విష్ణుసహస్రనామ-శంకరభాష్యం : వెన్నుని వేయి పేర్లు - 12
(936)౯౩౬. చతురశ్ర: -
'చతురశ్ర:' యనగా న్యాయసమ వేతుడని యర్థము. పరమాత్మ, కర్మానురూపమయిన ఫలము నొసంగుచు న్యాయము ననుసరించునట్టి వాడు గావున, 'చతురశ్ర:' యను నామము చే ధ్యాతవ్యుడు.
(937)౯౩౭. గభీగాత్మా -
ఇట్టిదని తెలిసికొన శశ్యము కానట్టి స్వరూపము - చిత్తము కలవాడు గాన, పరమేశ్వరుడు 'గభీరాత్మా' యను సార్థకనామమున విరాజిల్లుచుండును.
(938)౯౩౮. విదిశ: -
వివిధ ఫలములను ఆయా అధికారులకు విశేషించి యిచ్చువాడు కాన శ్రీహరి 'విదిశః' యనుచు స్తుతింపబడును.
(939)౯౩౯. వ్యాదిశ: -
శ్రీహరి, ఇంద్రాదులకు వివిధములయిన యాజ్ఞల నిచ్చువాడు గనుక 'వ్యాదిశ:' యనుచు భజింపబడుచున్నాడు.
(940)౯౪౦. దిశ: -
సమస్త కర్మఫలములను వేదరూపమున నిచ్చునట్టివాడు గావున పరమాత్మకు ' దిశ:' యను నామ మన్వర్థము.
శ్లో॥ “అగాది: భూర్భువో లక్ష్మీ స్సువీరో రుచిరాంగదః |
జననో జనజన్మాది ర్భీమో భీమపరాక్రమః' || ౧౧ర
శ. భా :- ఆది: కారణ మస్య న విద్యతే ఇతి. అనాది:. సర్వకారణ త్వాత్ భూర్భువ:. భూ: ఆధారః. భువ: సర్వభూతాశ్రయత్వేన ప్రసిద్దాయా భూమ్యా, భువోపి భూదితి, భూర్భువః, అథవా. న కేవల మసౌ భూః, భువః లక్షీ: శోభాచేతి. భువో లక్ష్మీ:, అథవా. భూ: భూర్లోక:, భువః భువర్లోక లక్ష్మీ: అత్య తివ్యా 'ఆత్మ విద్యా చ దేవత్వమ్ ' ఇతి శ్రీ తౌ భూమ్యన్త రిక్షియో శ్శోభేతివా, భూర్భువో లక్ష్మీః, సువీరః - శోభనా వివిధా ఈరాగతయో యస్య సః సువీర: రుచిరాంగద: జన్తూన్ జనయత్ శోభనం వివిధమ్ ఈర్తే ఇతివా సువీ: జనన: 'ట్యుడ్విధౌ బహు: గ్రహణాత్ కర్తరి ట్యుట్. నిత్య: ప్రోగ వచనాదివత్. జనస్య జనిమతో జన్య ఉద్భవ:. శష్యా: మూలకారణమితి. జనజన్మాది, భయహేతుత్వాత్ బీరు: 'భీకారమోஉ సాదానే' ఇతి విపాతనాత్. 'మహద్భయం వజ్ర ముద్యతమ్' ఇతి శ్రుతే:. అసురాధీనాం భయహేతుః పరాక్రమోஉప్యావతారే ష్విత, భీమపరాక్రమ:
(941)౯౪౧. అనాదిః -
ఆదిః' అనగా కారణము". పరమాత్మ సర్వకారణ మగుట చేత, తనకు కారణము లేనట్టినాడు గాన ‘అనాది: ‘ అను సార్థక నామమునే సంకీర్తనీయుడు.
(942) ౯౪౨. భూర్భువః ౯౪౩. లక్ష్మీ: -
భువః = సర్వభూతాశ్రయముగ ప్రసిద్ధమయిన భూమికి గూడ భూః = ఆధారమయి యున్న వాడు, కాన పరమాత్మ ‘భూర్భువః' యను నామముచే భజనీయుడగుచున్నాడు.
మరియు, 'భువ:' యనగా లక్ష్మి యనియు చెప్పికొననగును. ఆ పరమాత్మ కేవలము భూమికి ఆధారము మాత్రమే గాక ఆ భూమి 'లక్ష్మీ: '- శోభగూడ అయి యున్నవాడగుట చేతను “భూర్భువః' యను నాముము ఆ పరమాత్మయందన్వర్థము. 'భువో లక్ష్మీ:' యనియు చెప్పబడును.
ఇంతేకాదు. భూః - భూర్లోకము. భువః - భువర్లోకము, లక్ష్మీః - ఆత్మవిద్య, కనుకనే శ్రీస్తుతిలో 'ఆత్మ విద్యా చ దేవిత్వమ్' అని చెప్పబడినది. కాన, భూర్భువోలక్ష్మీ: - భూర్లోక- భువర్లోక- ఆత్మవిద్యా- స్వరూపుడు, భూమ్యంతరిక్షములకు శోభయై నొప్పు నట్టివాడును గాన పైనామముచే ధ్యానింప బడుచున్నాడు.
(944)౯౪౪. సువీరః -
శోభములగు వివిధములగు ' ఈర' - గతులు కలవాడు, శోభనము, వివిధములగు కంపనము - స్ఫురణము - కలవాడగుటవలన శ్రీహరి 'సువీర' శబ్దవాచ్యుడు.
(945)౯౪౫. రుచిరాంగదః -
రుచిరములయిన అంగదములను అలంకారములుగ కలవాడు గాన శ్రీ మహావిష్ణువు 'రుచిరాంగదః' యను నామముచే స్తోతవ్యుడగుచున్నాడు.
(946)౯౪౬. జననః -
జంతువులను (పాణులను) జినింపజేయునట్టి వాడు గాన పరమాత్మ 'జనన:' యను సార్థకనామమయిన బరగుచుండును. ఇట 'జన' ధాతువుకు 'ల్యుట్' ప్రత్యయము కర్త్రర్థక మని తెలియనగును.
(947)౯౪౭. జనజన్మాది: -
జన్మించువారి జన్మకు మూలకారణమయినవాడు గాన శ్రీహరి 'జనజన్మాది:' యని ధ్యానింపబడుచుండును.
