పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పోతన - పుస్తకాలు : గ్రంథం - అధిక పద్యగద్యలు, పాఠ్యంతరాలు

గ్రంథము - అధిక పద్యగద్యలు, పాఠ్యంతరములు

గమనిక;- మన తెలుగుభాగవతం.ఆర్గ్ నందు మూల గ్రంథం సంపూర్ణంగా ఇచ్చుట యందు పూర్తి శ్రద్ధ తీసుకొనుట జరిగినది. వందల కొలది పోతన భాగవత ప్రచురణలు ఉన్నాయి. అనేకము లభించుట దుర్లభమగుచున్నది. ఒంటిచేత్తో చేసిన కృషి కనుక ఆధారగ్రంథాల సేకరణ దగ్గర నుండి కొన్ని పరిమితులు ఉండడం సహజమే కదా. కనుక, కొన్ని మద్రణాప్రతులలోను వ్రాతప్రతులలోను కొన్ని పద్య గద్యలు అధికముగా ఉండుట, పాఠ్యంతరములు ఉండుట కనబడుతోంది. వాటిని ఆయా పద్యాల క్రింద చేర్చి, లింకు పెట్టిన పద్యసంఖ్యలతో జాబితాగా ఇక్కడ పెట్టబడింది. ఇట్టివి మరి కొన్ని మీ దృష్టికి వచ్చినచో దయచేసి సప్రమాణికంగా తెలుపగలరు. తరువాత, గ్రంథంలో అట్టి అధిక పద్యగద్యల స్థానం సూచించుటకు, ఏ పద్యం క్రింద వస్తున్నదో దాని పద్యసంఖ్యలో "/" ఇచ్చి క్రింద ఉపసంఖ్య గుర్తించడమైనది. ఉదాహరణకు: 2-240/1-వ. అంటే ద్వితీయస్కంధ నందు 240వ పద్యం క్రింద వస్తున్నది అని గ్రహించ మనవి.
విద్వాన్ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితుల వారి భాగవతం (1929) నుండి ఉల్లేఖన :

1) 2-240/1-వ.
. ఇట్లనియె.


తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి శ్రీమదాంధ్ర మహా భాగవతము (1911 & 1928 ప్రచురణ) నుండి ఉల్లేఖన :

ఈ యధిక పాఠము మూలమున "సోమృతస్యాభయస్య" అనుట మొదలుకొని, "పురుషస్తాభయాశ్రయః" అనువఱకు గల నాలుగు శ్లోకములకును వానికి శ్రీధరులు రచించిన వ్యాఖ్యానమునకును దెనుఁగై యీ ఘట్టమున నుండవలసినదియే. అయిన నిది పెక్కు వ్రాఁతప్రతులను నచ్చుప్రతులను గాన రాదు. ఒకానొక వ్రాఁతప్రతి యందే చూపట్టుచున్నది. మఱియుఁ బోతన మూలమున శ్రీధరవ్యాఖ్యాన సహితముగాఁ దెనిగించినవాఁడు. కనుకఁ క్రింది నాలుగు శ్లోకములు పోతనకు లభించిన మూలమున లేకుండవచ్చు నని తలంచినను వాని వ్యాఖ్యానము నం దైనను దప్పక కనుపట్టి యుండును. గాన వానినిఁ దెనిఁగింపకుండడు. అయిన నీ తెనిఁగింపు పోతన దాని యంత సమంజసమును బ్రౌఢమును గాకున్నది. వెలిగందల నారయ కవిత్వ మిందును గొంత చేరి యుండుననియుఁ గనుకనే యిది పోతన రచన వలె సమంజసమును బ్రౌఢమును గాదయ్యె ననియు నూహింపఁ దగి యున్నది.

