పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

విష్ణుసహస్రనామ-శంకరభాష్యం : వెన్నుని వేయి పేర్లు - 2

(51)౫౧. మనుః-
  మననము వలన ‘మనుః’ అనబడును. ‘నాஉన్యోஉతో స్తి‘
  అను శ్రుతిచే నిది ప్రతిపాదితము. మన్త్రము, లేక ప్రజాపతి ‘మను‘ శబ్దముచే చెప్పబడును.

(52)౫౨. త్వష్టా-
  ప్రజాపతి, సంహార సమయమున సర్వభూత తనూ కరణము చేయుట, అనగా సూక్ష్మీకరించుటను బట్టి ‘తృష్టా’ యను నామము పరమేశ్వర నామమై ఒప్పారును.

(53)౫3. స్థవిష్ణః-
  స్థౌల్యాతిశయము కలవాడుగాన, ‘స్థవిష్ఠః‘ యనబడును.

(54)౫౪. స్థవిరః ధ్రువః-
  పురాణ పురుషుడు. వయోవచనమును కావచ్చును. స్థిరత్వమును బట్టి ధ్రువుడు. ‘స్థవిరో ధ్రువః‘ ఇది ఏక సొమము; విశేషణ విశిష్టము.
  శ్లో|| అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో జోహితాక్షః ప్రతర్దనః |
  ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగలం పరమ్ || ౨౦
  శంకర భాష్యము : - కర్మేన్ద్రియై ర్న గృహ్యతే ఇతి అగ్రాహ్యః ‘యతో వాచో వివర్తన్తే అప్రాప్య మనసా సహ ఇతి శ్రుతేః, శశ్వత్ సర్వేషు కాలేషు భవతీతి శాశ్వతః‘శాశ్వతం శిప మచ్యుతమ్‘ ఇతి శ్రుతేః, ‘కృషి ర్భూవాచక శృద్దో ణశ్చ నిర్వృతి వాచకః విష్ణు స్తద్భావయోగాచ్చ కృష్ణో భవతి శాశ్వతః‘ ఇతి వ్యాసవచనాత్ సచ్చిదానన్దాత్మకః కృష్ణః కష్ణపర్ణాత్మకత్వాద్వా కృష్ణః ‘ కృషామి పృథివీం పార్థ భూత్వా కార్ణాయసో హలః కృష్ణో వర్ణశ్చ మే యస్మా తస్మా త్కృష్ణో உహ మర్జున‘ - ఇతి మహాభారతే. లోహితే
  ఆణీ యస్యేతి లోహితాక్షః ‘అసా వృషభో లోహితాక్షః‘ ఇతి శ్రుతేః. ప్రలయే భూతాని ప్రతర్దయతి హీన స్తీతి ప్రతర్దనః. జ్ఞానైశ్వర్యాది గుణై స్సంపన్నః ప్రభూతః. ఊర్థ్వాధోమధ్యభేదేన తిసృణాం కకుభా మపి ధామేతి త్రికకుబ్ధామ. ఇత్యేక మిదం నామ యేన పునాతి యో వా పునాతి ఋషి ర్ధేవతా వా తత్ పవిత్రమ్. ‘పునస్సంజ్ఞాయామ్‘‘కర్తరి చర్షిదేవతయోః‘ ఇతి భగవత్పాణిని న్మరణాత్ ఇత్ర ప్రత్యయః -
  “అశుభాని నిరాచష్టే తనోతి శుభస న్తతిమ్ |
  స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మ తత్మంగలం విదుః ||
  ఇతి శ్రీ విష్ణుపురాణవచనా త్కల్యాణ రూపత్వాద్వా మంగలం. పరమ్ - సర్వభూతేభ్యః ఉత్కృష్టం బ్రహ్మ. మంగలం పరమ్ - ఇత్యేకమిదం నామ సవిశేషణమ్ II

(55)౫౫. అగ్రాహ్యః-
  ‘యతో వాచో నివర్తంతే‘ అను శ్రుతి చెప్పిన రీతిగ కర్మేన్ద్రయములచే గ్రహింప బడనట్టివాడు గాన ‘అగ్రాహ్య‘ శబ్దాధేభియు డగుచున్నాడు.

(56)౫౬. శాశ్వతః -
  ‘శశ్వత్ భవతి‘ సర్వతాలములయందు ఉండువాడు గాన ‘శాశ్వతః‘ అని శ్రుతి చెప్పుచున్నది.

(57)౫౭. కృష్ణః -
  ‘కృష్‘ సత్తావాచకము, ‘ణ‘, ఆనందవాచకము -- అను వ్యాసవచనానుసారము సచ్చిదానన్దాత్మకుడుగాన ‘కృష్ణ‘ శబ్దముచే కీర్తింబడుచున్నాడు. కృష్ణవర్ణము గలవాడు నగుటచే కృష్ణశబ్దవాచ్యుడు. మహాభారతములో ‘ఇనుప హల మయి భూమిని దున్ను చున్నాను; కృష్ణవర్ణము కలిగియున్నాను; అందుచే ‘కృష్ణుడ’ నయితినని, పరమాత్మ స్వయముగా చెప్పెను.

(58)౫౮. లోహితాక్షః -
  ఎరుపు గల నేత్రములు కలవాడు. ఇది ‘అసావృషభో లోహితాక్షః‘ - అను శ్రుతిచే ప్రసిద్ధము.

(59)౫౯. ప్రతర్దనః-
  ప్రలయకాలమందు భూతకోటిని హింసించువాడు గాన, ‘ప్రతర్దనః‘ అనబడును. ౬౦. ప్రభూతః-
  జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు కాన, ‘ప్రభూత‘ శబ్ద వాచ్యు డగుచున్నాడు.

(61)౬౧. త్రికకుబ్ధామ-
  ఊర్ధ్వ- అథో- మధ్య - భేదములచే త్రివిధ దిశలకు ఆశ్రయ మైనవాడగుటచే ‘త్రికకుబ్ధామ -’ యనబడును.

(62)౬౨. పవిత్రమ్-
  ‘పూయతే உనేనేతి పవిత్రమ్‘ అను వ్యుత్పత్తిచే ఋషి - అనగా వేదమన్త్రము పవిత్ర మనబడును. పునాత్యసౌ, అను వ్యుత్పత్తిచే దేవత ‘పవిత్ర’ మనబడును.