(948)౯౪౮. భీమః -
భయ హేతువయిన వాడు గాన పరమేశ్వరుడు 'భీమ' శబ్దాభిధానమున విరాజిల్లుచున్నాడు. 'మహద్భయం వజ్ర ముద్యతమ్' అనుచు శ్రుతి పరమాత్మ యొక్క భీమత్వమును ప్రతిపాదించుచున్నది.
(949)౯౪౯. భీమప రాక్రమః
అవతారసమయమున అసురాదులకు భయహేతువయిన పరాక్రమము గలవాడు గాన శ్రీమహావిష్ణువు 'భీమపరాక్రమః' యని స్తుతింపబడుచున్నాడు.
శ్లో|| ఆధారనిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః |
ఊర్థ్వగ స్సత్పథా చారః ప్రాణదః ప్రణవః పణః” ||
శంకర భాష్యము ;- పృథి వ్యాదీనాం పంచభూతానా మాధారాణా మాధారత్వాత్, ఆధార నిలయః. స్వాత్మనా ధృతస్యాஉస్య అన్యో ధాతా నా స్తీతి. ఆధాతా. 'నద్యుతశ్చ' ఇతి సమాసాన్త విధ గనిత్య:. ఇతి కప్రత్యయాஉభావ:, సంహార సమయే సర్వా: ప్రజాః ధయతి, పిబతీతివా. ధాతా. 'ధేట్ పానే' ఇతి ధాతుః, ముకులాత్మనా స్థితానాం పుష్పాణాం హాసవత్. ప్రపంచ రూపేణ వికాసోஉస్యేతి, పుష్పహాస: నిత్య ప్రబుద్ధ స్వరూపత్వాత్ ప్రకర్షేణ జాగర్తీతి. ప్రజాగర:. సర్వేషా ముపరితిష్ఠన్. ఊర్థ్వగ:. సతాం కర్మాణి సత్పథాః, తా నాచరత్యేష ఇతి. సత్పథాచారః:, మృతాన్ పరిక్షి త్ప్రభృతీన్ జీవయన్, ప్రాణదః, ప్రణవోనామ పరమాత్మనో వాచక ఓంకార:, తద భేదోపచారేణాஉయం ప్రణవః పణతి ర్వ్యవహారార్ధః తం కుర్వన్, ప: 'సర్వాణి రూపాణి వివిత్యధీరో నామాని. కృత్వాஉఖివదన్ యదాస్తే' ఇతి శ్రుతేః పుణ్యాని సర్వాణి కర్మాణి పణం సంగృహ్య అధికారిభ్య స్తత్ఫలం ప్రయచ్ఛతీతి వా, లక్షణయా పణః.
(950)౯౫౦. ఆధారనిలయః -
నిఖిల జగమున కాధారభూతములయిన పంచభూతములకు నాధారమై వెల్గొందుచుంకువాడు గావున శ్రీహరి ‘ఆధారనిలయ:' యనుచు స్తవము చేయబడుచున్నాడు.
(951)౯౫౧. ఆధాతా (ధాతా) -
స్వస్వరూపము చేతనే ధరింపబడిన వాడగుట చేత, ఆ పరమాత్మను ధరించెడిది అన్య మేదియు లేనట్టివాడు గనుక శ్రీమహావిష్ణువు 'అధాతా' యని భక్తులచే ధ్యానింప బడుచున్నాడు, మరియు, 'ధాతా' యని పదచ్చేదము చేసినచో, సంహార సమయమున సర్వప్రజలను పానము చేయువాడని చెప్పికొన నగును. 'ధాతా' యందలి 'ధా' ధాతువు పానార్థకముగ గుర్తింపుగును.
(952)౯౫౨. పుష్పహాస: -
మొగ్గగానున్న పుష్పములకు వికాసమువలె ప్రపంచరూపమున వికాసము గలవాడు. గాన, పరమాత్మ 'పుష్పహాస: ' యను నామముచే స్తోతవ్యుడగుచున్నాడు.
(953)౯౫౩. ప్రజాగర: -
నిత్య ప్రబుద్ద స్వరూపుడగుట చేత పరమాత్మ ప్రకృష్టమైన జాగృతి కలవాడు గాన 'ప్రజాగరః' యను నామముచే ధ్యాతవ్యుడగుచున్నాడు.
(954)౯౫౪. ఊర్ధ్వగః -
సర్వులకును మీద నున్న వాడు కనుక 'ఊర్థ్వగః' యను శబ్దముచే చెప్పబడును.
(955)౯౫౫. సత్పథాచారః -
సత్పురుషుల కర్మల నాచరించు వాడు గావున శ్రీహరి 'సత్పథాచార:' యను నామమున బరగుమ.
(956)౯౫౬. ప్రాణదః -
మృతులయిన పరీక్షి త్ప్రభృతులను జీవింపజేసిన వాడు గావున శ్రీహరి 'ప్రాణదః' యను నామముచే ధ్యాతవుడగుచున్నాడు.
(957)౯౫౭. ప్రణవ: -
ప్రణవమనగా పరమాత్మవాచక మగు ఓంకారము. అట్టి ప్రణవముతో అభేదవివక్షచే పరమేశ్వరుడు 'ప్రణవ' శబ్ద వ్యపదేశ్యుడగుచున్నాడు.
(958)౯౫౮. పణ: -
'పణ' ధాతువు వ్యవహారార్థకము కాన, నామకరణాది వ్యవహారము చేయు వాడగుటచే పరమాత్మ 'పణ' శబ్ద వాచ్యుడగుచున్నాడు. ఈ విషయమునే 'సర్వాణి రూపాణి విచిత్య ధీరో నామాని కృత్వాஉభివదన్ యదాస్తే' యనుచు శ్రుతి యుద్ఘోషించుచున్నది.
మరియు, సకల పుణ్యకర్మలను తాను పణముగ స్వీకరించి ఆయా అధికారులకు తత్తఫలముల నిచ్చువాడు కనుక ‘పణ' శబ్దము లక్షణ చేత పరమాత్మ చెప్పబడును.
శ్లో! | ప్రమాణాం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః |
తత్త్వం తత్త్వవి దేకాత్మా జన్మమృత్యుజ రాతిగ: ||
శంకర భాష్యము : - ప్రమితి: సంవిత్ స్వయంప్రమా. ప్రమాణామ్ - 'ప్రజ్ఞావన బ్రహ్మ' ఇతి శ్రుతే:.
