు + ఊఁది = ప్రవేశించి; సముత్తాల = మిక్కిలి పొడవైన; ఆలోల = కదులుతున్న; తమాల పాదప = చీకటి చెట్టు యొక్క; శిఖా + అంతస్థుండవై = కడకొమ్మ లోపల ఉన్నవాడవై; విలసత్ = శోభించే; సంధించి = కూర్చి; వ్రాతము = సమూహం.

భావము:

నారాయణా! యమునా తీర భూముల్లోకి ఆల మందలు ప్రవేశించి మేస్తుండగా నీవు ఎత్తైన చీకటిచెట్టు కొనకొమ్మల్లో ఉండి వేణువుతో రసభరితమైన రాగాన్ని ఆలాపించగా నిన్ననుసరించే గోపాలుర సమూహాన్ని గండుకోయిలలుగా వర్ణిస్తాను.

1-50-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాణించెన్ గడునంచు నీసహచరుల్ రాగిల్లి సోలంగ మీ
వేణుక్వాణము వీనులంబడి మనోవీథుల్ బయల్ ముట్టఁగా
ఘోనాగ్రంబులు మీఁదికెత్తుకొని లాంగూలంబు లల్లార్చి గో
శ్రేణుల్ చిందులు ద్రొక్కి యాడుటలు నేఁ ర్చింతు నారాయణా!

టీకా:

రాణించెన్ = విలసిల్లినది; రాగిల్లి = రంజిల్లి; సోలంగ = వివశులు కాగా; క్వాణము = నాదం; మనోవీథుల్ = మానసిక స్థితులు; బయల్ ముట్టఁగా = ఆకాశాన్ని అందుకోగా; ఘోణ + అగ్రంబులు = ముక్కుకొనలు; లాంగూలంబులు = తోకలు; అల్లార్చి = ఆడించి.

భావము:

నారాయణా! నీ మురళీనాదం ఎంతో విలసిల్లిందని నీ సహచరులు ఆనందించి వివశులు కాగా, అది చెవుల బడి మనోభావాలు ఆకాశాన్ని అంటగా ముక్కుల నెత్తి, తోకలను ఊపుతూ ఆవుల మంద చిందులు త్రొక్కి ఆడడాన్ని నేను వర్ణిస్తాను.

1-51-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సులంగాపరి యేమెఱుంగు మధురప్రాయోల్లసద్వృత్తవా
గ్విరారావము మోవిదా వెదురు గ్రోవిం బెట్టి నాఁడంచు నిన్
టుల్ సేయఁగ నాఁడు గోపికల తద్గానంబులన్ మన్మథ
వ్యనాసక్తలఁ జేయుచందములు నేర్ణింతు నారాయణా!

టీకా:

మధుర ప్రాయ = యౌవనంలో; ఉల్లసత్ = ఆనందించే; వృత్త = వృత్తాంతాలలోని ; వాక్ + విసర = మాటల ప్రసారం కలిగిన; ఆరావము = ధ్వని; మోవిన్ = పెదవిపై; కసటుల్ + చేయఁగన్ = ఎగతాళి చేయడానికి; ఆఁడు = మాటలాడే.

భావము:

నారాయణా! “మధురమైన యౌవనంలో ఆనందాన్ని కలిగించే రకరకాల మాటల మనోహర ధ్వని - పెదవిపై పిల్లనగ్రోవిని పెట్టిన ఈ పశువుల కాపరికి ఏం తెలుసు?” అని చులకనగా మాట్లాడే గోపికలను తన మురళీగానంతో కామక్రీడాసక్తులను చేసే నీ పద్ధతులను వర్ణిస్తాను.

1-52-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డియొంతేఁ దడవయ్యె జెయ్యియలసెన్ శైలంబు మాచేతులం
దిడుమన్నన్ జిరునవ్వుతో వదలినన్ హీనోక్తి గీపెట్ట నె
క్కుడు గోవుల్ బ్రియమంద నింద్రుఁ డడలం గోవర్ధనాద్రీంద్రమున్
గొడుగైయుండగఁ గేలఁ బూనితి గదా గోవింద నారాయణా!

టీకా:

జడ = నిశ్చలంగా ఉన్న శ్రీకృష్ణా! హీన + ఉక్తి = మాట రాక; కీపెట్టన్ = కేకలు పెట్టగా; ఎక్కుడు = మిక్కిలిగా; అడలన్ = భయపడగా; కేలన్ = చేతిలో; గోవింద = గోవులకు ఆనందాన్ని కలిగించే కృష్ణా!

భావము:

గోవులకు ఆనందాన్ని కలిగించే నారాయణా! “చైతన్యం లేకుండా స్థిరంగా నిలిచిన కృష్ణా! చాలా కాలమయింది. నీ చేయి అలసిపోయింది. పర్వతాన్ని మా చేతులలో పెట్టు” అని గోపజనులు కోరగా చిరునవ్వుతో దానిని వదిలావు. వారు నోట మాట రానివారై కీపెట్టారు. గోవులు సంతోషించగా, ఇంద్రుడు భయపడగా గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా చేత ధరించావు కదా!

1-53-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లితాకుంచితవేణి యందడవి మొల్లల్ జాఱ ఫాలస్థలిన్
దికం బొయ్యన జాఱఁ గుండలరుచుల్ దీపింప లేఁజెక్కులన్
మొకన్నవ్వుల చూపులోరగిల మేన్మువ్వంకలన్ బోవఁగా
లి గైకొందువు గాదె నీవు మురళీనాట్యంబు నారాయణా!

టీకా:

లలిత = అందంగా; అకుంచిత = ముడిచిన; ఓరగిల = ప్రక్కకు వాలగా; మువ్వంకలన్ (మూడు + వంకలన్) పోవగా = మూడు మల్కలై పోగా; నలిన్ = యొగ్యంగా; కైకొందువు = పూనుకుంటావు.

భావము:

నారాయణా! అందంగా ముడిచిన జడలోని మల్లెపూలు జారగా, నుదుట పెట్టిన బొట్టు మెల్లగా జారుతుండగా, లేత చెక్కిళ్ళపై కుండాలలు ప్రకాశిస్తుండగా, చిరునవ్వులతో కూడిన చూపులు ప్రక్కలకు వాలుతుండగా, శరీరం మూడు వంకల తిరుగగా నీవు మురళిని వాయిస్తూ నాట్యం చేస్తావు.

1-54-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మా పాలం గడు గ్రొవ్వి గోపికలతో త్తిల్లి వర్తింతువే
మా పాలెంబుల వచ్చియుండుదు వెసన్మాపాలలో నుండుమీ
మా పాలైన సుఖాబ్ధిలో మునుగుచున్ న్నించి తా గొల్లలన్
మాపాలం గల వేల్పు నీవె యని కా న్నింతు నారాయణా!

టీకా:

క్రొవ్వి = బలిసి; పాలెంబుల = పల్లెలలో; వెసన్ = వెంటనే; మా పాలలోన్ = మా పక్షాలలో; మా పాలు+ఐన = మా వంతైన; కా = కదా.

భావము:

నారాయణా! “మా ఆవుల పాలను త్రాగి బలిసి, గోపికలతో మదించి ప్రవర్తిస్తావు కదా! మా పల్లెలకు వచ్చి ఉండు. మా పక్షాన ఉండుము” అన్న గొల్లలను వారి వంతైన సుఖసాగరంలో మునుగుతూ కాపాడే మా దేవుడవు నీవే అని భావిస్తాను.

1-55-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

 కాంతామణి కొక్కడీవు మఱియున్నొక్కర్తె కొక్కండవై
లస్త్రీలకు సంతసంబలర రాక్రీడ తన్మధ్య క
ల్పమూలంబున వేణునాదరస మొప్పంగా, బదార్వేలగో
పిలం జెంది వినోద మొందునెడ నీ పెంపొప్పు నారాయణా!

టీకా:

రాసక్రీడ = గోపికలతో కృష్ణుడు మండలాకారంగా చేసిన నృత్యం.

భావము:

నారాయణా! ఒక్కొక్క స్త్రీకి నీవు ఒక్కొక్కడవై, స్త్రీలందరికీ సంతోషం కలుగగా రాసక్రీడ లాడుతూ, వారి మధ్య కల్పవృక్షం క్రింద వేణునాదం చేస్తూ, పదహారు వేల గోపికలకు వినోదాన్ని అందించే సమయంలో నీ గొప్పతనం విలసిల్లుతుంది.

1-56-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లితంబైన భవత్తనూవిలసనన్ లావణ్యదివ్యామృతం
లుఁగుల్వారఁగ నీకటాక్షమునఁ దామందంద గోపాంగనల్
లఁపుల్పాదులుకట్టి కందళితనూత్నశ్రీలు వాటింతురా, 
నెతల్ తీవెలు చైత్రవిస్ఫురణమౌ నీయొప్పు నారాయణా!

టీకా:

లలితంబు+ఐన = సుకుమారమైన; భవత్ = నీ; తనూ = శరీరం యొక్క; విలసనన్ = విన్యాసం వలన; లావణ్య = సౌందర్యామనే; అలుగుల్ + పారగ = ప్రవహించగా; కటాక్షమునన్ = కడగంట; కందళిత = మొలకెత్తిన; చైత్ర విస్ఫురణమౌ = చిత్రంగా శోభించే; ఒప్పు = సమ్మతిని.