(63)౬3. మంగలం పరమ్-
  విష్ణుపురాణ వచనానుసారము ఏ బ్రహ్మ, స్మరణ మాత్రమున అశుభములను నిరాకరించి శుభపరంపరను విస్తరింపజేయునో ఆ బ్రహ్మ ‘మంగల‘ శబ్దముచే నొప్పును. కల్యాణరూపమగుటచే గూడ కల్యాణరూపమగుట ‘మంగల‘ శబ్దాభిధేయుడగునని తెలియవలయును. పరమ్ - సర్వభూతములకంటె ఉత్కృష్టమైనది బ్రహ్మ, ‘మంగలంపరమ్‘ అని విశేషణ విశిష్టమగు ఏక నామముగ గ్రహింప నగుమ.
  శ్లో ॥ ఈ శాన: ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్టః ప్రజాపతిః
  హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ 21
  శంకర భాష్యము : - సర్వభూతనియ న్తృత్వాత్ ఈశానః ప్రాణాన్ దదాతి చేష్ట యతీతి వా ప్రాణదః. ‘కోహ్యేవాஉన్యాత్ కః ప్రాణ్యాత్‘ ఇతి శ్రుతేః. యద్వా, ప్రాణాన్ కాలాత్మనా ద్యతీ ఖండయతీతి ప్రాణదః. ప్రాణాన్ దీపయతి శోధయతీతి వా, ప్రాణాన్ దదాది లునాతీతి వా ప్రాణదః ప్రాణితీతి ప్రాణః. క్షేత్రజ్ఞః, పరమాత్మా వా ‘ప్రాణస్య ప్రాణమ్‘ ఇతి శ్రుతేః, ముఖ్యప్రాణో నా వృద్ధతమో జ్యేష్ఠః, ‘జ్యచ’ఇత్యధి కారే ‘వృద్ధస్య చ‘ ఇతి వృద్ధశబ్దస్య జ్యాదేశవిధానాత్, ప్రశస్యతమః శ్రేష్ఠః, ‘ప్రశస్యస్య శ్రః‘ ఇతి శ్రాదేశవిధానాత్, ‘ప్రాణోవావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ‘ ఇతి శ్రుతేః, ముఖ్యప్రాణో వా, ‘శ్రేష్ఠశ్చ‘ ఇత్యధికరణసిద్ధ త్వాత్, సర్వకారణత్వాద్వా జ్యేష్ఠః, సర్వాతిశయత్వాద్వా శ్రేష్ఠః, ఈశ్వర త్వేన సర్వాసాం ప్రజానాం పతిః ప్రజాపతిః, హిరణ్మయాండా నర్వర్తిత్వాత్ హిరణ్యగర్భో బ్రహ్మా విరించిః తదాత్మా. ‘హిరణ్యగర్భస్పమవర్తతాగ్రే‘ ఇతి శ్రుతేః, భూః గర్భేయస్య స:, భూగర్భః మాయాః శ్రియః ధవః పతిః - మాధవః, మధువిధ్యాஉవభోధ్యత్వాద్వా మాధవః, ‘మౌనాద్ధ్యానాచ్ఛ యోగాచ్ఛ విద్ధి భారత మాధవమ్‘ ఇతి వ్యాసవచనాదివీ మాధవః, మధు
  Page 128
  నామాన మసురం సూదిలేనానితి మధుసూదనః.
  “కర్ణమిశ్రోద్భవం చాపి మధు నామ మహాసురమ్ ।
  బ్రహ్మణోஉపచితిం కుర్వన్ జఘాన పురుషోత్తమః
  తస్య తాత వధాదేవ దేవదానవమానవాః ।
  మధుసూదన ఇత్యాహుః ఋషయశ్చ జనార్దనమ్ ।।“
  ఇతి మహాభారతే.

(64)౬౪. ఈశానః-
  సర్వభూతనియంతృత్వ న్తృమును బట్టి ’ఈశానః ’ అని చెప్పబడును.

(65)౬౫. ప్రాణదః-
  ప్రాణము లిచ్చినవాడు, ప్రాణచేష్టలను కలిగించువాడు నగుటచే, ’ప్రాణద ’ నామముచే పిలువబడుచున్నాడు. ఇది శ్రుతి సిద్ధము. లేదా, కాలస్వరూపముతో ప్రాణములను ఖండించువాడు, మరియు, ప్రాణములకు దీప్తి నిచ్చువాడు, ప్రాణములను శోధించువాడు, ఛేదించువాడు నగుట వలనను ‘ప్రాణద’ సంజ్ఞతో నొప్పారుచుండును.

(66)౬౬. ప్రాణః-
  ప్రాణన వ్యాపారసు ( ఉచ్ఛ్వాసనిఃశ్వాసములు ) కల క్షేత్రజ్ఞుడు; ‘ప్రాణస్యప్రాణమ్’ అను శ్రుతినిబట్టి పరమాత్మ లేదా, ముఖ్యప్రాణము నగుటచే ’ప్రాణః’యని కొనియాడ బడుచున్నాడు.

(67)౬౭. జ్యేష్ఠః -
  వృద్ధతముడు ; వృద్ధ శబ్దమునకు ’జ్యాదేశము విధింప బడినది.

(68)౬౮. శ్రేష్ఠః-
  ప్రశస్యతముడు, ప్రశస్య శబ్దమునకు ప్రాదేశము విధింపబడినది. ‘ప్రాణోవాన జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ‘ అను శ్రుతిని బట్టి ‘ శ్రేష్ఠశ్చ ’ అను బ్రహ్మసూత్రనిర్ణయ ప్రకారము - ముఖ్య ప్రాణము కావచ్చును. సర్వకారణత్వమును పురస్కరించుకొని జ్యేష్ఠుడును, సర్వాతిశయత్వమునుబట్టి శ్రేష్ఠుడును, అగును.

(69)౬౯. ప్రజాపతిః-
  ఈశ్వరత్వధర్మముచే సర్వప్రజలకు పతిగాన ‘ప్రజాపతిః‘ అనబడును.

(70)౭౦. హిరణ్యగర్భః-
  హిరణ్మయాండ ( బ్రహ్మాండ ) అన్తర్వర్తిత్వము చేత హిరణ్యగర్భుడు బ్రహ్మ, తత్స్వరూపుడు నగుటచే ‘హిరణ్య గర్భః‘ యని చెప్పనగును. ఇది హిరణ్యగర్భస్సమవర్తతాగ్రే‘ అను శ్రుతిచే సిద్ధము.