శ్లో॥ 'జ్ఞానస్వరూప మత్యన్త నిర్మలం వరమార్థతః |
తమేవాஉర్ధస్వరూపేణ భ్రాన్తి దర్శనతః స్థితమ్' ||
ఇతి విష్ణు పురాణే ||
ప్రాణనిలయ: - ప్రాణా ఇన్ద్రియాణి యత్ర జీవే విలీయన్తే, తత్పర తన్త్ర త్వాత్. దేహస్య ధారకా: ప్రాణాపానాదయో వా తస్మి న్నిలీయన్తే. ప్రాణితీతి ప్రాణోజీవ: పరే పుంపి విలీయత ఇతి వా. ప్రాణాన్ జీవాంశ్చ సంహరన్నితివా. ప్రాణనిలయ: పోషయ న్నన్నరూపేణ ప్రాణాన్, ప్రాణభృత్. ప్రాణినో జీవయన్ ప్రాణాభ్యై: పవనై:, ప్రాణజీవనః
శ్లో॥ 'నప్రాణేన నాపానేన మర్త్యో జీవతికశ్చన |
ఇత రేణ తు జీవన్తి యప్మి న్నేతా వుపాశ్రితా' ఇతి మన్త్రవర్ణాత్.
తత్త్వం, తథ్య మమృతం. సత్యం. పరమార్థత: సతత్త్వ. మిత్యేతే ఎకార్థవాచిన: పరమార్థ సతో బ్రహ్మణ: వాచకా శ్శబ్దా: తత్త్వం స్వరూపం యథావత్ వేత్తతి, తత్త్వవిత్, ఏకశ్చాసా వాత్మా చేతి. ఏకాత్మా. 'ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత' ఇతి శ్రుతే: ||
శ్లో || యచ్చాప్నోతి యదా దత్తె యచ్చాత్తి విషయా విహ|
యచ్చాస్య సన్తతో భావ న్తస్మా దాద్మేతి గీయతే ||
ఇతి స్మృతేశ్చ.
జాయతే. ఆస్తి. పర్థతే. విపరిణమతే. ఆపక్షీయతే. నశ్యతి. ఇతి షడ్భావ వికారా నతీత్యగచ్చ తీతి. జన్మమృత్యు జరాతిగః, 'న జాయతే మ్రియతే వా విపశ్చిత్' ఇతి మన్త్రవర్ణాత్.
(959)౯౫౯. ప్రమాణమ్ -
'ప్రజ్ఞానం బ్రహ్మ' అను శ్రుతి వచనానుసారము 'ప్రమితి' యనబడు స్వయం ప్రమాత్మిక మై యొప్పువాడు గాన శ్రీహరి 'ప్రమాణమ్' యను నామముచే స్తుతింపబడును. 'జ్ఞానస్వరూప మత్యన్త నిర్మలం' - అను శ్లోశమున “పరమాత్మ; పరమార్థతః అత్యంత నిర్మలమయిన జ్ఞానస్వరూపమయి యుండి భ్రాంత దృష్టికి పదార్థరూపమున నుండె నని విష్ణుపురాణము చెప్పుచున్నది.
(960)౯౬౦. ప్రాణనిలయః
ప్రాణములు- ఇంద్రియములు - ఏ జీవాత్మయందు లీనమగుచుండునో, త త్పరతంత్రమలగుటచే దేహధారకములగు ప్రాణాపానాదులును ఎక్కడ ఎక్కడ విలీన మగుచుండునో అట్టి జీవాత్మ (పరమాత్మ) 'ప్రాణనిలయః' యనుచు స్తోతవ్వుడగుచున్నాడు. 'ప్రాణ' శబ్దము 'ప్రాణితీతి ప్రాణః' అను వ్యుత్పత్తి ననుసరించి జీవవాచకము. అట్టి జీవుడును ఎక్కడ లీనమగుచుండునో, ప్రాణములను - జీవులను - సంహరించు వాడగుచుండెనో అట్టి స్వరూపము 'ప్రాణనిలయ' శబ్ద వ్యపదేశ్యము.
(951)౯౫౧. ప్రాణభృత్ -
అన్నరూపమున ప్రాణములను పోషించు చుండును గాన పరమాత్మ 'ప్రాణభృత్ ' యని ధ్యానింప బడుచున్నాడు.
(952)౯౫౨. ప్రాణజీవన: -
ప్రాణులను ప్రాణవాయువుచే జీవింప జేయు వాడుగాన శ్రీమహావిష్ణువు 'ప్రాణజీవన:' యను సార్థక నామమున విరాజిల్లుచుండును. న ప్రాణేన నా పానేన పర్యో జీవతి కశ్చన' - అను మంత్రవర్ణన 'మర్యు డెవ్వడును కేవలము | ప్రాణాపానముల చేతనే జీవించుట లేదు; ఈ ప్రాణాపానములు ఎవని యందు ఆశ్రయించి యన్నవో ఆ పరమేశ్వరుని చేత జీవించు చుండెనని చెప్పుచున్నది.
(953)౯౫౩. తత్వమ్ -
తథ్య మమృతం సత్యం పరమార్ధత: సతత్వము - అనునవి ఏకార్థవాచకములు. పరమార్థ సత్తయయిన బ్రహ్మను బోధించును గాన 'తత్వమ్' శబ్దముచే పరబ్రహ్మ మనవ్యు డగుచున్నాడు.
(954)౯౫౪. తత్త్వవిత్ -
స్వరూపమును యథావత్తుగ తెలిసిన వాడు గాన పరమేశ్వరుడు ' తత్వవిత్ ' యనుచు స్తవము చేయబడును.
(955)౯౫౫. ఏకాత్మా -
ఆత్మా వా ఇ మెక సఏవాగ్ర ఆసీత్ అను శ్రుతి వచనము ననుసరించి ఏకమే అయినచ్చి ఆత్మ గాన పరమాత్మయందు ఏతాత్మ యను నామ మన్వర్థము. యచ్చాప్నోతి యదాద తే యను స్మృతి వచనము గూడ విషయములను పొందువాడు, స్వీకరించువాడు, భక్షించువాడు, సదా వర్తమానుడు అగుటచేత ఆత్మ యనబడు చుండెనని చెప్పుచున్నది.