భావము:

నారాయణా! సుకుమారమైన నీ శరీర విన్యాసం వల్ల సౌందర్యమనే అమృతం నీ కడగంట ప్రవహిస్తుంటే గోపికలు తమ భావాలనే పాదులు కట్టి, క్రొత్త సంపదలు అంకురించిన లతలై చిత్రంగా శోభించే నీ సమ్మతిని పాటిస్తారు.

1-57-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లీలన్ బూతకి ప్రాణవాయువులు పాలిండ్లందు వెళ్ళించి దు
శ్శీలుండై చను బండిదానవు వెసం జిందై పడం దన్ని యా
రోన్మద్దులు గూల్చి ధేనుదనుజున్ రోఁజంగ నీల్గించి వే
కూలం గంసునిఁ గొట్టి గోపికల కోర్కుల్ దీర్తు నారాయణా!

టీకా:

వెళ్ళించి = పోగొట్టి; బండిదానవు = శకటాసురుని; చిందై = శిథిలమై; మద్దులు = మద్దిచెట్లను; ధేనుదనుజున్ = ధేనుకాసురుని; రోజంగ = రొప్పగా; నీల్గించి = చంపి.

భావము:

నారాయణా! విలాసంగా పూతన ప్రాణాలను పాలిండ్లనుండి తీసి, దుర్మార్గుడై వచ్చిన శకటాసురుని ముక్కలై పడగా తన్ని, రోటితో మద్దిచెట్లను కూల్చి, ధేనుకాసురుని చంపి, కంసుని పడగొట్టి గోపికల కోరికలను తీర్చినావు.

1-58-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాగ్రంబున నీదు నామరుచియున్ మ్యంబుగాఁ జెవ్లుకు
న్నలారంగ భవత్కథాభిరతియున్ స్తాబ్జ యుగ్మంబులన్
వెనీపాదసుపూజితాదియుగమున్ విజ్ఞాన మధ్యాత్మకున్
వె నింపొందనివాఁడు దాఁ బశువు సూ వేదాత్మ నారాయణా!

టీకా:

రసన + అగ్రంబున = నాలుక కొనపై; నసలు + ఆరంగ = దురద తీరే విధంగా; అభిరతియున్ = అసక్తి కూడ; యుగ్మంబులన్ = జంటలను; అధ్యాత్మకున్ = మనస్సుకు; వెస = వెంటనే.

భావము:

వేదాలే ఆత్మగా కలిగిన నారాయణా! నాలుకపై నీ నామ సంకీర్తన రుచి ఇంపు. చెవుల నస తీరే విధంగా నీ కథలను వినాలనే ఆసక్తి ఇంపు. పద్మాలవంటి రెండు చేతులతో నీ పాదాలను పూజించడం ఇంపు. మనస్సు జ్ఞానాన్ని పొందడం ఇంపు. ఇవి పొందని వాడు పశువుతో సమానం కదా!

1-59-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాళిందితరంగడోలికలలో వైకుంఠధామంబులో
వెవొప్పార నయోధ్యలో మధురలో వ్రేపల్లెలో ద్వారకా
పురిలో నాడెడు భంగి నాదుమదిలో భూరిప్రసన్నాననాం
బురుహం బొప్ప నటించుటొప్పును సితాంభోజాక్ష నారాయణా!

టీకా:

కాళింది = యమున; డోలికలలో = ఊయలలో; ధామంబులో = నిలయంలో; వెరవు + ఒప్పార = అనుకూలంగా; భూరి = గొప్ప; ప్రసన్న = మనోహరమైన; ఆనన = ముఖమనే; అంబురుహంబు = పద్మము; సిత + అంభోజ + అక్ష = తెల్లని పద్మములవంటి కన్నులు కలవాడా!

భావము:

తెల్ల తామరలవంటి కన్నులు కల నారాయణా! యమునా తరంగాలలో, వైకుంఠలోకంలో, అయోధ్యలో, మధురలో, వ్రేపల్లెలో, ద్వారకలో ఆడినట్లుగానే నా మనస్సులో మనోహరమైన ముఖపద్మంతో ఆడడం నీకు తగినది.

1-60-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ల్లల్వేఱొకయూర నమ్ముకొను నాసం బోవుచోఁ ద్రోవ నీ
వుల్లాసంబున నడ్డకట్టి మదనోద్యోగానులాపంబులన్
ల్లన్ జల్లనిచూపు జల్లుమని గోస్త్రీలపైఁ జల్లు మీ
ల్లంబోరు తెఱంగు జిత్తమున నే ర్చింతు నారాయణా!

టీకా:

ఉల్లాసంబునన్ = సంతోషంతో; అడ్డకట్టి = అడ్డుకొని; మదన + ఉద్యోగ + అనులాపంబులన్ = కామాన్ని ప్రేరేపించే మాటలను; చల్లన్ + పోరు తెరంగు =  చల్లని యుద్ధం (ప్రణయ కలహం) తీరును; చర్చింతు = ధ్యానిస్తాను.

భావము:

నారాయణా! గోపికలు పొరుగూరిలో చల్లలమ్ముకొనే కోరికతో పోతుండగా నీవు దారిలో అడ్డగించి, కామాన్ని ప్రేరేపించే మాటలతో, చల్లని చూపులను వారిపై చల్లుతూ ప్రణయ కలహాన్ని నిర్వహించిన పద్ధతిని నా మనస్సులో ధ్యానిస్తాను.

1-61-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యన్వేదములున్ బురాణములు బ్రఖ్యాతంబుగా తెల్పి మీ
నన్ భక్తివిహీనుఁడైనపిదపన్ వ్యర్థప్రయత్నంబె పో
గుకాంతామణి గొడ్డువోయినగతిం గ్రొవ్వారు సస్యంబు దా
కాలంబున నీచపోవు పగిదిన్ ద్మాక్ష నారాయణా!

టీకా:

కలయన్ = కలసి కట్టుగా; క్రొవ్వారు = అతిశయించు; ఈచపోవు = శుష్కించు.

భావము:

కమల నయనా! నారాయణా! కలిసి కట్టుగా వేదాలను, పురాణలను గొప్పగా చెప్పికూడా నీ పట్ల భక్తి లేనివాడైతే కులస్త్రీ గొడ్రాలైనట్లు, ఏపుగా పెరిగిన పైరు ఎండిపోయినట్లు అతని వేద పురాణ జ్ఞానం వ్యర్థమే కదా!

1-62-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్నానంబుల్ నదులందుఁ జేయుట గజస్నానంబు చందంబగున్
మౌనంబొప్ప జపించు వేద మటవీ ధ్యంబులో నేడ్పగున్
నానాహోమములెల్ల బూడిదలలోనన్ వేల్చు నెయ్యై చనున్
నీ నామోక్తియు నీపదాబ్జరతియున్ లేకున్న నారాయణా!

టీకా:

గజస్నానంబు = ఏనుగు నదిలో స్నానం చేసి ఒడ్డుకు చేరగానే తొండంతో దుమ్ము ధూళిని తనపై చల్లుకుంటుంది. దీనినే గజస్నాన న్యాయం అంటారు. ఏదైనా వ్యర్థప్రయత్నాన్ని గురించి చెప్పినప్పుడు ఈ న్యాయాన్ని పేర్కొంటారు.

భావము:

నారాయణా! నీ నామస్మరణ, నీ పాదపద్మాలపై ఆసక్తి లేనప్పుడు నదులలో చేసే స్నానం గజస్నానం అవుతుంది. మౌనంగా జపించే వేదమంత్రాలు నట్టడవిలో ఏడ్పు అవుతుంది. రకరకాలైన హోమాలన్నీ బూడిదలో వేల్చిన నెయ్యి అవుతుంది. అనగా నీ నామ స్మరణ, నీ పాద భక్తి లేకుండా చేసే స్నాన జప హోమాలు నిష్ప్రయోజనాలు అని భావం:

1-63-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీటం దగు రొంపిపైఁ జిలికినన్నానీట నేపాయు నా
యిపాపంబులు దుర్భరత్వము మహాహేయంబునం బొందినం
లువై జీవుని దొప్పదోఁగినవి యీ బాహ్యంబునం బాయునే
పొలియుంగాక భవత్సుపాదజలముం బ్రోక్షింప నారాయణా!

టీకా:

రొంపి = బురద; హేయంబునన్ = రోతగా; బలువై = బలిసి, ఎక్కువై; దొప్పఁదోగినవి = ముంచినవి; పొలియున్ = నశిస్తాయి; ప్రోక్షింప = చల్లినచో.

భావము:

నారాయణా! నీటిలోని బురద మీద పడినప్పుడు ఆ బురదనీటితోనే కడిగితే పోతుందా? దుర్భరంగా బలిసి, శరీరం లోపల ఉన్న జీవుణ్ణి చెడగొట్టే మహాపాతకాలు నీ పాదతీర్థాన్ని చల్లితేనే నశిస్తాయి.

