పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : విజ్ఞప్తి

విజ్ఞప్తి

వైరాగ్య పుష్పగుచ్ఛము - భగవద్గీతా దండకము గీతా ప్రశ్నోత్తరములు - రామగీతార్థము - బూదెల వేదాంతాది గ్రంథములు - రచియించుటకు ముందుగ నేనీ గజేంద్ర మోక్షణమను చరిత్రమునకు, బాహ్య రహస్య లేక నధ్యాత్మిక తాత్పర్యములు విశేషముగా వ్రాయుటలో శ్రుతి స్మృతులు సందర్భానుసార ముపయోగించి సృష్టిక్రమముఁ - గాముకుని లక్షణములుఁ - దత్కామజనిత కష్టములు - వాటి నివారణోపాయములు - మున్నగునవి. యెల్లరకు బోధపడునటులు, పూర్వపక్ష సిద్దాంతములతో సమకూర్చడమైనది. పాలయందు వెన్నగలదనియు నయ్యది నేయిగా మారగలదనియు నందఱకుఁ దెలిసిన విషయమే. కాని, సక్రమముగాఁ దీసిననే యది వచ్చును గాని లేనినా డది చెడిపోవు నటులనే, ఈ గ్రంథముఁ జక్కగాఁ జదివిన వారికే బోధపడగల దని వేఱే చెప్పనక్కరలేదు. అదిగాకఁ జందోవ్యాకరణాదు లంతగాఁ దెలిసినవాఁడను గాను గాన నిం దేవైనఁ బొరపాటు లగుపడిన నవి నాకుఁ దెలియపర్చినచో సవరించుకొందును. అంతియేగాక నచ్చటచ్చట నద్వైతమునుగూర్చి నే నుపన్యాసము లిచ్చుచుండుటలోఁ బూళ్ళ గ్రామము వారీ పుస్తక మచ్చు గూర్పింపఁ బ్రోత్సహించి కొంత ధన సహాయ మొనర్చి రా తదుపరిఁ బాలకొల్లు రామలింగేశ్వర స్వామి వారి యాలయములో గీతోపన్యాసము లొసంగుచుఁ బ్రస్తావనలోఁ బై గ్రంథమునుగూర్చి ముచ్చటింపఁ తెవాలి తాలూకా, వరహాపురం అగ్రహారం వాస్తవ్యులును - ప్రస్తుతము నర్సాపురం తాలూకా దిగమఱ్ఱు గ్రామములో కాపురముండి. పాలకొల్లు రంగమన్నారు పేటలోఁ బార్మసీ నేర్పాటుఁ జేసి, తెలుఁగు వైద్యము నింగ్లీషు వైద్యము నతి నిపుణతతో నొనర్చువారును - శ్రీ వంకమామిడి సాంబయ్యగారి కుమారులు నగు శ్రీ కృష్ణమూర్తి డాక్టరుగారు, మీ పుస్తక మీ పాలకొల్లు గ్రామములోనే యచ్చుపడగల దని హెచ్చరించి రంత, వారి వా క్కమోఘమై ఈ గ్రామమునఁ గల మహాభక్తుల సహాయముచేతను శ్రీ కృష్ణమూర్తిగారి మిత్రబృంద సహాయము చేతను శ్రీ పూళ్ళ గ్రామీయుల సహాయముచేతనుఁ గృష్ణాప్రెస్ వారిచే ముద్రణ పూర్తి యైనది గాన శ్రీ కృష్ణమూర్తి డాక్టరుగారినిఁ దదితర మహాభక్తుల ననేక విధముల నభినందించుచు నన్నీ గ్రామము రప్పించి నటు లొనర్చిన వెలివెల దేవలరాజు పంతులుగారికి నీ గ్రంథ విషయములో నాకు సర్వవిధములఁ జేతోడుగానుండి సంస్కరించిన - ఆయుర్వేద భిషక్ - మహాకవి - కవిసింహ - నల్లా చినకోటయ్యగారికి, బహు తొందఱగా నచ్చుపనిఁ పూర్తి గావించి యొసంగిన తత్కృష్ణాప్రెస్ మేనేజరు శ్రీ కాకుల వేంకటస్వామిగారికిని, మహాపవిత్రమైన నీ గ్రంథమును భక్తిశ్రద్ధలతోఁ జదివినవారికిని, విన్నవారికిని నఘట
నాఘటన సమర్థుం డగు శ్రీరామచంద్రమూర్తి యష్టైశ్వరంబులం జేకూర్చి రక్షించుచుండునుగాక.
ఇట్లు,
అనుభవ వేదాంత ప్రదర్శక,
చదువుల వీర్రాజుశర్మ.
శృంగవరపుకోట|
8 - 5 - 1954 |

ఏ తద్గ్రంథ ప్రకాశిక పవిత్ర నామములు.