(71)౭౧. భూగర్భః-
  భూమి గర్భముందు కలవాడు. గాన, ‘భూగర్భః‘ యని, కీ ర్తింపబడుచున్నాడు. ౭౨. మాధవః-
  మా అనగా, శ్రీదేవి ఆమెకు ధవుడు ( పతి ) గాన ‘మాధవః‘ యనబడును. లేదా ఉపనిషత్ప్రసిద్ధ మధువిద్యచే అవగమ్యమానుడు, లేదా ‘మౌనము చేత ధ్యానము చేత యోగము చేత మాధవుని తెలిసికొనుము‘ అను వ్యాస
  వచనమును బట్టి పై సాధనములకు వేడ్యుడు నగుట చేతను ‘మాధవః’ యను నామముతో నొప్పారుచున్నాడు.

(73)౭౩. మధుసూదనః-
  మధు వను అసురుని సంహరించిన వాడగుటచేతి ‘మధుసూదన‘ శబ్దముచే చెప్పబడుచున్నాడు. కర్ణ మిశ్రోద్భపుడు ( కర్ణమలోడ్భవుడు ) అగు మధు నామక మహాసురుని వధించుట చేతనే దేవ, దానవ, మానవులు, మహర్షులు, జనార్ధనుని మధుసూదను డని కీర్తించిది, అని మహాభారత వచనము వలన తెలియును.
  శ్లో ॥ ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః |
  అను త్తమో దురాధర్షః కృతజ్ఞః కృతి కాత్మవాన్ ౨౨
  శంకర భాష్యము : - సర్వశక్తిమత్తయా ఈశ్వరః విక్రమః శౌర్యమ్. ఉద్యోగాత్ విక్రమీ. ధనురస్యా స్తీతి ధన్వీ, వ్రీహ్యాదిత్వా దివిప్రత్యయః, ‘రామ శ్శస్త్రభృతామహమ్‘ ఇతి భగవద్వచనాత్, మేధా - బహుగ్రన్థధారణ సామర్థ్యమ్, సా యస్యాప్తి స మేధావీ, ‘అస్మాయా మేధా స్రజో వినిః‘ ఇతి పాణిని వచనాత్ వినిప్రత్యయః, విచక్రమే జగత్ విశ్వం, తేన విక్రమః. వినా గరుడేన పక్షిణా క్రమాద్వా. క్రమణాత్ క్రమహేతుత్వాద్వా క్రమః. ‘క్రా నె విష్ణుమ్ ఇతి మధువచనాత్, అవిద్యమాన:, ఉత్తమో యస్మాత్సః అనుత్తమః యస్మాత్పరం నా உపర మస్తి కించిత్‘ ఇతి శ్రుతే: ‘న త్వత్సమోஉస్త్యభ్యధికః కుతోஉన్యః‘ ఇతీ స్మృతేశ్చ. దైత్యాదిభి ర్ధర్షయితుం న శక్యత ఇతి దూధర్షః, ప్రాణినాం పుణ్యాపుణ్యాత్మకం కర్మ కృతం జానాతీతి కృతజ్ఞః పత్రపుష్పాధిక మర్పగపి ప్రయచ్ఛతాం మోక్షం దదాతీతి వా. పురుష ప్రయత్నః కృతి; క్రియా వా. సర్మాత్మికర్వా త్తదాధార
  తయా వా లక్ష్యతే కృత్యా ఇతి వా కృతిః స్వమహిమప్రతిష్ఠితత్వాత్ ఆత్మ వాన్, “స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి స్వే మహిమ్ని“ ఇతి శ్రుతేః. !!

(74)౭౪. ఈశ్వరః-
  పరమాత్మ, సర్వశక్తిమత్త్వ ధర్మము చేత ’ఈశ్వరః ’ అని చెప్పబడుచున్నాడు. ౭౫. విక్రమి-
  శౌర్యశాలి. గాన, ‘విక్రమీ‘ యని, కీర్తింపబడుచున్నాడు.

(76)౭౬. ధన్వీ-
  ‘రామశ్శ స్త్రభృతామహమ్‘ అను భగవద్వచనాను సారము ధనుర్ధరుడు గాన, ‘ధన్వీ‘ యనబడుచున్నాడు.

(77)౭౭. మేథావీ-
  బహుగ్రన్థ ధారణ సామర్ధ్యము కలవాడు గాన ‘ మేధావీ ‘ యని చెప్పబడుచున్నాడు.

(78)౭౮. విక్రమః-
  విశ్వమును పాదముచే ఆక్రమించినవాడు, లేదా, వి = పక్షి - గరుత్మంతుడు; వానితో సంచరించువాడు, ’ విక్రమ ’ శబ్ద వాచ్యుడు.

(79)౭౯. క్రమః ‘-
  ’క్రాన్తే విష్ణుమ్’ అను మనువచనానుసారము బాహ్యా కాశాదులకు దైహికాకాశాదులయండు ఏకత్వధారణ చెప్పుచు, ప్రాదేన్ద్రియమందు విష్ణువును భావింపవలె ననుటచే గమన క్రియకు హేతువైనవాడు కనుః ’క్రమః’, అనబడును.

(80)౮౦. అనుత్తమః-
  ఎవనికంటె ఉత్తముడు లేడో అతడు ‘అనుత్తమః‘ అని చెప్పబడును. ఈ విషయము ‘ యస్మాత్పర్శం‘ - అను శ్రుతి వలనను ‘సత్వత్సమోஉసి అను స్మృతి వలనను సిద్ధము. ౮౧. దురాధర్షః-
  దైత్యాదులచే తిరస్కరింప శక్యము కానివాడగుటచే ‘దురాధర్షః‘ యనబడును.

(82)౮౨. కృతజ్ఞ: -
  ప్రాణులచే జేయబడిన పుణ్యపాపకర్మలను తెలిసిన వాడు. మరియు, అల్పమగు పత్రపుష్పాదికము సమర్పించిన వారికై నను శాక్షమిచ్చువాడు గాన, ‘కృతజ్ఞః‘ యని కీర్తింపబడుచున్నాడు.