(966)౯౬౬. జన్మమృత్యుజరాతిగ: -
'న జాయతే మ్రియతే వా విపశ్చిత్' - అను మంత్ర వర్ణానుసారము జన్మ మొదలు మరణాంతము గల షడ్భాన వికారములకు (జాయతే, అస్తి, పర్థతే, వివనీణమేత, అపక్షీయతే, నశ్తి) అతీతుడై యున్నవాడు గాన పరమేశ్వరుడు 'జన్మమృత్యు జరాతిగః' యను సార్ధక - మమున విరాజిల్లుచుండును.
శ్లో | “భూర్భువ స్స్వస్తరు స్తార స్సవితా ప్రపితా మహః |
యజ్ఞో యజ్ఞపతి ర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన:" ||
శంకర భాష్యము ;- భూర్భువస్స్వ స్సమాఖ్యాపి త్రీణివ్యాహృతి రూపాణి శుక్రాణి త్రయీ సారాణి బహ్వృచా ఆహుః తైర్హోమానినా జగత్త్రయం తరతి. ప్లవతేవేతి. భూర్భువస్స్వస్తర: అగౌ ప్రాస్తాహుతి స్సమ్య గాదిత్య ముపతిష్ఠతే ఆదిత్యా జ్ఞాయతే వృష్టి, వృష్టే రన్నం తతి: ప్రజా: ఇతి మనువచనాత్, ఆథవా. భూర్భువస్స్వ స్పమాఖ్యలోకత్రయ సంసార వృక్షో భూర్భువ స్స్వస్తరు: భూర్భువ స్స్వరాఖ్యం - లోకత్రయ సంసార వృక్షవత్ వ్యాప్యతిష్ఠతీతివా, భూర్భువ స్స్వస్తరు: సంసార సాగరం తారయన్, తార:. ప్రణవోవా. సర్వస్య లోకస్య జగతి ఇతి. సవితా పితామహస్య బ్రహ్మణో, పి పితేతి, ప్రపితా మహః యజ్ఞాత్మనా, యజ్ఞ:. యజ్ఞానాం పాతా. స్వామీవా, యజ్ఞపతిః 'అహంహి సర్వ విజ్ఞానాం భోక్తా చ ప్రభు రేవచ' ఇతి భగవద్వచనాత్ యజమానాత్మనా తిష్ఠన్ యజ్వా, యజ్ఞా అంగాన్యస్యేతి వరాహమూర్తి:. యజ్ఞాంగః,
శ్లో. “వేదపాదో యూవదంష్ట్ర, క్రతుహస్తశ్చితీముఖః !
అగ్నిజిహ్వో దర్భరోమా బ్రహ్మశీర్షో మహాతపాః ||
శ్లో॥ అహో రాత్రే క్షణో దివ్యో వేవాంగ శ్రుతి భూషణః |
ఆజ్యనాస స్మృవతుండ సామ ఘోష స్వనో మహాన్ ||
శ్లో॥ ధర్మసత్య మయ శ్శ్రీమాన్ క్రమ విక్రమ సత్ర్కియ: |
ప్రాయశ్చిత్త నఖో ఘోర: పశుజాను ర్మహాభుజః ||
శ్లో॥ ఉద్గాత్రన్త్రో హోమలింగో బీజౌషధి మహాఫల: |
వాయ్వన్తరాత్మా మన్త్ర ఫ్ఫిక్ విక్రమ స్సోమశోణిక: ||
శ్లో॥ వేదిస్కద్ధో హవి రన్గ్ధో హవ్యకవ్యాతి వేగవాన్ |
ప్రాగ్వంశ కాయో ద్యుతిమా న్నానా దీక్షాభి రర్చితః ||
శ్లో ॥ దక్షిణా హృదయో యోగీ మహాసత్ర మయో మహాన్ |
ఉపాకర్మోష్ఠ రుచక:. ప్రవర్గ్యా వర్తభూషణః ||
శ్లో ॥ నానాచ్చన్దో గతిపథో గుహ్యోప విషదాననః |
ఛాయా పత్నీ సహాయోవై మేరుశృంగ ఇవోచ్ఛిత:' ||
ఇతి హరివంశే.
ఫలహేతు భూతాన్ యజ్ఞాన్ వా హయతితి యజ్ఞ హన:.
(967)౯౬౭. భూర్భువస్స్వస్తరు: -
భూః, భువః, సువః - అను వ్యాహృతులు మూడును త్రయీ (వేద) సారములని చెప్పబడుట చేత ఆ వ్యాహృతులచే చేసిన హోమాదికము వలన జగత్త్రయము తరించును - ఉద్దరింపబడును. జగత్త్రయమును తరింపజేయు వ్యాహృతి రూపమున నొప్పువాడు గాన పరమాత్మ 'భూర్భువస్స్వ స్తరు:' యని భక్తగణముచే భజింపబడుచుండును. 'అగ్నౌ ప్రాస్తా హుతి స్సమ్య గాదిత్య ముపతిష్ఠతే - అను మనుస్మృతివచనము - 'అగ్నియందు వేదసారములగు వ్యాహృతులతో ప్రక్షిప్తమగు ఆహుతి ఆదిత్యుని పొందును: ఆదిత్యుని వలన వర్షము కురియను; సృష్టి వలన అన్నము కలుగును; అన్నము వలన ప్రజలు కలుగుదురని చెప్పుచున్నది.
ఇంతేకాదు. భూర్భువ స్స్వర్లోక రూపమగు సంచానృక్ష రూపమయి యొప్పువాడు, భూర్భువస్స్వరాఖ్య మైన లోకత్రయమును వృక్షమువలె వ్యాపించి యున్నవాడు నగుటచే ‘భూర్భువ స్స్వస్తరు: అను నామము పరమేళ్వరునియందు ప్రసిద్ధము.
(968)౯౬౮. తారః -
సంసార సాగరమును తరింపజేయు వాడు, ప్రణవ స్వరూపమై యొప్పువాడు నగుటచే, పరమేశ్వరుడు ‘తార: ‘ యను నామముచే స్తవనీయుడు.
(968)౯౬౮. సవితా -
సర్వలోకజనతుడు గాన శ్రీహరి 'సవితా' యని ధ్యానింపబడుచున్నాడు.