1-64-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చిత్తాబ్జము మీపదాబ్జములకుం దాత్పర్య సద్భక్తితం
తు బంధించిన బంధనంబు కతనం దుష్పాపపుంజంబు లె
ల్లను విచ్చిన్నములై యడంగు మహిమోల్లాసాబ్ధియైనట్టి దా
సు కింపొందును మోక్షవైభవము దా సుశ్లోక నారాయణా!

టీకా:

చిత్త + అబ్జము = మనస్సనే పద్మము; తంతున = దారంతో; పుంజంబులు = రాశులు;  విచ్ఛిన్నములు+ఐ = తెగిపోయి; అడంగు = నశిస్తాయి; సుశ్లోక = గొప్ప కీర్తి కలవాడా!

భావము:

గొప్ప కీర్తి కలిగిన నారాయణా! తన మనస్సనే పద్మాన్ని నీ పాద పద్మాలతో భక్తి అనే దారంతో వేసిన ముడి వల్ల దాసుని పాపరాశులన్నీ తెగిపోయి నశిస్తాయి. ఆ మహిమ చేత ఆనంద సాగరంగా మారిన అతనికి మోక్ష వైభవం లభిస్తుంది.

1-65-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నువుం జీవుఁడు నేకమైన పిదపన్ ర్మక్రియారంభుఁడై
యంబున్మది దన్నెఱుంగక తుదిన్నామాయచే మగ్నుఁడై
నుతత్వాది వియోగమైనపిదపం దానేర్చునే నీదు ద
ర్శ మింపారఁగ భక్తివైభవ మహాసంకాశ నారాయణా!

టీకా:

తనువు = శరీరం; అనయంబున్ = ఎల్లప్పుడు; మగ్నుఁడై = మునిగినవాడై; మహా + అసంకాశ = సాటి లేని గొప్పవాడా!

భావము:

భక్తి అనే సంపదలో సాటిలేని గొప్పవాడవైన నారాయణా! శరీరం, ఆత్మ ఒక్కటైన తర్వాత ధర్మాచరణకు పూనుకొని ఎల్లప్పుడు తనను తాను తెలుసుకొనలేక చివరికి ఆ మాయలో మునిగిన జీవుడు దేహేంద్రియాలను విడిచిన తర్వాత నీ దర్శనం చేసుకోగలడా?

1-66-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కున్ సాత్త్వికసంపదన్విత మహాదాసోహ భావంబునన్
యంబున్మది నన్యదైవభజనం బారంగ దూలింపుచున్
నితాహ్లాదముతోడ నీ చరణముల్ ద్భక్తి పూజించి నిన్
నుగొన్నంతనె కల్మషంబు లడఁగుం ర్మఘ్న నారాయణా!

టీకా:

సాత్త్విక = సత్త్వ గుణాలకు చెందిన; సంపత్ + అన్విత = సంపదలతో కూడిన; దాసోహభావంబునన్ = దాసుడననే భావంతో; ఆరంగ = పూర్తిగా; తూలింపుచున్ = తొలగిస్తూ; అడఁగున్ = నశిస్తాయి; కర్మఘ్న = కర్మలను నశింపజేసేవాడా!

భావము:

కర్మలను నాశనం చేసే నారాయణా! సత్త్వగుణ సంపన్నమైన దాసోహమనే భావంతో సర్వదా అన్యదేవతలను భజించడాన్ని పూర్తిగా మానుకొంటూ సంతోషంగా నీ పాదాలను సద్భక్తితో పూజించగానే జీవునికి పాపాలు నశిస్తాయి.

1-67-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రికింపన్ హరిభక్తి భేషజునకున్ వ్యంబుగా మీఁద మీ
ణాంభోరుహ దర్శనంబు గలదే సంప్రీతి నెట్లన్నఁ దా
లోఁ జోరుఁడు గన్న దుస్తర పరద్రవ్యంబుపై నాశలం
బొయన్నేర్చునె దుర్లభంబగు గృపాంభోజాక్ష నారాయణా!

టీకా:

పరికింపన్ = ఆలోచించగా; భేషజునకున్ = డంబాచారము గలిగినవానికి; దుస్తర = దాటలేని; పొరయన్ = పొందగా.

భావము:

దయతో కూడిన కమలాల వంటి కన్నులు కల నారాయణా! ఆలోచిస్తే హరిభక్తి అనే డంబాచారం కలిగినవానికి భవిష్యత్తులో నీ పాదపద్మాలను తృప్తిగా దర్శించే భాగ్యం ఉంటుందా? ఎలాగంటే పరుల సంపదలను చూసినంత మాత్రాన దొంగకు అవి లభిస్తాయా? ఎన్నడూ లభింపవు.

1-68-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మజ్ఞాన వివేక పూరిత మహావ్యాంతరాళంబునన్
గన్నీ నిజనామమంత్ర మొనరన్ క్తిన్ననుష్ఠింపుచుం
దురితాన్వేషణ కాలభూతము వెసన్ దూలంగ వాకట్టు వాఁ
రుగున్ భవ్యపదంబు నొందుటకునై వ్యక్త నారాయణా!

టీకా:

భవ్య = యోగ్యమైన; అంతరాళంబునన్ = నడిమి ప్రదేశంలో (మనస్సులో); పరగన్ = ఉండేవిధంగా; ఒనరన్ = ఒప్పుగా; అనుష్ఠింపుచున్ = ఆచరిస్తూ; దురిత + అన్వేషణ = పాపాలను వెదకే; కాలభూతము = మృత్యువు; వెసన్ = వేగంగా; తూలంగ = తొలగగా; వాకట్టువాఁడు = వాగ్బంధనం చేసేవాడు; అవ్యక్త = కనిపించనివాడా!

భావము:

అవ్యక్తుడవైన నారాయణా! గొప్ప జ్ఞానము, వివేకం కలిగిన మనస్సులో నీ నామమంత్రాన్ని భక్తితో జపిస్తూ పాపాలను వెదకే మృత్యువును తొలగిపోయే విధంగా వాగ్బంధనం చేసేవాడు పరమపదాన్ని పొందుతాడు.

1-69-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి ఘోరాంధక బోధకారణ విపత్సంసార మాలిన్యమున్
మానంద సుబోధకారణ లసద్భస్మంబు పై నూఁది యా
నితజ్ఞానసుకాంతి దర్పణమునన్ నిస్సంగుఁడై తన్నుదా
యం గాంచిన వాఁడు నిన్నుఁ గనువాఁబ్జాక్ష నారాయణా!

టీకా:

అంధక బోధ = చీకటి వంటి జ్ఞానం (అజ్ఞానం); విపత్ సంసార = ఆపదలతో కూడిన సంసారం యొక్క; లసత్ = ప్రకాశించే; నిరత = మిక్కిలి ఆసక్తి కలిగిన; నిస్సంగుడై = బంధాలు లేనివాడై; అబ్జ+అక్ష = కమలనయనా!

భావము:

కమలనయనా! నారాయణా! అజ్ఞానం వల్ల కలిగే సంసార మాలిన్యాన్ని  పరమానందాన్ని కలిగించే జ్ఞానంతో తొలగించుకొని బంధాలు తెంచుకొన్నవాడు అత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. మలినమైన అద్దంమీద బూడిదను చల్లి తుడిచినవాడు తనను స్పష్టంగా చూసుకోగలడు. కర్మసంగ రహితుడైన జ్ఞాని ఆత్మ సాక్షాత్కారాన్ని, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు.

1-70-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుషాలాపములాడ నోడి మది నీపాపార్జనారంభుఁడై
నిసించేరికిఁ గీడుసేయక మదిన్ నిర్ముక్త కర్ముండునై
మానంద నిషేధముల్ సమముగా భావించి వీక్షించునా
మజ్ఞాని భవత్కృపం బొరయ నో ద్మాక్ష నారాయణా!

టీకా:

పరుష + ఆలాపములు = నిష్ఠురాలైన మాటలను; ఆడన్ = పలుకగా; ఓడి = విఫలమై; ఈ పాప + ఆర్జన + ఆరంభుఁడు + ఐ = పాపాలను సంపాదించే ఈ పనులను ప్రారంభించేవాడై; నిరసించి = తిరస్కరించి; ఏరికిన్ = ఎవరికి కూడా; నిర్ముక్త కర్ముండున్ + ఐ = ఫలాపేక్ష లేని కర్మల నాచరించేవాడై; నిషేధముల్ = ఆటంకాలు; పొరయున్ = పొందుతాడు.

భావము:

ఓ కమలాక్షా! నారాయణా! నిష్ఠురంగా మాట్లాడకుండా, పాపకర్మలను చేయడాన్ని మానుకొని, ఎవరికీ కీడు చేయకుండా, కర్మలను వదలిపెట్టి, పరమానందాన్ని పొందడంలో కలిగే ఆటంకాలను సమానంగా చూచే గొప్ప జ్ఞాని మాత్రమే నీ దయను పొందుతాడు.

1-71-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రులం దన్ను నెఱుంగు నియ్యెఱుకయున్నొప్పార నేకాంతమం
యం బైపడు నన్యభామినులపై నాకాంక్షదూరత్వమున్
ణావస్ఠను నీదునామములె సన్మానంబునం దోఁచుటల్
లోనన్నివి దుర్లభంబులు సుధాధామాక్ష నారాయణా!