(83)౮3. కృతిః - పురుషప్రయత్నము, లేక క్రియ ‘కృతిః‘ యని చెప్పబడును. సర్మాత్మికుడగుటచే దానికాధారముగ కృతి చేత లక్షితు డగువాడుగాన ‘కృతి‘శబ్ద వాచ్యుడు.
  శ్లో॥ సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభనః|
  అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః॥
  శం.భా. : - సురాణాం దేవానా మీశ: సురేశః సూపపదోవా రా ధాతుః శోభనదాతౄణా మీశ:. సురేశః ఆర్తానా మార్తిహరణత్వాత్ శరణమ్, పరమానన్దరూపత్వాత్ శర్మ, విశ్వస్యకారణత్వాత్ విశ్వరేతాః సర్వాః ప్రజా యత్సకాశా దుద్భవన్తి స ప్రజాభవః; ప్రకాశరూపత్వాత్ అహః, కాలాత్మనా స్థితో విష్ణుః సంవత్సర ఇత్యుక్తః వ్యాలవత్ గ్రహీతు మశక్యత్వాత్ వ్యాల: ప్రతీతిః ప్రజ్ఞా ప్రత్యయః. ‘ప్రజ్ఞానం బ్రహ్మ‘ ఇతి శ్రుశేః. సర్వాణి దర్శినాత్మకాని అక్షీణి యస్య సః సర్వదర్శనః. సర్వాత్మకత్వాత్ ‘విశ్వతశ్చతుః‘ ‘విశ్వాక్షమ్‘ ఇతి ప్రతేః॥

(85)౮౫. సు రేశః-
  దేవతలకు ఈశుడు. లేదా, ‘సు‘ ఉపసర్గగా కల ‘రా‘ ధాతవు యొక్క రూపము ‘సురా‘ యగును. శుభముల నిచ్చు వారని అర్థము. వారికి ఈశుడు గాన ‘సురేశ‘ నామమున బరగినాడు.

(86)౮౬. శరణమ్ -
  ఆ రుల ఆర్తిని హరించువాడు గాన, ‘శరణ‘ శబ్దవ్యప దేశ్యుడు.

(87)౮౭. శర్మ-
  పరమా నన్దస్వరూపు డగుటచేత ‘శర్మ‘ నామమున విలసిల్లును.

(88)౮౮. విశ్వ రేతాః-
  విశ్వమునకు కారణ మయినవాడు కాన, ‘విశ్వరేతాః‘ యనబడును.

(89)౮౯. ప్రజాభవః-
  సర్వప్రజల ఉద్భవమునకు మూల మయినవాడు కనుక ‘ప్రజాభవ‘ శబ్దముచే చెప్పబడుచున్నాడు.

(90)౯౦. అహః -
  ప్రకాశస్వరూపుడు గాన ‘అహః‘ యనియు.

(91)౯౧. సంవత్సరః-
  కాలాత్మకుడై యున్న వాడు కాన ‘సంవత్సరః‘యనియు,

(92)౯౨. వ్యాలః-
  వ్యాలము ( సర్పము ) వలె గ్రహింపశక్యము కానివా డగుటచే ‘వ్యాలః’ యనియు చెప్పబడుచున్నాడు.

(93)౯3. ప్రత్యయః-
  ప్రజ్ఞాత్మికుడు గాన, ‘ప్రత్యయ‘ శబ్దవాచ్యుడగుచున్నాడు. ఈ విషయము ‘ప్రజ్ఞానం బ్రహ్మ‘ అను శ్రుతి వలన తెలియును.
  ౯ర. సర్వదర్శనః-
  సర్వమైన దర్శనసాధనములు. నేత్రములుగా కలవాడు, సర్వాత్మకుడు నగుటచే ‘సర్వదర్శనః‘ యని చెప్పబడుచున్నాడు. ఈ విషయము ‘విశ్వతశ్చక్షు:‘ అను శ్రుతి చెప్పుచున్నది.
  శ్లో ॥ ‘అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాది రచ్యుతః |
  వృషాకపి రమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ ౨ర
  శంకర భాష్యము : - న జాయత ఇత్వజః ‘న జాతో న జనిష్యతే‘ ఇతి శ్రుతేః. ‘‘నహి జాతో న జాయేஉహం వ జరిష్య్వే కదాచన క్షేత్రజ్ఞ స్సర్వభూతానాం తస్మా దహ మజః స్మృతః‘‘ ఇతి మహాభారతే. సర్వేషా మీశ్వరాణా మీశ్వరః సర్వేశ్వః, ‘ఏష సర్వేశ్వర:‘ ఇతి శ్రుతేః నిత్యనిష్పన్నరూసత్వాత్ సిద్ధః. సర్వశస్తుషు సంవి దూపత్వాత్, : రతిశయరూపత్వాత్, ఫలరూసత్వాద్వా సిద్ధిః, స్వర్గాదీ కాం వినాశిత్వా దఫలక్వమ్, సర్వభూతానా మాది కారణత్వాత్ సర్వాదిః, స్వరూప సామర్ధ్యాత్ న చ్యుతో, నచ్య నతే, న చ్యవిష్యతే ఇతి అచ్యుతః ‘శాశ్వతం శివ మచ్యుతమ్‘ ఇతి శ్రుతేః తథా చ భగవద్వచనమ్ - ‘యస్మా న్నచ్యుతపూర్వోஉహ మచ్యుత ‘స్తేనకర్మణా‘ ఇతి, ఇతి నామ్నాం శర మాద్యం వివృతిమ్, వర్షణా త్సర్వకామానాం ధర్మో వృషః. కాత్ తోయాత్ భూమి మపాదితి కపి ర్వరాహః, వృషరూపత్వా త్కపిరూప త్వాచ్ఛ వృషాకపిః
  శ్లో॥ ఒపిర్వరాః శ్రేష్ఠశ్చ ధర్మశ్చ వృష ఉచ్యతే !
  తన్మా ద్వృషాంపిం ప్రాహ కాశ్యపో మాం ప్రజాపతిః‘‘ ॥
  ఇతి మహాభారతే.
  ఇయానితి మాతుం పరిచ్చేత్తుం న శక్యతే ఆత్మా యస్యేతి. ఆమే యాత్మా సర్వసంబద్ధ నిర్గతః. సర్వయోగవివిస్పృతః, ‘అసంగోహ్యయం పురుషః‘ ఇతి శ్రుతే: bebe వావాశాస్త్రోక్తాద్యోగా దపగతత్వాద్వా ॥

(95)౯౫. అజః-
  జన్మలేనట్టివాడు కాన ‘అజ‘ నామముతో విరాజిల్లుచున్నాడు. ఈ విషయము, ‘ఎప్పుడును ఏ కాలమందును జన్మ లేనివాడను సర్వభూతములకు క్షేత్రజ్ఞుడ నగు నేను అజుడ నని స్మరింపబడితిని‘ అను శ్రుతి స్మృతివచన తాత్పర్యానుసారము ప్రసిద్ధము.
  ౯౬ సర్వేశ్వరః-
  ‘ఏష సర్వేశ్వరః’ అను శ్రుతినిబట్టి ఈశ్వరుల కందరకు ఈశ్వరుడు గాన ‘సర్వేశ్వరః’యనబడును.