(970)౯౭౦. ప్రపితామహః -
పితామహుడైన బ్రహ్మకును పితయై వాడు గాన ‘ ప్రపితామహః' యని సంకీర్తింప బడుచున్నాడు.
(971)౯౭౧. యజ్ఞ: -
యజ్ఞాత్మకు డగుటచే పరమేశ్వరుడు 'యజ్ఞ ' శబ్ద వాచ్యుడగుచున్నాడు.
(972)౯౭౨. యజ్ఞపతి: -
'అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభు రేవచ" అను భగవద్వచనానుసారము పరమాత్మ యజ్ఞభోక యజ్ఞ పతియు నగుటచే 'యజ్ఞపతి:' యసు నామమున బరగును, ౯౭౩. యజ్వా -.
యజమానరూపమున యజ్వయయినవాడు గాన 'యజ్వా' యను నామఘున విరాజిల్లుచుండును.
(974)౯౭౪. యజ్ఞాంగః -
యజ్ఞములు అంగమ లయి యొప్పు యజ్ఞవరాహమూర్తి గావున పరమాత్మా 'యజ్ఞాంగ:' యను నామముచే ధ్యాతవ్యుడగుచున్నాడు.
హరివంశములో నీక్రింది రీతిగ యజ్ఞవరాహ స్వరూపము వివరింబడినది. 'యజ్ఞవరాహమూర్తి 'వేదములు పాదములుగను, యూగములు దంష్ట్రలుగను, క్రతువులు హస్తములు గల కలిగియున్నాడు. ఆయన చితీరూప ముఖము, అగ్నిరూపము, జిహ్వ, దర్భరూం రోమావళి, బ్రహ్మరూప శిరస్సు అహోరాత్రరూప చక్షుసు, వేదాంగ రూప కర్ణ భూషణములు గలిగి విభ్రాజితుడయ్యెను.
(975) ౯౭౫. యజ్ఞవాహన: -
ఫలదాయములయిన యజ్ఞములను వహిఁప జేయు వాడుగాన, పరమాత్మ 'యజ్ఞ వాహన:' యను నామముచే భజింపబడుచున్నాడు.
387వ పేజీలో శ్లోకము, దానికి అర్థము స్పష్టంగా కనిపించడం లేదు. అందుకనే టైప్ చేయలేదు. గమనించగలరు.
(976)౯౭౬. యజ్ఞభృత్ -
పరమాత్మ యజ్ఞ భర్త, యజ్ఞపాలకుడు నగుటచే యజ్ఞభృత్ యని స్తోత్రము చేయబడును.
(977)౯౭౭. యజ్ఞకృత్ -
జగదాది యందును, అంతమందును యజ్ఞము చేయువాడు, లేక యజ్ఞమును ఛేదించునట్టివాడును గాన శ్రీ మహావిష్ణువు యజ్ఞకృత్ యను నామముచే సంకీర్తింపబడును. ౯౭౮. యజ్జీ -
భగవదారాధనాత్మకములయిన యజ్ఞములకు (ఇక్కడేంటో తెలియలేదు).... ప్రధానము- అయినవాడు గాన యజ్ఞీ యను నామమున వ్యవహరింపబడును.
(979)౯౭౯. యజ్ఞభుక్ -
యజ్ఞము ననుభవించువాడు, పాలించువాడు నగుటచే పరమేశ్వరుడు 'యజ్ఞభుక్' యని ధ్యానింపబడును.
(980)౯౮౦. యజ్ఞసాధనః. -
తన ప్రాప్తికి యజ్ఞములు సాధనములుగ గలవాడు గాన 'యజ్ఞ సాధసః' యనుచు పరమాత్మ సంస్తుతింపబడుచుండును.
(981)౯౮౧. యజ్ఞాన్తకృత్ -
యజ్ఞము యొక్క అంతమును ఫలప్రాప్తిని - కలిగించు వాడు, లేక విష్ణుదేవతాక ఋఙ్మంత్రము కీర్తనముతో కూడిన పూర్ణాహుతితో పూర్ణము కావించి యజ్ఞసమాప్తిని చేయు వాడు కనుక శ్రీహం 'యజ్ఞాంతకృత్ ' యను నామముతో భజనీయుడగుచుండును.
(982)౯౮౨. యజ్ఞగుహ్యమ్ -
యజ్ఞములలో గుహ్యమైనది జ్ఞానయజ్ఞము. లేక ఫలాపేక్షారహితమైన యజ్ఞము. అట్టి యజ్ఞముతో నభేదవివక్షచే బ్రహ్మ (పరమాత్) 'యజ్ఞగుహ్య ' మనబడును.
(983)౯౮౩. అన్నమ్ -
భూతములచే తినబడునది, భూతములను తినునదియ 'అన్న' మనబడును కాన, పరబ్రహ్మ 'అన్న' శబ్దముచే క్షితుడగును.
(984)౯౮౪. అన్నాదః -
అన్నమును తినునట్టివాడు గాన, పరమాత్మ 'అన్నాద:' యని చెప్పబడును. సకలజగత్తు అన్నాద - అన్న- రూపము- భోకృ - భోగ్య రూపమే యని తెలుపుటకు 'ఏవ' కా ముపయోగింపబడినది. అటులనే, 'చ' శబ్దము, భగవన్నామముల కన్నిటికిని ఒక్క వరమాత్మయందే ‘నముచ్చిత్యవృ యని తెలియజేయుటకు ప్రయోగింపబడినదని తెలియనగును.
శ్లో॥ “ఆత్మయోని: స్వయంజాతో వైఖానః సాకుగా యన:
దేవకి నన్దనః స్రష్టా క్షితీశః పాపనాశన:" ||
శంకర భాష్యము :- ఆత్మైవ యోని రుపాదాన కారణం నాన్యది తి, యోని:. నిమిత్త కారణమపి సవివేతి దర్శయితుం, స్వయంజాత:. “ప్రకృతి శ్చ ప్రతిజ్ఞాదృష్టాన్తానిరోధాత్ ' ఇత్యత్ర స్థాపిత ముభయః త్వం హరేః విశేషేణ ఖననాత్ వైఖానః. ధరణీం విశేషేణ. ఖ పాతాలవాపినం హిరణ్యాక్షం వారాహం రూప మాస్థాయ జిమూనేతి పు ప్రసిద్ధమ్. సామాని గాయతీతి, సామగాయన:, దేవక్యాః పుత్రో. నందన:.