మహారాజపోషకులు

పాలకొల్లు
మహారాజశ్రీ కొడంగి రామప్పగారి కుమారుడు | `
కె. ఆర్. గోపాలరావుగారు. | రూ|| 25.00
రాజపోషకులు - పాలకొల్లు | `
మ॥ రా॥ శ్రీ కె. ఆర్. శ్రీనివాసరావుగారు. | రూ॥ 10.00
,, కె. ఆర్. లక్ష్మీనారాయణగారు. | రూ॥ 10.00
,, బి. సత్యానందరావుగారు. | రూ|| 10 0 0 ,, సింహాద్రి సత్యనారాయణమూర్తిగారు (రాజయోగి). | రూ॥ 10.00
,, యిమ్మిడి సత్యనారాయణ మూర్తి శ్రేష్ఠిగారు. | రూ॥ 10.00
,, నాళం సుబ్బారావు గుప్తగారు (పూళ్ళ గ్రామము). | రూ|| 10.00
,, వెలిచేటి రామమూర్తి పంతులుగారు. (రిటైర్డు గవర్నమెంటు మిల్టరీ గెజిటెడ్ ఆఫీసరు) | రూ|| 15.00
,, పూళ్ళ పెదకోదండరామయ్య పంతులుగారు. (హెడ్ కరణం) | రూ|| 10.00
,, తోట కృష్ణమూర్తిగారు బి. ఏ. | రూ|| 10.00
,, మద్దుల చంద్రనాగపూర్ణ గోపాలరాయుడుగారు | రూ|| 10.00
,, కల్లి వెంకటేశ్వరరావు నాయుడుగారు. | రూ|| 10.00
- - - - - - * పోషకులు * - - - - - - | `
మ|| రా|| శ్రీ వడ్డి వీరన్నగారు. | రూ|| 5.00
,, అడజర్ల అప్పారావుగారు. | రూ|| 5.00
,, రవ్వా నరసయ్యగారు. | రూ|| 5.00
,, కాకిత సుబ్బరాజుగారు. | రూ|| 5.00
మ|| రా|| శ్రీ ఆడ్డగర్ల నారాయణ అప్పారావుగార్లు. | రూ|| 5.00
,, దేవాలయం ట్రస్టీలు. | రూ|| 5.00
,, అల్లు అప్పలస్వామిగారు. | రూ|| 5.00
,, వడ్డిపట్ల చినగంగరాజుగారు. | రూ|| 5.00
,, వర్తక సంఘంవారు. | రూ|| 5.00
,, వెజ్జు సోమన్నగారు. | రూ|| 5.00
- - - - - - * దిగమఱ్ఱు గ్రామము * - - - - - - | `
మ|| రా|| శ్రీ అల్లూరి నరసింహరాజుగారి భార్య వెంకయ్యగారు. | రూ|| 5.00
,, కుంచె శ్రీమన్నారాయణమూర్తి, విశ్వనాథంగార్లు. | రూ|| 5.00
పాలకొల్లు గ్రామము | `
,, ఆనందాశ్రమమువారు. | రూ|| 5.00
,, యు. ఎస్. రామారావుగారు. | రూ|| 5.00
,, కూచిభొట్ల సత్యనారాయణమూర్తిగారు. | రూ|| 5.00
,, కాకుల మాచిరాజుగారు. | రూ|| 5.00
,, నడవంటి గోపాలకృష్ణమూర్తిగారు. | రూ|| 5.00
,, వెలివల దేవలరాజుగారు. | రూ|| 5.00
,, గుడిమెట్ల రాజలింగగుప్తగారు. | రూ|| 5.00
,, సింగంశెట్టి లక్ష్మీనారాయణగారు. | రూ|| 5.00
,, నూకల సూర్యారావుగారు. | రూ|| 5.00
శ్రీమతి | `
కె. ఆర్. సత్యవతీదేవిగారు (కె. ఆర్. గోపాలరావుగారు భార్య). | రూ|| 5.00
,, గోటేటి అన్నపూర్ణమ్మగారు. | రూ|| 5.00
,, కారుమూరి శేషమ్మగారు. | రూ|| 5.00
,, దశిక మాణిక్యాంబగారు. | రూ|| 5.00
,, కొమ్మూరి సూర్యకాంతమ్మగారు. | రూ|| 5.00
,, యల్లావజ్జుల లక్ష్మీకాంతమ్మగారు. | రూ|| 5.00