(97)౯౭. సిద్ధః-
  నిత్యనిష్పన్న స్వరూపుడు గాన సిద్ధశబ్ధవాచ్యుడు.

(98)౯౮. సిద్ధిః-
  సర్వవసువులు సంవిద్రూప మగుట చేత నిరతిశయ స్వరూప మగుట చేత ఫలస్వరూప మగుట చేతను, ‘ సిద్ధి:’ అను నామము పరమేశ్వరుని యందు వర్తించును. స్వర్గాదులు నశించునవి కనుక అవి ఫలముగా చెప్పబడవు.

(99)౯౯. సర్వాదిః-
  సర్వభూతములకు ఆది కారణము కాన ‘సర్వాది:‘ యనబడుచున్నాడు.

(100)౧౦౦. అచ్యుతః-
  స్వరూపసామర్ధ్యముచే ఏ కాలముందును చ్యుతి లేనట్టి వాడు అచ్యుతమముచే పేర్కొనబడుచున్నాడు. శము ‘శాశ్వతం శివమచ్యుతం’ అను శ్రుతిచే సిద్ధము. మరియు ‘యస్మాన్న చ్యుతపూర్వోహమ్’ - అను భగవద్వచనానుసార ముగ గూడ పై విషయము తెలియనగును. ఇంతవరకు సహస్రనామములలో నామశతము వివరింపబడినది.

(101)౧౦౧. వృషాకపి: -
  సర్వకామములను వర్షించునదగుట చే ధర్మము ‘వృష‘ మనబడును. ‘క‘ శబ్దమునకు జలమని యర్థము. కనుక జలము నుండి భూమిని ‘అపాత్‘ ఉద్ధరించినది. ‘కపి‘ యనబడును. అది వరాహావతారము. వృషరూప, కపిరూపములను బట్టి ‘వృషా కపి‘ నామము వర్తించినది. ‘కపిర్వరాహశ్చ శ్రేష్ఠశ్చ ధర్మశ్చ వృష ఉచ్యతే‘ యను మహాభారతవచనము పైన వ్యుత్పత్తి ద్వారా ‘వృషాకపి‘ శబ్దమును వివరించినది.

(102)౧౦౨. అమేయాత్మా-
  ఇంతటిదని పరిచ్ఛేదమునకు శక్యముకాని స్వరూపము కలవాడు గాన ‘ అమేయాతా‘ అని కొనియాడబడుచున్నాడు.

(103)౧౦౩. సర్వయోగవినిస్సృతః-
  సర్వసంబన్ధ వివిక్తుడు, కనుకనే ‘అసంగోహ్యయం పురుషః‘ అని శ్రుతి చెప్పుచున్నది. నానాశాస్త్రోక యోగము నుండి తొలగువాడపను అగుటచేత ‘సర్వయోగ వినిస్సృతః‘ యను నామము పరమేశ్వరునియందు ప్రసిద్ధము.
  శ్లో ॥ వసుర్వసుచునాః సత్యః సమాత్మా సమ్మితః సమః
  అమోఘః పుండరీ కాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౨౫
  శంకర భాష్యము : - వసన్తి సర్వభూతా న్యత్రతేష్వయమపి వసతీతి వా వసుః, ‘వసూనాం పాపకశ్చాస్మి’ ఇర్యుక్తో వా వసుః వసుశబ్దేన ధనవాచినా ప్రాశస్త్యం లక్ష్యతే. ప్రశస్తం మనో మస్య స వసురునాః రాగద్వేషా దిభిః క్లేశైః మదాధిభి రుంక్లేశైశ్చ యతో న ముషికు చిత్తం తత స్తన్ననః ప్రశస్తమ్. అవితథరూపసత్వా త్పరమాత్మా సత్య:. ‘సత్యం జ్ఞాన మన న్తంబ్రహ్మ‘
  ఇతి శ్రుతేః. మూర్తిమూర్తాత్మకత్వాద్వా. ‘సచ్చత్యచ్చాభవతు‘ ఇతి శ్రుతేః. సదితి ప్రాణాః, తీత్యన్నమ్. యమితి దివాకరః, తేన ప్రాణాஉన్నాஉஉత్యరూపాద్వా సత్య:, ‘సకల ప్రాణా స్తీత్యన్నం యమిత్యసావాదిత్యః‘ ఇతి శ్రుతేః. సత్సు సాధుత్వాద్వా సత్యః సమ ఆత్మా మనో యస్య రాగద్వేషాదిభి రదూషితః స సమాత్మా. సర్వభూతేషు సమ ఏకి ఆత్మా వా, ‘సను ఆత్మేతి విద్యాత్‘ ఇతి శ్రుతే: సర్వైరవ్యర్థ జాతైః పరిచ్ఛిన్నః సమ్మిత:, సర్వె రపరిచ్చి న్నోஉమిత ఇతి అసమ్మితః సర్వ కాలేషు సర్వవికారరహితత్వాత్ సమః మయా క్ష్మ్యా సహ వర్తతే ఇతి వా సమః. పూజితః స్తుతః సంస్కృతో నా సర్వఫలం దదాతి న వృధా కరోతీతి అమోఘః, అవితథసంకల్పాద్వా ‘సత్యసంకల్ప:‘ ఇతి శ్రుతేః, హృదయస్థం పుండరీక మశ్నుతే వ్యాష్నోతి తత్రోసలక్షిత ఇతి పుండరీ కాక్షః, “యత్పుండరీకం పురమధ్యసంస్థమ్‘ ఇతి శ్రుతే:. పుండరీకాకారే ఉభే ఆక్షిణీ యస్యేతి వా. ధర్మలక్షణం కర్మ అస్యేతి వృషకర్మా. ధర్మార్థ మాకృతిః శరీరం యస్య స వృషాకృతిః ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే‘ ఇతి భగవద్వచనాత్ ॥

(104)౧౦౪. వసుః
  భూతముల సర్వభూతములు తనయందే ఉన్న వాడును తాను సర్వ యందున్న వాడును ఐసు శబ్దవాచ్యు డగును. ‘వసువులలో పావకుడను నేను‘, అను భగవద్వచనమునుబట్టియు పర మేశ్వరుడు వసుస్వరూపుడు అని తెలియనగును.