శ్లో || జ్యోతీంషి శుక్రాణి చ యావి లోకే
త్రయోలోకా లోకపాలా స్త్రయీ చ |
త్రయోஉగ్నయ శ్చాహుతయ శ్చ పంచ
సర్వదేవా దేవకీ పుత్రఏవ || ఇతి మిహాభారతే,
స్రష్టా - సర్వలోకస్య - క్షితే ర్భూమే రీశ: క్షితీశ: దశరథాత్మజం. కీర్తిత: పూజితో ధ్యాత:, స్మృత: పాపరాశిం నాశయన్, పాపనాశన:.'పక్షోపవాసా ద్యత్సాహం పురుషస్య ప్రణశ్యతి. ప్రాణాయాం శతేనైన తత్పాపం నశ్యతే నృణమ్. ప్రాణాయాను సహస్రేణ యత్పాపం నశ్యతే నృణామ్ క్షణమాత్రేణ తత్పాపం హరే ర్థ్యానా త్ప్రణశ్యతి' ఇతి వృద్ధ శాతాతపే
(985)౯౮౫. ఆత్మయోని: -
ఈ జగత్తుకుపాదనకారణము అన్యము కాక తానేయయి యున్న వాడు గాన పరమాత్మ 'ఆత్మయోని:' అని కీర్తింపబడుచుండును.
(986)౯౮౬. స్వయంజాత: -
నిమితరణము కూడ తానే యయినవాడు గాన 'స్వయంజాత:' యను నామము పరమాత్మయం దన్వర్థము. 'ప్రకృశిశ్చ ప్రతిజ్ఞా దృష్టాస్థానురోధాత్ ' - అను బ్రహ్మ సూత్రమును వివరించు సమయమున, పరమాత్మకు ఉభయ కారణత్వము స్థాపితమయినది.
(987)౯౮౭. వైఖానః -
విశేషముగ ఖననము చేసినవాడు గాన పరమేశ్వరుడు “వైఖాన:' యను నామముచే స్తోత్రము చేయబడును. శ్రీమహావిష్ణువు వారాహరూపమున భూమిని విశేషముగా బెకలించుకొని పాతాళవాసియైన హిరణ్యాక్షుని సంహరించెనని పురాణప్రసిద్ధి.
(988)౯౮౮. సామగాయనః -
సామములను గానము చేయువారు గావున 'సామగాయనః' యని భక్తులచే ప్రార్థింప బడుచుండును.
(989)౯౮౯. దేవకీనంద: -
దేవకీపుత్రుడు గాన శ్రీహరి 'దేవకీనందన:' యను నామమున బరగును. 'లోకములోని జ్యోతిస్సులు, త్రిలోకములు, లోకపాలకులు, వేదత్రయము, అగ్నిత్రయము, పంచాహుతులు, సర్వదేతలు - ఈ సర్వము దేవకీపుత్రుడే' యని మహాభారతవచనము తెలియుచుస్నది.
(990)౯౯౦. స్రష్టా -
పరమాత్మ, సర్వలోక స్రష్టయైనవాడు గాన, 'స్రష్టా' యను నామమున వెలుగొందు చున్నాడు.
(991)౯౯౧. క్షితీశ: -
శ్రీహరి సమస్తభూమికి ఈశుడు గావున, 'క్షితీశ' నామమున బరగుచున్నాడు. దశరథాత్మజుడయిన శ్రీరామచంద్రమూర్తియు 'క్షితీశ' శబ్దముచే నూచితము.
(992)౯౯౨. పాపనాశనః -
కీర్తింపబడి, పూజింపబడి, ధ్యానింపబడి, స్మరింపబడి భక్తుల పాపరాశిని నశింపజేయువాడు గాన శ్రీహరి 'పాపనాశనః' యను సార్థక నామముతో విలసిల్లు చున్నవాడు. 'ఒక పక్ష ముపవాసము చేయుటతో నశించునట్టి మానవుని పాపము ప్రాణాయామశతముతో సంతరించును. ప్రాణాయామ సహస్రముతో సంతరించు పాపము క్షణమాత్రము శ్రీహరి ధ్యానముచేత నశించు' నని వృద్ధాశాతాతపవచనము వలన తెలియు చున్నది.
శ్లో|| శంఖభృన్నన్దకీ చక్రీ శార్జ్గధన్వా గదాధర: |
రధాంగపాణి రక్షోభ్య స్పర్య ప్రహరణాయుధః || ౧౨౦
సర్వప్రహరణాయుధోం:నమః||
శం.భా. ;- పాంచజన్యాఖ్యం భూతా ద్యహంకారాత్మకం శంఖం బిభ్రత్ శంఖభృత్ విద్యామయో నన్దకాభ్యోஉపిరస్యేతి. నన్దకీ. మనస్తత్వాత్మకం సుదర్శనాఖ్యం చక్ర మస్యాస్తీతి. సంసార చక్రమస్యాజ్ఞ యా పరివర్తత ఇతివా. చక్రీ. ఇన్ద్రియా ద్యహంకారాత్మకం శార్ఙ్గం నామ ధమ రస్యా ప్తీతి. శార్ఙ్గధన్వా. 'ధనుషశ్చ' ఇతి అనఙ్ సమాపాన్త:, బుద్ధి క త్త్వా త్మికాం కౌమోదకీ • నామ గరాం వహన్, గదాధర.. రధాంగం చక్ర మస్య పాణౌ స్థిత మితి రథాంగపాణి:, అత ఏవ ఆశక్యక్షోభణ ఇతి. అక్షోభ్యః కేవల మేతానన్త్యాయుధా న్యసేతి నవియమ్యతే, అపితు సర్వా. ణ్యేవ ప్రహరణా న్యాయుధా న్యస్యేతి. సర్వప్రహరణాయుధ: ఆయుధ త్వేనాஉప్రసిద్ధా వ్యపి కరజాధీని ఆప్యాయుధాని భవ న్తీతి అన్తే సర్వ ప్రహరణాయుధ ఇతి వచనం. సత్యసంకల్ప త్వేన సర్వేశ్వరత్వం దర్శయితుమ్. 'ఏష నర్వేశ్వర:' ఇతి శ్రుతే:. ద్విర్వచనం సమాప్తిం ద్యోతయతి. ఓంకారశ్చ మంగలార్థ:.