టీకా:

ఒరులన్ = పరులను; ఎఱుక = జ్ఞానం; ఒప్పారన్ = చక్కగా ఉండగా; పైపడు = మీద పడే; ఆకాంక్ష దూరత్వము = కోరిక లేకపోవడం; సన్మానంబునన్ = గౌరవంగా; తోచుటల్ = జ్ఞాపకం రావడం మొదలైనవి; సుధాధామ + అక్ష = చంద్రునివంటి చల్లని చూపులు కలవాడా!

భావము:

చంద్రునివంటి చల్లని చూపులు కల నారాయణా! స్వపర భేదాన్ని తెలుసుకొనే జ్ఞానం, ఏకాంతంలో తనను వాంఛించిన స్త్రీలపై అనాసక్తి, అవసానకాలంలో మనస్సులో నీ నామస్మరణ చేయడం లోకంలో దుర్లభాలు.

1-72-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెవొప్పన్ బహుశాస్త్రమంత్రము లొగిన్ వీక్షించి వేతెల్పి మీ
నామామృతపూర మానుచుఁ దగన్ వైరాగ్యభావంబునన్
రి నశ్రాంతముఁ గోరువారు పిదపన్ సంసారమాతుఃపయో
దుగ్ధంబులు గ్రోలనేరరు వెసన్ దైత్యారి నారాయణా!

టీకా:

వెరవు + ఒప్పన్ = ఉపాయంగా; ఒగిన్ = క్రమంగా; వే తెల్పి = వేగంగా చెప్పి; అమృత పూరము = నిండుగా ఉన్న అమృతాన్ని; ఆనుచు = త్రాగుతూ; అశ్రాంతము = ఎల్లప్పుడు; మాతుః = తల్లియొక్క; పయోధర దుగ్ధంబులు = చనుబాలను; గ్రోల నేరరు = త్రాగలేరు.

భావము:

రాక్షసవైరివైన నారాయణా! పెక్కు శాస్త్రాలను, మంత్రాలను చదివి, వివరించి, నీ నామామృతాన్ని పానం చేస్తూ, ఎల్లప్పుడూ వైరాగ్యభావాన్ని కోరేవారు ఆ తరువాత సంసారమనే తల్లిపాలను త్రాగరు. అంటే వారికి పునర్జన్మ ఉండదు.

1-73-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేదంబందు సునిశ్చయుండగు మహా వేల్పెవ్వఁడో యంచు నా
వేవ్యాసపరాశరుల్ వెదకినన్ వేఱొండు లేఁడంచు మీ
పాదాంభోజము లెల్ల ప్రొద్దు మదిలో భావింతు రత్యున్నతిన్
శ్రీదేవీ వదనారవింద మధుపా శ్రీరంగ నారాయణా!

టీకా:

సునిశ్చయుండు = ప్రతిపాదింపబడినవాడు; మధుపా = తుమ్మెదా!

భావము:

లక్ష్మీదేవి ముఖమనే పద్మానికి తుమ్మెద వైన శ్రీరంగనాయకా! నారాయణా! వేదవ్యాసుడు, పరాశరుడు మొదలైనవారు వేదాలు ప్రతిపాదించిన మహాదేవుడు ఎవరా అని వెదకి నీవు తప్ప మరొకడు లేడంటూ నీ పాదపద్మాలనే తమ మనస్సులలో గొప్పగా ధ్యానిస్తుంటారు.

1-74-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుదారాప్తజనాది విత్తములపై శూన్యాభిలాషుండునై
నోద్రేకయుతంబులై పొదలునయ్యై యింద్రియవ్రాతముల్
మృతిఁ బొందించి దమంబునన్ శమమునన్ మీఱంగ వర్తించు ని
ర్గసంసారి భవత్కృపం బొరయు నో కంజాక్ష నారాయణా!

టీకా:

దార = భార్య; శూన్య+అభిలాషుండు = కోరికలు లేనివాడు; యతన = ప్రయత్నం యొక్క; ఉద్రేక = అతిశయంతో; యుతంబులై = కూడినవై; పొదలు = వృద్ధిపొందే; వ్రాతముల్ = సమూహాలు; దమంబునన్ = నిగ్రహంతో; శమమునన్ = శాంతితో; నిర్గత సంసారి = సంసారబంధాలనుండి బయటపడినవాడు; పొరయున్ = పొందుతాడు.

భావము:

కమలనయనా! నారాయణా! సంతానం, భార్య, మిత్రులు, ధనం పట్ల కోరికలు లేనివాడై, కోరికలు తీర్చుకొనడానికి ఎంతగానో ప్రయత్నించే ఇంద్రియాలను అణచివేసి, నిగ్రహంతో శాంతంతో ప్రవర్తిస్తూ సంసార బంధాలను వదలించుకొన్నవాడే నీ దయను పొందుతాడు.

1-75-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రదం బారగఁ పుణ్యకాలగతులన్ క్తిన్ననుష్ఠింపుచున్
రన్నన్న సువర్ణగోసలిల కన్యాధారుణిగ్రామదా
ము లామ్నాయవిధోక్తి భూసురులకున్ న్మార్గుఁడై యిచ్చువాఁ
రేంద్రార్చిత వైభవోన్నతుఁడగున్నామీఁద నారాయణా!

టీకా:

ప్రమదంబు + ఆరగ = ఆనందంతో; పుణ్యకాలగతులన్ = పర్వదినాలలో; అనుష్ఠింపుచున్ = ఆచరిస్తూ; ఆమ్నాయ విధ + ఉక్తి = వేదాలలో చెప్పిన విధంగా.

భావము:

నారాయణా! పర్వదినాలలో అన్నాన్ని, బంగారాన్ని, ఆవులను, నీళ్ళను, కన్యలను, భూములను, గ్రామాలను ఆనందంతో వేదోక్తంగా బ్రాహ్మణులకు దానమిచ్చేవాడు ఆ తరువాత దేవతలు, ఇంద్రుడు మెచ్చుకొనే  గొప్ప వైభవాన్ని పొందుతాడు.

1-76-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

 నెవ్వారి మనంబులో నెఱుకదా నెంతెంత గల్గుండు నా
కొదిం జెంది వెలుంగుచుందు కలయన్ గోవింద నీరూపులన్
రన్నంబు మితంబులై సరసిలో నంభోరుహంబుల్ దగన్
నినొప్పారెడు చంద మొందె దెపుడు న్నీలాంగ నారాయణా!

టీకా:

ఎఱుక = జ్ఞానం; అంబు మితంబులు = నీటికొలదికి పరిమితాలై; అంభోరుహంబుల్ = తామరలు; నీల + అంగ = నల్లని శరీరం కలవాడా!

భావము:

నల్లని శరీరం కలిగిన గోవిందా! నారాయణా! సరస్సులో నీటి కొద్ది తామర లున్నట్లు ఈ లోకంలో ఎవరి మనస్సులో ఎంత జ్ఞానం ఉంటుందో అంత వరకే నీ రూపాలు వెలుగుతూ ఉంటాయి.

1-77-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిలో నుత్తమభక్తి పీఠముపయిన్ మానాథ మీపాదముల్
దియం జేర్చినవానికేనొడయఁడన్ గాదంచు సత్యున్నతిన్
దిలుండై సమవర్తి మృత్యువునకున్ బాఠంబుగాఁ బల్కు మీ
పద్మార్చకు లెంతపుణ్యులొ కృపాపారీణ నారాయణా!

టీకా:

మానాథ = లక్ష్మికి భర్తవైనవాడా; కదియన్ = చేరువగా; ఒడయండన్ = ప్రభువును; సమవర్తి = యముడు; కృపాపారీణ = దయాగుణంలో తుద ముట్టినవాడా!

భావము:

లక్ష్మీపతీ! దయాపూర్ణా! నారాయణా! తన మనస్సులో భక్తి అనే పీఠంపై మీ పాదాలను ప్రతిష్ఠించి కొలిచేవానికి తాను ప్రభువును కాదని యముడు మృత్యుదేవతకు బోధించాడంటే నీ పాదపూజ చేసేవారు ఎంత పుణ్యాత్ములో కదా!

1-78-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుమెన్నం గొలదేల యేకులజుఁడుం గోత్రాభి మానాభిలా
లు నజ్ఞానము బాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముఁడై
రారం బరుసంబు సోఁకు నినుమున్ హేమాకృతస్తోమమై
వెయున్నాగతి వాఁడు ముక్తి కరుగున్ వేదాత్మ నారాయణా!

టీకా:

కొల = పాపం; గోత్ర = వంశాన్ని; అభిమాన = ఇష్టపడే; అభిలాషులు = కోరిక కలవారు;  పరుసంబు = స్పర్శవేధి; సోఁకున్ = తాకినట్టి; హేమ + ఆకృత స్తోమము + ఐ = మొత్తం బంగారు రూపమై.

భావము:

వేదాత్ముడైన నారాయణా! కులాన్ని లెక్కించే పాపం ఎందుకు? ఎవడైతే కులగోత్రాలను పరిగణించే అజ్ఞానాన్ని వదలి సుజ్ఞానంతో శుద్ధాత్ముడై ప్రకాశిస్తాడో అతడు స్పర్శవేధిని తాకిన ఇనుము బంగారమైనట్లు ముక్తిని పొందుతాడు.