(105)౧౦౫. వసుమనాః -
  ధనవాచకమైన వసు శబ్దము ఇక్కడ ప్రాశస్త్యపఠము. వసు - ప్రశస్తం, మనో యస్య సః - అను వ్యుత్పత్తితో ప్రశస్తమైనమనస్సుశలవాడు, అనగా రాగ ద్వేషాదులతో గాని మద - మాత్సర్యాదులతో గాని కలుషితము కాని మనస్సు కలవాడు కాన ‘వసుమనాః‘ యని పిలవబడును.

(106)౧౦౬. సత్యః-
  ‘సత్యం జ్ఞాన మనన్తం బ్రహ్మ‘ అను శ్రుతినిబట్టి సత్య స్వరూపుడు అగుటచేతను లేదా ‘సచ్చ త్యచ్చాభవత్’ అను శ్రుతిననుసరించి ‘సత్‘- మూ ర్తస్వరూపము ‘త్యత్‘ అమూ ర్త స్వరూపము అగుటచేతను ‘సత్యః‘ అనబడును. మరియు సత్య శబ్దములోని ‘సత్‘ శబ్దమునకు ప్రాణములనియు ఆ పై ‘త‘ కారమునకు అన్న మనియు ఆపై ‘యమ్‘ నకు ఆదిత్యుడనియు సత్యశబ్దార్ధము శ్రుతిచే వివరింపడుటవలన ప్రాణ - అన్న- ఆదిత్య రూపుడగు పరమేశ్వరుడు ‘సత్యః‘ అను నామము చేత స్తుతింప బడుచున్నాడనియు, సత్ఫరుషుల యందు సాధుత్వము కలవాడగుటవలనగూడ ‘సత్య:‘ యనబడు ననియు తెలియనగును.

(107)౧౦౭. సమాత్మా-
  సమః- రాగ ద్వేషాదులచే దూషితము కానట్టి ఆత్మా- మనస్సు కలవాడు; లేదా సర్వభూతములయందును సమమగు- ఏకమగు - ఆత్మ కలవాడు కాన ‘సమాత్మా‘ యనబడును. ఈ విషయము ‘సర్వ భూతేషు సమ ఆత్మా‘ ఇత్యాది శ్రుతులచే సిద్దము. ౧౦౮. అసమ్మితః -
  సర్వపదార్ధములచేత పరిచ్ఛిన్నుడు, సమ్మితుడు, సర్వ పదార్థములచేత అపరిచ్ఛిన్నుడు - అమితుడును కనుక ‘అసమ్మితః‘ యని చెప్పబడును.

(109)౧౦౯. సమః -
  సర్వకాలములయందు సర్వవికారరహితుడు, లేదా మా - లక్ష్మీ దేవి ఆమెతో కూడ నుండువాడు గాన ‘సమః’ అని ప్రస్తుతింపబడుచున్నాడు.

(110)౧౧౦. అమోఘః-
  పూజింపబడి స్తుతింపబడి సంస్మరింపబడి సర్వఫలముల నిచ్చువాడును, వృథా చేయనివాడును, ’సత్యసంకల్పః ’ అను శ్రుతిని బట్టి మోఘము కాని సంకల్పము కలవాడును అగుటచే ‘అమోఘ’ శబ్దముచే పరిలక్షితుడగుచున్నాడు.

(111)౧౧౧. పుండరీకాక్షః -
  యత్పుండరీకం పురమువ్యసంస్థమ్ అను శ్రుతి ననుసరించి హృదయపుండరీకమును వ్యాపించి అట ఉపలక్షింపబడు వాడును, పుండరీకాకృతి గల నేత్రములు కలవాడును, అగుట వలన ‘పుండరీకాక్ష’ నామమున బరగుచున్నాడు.

(112)౧౧౨. వృషకర్మా-
  ధర్మలక్షణ మయిన కర్మ కలవాడు గాన ‘వృషకర్మా‘ యనియు.
  ౧౧౩, వృషాకృతిః-
  ‘ధర్మసంస్థాపనార్ధాయ సంభవామి‘ అను భగనద్వచ నానుసారము ధర్మార్థము ఆకృతి - శరీరము - కలవాడు గాన ‘వృషాకృతిః‘ యనియు చెప్పబడుచున్నాడు.
  శ్లో॥ రుద్రో బహుశిరా బభ్రు ద్విశ్వయోనిః శుచిశ్రవాః |
  అమృత శ్శాశ్వతిస్థాణుః వరారోహో మహాతపాః ॥ 26
  శx. భా. : - సంహారకాలే ప్రజా స్సంహరన్ రోదయతీతి రుద్రః. రుదం,రాద దదాతీతి వా రు: దుఃఖం, దుఃఖకరణం వా ద్రావయతీతి వా రుద్రః, రోదనాత్ ద్రావణాద్వஉపి రుద్ర ఇత్యుద్యతే. “jgర్దు:ఖం దుఃఖ హేతుం వా తద్ద్రావయతి యః ప్రభుః రుద్ర ఇత్యు చ్యతే అన్మాచ్ఛివః పరమకారణమ్“ ఇతి శివపురాణ వచనాత్ బహుశిరా: - బహూని శిరాంపి యస్యేతి బహుశిరాః. ‘సహస్రశీర్షా పురుషః‘ ఇతి మన్త్రవర్ణాత్, బిభర్తి లోకానితి బభ్రుః, విశ్వస్య కారణత్వాత్ విశ్వయోనిః శుచీని శ్రవాంపి నామాని శ్రవణీయా న్యస్యేతి శుచిశ్రవా:, న విద్యతే మృతం మరణ మస్యేతి అమృతః. ‘అజరోஉమరః‘ఇతి శ్రుతేః. శాశ్వతశ్చాసౌ స్థాణు శ్చేతి శాశ్వతస్థాణుః. వర ఆరోహాஉకో యస్యేతి వరారోహః వర మారోహణం యస్మిన్నితి వా ఆరూఢానాం పునరావృత్త్యసంభవాత్. ‘న చ పునరావర్తతే‘ ఇతి శ్రుతే: యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ‘ ఇతి భగ్వవద్వచనాత్, మహత్ సృజ్యవిషణం తపోజ్ఞాన మస్యేతి మహాతపాః. ‘యస్య జ్ఞాసమయం తపః‘ ఇతి శ్రుతేః ఐశ్వర్యం ప్రతాపో వా తపో మహ దస్యేతి వా మహాతపా: ॥
  ౧౧ర. రుద్రః-
  సంహార కాలమందు ప్రజలను సంహరించుచు దుఃఖింప జేయువాడు, దు:ఖము నిచ్చువాడు, రుర్దు:ఖం దుఃఖ హేతుం వా’ అను శివపురాణవచనానుసారము దుఃఖమ్మను దుఃఖ కారణమును పోగొట్టువాడును అగుటచేత ‘రుద్ర’సంజ్ఞతో నొప్పును.