శ్లో || 'ఓంకారశ్చాஉధశబ్దశ్చ ద్వా వేతౌ బ్రహ్మణః పురా |
కంఠం భిత్వా వినిర్మాతౌ తస్మా న్మాంగలికా వుభౌ' ||
ఇతి వచనాత్.
'ధన్యం తదేవలగ్నం తన్నక్షత్రం తదేవ పుణ్య మహః కరణవ్యర పా సిద్ధి: యత్ర హరి: ప్రాఙ్నమస్క్రియతే' ఇతిచ. ప్రాగిత్యువలక్షణమ్, ఆన్తేపి నమస్కారస్య శిష్టై రాచ ణాత్. నమస్కారఫలం ప్రాగేవ దర్శితమ్.
శ్లో|| 'ఏకో పి కృష్ణస్య కృతః ప్రణామం
దశాశ్వమేధా వభృధేన తుల్య: |
దశాశ్వమేధీ పున రేతి జన్మ
కృష్ణప్రణామీ వపున ర్భవాయ ||
శ్లో॥ 'ఆతసీ పుష్ప సంకాశం పీతవాసన వచ్యుతమ్ |
యే నమస్యన్తి గోవిన్దం నతేషాం విద్యతే భయమ్'
శ్లో॥ 'లోక నియాధిపతి మప్రతిమ ప్రభావమ్
ఈష త్ప్రణమ్య శిరసా ప్రభవిష్ణు మీశమ్ |
జనాన్తర ప్రలయకల్ప సహస్రజాత
మాశు ప్రశాన్తి ముపయాతి వరప్య పాపమ్' ||
(993)౯౯౩. శంఖభృత్ -
భూతాదుల యొక్క అహంకారాత్మకమయిన పాంచజన్య మనునట్టి శంఖమును ధరించి యున్న వాడు గాన, పరమేశ్వరుడు 'శంఖభృత్ ' అను సార్థక నామమున విధ్రాజితు డగు చుండును.
(994)౯౯౪. నన్దకీ -
విద్యామయ మయిన 'నన్దక' మను ఖడ్గమును ధరించిన వాడు గాన, శ్రీహరి 'నన్దకీ' యని చెప్పబడును.
(995)౯౯౫. చక్రీ -
శ్రీహరి, మనస్తత్వాత్మక మయిన 'సుదర్శన' మను చక్రము గలవాడు మరియు తన యాజ్ఞచే పరివర్తనము నొందునట్టి సంసార చక్రము కలవాడు నగుట వలన 'చక్రీ' యను నామముచే ధ్యాతవ్వుడగుచున్నాడు.
(996)౯౯౬. శార్ఙ్గధన్వా -
ఇంద్రియా ద్యహంకారాత్మక మయిన 'శార్ఙ్గధన్వా' యను నామముచే శ్రీహరి స్తోతవ్యుడు.
(997)౯౯౭. గదాధర: -
బుద్ధి తత్త్యాత్మక మయిన 'కౌమోదకి' యను గదను ధరించిన వాడు గాన పరమాత్మ 'గదాధర' నానుమున ప్రసిద్ధుడు.
(998)౯౯౮. రధాంగపాణి: -
గధాంగము - చక్రము - హస్తమున గలవాడు గాన ‘రథాంగపాణి: ‘ యను నామముచే శ్రీహరి సంకీర్తింపబడుచున్నాడు.
(999)౯౯౯. అక్షోభ్యః -
క్షోభింపజేయు శక్యము కానట్టి వాడు కనుక “అక్షోభ్యః ' యను నామము పరమేశ్వరునియందు ప్రసిద్ధము.
(1000)౧౦౦౦. సర్వప్రహరణాయుధః -
భగనంతుని ఆయుధములు అసంఖ్యాకములు. ఇన్ని ఆ నియమము లేక ప్రహరణమునకు తగినవన్నియు ఆయుధముల నొప్పు వాడుగాన, శ్రీహరి 'సర్వప్రహారణాయుధః' యని సార్ధక నామమున విరాజిల్లు చుండును. ఆయుధములుగ న సిద్ధము లయిన నఖములు గూడ నారసింహావతారము ఆయుధము లయినవి.
అంతమందు సర్వప్రహరణాయుధః' అని చెప్పుటవలన సత్యసంకల్పుడగుటచే పర మాత్మయొక్క సర్వేశ్వరత్వ ద్యోతక మగుచున్నది. 'ఏష సర్వేశ్వరః' యనుచు శ్రుతి మేశ్వరుని సర్వేశ్వరత్వము నుద్ఘోషించుచున్నది. 'సర్వప్రహరణాయుధ:' అని రెండు మార్లు చెప్పుట సమాపి ద్యోతనము చేయుచున్నది.
ఓంకారము మంగళార్ధకము. "ఓంకారము 'ఆ శబ్దము, పూర్వము బ్రహ్మయొక్క కంఠమునుండి వినిర్గతలైనవి, కాన, అవి మంగళకరము” లని ప్రాచీనవచనము.
అంతముందు 'నమః' శబ్ద ముపయుక్తము 'భూయిష్ఠానమ ఉక్తిం విధేమ' - అని మంత్రివర్ణము. “శ్రీహరి యొప్పు నమస్కరింపబడునో ఆ లగ్నమే ధన్యము; ఆ నక్షత్రమునకు ధన్యము; ఆ యహస్సే పుణ్యము, అదియే ఇంద్రియ సఫలయని భగవన్నమస్కార విశేషమును గూర్చి ప్రతిపాదిత వచనములు గలవు.
ఇందు 'ప్రాక్ నమస్క్రీయతే' - అనుచు ప్రాక్ - యందు - నమస్కారము చెప్పబడినది. అది అంతమును గూడ బోధించును. ఆద్యంతములందు నమస్కారాచరణము శిష్టా చార ప్రసిద్ధము.
