పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : వనగజంబు నెగచు

ఆ|| వె||
నగజంబు నెగచు నచారిఁ బొడగని
నగజంబ కాన జ్రిగజము
వెల్ల నై సురేంద్రు వేచి సుధాంధులు
ట్టఁ బట్టనీక యలు ప్రాఁకె.
బాహ్య|| -గజమును బాధించుచున్న మొసలినిఁ జూచి యైరావతమనగూడ నీటి (పాలసముద్రము) లోనఁ బుట్టిన దగుటచే నీటిలోనున్న యెడల బాధించు నని భయము నొంది వెల వెలఁబోయి తెల్లనై దేవతులను దప్పించుకొని (యింద్రుని కొఱకువేచి) నిరీక్షించి దిగంతమునకు నెగబ్రాకెను - (స్వభావాలంకారము)
హ|| - జీవుని బాధించు చున్న కామమును జూచి ఇంద్రుని గజము - నూర్యాంతర్గతర్జ్యోతి - అమూర్త స్వరూపము కూటస్థుఁడు తాను గూడ శుద్ధ సంకల్పవాసనా నందమయుఁ డగుటచే సంకల్పజల జనిత కామము తననుగూడ బాదించు నేమో యని భయపడి శుద్ధసాత్వికవర్ణమై ఫల ప్రయచ్ఛ దేవతుల కందక, నంతరిక్షమునకు "ఆకాశవత్సర్వ శరీర ఆత్మానదృశ్యతే వాయువదాంతరాత్మా" సర్వశరీరముల యందు నాకాశమువలె నంతరాత్మ యదృశ్యమై యున్నది. కావున, బయ లనగాఁ బరమాత్మ కడకు నారోహిత మయ్యె (ప్రాకె) నని తాత్పర్యము (ఇంద్రుఁడు - సూర్యుఁడు)