(115)౧౧౫. బహుశిరాః -
  ‘సహస్రశీర్షా పురుషః’ అను శ్రుత్యనుసారము బహు శిరస్సులుకలవాడు కాన బహుశీర్షా:’ యనబడును.

(116)౧౧౬. బభ్రుః-
  లోకములను భరించువాడు గాన ‘బభ్రుః’అనియు.

(117)౧౧౭. విశ్వయోనిః-
  విశ్వమునకు కారణ మయిన వాడగుటచే ‘విశ్వయోనిః’ అనియు చెప్పబడుచున్నాడు.

(118)౧౧౮. శుచిశ్రవాః-
  శుచియు, శ్రవణీయములు నయిన నామములు కల వాడు గాన పరమేశ్వరునకు ‘శుచిశ్రవాః’ ' యను నామము ప్రసిద్ధము.

(119)౧౧౯. అమృతః-
  మరణరహితుడు గాన ‘అమృత’ శబ్దముచే కీర్తింపబడుచున్నాడు. ఇది ‘అజరోஉమర:’ అను శ్రుతిచే సిద్ధము.

(120)౧౨౦. శాశ్వతస్థాణుః —
  శాశ్వతుడగు నిశ్చలస్వరూపుడగుటచే ‘శాశ్వతస్థాణుః’ అనబడును.

(120)౧౨౦. వరారోహః-
  శ్రేష్ఠమయిన అంకము కలవాడు, శ్రేష్ఠమయిన ఆరోహణమునకు ఆధార మయినవాడును, ఆ యంకమున ఆరూఢులయిన వారికీ ‘సంచ పుననరావర్తతే’అను శ్రుతుని పట్టియు ‘యద్గత్వాన నివర్తన్తే తద్దామ పరమం మమ‘ అను భగవ ద్వచనానుసారమవనకు పునరావృత్తి సంభవింపది గాన పరమేశ్వరుడు ‘వరారోహ‘ శబ్దముచే చెప్పబడుచున్నాడు.

(122)౧౨౨. మహాతపాః
  సృష్టి విషయమైన మహాజ్ఞానము కలవాడు. ‘యస్య జ్ఞానమయం తపః‘ అను శ్రుతిని బట్టి ఇక్కడ తపస్సు - జ్ఞానము, లేదా తపః - ఐశ్వర్యము, లేక ప్రతాపము అధికముగా గలవాడు నగుటచే ‘మహాతపాః‘ యని పిలవబడుచున్నాడు.
  శ్లో ॥ సర్వగః సర్వవిద్భాను స్వష్వక్సేనో జనార్దనః |
  వేదో వేదవి దవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః ॥ ౨౭
  శం.భా. - సర్వక గచ్ఛతీతి సర్వ: కా ఐత్వేన ప్యాప్తత్వా త్సర్వత్రి, సర్వం వేత్తి విన్దతీతి నా సర్వవిత్, ఛాతీతి భావః. ‘తమేవ భాన్త మనుభాతి సర్వమ్‘ ఇతి శ్రుతేః. యదాదిత్యగతం తేజో జగ ద్భాస యతేஉఖిలమ్’ ఇత్యాది స్మృతేశ్చ, సర్వనిచ్చాసా భానుశ్చ సర్వవిద్భానుః విష్వక్ - అవ్యయం సర్వే య్యర్థే విష్వగంచతి- పలాయతే దైత్యసేనా యస్య రణోద్యోగమాప్రేణేతి విష్వక్పేసిః, జనాన్ దుర్జనా నిర్దయతి హీనస్తి. ‘నరకాదీన్ గమయుతీతి వా జనార్దనః జనైః పురుషార్ధ మభ్యునయ నిశ్శ్రేయ సలక్షణం యాచ్యతే ఇతి జనార్దనః. వేదదూపత్వా ద్వేద: వేదయతీతి వా వేదః, “తేషామేవాஉనునింపార్థ మహ యజ్ఞానజం తమః | నాశయా మ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత” ఇతి భగbద్వచనాతd.
  యథావ ద్వేదం వేదార్థం చ వేత్తీతి వేదవిత్, ‘వేదాన్తకృ ద్వేదవిదేవ చాహమ్’ ఇతి భగవద్వచనాత్.
  శ్లో॥ “సర్వే వేధాః సర్వవేద్యాః సశాస్త్రా:
  సర్వే యిజ్ఞాః స్వు ఇజ్యాశ్చ కృష్ణః |
  విదుః కృష్ణం బ్రాహ్మణా స్తత్త్వతో యే
  తేషాం రాజన్ పర్వయజ్ఞా స్సమాప్తాః ॥
  ఇతి మహాభారతే. అన్య - గః- జ్ఞానా... భిః పరిపూర్ణోஉవికల ఇతి ఉచ్యతే, ప్యంగో వ్యక్తిర్వ విద్యతే ఇతి అవ్యంగో వా. ‘అవ్యక్తోஉయమ్’ ఇతి భగవద్వచనాత్, వేదా అంగభూతా యస్య స వేదాంగః వేదాన్ విన్తే - విచార యతీతి వేదవిత్, క్రాన్తదర్శీ కవిః. సర్వదృక్. ‘నాన్యోஉతో స్తిద్రష్టా‘ ఇత్యాతి శ్రుతే. ‘కవిర్మనీషీ’ ఇత్యాది మన్త్రవర్ణాత్ ॥ ౧౨౩. సర్వగః-
  సర్వకారణ మగుటచే సర్వత్ర వ్యాప్తమై యున్న వాడు కాన ‘సర్వగః‘ యని చెప్ప బడుచున్నాడు.