1-79-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నితానందనియోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై
రుణాహీనమనస్కులై మలినులై ష్టాత్ములై నష్టులై
రుషవ్యాధినిబద్ధులై పతితులై గ్నాంగులై మ్రగ్గువా
యన్నిన్నొగి నాత్మయుం దిడనివా బ్జాక్ష నారాయణా!

టీకా:

నిరత = ఎల్లప్పుడు; నియోగులై = నిమగ్నులై; నియతులై = నియమం కలవారై; పరుష = కఠినమైన; వ్యాధి నిబద్ధులై = రోగగ్రస్తులై; భగ్న + అంగులై = అవిటివారై; మ్రగ్గువారు = బాధపడేవారు.

భావము:

కమలనయనా! నారాయణా! సదానంద భరితులై నియమబద్ధులై నిన్ను తమ మనస్సులో నిలుపుకొననివారు దురదృష్టవంతులై, నీచులై, దయలేనివారై, పాపులై, కష్టపడేవారై, అన్నీ పోగొట్టుకొన్నవారై, తీవ్రరోగపీడితులై, పతితులై, అవిటివారై బాధపడతారు.

1-80-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భోగాస్పదులై గతౌఘమతులై కారుణ్యులై ముక్తులై
కీర్తిప్రదులై దయాభిరతులై ర్మాత్ములై నిత్యులై
నుజాధీశ్వరులై మనోజనిభులై మాన్యస్థులై స్వస్థులై
యొరన్నొప్పెడువారు నీపదరుచి న్నూహించు నారాయణా!

టీకా:

ఘన = గొప్పనైన; భోగ = సుఖాలకు; ఆస్పదులై = స్థానభూతులై; గత = పోగొట్టుకొన్న; ఓఘ = పాపాలు కలిగిన; దయా + అభిరతులై = దయాసక్తులై; మనుజ + అధీశ్వరులై = రాజులై; మనోజ = మన్మథునితో; నిభులై = సమానులై; మాన్యస్థులై = మర్యాద గలవారై; స్వస్థులై = ఆరోగ్యవంతులై.

భావము:

నారాయణా! నీ పాదకాంతులను మనస్సులో భావించేవారు గొప్పగా సుఖపడేవారై, పాపాలను పోగొట్టుకొన్నవారై, దయాత్ములై, ముక్తులై, ధనాన్నీ కీర్తినీ పంచేవారై, కరుణాసక్తులై, దర్మాత్ములై, శాశ్వతులై, రాజులై, మన్మథునితో సమానులై, గౌరవనీయులై, ఆరోగ్యం కలవారై, యోగ్యులై జీవిస్తారు.

1-81-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విదితామ్నాయ నికాయభూతములలో విజ్ఞానసంపత్కళా
స్పయోగీంద్ర మనస్సరోజములలో బ్రహ్మేంద్రదిక్పాలక
త్రిశవ్రాతకిరీటరత్నములలో దీపించుచున్నట్టి మీ
పద్మంబులు భావగేహమున నే భావింతు నారాయణా!

టీకా:

విదిత = తెలిసిన; ఆమ్నాయ = వేదాలు; నికాయ = నిలయంగా కల; భూతములలో = ప్రాణులలో; ఆస్పద = నెలవైన; మనః + సరోజములలో = మనస్సులనే పద్మాలలో; త్రిదశ = దేవతల యొక్క; వ్రాత = సమూహం యొక్క; దీపించుచున్నట్టి = ప్రకాశిస్తున్న; భావ గేహమున = మనస్సనే మందిరంలో.

భావము:

నారాయణా! వేదాలకు నిలయాలైన ప్రాణులలో, జ్ఞానసంపద అనే కళలకు నిలయాలైన యోగీంద్రుల మనోపద్మాలలో, బ్రహ్మ ఇంద్రుడు దిక్పాలకులు మొదలైన దేవతల కిరీట రత్నాలలో ప్రకాశించే నీ పాదపద్మాలను నా మనోమందిరంలో భావిస్తాను.

1-82-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెయన్ యౌవనకాలమందు మరుఁడున్ వృద్ధప్యకాలంబునన్
లురోగంబులు నంత్యమందు యముఁడుం బాధింప నట్లైన యీ
లుజన్మంబులు చాల దూలితి ననుం బాలింపవే దేవ మీ
లితానంద దయావలోకనము నాపైఁ జూపు నారాయణా!

టీకా:

వెలయన్ = ప్రకాశింపగా; మరుఁడు = మన్మథుడు; అంత్యము = మరణం; తూలితి = అనుభవించాను; అవలోకనము = దృష్టి.

భావము:

నారాయణా! యౌవనంలో మన్మథుడు, వృద్ధాప్యంలో ఎన్నో రోగాలు, మరణకాలంలో యముడు బాధిస్తుండగా ఇటువంటి ఎన్నో జన్మలెత్తి అనుభవించాను. నన్ను పాలించు. బ్రహ్మానందాన్ని కలిగించే నీ కరుణాదృష్టిని నాపై ప్రసరించు.

1-83-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుకర్మాయత పాశబంధవితతిన్ బాహాపరిశ్రేణికిన్
యంత్రాన్వితబంధయాతనగతిన్ సంసారకూపంబులో
రం ద్రిమ్మరుచుండు నన్ను నకటా! యార్తుండనై వేఁడెదన్
వెయన్నీకృపచేతఁ జేకొనవె నన్ వేవేగ నారాయణా!

టీకా:

బలు = మిక్కిలి; ఆయత = పొడవైన; పాశబంధ = త్రాళ్ళతో కట్టిన ముడుల; వితతిన్ = సమూహాన్ని; బాహా = బాహువులనెడి; పరిశ్రేణికిన్ = బొక్కెనకు; జలయంత్ర = నీటిమరతో; అన్విత = కూడిన; బంధ యాతన = బంధనాల బాధ; గతిన్ = వలె; ఆర్తుండనై = బాధపడుతున్నవాడనై; చేకొనవె = ఆదరించవా.

భావము:

నారాయణా! త్రాటితో బొక్కెనలను వరుసగా కట్టి వాటిని జలయంత్రంతో అమర్చగా అవి తిరుగుతున్నట్లు అనేక కర్మపాశాలతో కట్టబడి సంసారమనే బావిలో తిరుగుతున్న నేను నిన్ను ఆర్తితో వేడుకుంటున్నాను. నన్ను దయతో ఆదరించు.

1-84-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హంకారవికారసన్నిభ మహాత్తాది లోభాంధకా
ముచే ముక్తికి నేఁగుమార్గ మెఱుగన్ రాదింక నాలోన నీ
విలాపాంగదయాదివాకరరుచిన్ వెల్గింపు మింపార నో
లానంద విహారవక్షలలితా! కంజాక్ష నారాయణా!

టీకా:

మమ = మమకార మనెడి; హంకార = అహంకార మనెడి; వికార = తెగులుతో; సన్నిభ = సమానమైన; మహా మత్త + ఆది = గొప్ప మదం మొదలైన; లోభ = కోరికలనెడి; విమల = పరిశుద్ధమైన; అపాంగ = కడకంటిలోని; దయా దివాకర రుచిన్ = దయ అనే సూర్యకాంతిని; ఇంపారన్ = సంతోషించగా; కమలా = లక్ష్మీదేవి; ఆనంద = సంతోషంగా; విహార = విహరించే; వక్ష = వక్షఃస్థలం చేత; లలతా = అందమైనవాడా!; కంజ + అక్ష = పద్మములవంటి కన్నులు కలవాడా!

భావము:

లక్ష్మీదేవి ఆనందంతో విహరించే వక్షఃస్థలంతో శోభించేవాడా! కమలనయనా! నారాయణా! మమకారం, అహంకారాలు అనబడే వికారాలతో సమానమైన మద మాత్సర్యాలనే అంధకారం చేత ముక్తిని చేరే మార్గం తెలియరాదు. నీ కటాక్షం నుండి దయ అనే సూర్యకాంతిని నాలో ప్రకాశింప చేయవలసింది.

1-85-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిపంథిక్రియ నొత్తి వెంటఁబడు నప్పాపంబుఁ దూలించి మీ
ణాబ్జస్థితిపంజరంబు శరణేచ్చం జొచ్చితిం గావుమీ
బిరుదుం జూడుము మీరు సూడఁగ భవధ్భృత్యుండు దుఃఖంబులం
బొయన్ మీకపకీర్తిగాదె శరదాంభోజాక్ష నారాయణా!

టీకా:

పరిపంథి క్రియన్ = శత్రువులాగా; ఒత్తి = నెట్టి; తూలించి = తొలగించి; చరణ + అబ్జ = పాద పద్మాలనే; స్థితి = స్థిరమైన; శరణ + ఇచ్ఛన్ = రక్షణ పొందాలనే కోరికతో; బిరుదున్ = శరణాగతులను రక్షిస్తావనే నీ పేరును; పొరయన్ = పొందడం; శరత్ + అంభోజ + అక్ష = శరత్కాలమందలి కమలాల వంటి కన్నులు కలవాడా!