3) 5.2-91/1-క.
దోనొకకర్మఫల
ప్రాదుర్భావ మగు లోక పాలన కే
కా దేవుం డభయప్రతి
పాక మగు మోక్షమునకుఁ తి యె ట్లన్నన్.
4) 5.2-91/2-వ.
వినుము, పరమాత్మయు నానందేశ్వరుం డ(డున)గు నవ్విష్ణునకుఁ బ్రపంచమాత్రాధికత్వం బేమి యద్భుత మ ట్లగుటంజేసి, యతని మహిమాతిశయం బస్మదాదులు నెఱుంగనేర్తురె, స్థిత్యర్థపాదుం డగు నీశ్వరుని పాదాంశంబు లందు భూభువస్సువర్లోకంబులు గుదురుకొని యుండుఁ. దదీయ విలయ సమయంబునం దదుపరి మహర్లోకంబు దపియింప నందుఁ గల జనంబు లంతరాళంబు నందక మహర్లోకశిరఃస్థానం బైన జనలోకంబుఁ బ్రవేశించి యత్యంతం బగు నవినాశి సుఖంబు లనుభవింతురు. తపోలోకంబు సంకర్షణానల శక్తిచేత నధస్త్రిలోకంబులుం దందహ్యమానంబు లగు నప్పుడు తదూష్మలం జెందక విలక్షం బై, క్షేమంబు గలిమిఁ దజ్జనం బంద సుఖించు. జన్మజరామరణభయంబులు లేక ముక్తికిఁ బ్రత్యాసన్ను లగుటం జేసి సత్యలోకపువాసు లంద యానందింతురు. భూభువస్సువర్లోకంబు లవ్విరాట్పురుషుని పద స్థలం బగుట నేక పాద్విభూతి యయ్యె. మహర్లోకంబు మధ్యమవిభూతి యన నమరె. జన తపో సత్య లోకంబు లమ్మహాపురుషుని శిరఃస్థానంబు గావున, నది త్రిపాద్విభూతి యనంబడుఁ. దదీయ లోకంబు బ్రహ్మచర్య వానప్రస్థ యతులకు దక్క నితరుల కసాధ్యంబు. గృహస్థు లయ్యు నితర త్రివిధాశ్రమధర్మంబులు గలిగినం జేకుఱు. క్షేత్రజ్ఞుం డైన పురుషుండు స్వర్గాపవర్గ హేతుభూతం బైన దక్షిణోత్తర కర్మ జ్ఞాన మార్గంబులు సృజించి యంతయుఁ దాన యై యుండు.


5) 3-48/1-వ.
ఇట్లనియె.
6) 3-432/1-వ.
అదియునుం గాక.
7)

ఇది (విద్యాధరు లిట్లనిరి క్రింద రెండవ పద్యంగా) ఒకానొక ప్రతిని జూపట్టెడి..
4-24/1మ.
దంశాంశజు లీ మరీచిముఖరుల్ బ్రహ్మామరేంద్రాదిజా
ముఖ్యుల్ దివిషద్గణంబుఁ బరమాత్మా! నీకు విశ్వంబు ను
త్సలీలాకరకందుకోపమము నాథా! వేదశాఖాశిఖా
స్తనీయాంఘ్రికి నీ కొనర్తుము నమస్కారంబు లశ్రాంతమున్.

8) 4-543/1-వ.
అని వెండియు ని ట్లని యాన తిచ్చె.
9)

6-1/1-క..
కొన్ని ప్రతులందు "శా. శ్రీవత్సాంకిత.." పద్యమునకు మాఱుగా
"క.
భూదయాహృదయస్థిత
పాకహర! సర్వలోకపావన! భువనా
తీగుణాశ్రయ! యతివి
ఖ్యా సురార్చితపదాబ్జ! రుణానిలయా!"
అని పద్యం ఉన్నది.

10)
6-256-త.
"(తరలము.) అదితియున్..... " పద్యం మాఱుగా
" 6-256/1-వ.
అదితియు దితియుఁ గాష్ఠయు నరిష్ఠయు సారసయు నిళయు మునియుఁ గ్రోధవశయుఁ దామ్రయు సురభియు సరమయుననఁ బదమువ్వురు గల రందు." అని వచనమే వ్రాఁతప్రతులఁ గానిపించెడి.
(దనువు తిమి పేర్లు లేవు)
11) 6-396/1-వ.
అని మఱియు వాసుదేవ కృపాలబ్ధదుర్నిరీక్ష్యుం డైన వజ్రహస్తునిం గని యిట్లనియె.
12) 8-148/1-వ.
అప్పుడు.
13) 8-358/1-వ.
అప్పుడు.
14) 8-368/1-వ.
అంత.
15) 8-515/1-వ.
అంత.
16) 9-476/1-వ.
అంత
17) 9-644/1-వ.
రాజున కి ట్లనియె.
18) 10.1-291/1-వ.
అందు.
19) 10.1-1569/1-వ.
మఱియును.