(125)౧౨౫. సర్వవిద్భానుః-
  సర్వము తెలిసినవాడు, సర్వము ప్రాప్త మయిన వాడును, ఆయన ప్రకాశము ననుసరించియే సర్వము ప్రకాశించుచున్నదనియు, ఆదిత్యాది గతమగు తేజస్సు పరమాత్మదే అనియు నుద్ఘోషించు శ్రుతిస్మృతుల ననుసరించి ప్రకాశ స్వరూపుడు, భానువు, కనుక ‘సర్వవిద్భానుః‘ అని స్తుతింప బడుచున్నాడు.

(125)౧౨౫. విష్వ క్సేనః-
  సర్వదైత్య సేనను తన యుద్ధోద్యమమాత్రమున పలాయనము చేయించువాడు కాన ‘విష్వక్సేన‘ శబ్దముచే సంకీర్తనము చేయబడుచున్నాడు.

(126)౧౨౬. జనార్దనః-
  దుర్జనులను హింసించువాడు, సరకాదులను పొందించువాడును, అభ్యుదయ - నిశ్శ్రేయస - లక్షణ మయిన పురుషార్ధ మును గూర్చి జనులచే యాచింపబడువాడును అగుటచే పరమేశ్వరుడు ‘జనార్ధన’ నామముచే సంకీర్తితుడగుచున్నాడు.

(127)౧౨౭. వేదః-
  వేదస్వరూపుడు, వేదయతి - తెలియజేయువాడును, కనుకనే వారియం దనుగ్రహముచేత నేను వారి యందుండి వారి అజ్ఞానమును పోగోట్టుచున్నా నని భగద్వచనము చెప్పుచున్నది కాన ‘వేద: ‘ యని చెప్పబడుచున్నాడు.

(128)౧౨౮. వేదవిత్-
  యథాతధముగా వేదము వేదార్థము తెలిసినవా డగుటచే ‘వేదవిత్‘ అని చెప్పబడుచున్నాడు. వేదా న్తకృత్ వేద విదేవచాహమ్ అను భగవద్గీతా వచనము పై విషయమును స్ఫురింపజేయును. మహాభారతములో- సర్వవేదములు, సర్వవేద్యములు, సర్వశాస్త్రములు, సర్వయజ్ఞములు, సర్వ పూజనీయ దేవతలు, కృష్ణుడే అని తత్త్వతః తెలిసికొనిన బ్రాహ్మణులకు సర్వయజ్ఞసమాప్తి ఫలము లభించునని చెప్పబడినది.

(129)౧౨౯. అవ్యంగః-
  జ్ఞానాదులచేత పరిపూర్ణుడు, అవికలుడు, ‘అవ్యక్తోஉయమ్‘ అను భగవద్వచనము ననుసరించి వ్యక్తము కానట్టి వాడును అగుటవలన ‘అవ్యంగ‘ నామముతో విరాజిల్లు చుండును.

(130)౧౩౦. వేదాంగః-
  వేదములు అంగములుగా నున్న వాడు కాన ‘వేదాంగః‘ యనియు కీర్తింపబడుచున్నాడు.

(131)౧౩౧. వేదవిత్-
  వేదములను విచారణ చేయువాడు గాన ‘వేదవిత్‘ అనియు చెప్పబడుచున్నాడు.

(132)౧౩౨. కవిః -
  ‘నాన్యోஉతో స్తి ద్రష్టా‘ అను శ్రుతి ననుసరించి సర్వ ద్రష్ట యగుట చేతను ‘కవిర్మనీషి‘ అను శ్రుతియు సర్వద్రష్టృత్వ మునే ప్రతిపాదించుచుండుట చేతను పరమేశ్వరుడు ‘కవి‘ శబ్ద వ్యప దేశ్యు డగుచున్నాడు.
  శ్లో॥ లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యకః కృతాకృతః |
  చతురాత్మా చతుర్వ్యూహ శ్చతుర్దంష్ట్ర శ్చతుర్భుజః |
  శం భా : - లోకా నధ్యక్షయతీతి లోకాధ్యక్షః, సర్వేషాం లోకానాం ప్రాధాన్యేనోసద్రష్టా. లోకపాలాది సురాణా మధ్యక్షః సురాధ్యక్షః, ధర్మా ధర్మౌ సాక్షా దీక్షతేஉనురూపం ఫలం దాతుం, తస్మా ద్ధర్మాధ్యక్షః, కతృశ్చ కార్యరూపేణ, అకృతిశ్చ కారణరూపేణేతి కృతాకృతిః, సర్గాదిశు పృధగ్వి భూతయః చతస్రః ఆత్మానో మూర్తయో యస్య సః చతురాత్మా.
  శ్లో॥ “బ్రహ్మా దక్షాదయః కాల స్తథైవాఖిలజ స్తవః |
  విభూతయో హరెరేతా జగత స్సృష్టి హేతవః ॥
  “విష్ణు ర్మన్వాదయః కాల స్సర్వభూతాని చ ద్విజ |
  స్థితే ర్నిమి త్తభూతస్య విష్ణోరేతా విభూతయః ॥
  “రుద్రః కాలోஉన్తకాద్యాశ్చ సమస్తాశ్చైవ జన్తవః |
  చతుర్థా ప్రలయాయైతా జనార్దనవిభూతయః ॥
  - ఇతి వైష్ణవపురాణే.
  శ్లో ॥ “వ్యూహ్యాత్మానం చతుర్థా వై వాసుదేవాదిమూర్తిభిః |
  సృష్ట్యాదీన్ ప్రకరోత్యేష విశ్రుతాత్మా జనార్ధనః“
  - ఇతి వ్యాసవచనాత్ చతుర్వ్యూహః

(133)౧33. లోకాధ్యక్ష:-
  సర్వలోకములను ప్రధానముగా చూచుచుండువాడు గాన ‘లోకాధ్యక్ష‘ శబ్దము చేతను,

(134)౧3౪. సురాధ్యక్ష: -
  లోకపాలాది దేవతలకు అధ్యక్షుడు కాన ‘సురాధ్యక్షు ’ పదము చేతను,

(135)౧3౫. ధర్మాధ్యక్షః-
  ధర్మాధర్మములకు తగిన ఫల మిచ్చుటకై సాక్షాత్తుగ నీక్షించువాడు కాన ; ‘ధర్మాధ్యక్ష ’ శబ్దము చేతను ప్రస్తుతింప బడుచున్నాడు.