భావము:

శరత్కాలంలోని తామరల వంటి కన్నులు కలిగిన నారాయణా! శత్రువులాగా వెంటబడే పాపాన్ని తొలగించి నీ పాదపద్మాలనబడే స్థిరమైన పంజరాన్ని ఆశ్రయించిన నన్ను కాపాడు. శరణాగత రక్షకుడవన్న నీ పేరును గుర్తుకు తెచ్చుకో. నీ సేవకుడు దుఃఖాన్ని పొందడం నీకు అపకీర్తి కాదా?

1-86-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాచారము సూనృతంబు కృపయున్ త్యంబునున్ శీలమున్
తి శాంతత్వము చిత్తశుద్ధి కరమున్ ధ్యాత్మయున్ ధ్యానమున్
దృతియున్ ధర్మము సర్వజీవహితముం దూరంబుగాకుండ స
మ్మతికిం జేరువ మీ నివాససుఖమున్ మానాథ నారాయణా!

టీకా:

సతత = నిత్యమైన; సూనృతంబు = సత్యవాక్కు; నతి = నమ్రత; చిత్త శుద్ధి కరమున్ = మనస్సును నిర్మలంగా ఉంచుకొనడం; అధ్యాత్మ = ఆత్మజ్ఞానం; ధృతి = ధైర్యం; సమ్మతికిన్ = ప్రజ్ఞావంతునికి; మానాథ = లక్ష్మీపతీ!

భావము:

లక్ష్మీపతివైన నారాయణా! ఎల్లప్పుడు సదాచారాన్ని పాటించడం, సత్యాన్ని పలుకడం, దయ కలిగి ఉండడం, యథార్థాన్ని గ్రహించడం, చక్కని నడవడి, నమ్రత, శాంతం, చిత్తశుద్ధినిచ్చే ఆత్మజ్ఞానం, ధ్యానం, ధైర్యం, ధర్మాచరణం, సర్వ జీవులకు మేలు చేయడం మొదలైన వాటిని వదలకుండా ఉండే ప్రజ్ఞావంతునికి నీ సన్నిధి అతి సమీపంలో ఉంటుంది.

1-87-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాశిన్ గయ తుంగభద్ర యమునన్ భాగీరథిం గృష్ణ వే
త్రతిన్ నర్మద పెన్న గౌతమి పయోరాశిన్ వియద్గంగయం
గాహంబున నైన పుణ్యములు బెంపారంగ నేఁ డిచ్చటన్
దంఘ్రీ స్మరణంబునం గలుగు నోద్మాక్ష నారాయణా!

టీకా:

భాగీరథి = గంగ; గౌతమి = గోదావరి; పయోరాశి = సముద్రం; వియత్ + గంగ = ఆకాశగంగ; అవగాహంబున = స్నానంతో; పెంపు + ఆరంగ = వృద్ధి పొందగా; భవత్ + అంఘ్రి = నీ పాదాల.

భావము:

భవనాశి, గయ, తుంగభద్ర, యమున, గంగ, కృష్ణవేణి, వేత్రవతి, నర్మద, పెన్న, గోదావరి, సముద్రం మొదలైన వాటిలో స్నానం చేస్తే వచ్చే పుణ్యాలు నే డిక్కడ నీ పాదాలను స్మరించినంత మాత్రాన లభిస్తాయి కదా!

1-88-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

 గ్రామాధిపు నింటిదాసుఁడు వెసం దా ద్రోహముం జేసినన్
గం జెల్లుట సూచి తీ భువన సంపాద్యుండ వైనట్టి మీ
దాసావళి దాసదాసినని దుర్వారౌఘముల్ జేసితిన్
రుణం జేకొని కావుమయ్య త్రిజగత్కల్యాణ నారాయణా!

టీకా:

గ్రామ + అధిపు = గ్రామాధికారి యొక్క; వెసన్ = త్వరగా; పరగన్ = ప్రసిద్ధంగా; చెల్లుట = చెల్లుబాటు కావడం; భువన = లోకాలను; సంపాద్యుండవు = కల్పించినవాడవు; దాస + ఆవళి = దాసుల సమూహం యొక్క; దుర్వార = అడ్డులేని; అఘముల్ = పాపాలను.

భావము:

ముల్లోకాలకు మేలు కూర్చే నారాయణా! లోకంలో గ్రామాధికారి ఇంటి సేవకుడు ద్రోహం చేసినా చెల్లుబాటు కావడం చూచినాను. లోకాలను సృష్టించిన నీ దాసుల సమూహానికి దాసుడైనవాని దాసుడ ననుకొంటూ అడ్డులేకుండా పాపాలు చేశాను. నన్ను దయతో కాపాడు.

1-89-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణుతింపన్ బహుధర్మశాస్త్ర నిగమౌఘం బెప్పుడున్ ని న్నకా
బంధుండని చెప్ప నత్తెఱఁగు దూరం బందకుండంగనే
బ్రతుల్ జేసెదఁ గొంతయైన గణుతింపం బాడి లేకుండినన్
మా నానుతి నీవు శ్రీపతివి నీకేలప్పు? నారాయణా!

టీకా:

గణుతింపన్ = పరిశీలించగా; నిగమ = వేదాల; ఓఘంబు = సమూహం; అకారణ బంధుండు + అని = కారణం లేని చుట్టానివి అని; ఆ + తెఱఁగు = ఆ పద్ధతిని; దూరంబు + అందకుండగనే = అంతు చూడకుండానే; పాడి = న్యాయం; నుతి = స్తోత్రం.

భావము:

నారాయణా! పెక్కు ధర్మశాస్త్రాలు, వేదాలు నిన్ను అకారణ బంధువని చెప్తాయి. నేను వాటి అంతు చూడకుండానే నీకు దండాలు పెడతాను. నీవు కొంచెమైనా నన్ను లెక్కలోనికి తీసికొనడం న్యాయం. లేకుంటే నా స్తోత్రం నీకు ఋణమనుకొంటే లక్ష్మీపతివైన నీకు అప్పెక్కడిది?

1-90-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై యీశ మీ
ణంబన్నఁ గృశానుభాను శతతేస్ఫూర్తియైనట్టి మీ
చక్రంబున నక్రకంఠము వెసన్ ఖండించి మించెం దయా
సద్భక్త భయానకప్రకర సత్ప్రాకట్య నారాయణా!

టీకా:

కరినాథుండు = గజేంద్రుడు; జలగ్రహ = మొసలిచే; గ్రహణ = పట్టుబడి; దుఃఖ + ఆక్రాంతుడై = దుఃఖపడినవాడై; కృశాను = అగ్నియొక్క; భాను శత = నూరు సూర్యుల యొక్క; స్ఫూర్తి = తేజస్సు కలినది; నక్ర = మొసలి యొక్క; వెసన్ = వేగంగా; దయాపర = దయామయా!; భయానక = భయాన్ని కలిగించే; ప్రకర = సమూహం కలిగినవారికి; సత్ ప్రాకట్య = చక్కగా ఉనికిని ప్రకటించేవాడా!

భావము:

దయామయా! భక్తులకు ఆపదలు కలిగినప్పుడు ఉనికి ప్రకటించే నారాయణా! గజేంద్రుడు మొసలికి పట్టుబడి దుఃఖించి “దేవా! నీవే శరణం” అనగానే అగ్నిలాగా, నూరు సూర్యులలాగా ప్రకాశిమ్చే నీ చేతి చక్రంతో ఆ మొసలి కంఠాన్ని ఖండించి రక్షించావు.

1-91-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భావంబున నిన్ దలంచె గజయూధేంద్రుండు ఆపన్నుఁడై
యేభావంబున ద్రౌపదయ్యెడ రమాధీశా యనె న్వాయసం
బేభావంబున నీశరణ్య మనెనో యీ నీకృపాదృష్టిచే
నాభావంబున నీతలంపుఁ గలుగ న్నాకిమ్ము నారాయణా!

టీకా:

గజయూథ + ఇంద్రుడు = ఏనుగుల సమూహానికి అధిపతి; ఆపన్నుడై = ఆపద పొందినవాడై; ఆ + ఎడ = అక్కడ (ఆ కౌరవసభలో); రమా + అధీశా = లక్ష్మీపతీ!; వాయసంబు = కాకి (కాకాసురుడు); శరణ్యము = రక్షించు; తలంపు = ఆలోచన.

భావము:

నారాయణా! ఏ భావంతో ఆపదలో ఉన్న గజేంద్రుడు నిన్ను తలచుకొన్నాడో, ఏ భావంతో ద్రౌపది కౌరవసభలో “శ్రీపతీ” అని పిలిచిందో, కాకాసురుడు ఏ భావంతో నిన్ను శరణు కోరాడో ఆ భావంతో నిన్ను తలచుకొనే బుద్ధిని దయతో నా కివ్వు.

1-92-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబునన్
నీగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరెన్ నీనామజప్యంబునన్
నీగ్రీవుఁడు మించి త్రుంచెఁ బురముల్ నీ ప్రాపు సేవించినన్
నీగ్రీవమఖాబ్జభాస్కర కృపానిత్యాత్మ నారాయణా!