నమస్కార ఫలము పూర్వము ప్రదర్శితము. శ్రీకృష్ణ పరమాత్మ కొనరించు నమస్కారము దశాశ్వ మేథావభృథ ఫలముతో తుల్యమైనది. దశాశ్వమేధి పుసర్జన్మ నొందును; శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించిన వానికి పునర్జన్మ యుండదు. 'అతనీ పుష్పసంకాశమైన కాంతులతో నొప్పుచు, పీతాంబరధారియగు గోవిందుని నమస్కరించు వారలకు భయముండదు. 'లోక త్రమాధిపతియు, నిరుపమాన ప్రభావసంపన్నుడు నగు జగదీశ్వరునకు ఎవరు శిరసువంచి నమస్కరింతురో అట్టి మానవులకు అనంతజన్మార్జిత పాపరాశి నశించిపోవును.
ఇప్పటికీ సహస్రనామములలో దశమశతము వివంపబడినది.
శ్లో| “ఇతీదం కీ ర్తనీయస్య కేశవస్య మహాత్మనః |
నామ్నాం సహస్రం దివ్యానా మశేపేణ ప్రకీర్తితమ్ ||
శంకర భాష్యము ;- ఇతీద మిత్యనేవ నామసహస్ర మన్యూనా నతిరిక్త ముక్త మితి దర్శయతి, దివ్యానా మ ప్రాకృతానాం నామ్నాం సహస్రం ప్రకీర్తిత మితి వదతా ప్రకారాన్తరే కాపి సంఖ్యోపపత్తి ర్దర్శితా, ప్రక్రమే - కిం జపన్ ముచ్యతే అన్తు: ఇతి. ఈ శాపశబ్దోపారానాత్ 'కీర్తయేత్' ఇత్యనే నాపి త్రివిధ జపో లక్ష్యతే ఉచ్చ- ఉపాంశు- మాసన - లక్షణో జన: త్రివిధః.
ఇక్కడ ఇవి పదమ్' అనుటచే నామ సహస్ర తక్కువ, ఎక్కువ, కాకుండ ఉక్త మయినదని తెలుపబడిన దివ్యములనగా అప్రాకృతములగు నామముల సహస్రము. కీర్తిమనుటచే ప్రకారా న్తరముగా కూడ సంఖ్యోపపత్తి తెలుపబడినది. ఉపక్రమములో కిం జపనే మ చ్యతే జన్తు:' అని శబ్దమును గ్రహించుట వలన ఇట 'కీర్తియేత్ ' అనుటచేత ఉచ్చ- ఉపాంశు- మానస -లక్షణమైన 'త్రివిధ జపము చెప్పునట్లు గ్రహింపనగును.
శ్లో! య ఇదం శ్రుణుయా న్నిత్యం యశ్చాపి వరికీర్తయేత్
నాஉశుభం ప్రాప్నుయా త్కించిత్ సోஉముత్రేహ మానవ: ||
శంకర భాష్యము :- స్పష్టార్థ: పరలోకప్రాప్తవ్యాపి, యయాతి నహుపా దశుభ ప్రాప్త్య భావం దర్శయితు మముత్ర ఇత్యుక్తమ్.
పై శ్లోకమందలి యర్థము స్పష్టము. ఈ సహస్రనామములను నిత్యము శ్రవణము చేయు మానవుడును, కీర్తి మానవుడును ఇహమందుకాని పరమందు కాని అశుభ మేమ మును పొందడు, పరలోకప్రాప్తు లయినను యయాతి - న షాధులకు అశుభప్రాప్తి కలిగినది. అట్టి ఆశుభము ప్రాప్తి దనుటకై 'అముత్ర' అని చెప్పబడినది.
శ్లో! వేదాన్తగో బ్రాహ్మణ స్స్యాత్ క్షత్రియో విజయీభ
వైశ్యో ధనసమృద్ధ స్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్ !
శంకర భాష్యము :- వేదాన్తానా ముపనిషదా మర్దం బ్రహ్మ గచ్ఛ త్యవదచ్ఛతీతి వేదాన్తగః. 'కిం జపన్ ముచ్యతే జన్తు ర్జన్మసంసారబన్ధనాత్' ఇతి వచనాత్, జపకర్మణా సాక్షాన్ముక్తి శంకాయాం శర్మణాం సాక్షా న్ముక్తి హేతు త్వం నాస్తి జ్ఞానేనైవ మో, ఇతి ధర్మత్రయితుం 'వేదాన్తగో బ్రాహ్మణ స్స్యాత్ 'ఇత్యుక్తమ్ కర్మాణాన్తు అన్త: కరణశుద్ధి ద్వారేణ మోక్ష హేతుత్వమ్.
శ్లో || 'కషాయసక్తి కర్మాణి జ్ఞానం తు పరమా గతి: |
కషాయే కర్మభిః పక్సే తతో జ్ఞానం ప్రవర్తతే ||
నిత్యం జ్ఞానం, సమానాద్య సరో బన్ధా త్ప్రముచ్యతే |
ధర్మా త్సుఖం చ జ్ఞానం చ జ్ఞానా న్మోక్షోஉధిగమ్యతే ||
యోగినః కర్మ కుర్వన్తి సంగం త్య క్త్వాஉత, శుద్ధయే |
“కర్మణా బధ్యతే జన్తు ర్విద్యయైన విముచ్యతే ||
తస్మా త్కర్మ న కుర్వన్తి యతయః పారదర్శిన: |
“యథోక్తా స్వపి కర్మాణి పరిహాయ ద్విజోత్తమః ||
ఆత్మజ్ఞానే శమే చ స్యా ద్వేన భ్యాసే చ యత్నవాన్ |
తపసా కల్మషం హన్తి విద్యయాஉనృత ముశ్నుతే ||
జ్ఞాన ముత్పద్యతే పుంసాం క్షయాత్పాపస్య కర్మణః |
యథాஉஉ ధర్మతల ప్రఖ్యే పశ్య త్యాత్మాన మాత్మని ||
ఇత్యాది స్మృతిభ్య:
ఈ సహస్రనామ స్తోత్రము వలన బ్రాహ్మణుడు వేదాన్తనగు డగును. వేదాన్తగః - వేదాన్తముల ఉపనిషత్తుల అర్థమయిన బ్రహ్మను తెలిసికొన్నవాడగును. ఇక్కడ 'కిం జపన్ ముచ్యతే జను ర్జన్మ సంసార బన్ధనాత్' అను ప్రశ్న వాక్యమును