పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : వినువీథిన్ జనుదేరఁ

మ॥
వినువీథిన్ జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ
సంపత్తి నిరాకరిష్ణుఁ గరుణార్ధిష్ణుఁ యోగీంద్ర హృ
ద్వవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృంప్రాభవాలంకరి
ష్ణు వోఢోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్.
బాహ్య॥ దైత్యజీవన భంగకరుఁడును - గరుణా మయుండును - యోగీంద్రహృద్వనవర్తియును - సహనము గలవాఁడును - భక్తజనప్రభావము (శక్తి)చే నలంకరింపబడునట్టియు లక్ష్మీదేవి పరిచర్యచే సేవింపఁబడువాఁడును - జయశీలుఁడును - ప్రకాశమానుఁడు నగు విష్ణువును నంతరిక్షమార్గమున దేవతలు గాంచి రని భావము -
హ॥ అసుర సంపత్తి (దుర్గుణములు) నశింపఁజేయునట్టిన్ని ప్రకృతితో నవినాభావ సంబంధ మైనట్టియు - యోగీశ్వర హృదయారామము లందు విహరించు నట్టియు - ద్వంద్వసముఁడును - భక్తాధీనుఁడును వ్యాపక స్వరూపుఁడు నగువానిని - దైవసంపత్తి యగు నధ్యాత్మవేత్తలు (దేవతలు) ధ్యేయం బగు మహాకాశము నందే పరమాత్మను వీక్షించుచుండిరి.