టీకా:

నీలగ్రీవుడు = నల్లని కంఠం కలిగిన శివుడు; చేతి పున్క = చేతికంటిన కపాలాన్ని; ఆఖ్యన్ = పేరుతో; తనరెన్ = ప్రసిద్ధిని పొందాడు; ప్రాపు = ఆశ్రయంలో.

భావము:

శివుని ముఖపద్మానికి సూర్యుని వంటివాడా! శాశ్వతమైన దయాస్వరూపం కలిగిన నారాయణా! శివుడు తన చేతికి అంటుకొన్న బ్రహ్మ కపాలాన్ని నీ భార్య లక్ష్మి పెట్టిన భిక్షతో వదిలించుకున్నాడు. నీ నామాన్ని జపించి ఈశ్వరుడన్న పేరుని పొందగలిగాడు. నిన్ను ఆశ్రయించి సేవించడం వలన పరాక్రమిమ్చి త్రిపురాలను జయించాడు.

1-93-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిను వర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీనామమున్ వీనులన్
విని మోదింపనివాఁడు చెవ్డు మరి నిన్ వేడ్కన్ మనోవీధినిన్
ని పూజింపనివాఁడు నాశకరుఁడౌ ర్మక్రియారంభుఁడై
లోఁ గాననివాఁడు నీచమతివో త్వజ్ఞ నారాయణా!

టీకా:

మోదింపనివాఁడు = ఆనందింపనివాడు; చెవ్డు = చెవిటివాడు; మనోవీథినిన్ = హృదయంలో; నాశకరుఁడు = తనకు ఇతరులకు నాశనం కలిగించేవాడు; కర్మక్రియా + ఆరంభుడై = కర్మలకు చెందిన పనులను మొదలుపెట్టినవాడై; నీచమతి = నీచబుద్ధి కలవాడు; తత్త్వజ్ఞ = విశ్వ రహస్యం తెలిసినవాడా!

భావము:

విశ్వరహస్యం తెలిసిన నారాయణా! నిన్ను వర్ణింపని వాడు మూగవాడు. నీ పేరును విని సంతోషింపనివాడు చెవిటివాడు. నిన్ను మనస్సులో దర్శిస్తూ పూజింపనివాడు ఆత్మ పర నాశకుడు. కార్యాలను చేయ మొదలుపెట్టి తనలో నిన్ను చూడనివాడు నీచుడు.

1-94-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నినువర్ణింపని నీచబంధమతి దా నిర్మగ్నమూఢాత్ముఁడై
పెను దైవంబులఁ గోరి తా మనమునన్ సేవించు చందంబు తా (యతి - ?)
లం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్ పూని వే
ల్చిచందంబున వ్యర్ధమై తనరుఁ జూ చిద్రూప నారాయణా!

టీకా:

నీచబంధమతి = మందమతి; నిర్మగ్న మూఢ + ఆత్ముఁడై = అజ్ఞానంలో మునిగిన ఆత్మ కలవాడై; పెను = పెక్కు; అనలంబు = అగ్ని; భూతి = బూడిద; వెలయన్ = ప్రకాశించే విధంగా; ఆజ్య + ఆహుతుల్ = నేతి ధారలను; పూని = ప్రయత్నించి; వేల్చిన = హోమం చేసిన; చూ = చూడు; చిత్ + రూప = జ్ఞానమే రూపంగా కలవాడా!

భావము:

జ్ఞానరూపివైన నారాయణా! నిన్ను వర్ణించని మందమతి మూఢత్వంలో మునిగి ఇతర దేవతలను కోరి కోరి వ్యర్థంగా సేవిస్తాడు. ఇది ఎలా ఉందంటే... అగ్ని ఆరిపోయిన తర్వాత ఆ బూడిదలో నెయ్యి పోసి వెలిగించి హోమం చేస్తే అది వ్యర్థమే అవుతుంది కదా!

1-95-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిను వర్ణింపని జిహ్వ దాఁ బదటికా నీలాభ్రదేహాంగకా!
నిను నాలింపని చెవ్లు దాఁ బదటికా నీరేజపత్రేక్షణా!
నినుఁ బూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా!
నినుఁ జింతింపని యాత్మ దాఁ బదటికా నిర్వాణ నారాయణా!

టీకా:

పదటి కా (‘పదడు’ శబ్దం ఔపవిభక్తికమైన టి చేరి ‘పదటి’ అయింది. పదడు అంటే బూడిద.) = బూడిద కదా (వ్యర్థం కదా); నీల + అభ్ర = నల్లని మేఘం వంటి; దేహ + అంగకా = దేహావయవాలు కలవాడా!; ఆలింపని = వినని; నీరేజ పత్ర = తామర రేకుల వంటి; ఈక్షణా = కన్నులు కలవాడా!; కేలు = చేయి; నిర్వాహక క్ష్మాతలా = భూతలాన్ని నిర్వహించేవాడా!; నిర్వాణ = మోక్షము నిచ్చేవాడా!

భావము:

నీలమేఘ శరీరా! పద్మదళనేత్రా! భూతల నిర్వాహకా! మోక్షప్రదాతా! నారాయణా! నిన్ను వర్ణింపని నాలుక, నీ గురించి వినని చెవులు, నీ పూజ చేయని చేయి, నిన్ను స్మరింపని మనస్సు బూడిదలాగా వ్యర్థమైనవి.

1-96-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీవే తల్లివి నీవె తండ్రి వరయన్ నీవే జగన్నాధుఁడౌ
నీవే నిశ్చల బాంధవుండ వరయన్ నీవే మునిస్తుత్యుఁడౌ
నీవేశంకరమూలమంత్ర మరయన్ నీవే జగత్కర్తవున్
నీవేదిక్కను వారి వారలె కడున్ నీవారు నారాయణా!

టీకా:

అరయన్ = ఆలోచిస్తే; జగత్ + నాథుడౌ = జగాలకు ప్రభుడవు; నిశ్చల = స్థిరమైన; ముని స్తుత్యుడౌ = మునులచేత పొగడబడేవాడవు.

భావము:

నారాయణా! ఆలోచించి చూస్తే నీవే తల్లివి. నీవే తండ్రివి. నీవే లోకనాథుడవు. నీవే ఆత్మీయుడవైన చుట్టానివి. మునులచేత పొగడబడేవాడవు నీవే. నీవే శంకరుడు జపించే మూలమంత్రానివి. నీవే లోకాలను సృష్టించిన వాడవు. నీవే దిక్కని పలికేవారు, వారికి చెందినవారే నీవారు కదా!

1-97-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతమున్
విరీతంబుగఁ జేసినాఁడ నిఁక నీవే దిక్కు నాలోనికిన్
టం బింతయులేక దండధరుకుం ట్టీక రక్షింపు మీ
కృకుం బాత్రుఁడనయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా!

టీకా:

ఆజన్మ పర్యంతమున్ = పుట్టినప్పటి నుండి; దండధరుకున్ = యమునకు; కట్టి + ఈక = బంధించనీయక.

భావము:

ధర్మపురి క్షేత్రంలో వెలసిన లక్ష్మీనాథుడవైన నారాయణా! నీవు రక్షిస్తావని నిన్ను నమ్మి పుట్టినప్పటినుండి విపరీతంగా ఎన్నో తప్పులు చేశాను. నాకు ఇక నీవే దిక్కు. నాలో కపటత్వాన్ని పారద్రోలి, నన్ను యమునకు దొరకకుండా రక్షించు. నేను నీ దయకు తగినవాడనే కదా!

1-98-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెల్లంజేసితి పాతకంబులు మదిన్ శ్రీనాథ! మీనామముల్
పొల్లుల్ బోవని నమ్మి పద్యశతమున్ బూర్ణంబుగాఁ జెప్పితిన్
చెల్లంబో నను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ
ల్లిం దండ్రియు నీవుగాక యొరులో ర్కింప నారాయణా!

టీకా:

చెల్లన్ + చేసితి = చెల్లిపోయేటట్లు చేశాను; పాతకంబులు = పాపాలు; పొల్లుల్ + పోవు + అని = వ్యర్థం కావని; చెల్లన్ + పో = చెల్లనిమ్ము గాక; తర్కింప = విచారింపగా.

భావము:

శ్రీపతీ! నారాయణా! పాప ఫలాలను అనుభవించాను. నీ నామాలు వ్యర్థం కావని భావించి వంద పద్యాలను (శతకాన్ని) పూర్తిగా చెప్పాను. అది అలా ఉండనీ. వీడు నన్ను నమ్మాడు కదా అని భావించి దయతో నన్ను చేపట్టి రక్షించు. విచారిస్తే నాకు తల్లి దండ్రులు నీవు కాక వేరెవరున్నారు?

1-99-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సింహాచ్యుత వాసుదేవ విక సన్నాళీకపత్రాక్షభూ
గోవిందముకుందకేశవ జగత్త్రాతాహితల్పాంబుజో
దామోదరతార్క్ష్యవాహనమహాదైత్యారివైకుంఠమం
దిపీతాంబరభక్తవత్సల కృపన్ దీపింపు నారాయణా!

టీకా:

వికసత్ = వికసించిన; నాళీక పత్ర = తామర రేకుల వంటి; అక్ష = కన్నులు కలవాడా!; జగత్ + త్రాత = లోకరక్షకా!; అహి తల్ప = శేషశయనా!; అంబుజ + ఉదర = పద్మనాభా!; తార్క్ష్య వాహన = గరుడవాహనా!; దైత్య + అరి = రాక్షసవైరీ!

భావము:

నరసింహా! (సగం మానవరూపంలో, సగం సింహరూపంలో ప్రకటమై దుష్టశిక్షణ చేసినవాడు); అచ్యుతా! (తాను జారక, తన భక్తులను జారవిడువనివాడు); వాసుదేవా! (అంతటా వసించి, తనలో అన్నింటినీ వసింపజేసేవాడు); వికసించిన కమలాల వంటి కన్నులు కలవాడా! భూధరా! (భూమిని ధరించిన వరాహమూర్తి); గోవిందా! (స్తోత్రవాక్కులను పొందేవాడు); ముకుందా! (ముక్తినీ, భక్తినీ ఇచ్చేవాడు); కేశవా! (చంద్ర సూర్య కిరణాలే కేశాలుగా కలవాడు);  లోకరక్షకా! శేషతల్పా! పద్మనాభా! దామోదరా! (ఇంద్రియ నిగ్రహం కలవాడు); గరుడవాహనా! రాక్షసవైరీ! వైకుంఠనిలయా! పీతాంబరా! భక్తవత్సలా! నారాయణా! నన్ను దయతో దీవించు.

1-100-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంటం గడలేని సంపదలొగిం గావింపు లక్ష్మీశపా
ల్కలిన్ బన్నగశాయివై భువనముల్ ల్పించు సత్పుత్రినిన్
బొమన్ జేసిన నాభిపంకజ జగత్పుణ్యాత్మ భాగీరథీ
తింగన్న పదార విందముల నే భావింతు నారాయణా!

టీకా:

కడలేని = అంతులేని; ఒగిన్ = క్రమంగా; పొడమన్ + చేసిన = పుట్టించిన; నాభి పంకజ = బొడ్డు తామర కలవాడా!

భావము:

నారాయణా! లక్ష్మీపతివి కనుక నీ కటాక్షంతో అంతులేని సంపదలను కల్పించు. పాలసముద్రంపై శేషశాయివై లోకాలను సృష్టించే బ్రహ్మను పుట్టించిన బొడ్డు తామర కలవాడా! లోకపావని అయిన గంగను పుట్టించిన నీ పాదపద్మాలను నేను స్మరిస్తాను.

1-101-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముల్ మంత్రసమస్త యజ్ఞఫలముల్ దానక్రియారంభముల్
ముల్ పుణ్యసుతీర్ధసేవ ఫలముల్ ద్వేదవిజ్ఞానముల్
వాసవ్రత శీలకర్మ ఫలముల్ ప్పార నిన్నాత్మలో
నుమింపం గలవారికే గలుగు వేయున్నేల నారాయణా!

టీకా:

ఉపమింపన్ + కలవారికే = పోల్చగలవారికే.

భావము:

నారాయణా! తపస్సుల, మంత్రాల, సమస్త యజ్ఞాల, దానకర్మల, జపాల, పుణ్యతీర్థ సేవనల, వేద విజ్ఞానాన్ని పొందడం, ఉపవాసాల, వ్రతాల, సత్ప్రవర్తనల ఫలితాలన్నీ నిన్ను మనస్సులో స్మరించినంత మాత్రాన లభిస్తాయి. వేయి మాటలెందుకు?

1-102-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీనారాయణ! యన్నఁ జాలు దురితశ్రేణిన్నివారింపఁగా
నానందస్థితి గల్గునంచు నిగమార్థానేక మెల్లప్పుడున్
నానాభంగులఁ జెప్ప నేను విని శ్రీనారాయణా! యంచు ని
న్నేనేనెప్పుడు గొల్తు బ్రోవఁగదె తండ్రీ నన్ను నారాయణా!

టీకా:

దురిత శ్రేణిన్ = పాపసమూహాన్ని; నిగమ + అర్థ + అనేకము = వేదార్థాల బాహుళ్యం.

భావము:

నారాయణా! “శ్రీ నారాయణా!” అంటే చాలు పాపాలన్నీ తొలగిపోయి బ్రహ్మానంద స్థితి కలుగుతుందని వేదార్థాలన్నీ రకరకాలుగా చెప్పగా విని నేను నిన్ను “శ్రీ నారాయణా!” అంటూ సేవిస్తాను. తండ్రీ! నన్ను కాపాడవలసింది.

1-103-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లితాఘౌఘ వినాశకారి యగుచుం గైవల్య సంధాయియై
లి నొప్పారెడు మంత్రరాజ మగు నీనామంబు ప్రేమంబునన్
రన్నెవ్వని వాక్కునం బొరయదో న్నీచుదేహంబు దా
వెయన్ భూరుహకోటరం బదియ సూ వేదాత్మ నారాయణా!

టీకా:

కలిత = కూడిన; అఘ + ఓఘ = పాపరాశిని; వినాశకారి = నాశనం చేసేది; కైవల్య = మోక్షాన్ని; సంధాయియై = సమకూర్చేదై; నలిన్ = మిక్కిలి; ఒప్పు + ఆరు = యోగ్యంగా ఉండే; పొరయదో = ఉండదో; భూరుహ కోటరంబు = చెట్టుతొఱ్ఱ.

భావము:

వేదమూర్తివైన నారాయణా! సంచిత పాపాల నన్నింటినీ నాశనం చేసేదై, మోక్షాన్ని సమకూర్చేదై విలసిల్లే నీ నామాన్ని పలుకనట్టి నీచుని దేహం చెట్టుతొఱ్ఱ వంటిది కదా!

1-104-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణీయంబుగ నాదిమంబు నవతారంబున్ భవద్దివ్యరూ
ము నామామృతమున్ దలంప దశకప్రాప్తయ్యెఁ గృష్ణావతా
ము సుజ్ఞానము మోక్షమున్ ద్వివిధసంప్రాప్తిన్ శతాంధ్రాఖ్యకా
వ్యము నర్పించితి మీ పదాబ్జములకున్ వైకుంఠ నారాయణా!

టీకా:

రమణీయంబుగ = అందంగా; ఆదిమంబు = మొదట; దశకప్రాప్తి = పది పద్యాలను పొందడం; ద్వివిధ సంప్రాప్తిన్ = పదికి రెట్టింపుతో; శత + ఆంధ్ర + ఆఖ్య కావ్యము = నూరు తెలుగు పద్యాల కావ్యాన్ని (శతకాన్ని).

భావము:

 వైకుంఠవాసా! నారాయణా! అవతార దశకంతో మొదలుపెట్టి, నీ దివ్యరూప దశకం, నామ ప్రభావ దశకం అనే నాలుగు విషయాలు పదేసి పద్యాలతో అందంగా సమకూరాయి. తరువాత కృష్ణావతార వింశతి (20), జ్ఞానవింశతి (20), మోక్షవింశతి (20) అనే ఈ మూడు విషయాలతో కూడి ఆంధ్రభాషలో నూరు పద్యాలు రచింపబడ్డాయి. ఈ శతక కావ్యాన్ని నీ పాదపద్మాలకు సమర్పించాను.

1-105-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీమూర్తుల్ గన నీకథల్ వినఁ దుదిన్ నీపాదనిర్మాల్య ని
ష్ఠామోదంబు నెఱుంగ, నీచరణతోయంబాడ, నైవేద్యముల్
నీమంబొప్ప భుజింప నీజపము వర్ణింపన్ గృపం జేయవే
శ్రీమించన్ బహుజన్మజన్మములకున్ శ్రీయాది నారాయణా!

టీకా:

మూర్తుల్ = రూపాలను; కనన్ = చూడడానికి; తుదిన్ = చివరకు; పాద నిర్మాల్య = పాదపూజ చేసి తీసివేసిన పూజాద్రవ్యాలలో; నిష్ఠ = ఉన్నటువంటి; ఆమోదంబు = వాసనను; చరణతోయంబు = పాదాలు కడిగిన నీటిని; ఆడన్ = స్వీకరించడానికి; నీమంబు = నియమం.

భావము:

శ్రీ ఆది నారాయణా! నాకు జన్మజన్మలకు కూడా నీ రూపాలను చూడడానికి, నీ కథలను వినడానికి, నీ పాదపూజ చేసిన నిర్మాల్యగంధాన్ని తెలుసుకొనడానికి, నీ పాదతీర్థాన్ని, నీ నైవేద్యాన్ని స్వీకరించడానికి, నీ జపం చేస్తూ నిన్ను వర్ణించడానికి దయతో జ్ఞానసంపదను అనుగ్రహించు. 

1-106-గ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన నారాయణ శతకంబున సర్వంబు సంపూర్ణము.

టీకా:

కలిత = పొందబడిన; ప్రణీతంబు + ఐన = రచింపబడిన.

భావము:

ఇది శ్రీ పరమేశ్వరుని దయచేత పొందబడిన కవిత్వ వైచిత్రి కలిగినవాడు, కేసనమంత్రి కుమారుడు, సహజ పాండిత్యం కలవాడు అయిన పోతనామాత్యునిచే రచింపబడిన నారాయణ శతకంలో సర్వం సంపూర్ణం.